లేబుళ్లు

1, ఆగస్టు 2010, ఆదివారం

Methagaalake Common "wealth" kreedothsavam.

ఆగష్టు  1 న  "ఈనాడు" లో వచ్చిన 'మేత గాళ్ళకే  కామన్ 'వెల్త్'  వ్యాసం చదివాక ఈలేఖ వ్రాయకుండా ఉండలేక పోయాను.
డెబ్భై పైగా కామన్ వెల్త్ దేశాల ప్రతిష్టాత్మక క్రీడల నిర్వహణ సన్నాహాలు ఎంత లోపభూఇష్టం గా వున్నాయంటే  క్రీడా మైదానాల
నిర్మాణం,మౌలిక వసతుల ఏర్పాట్లు  అంతా అవకతవకల మయం.అసలు అవి నిర్ణీత సమయానికి తయారవుతాయా అన్నది పెద్ద ప్రశ్న.నిర్మాణాల నాణ్యతా రాహిత్యం, నకిలీ ధ్రువ పత్రాల ఆగడం,నిర్వాహకుల ఆరోపణా, ప్రత్యారోపణల పర్వం, ప్రపంచం
గమనిస్తుందన్నవిషయం నిస్సిగ్గుగా వదిలేసి అవినీతి క్రీడలో దేశ పరువు పోతుందన్న భయం లేకుండా
ఈ క్రీడానిర్వహకుల నిర్వాకం చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. ఈ క్రీడా నిర్వహణ కోసం 80   వేల కోట్ల రూపాయల  ఖర్చు, దానిలో అవినీతి సొమ్ము దాదాపు  30  వేల కోట్లు అవినీతికే  తర్పణం అని, దానినుంచి విదేశాలకు సొమ్ము తరలింపు జరుగుతోందన్న ఆరోపణలు సరికొత్తగా వెలుగు చుశాయి.
కేంద్ర విజిలెన్సు కమిషన్ (సి.వి.సి) ప్రాధమిక విచారణ లోనే ఈ అవకతవకలు  బట్టబయలు అయ్యాయి.
అసలు ఈక్రీడలకి  నిర్వహణ మనదేశం ఎందుకు ఎంపికయింది? అన్న ప్రశ్నకు ఒక్కటే సమాధానం.
అయినవాళ్ళు అక్రమ మార్గాన  ధనం సంపాదించుకునేందుకే  కాని దేశ క్రీడల మీద, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి
ప్రోత్సాహిద్దామని కాని వారి ఉద్దేశ్యం కాదు. ప్రజారోగ్యానికి, క్రీడలకి అవినాభావ సంబంధం వుందని  అనర్త్యసేన్ గారిచ్చిన పిలుపు ఎవరికీ కావాలి. ఈదేశంలో క్రీడలకు, క్రీడాకారులకు,క్రీడా వ్యవస్థకు  రాజకీయనాయకుల
మకిల అంటి, క్రీడా శిక్షణ గాడి తప్పి పతకాలు  రావడం ఎక్కడో నూటికో, కోటికో ఒక్కటి.  ఏది ఏమైనా వందలమంది విదేశీ, స్వదేశీ క్రీడాకారులు పాల్గొనే ఈక్రీడోత్సవం ఎలాంటి అడ్డంకులు,అవాంతరాలు, కీడు జరగకుండా జరిగి పోవాలని భారతీయులంతా మనః స్పూర్తిగా కోరుకుంటున్నారు.
కేశిరాజు వెంకట వరదయ్య    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి