లేబుళ్లు

9, అక్టోబర్ 2015, శుక్రవారం

 'If Becoming Religious has made you more Judgmental, Rude, Harsh, A back biter, you need to check if you are worshiping GOD or EGO'
     
         ' మత,ధార్మిక వాదిగా  నువ్వు  ఒక సమతుల్య భావం వ్యక్తీకరించే వ్యక్తిగాకాకుండా , మోటుగానో, కరుకుగానో  లేక  పరుషంగానో లేక మనుషుల వెనకాల ద్వేషంతో మాట్లాడే వ్యక్తిగానో  మారావంటే  నువ్వు అసలు భగవంతుణ్ణి  ధ్యానిస్తున్నావా  లేక నీ 'అహాన్ని' ప్రేమిస్తున్నావా? అన్నవిషయాన్ని నువ్వు కచ్చితంగా తేల్చుకొనవలసిన  సమయం ఆసన్నమయిందని తెలుసుకో !    

20, జులై 2015, సోమవారం

నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం

                                                     


                                                        నవ్య ఆంధ్రప్రదేశ్  నిర్మాణం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ... అవశేష  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అవతరణ  2, జూన్ ,2014.
ఆక్షణం నుంచి  అవశేష ఆంధ్రప్రదేశ్  అన్ని రంగాల  ఓ సంక్షుభిత  రాష్ట్రం.
క్షేత్ర స్థాయిలో ఓ  విచిత్ర పరిస్థితి.
సొంత 'రాజధాని' లేమి!
పాలకులు, ఉద్యోగులు ఒకచోట. 'ప్రజ' ఒకచోట. పాలకుల ముందున్న సుమారు 20,000 కోట్ల రూపాయల  దివాలా ఆర్ధిక వ్యవస్థ. లక్ష కోట్ల  రుణ మాఫీ  వాగ్దానం. తగిన ఆదాయం లేదు. ఆదాయం వచ్చే వనరులు  శూన్యం. ఆదుకుంటామని అభయ 'హస్తం' చాచి 'శూన్య' మైన ' మిధ్య'. రిక్త హస్తం. ఏమి చేయాలో  తెలియక  చేష్టలుడిగి ఏదోఒంక ఏదోఒక  'ఒంక' తో
వెర్రి, మొర్రి చూపులతో, ఆశావహదృక్పధంతో  వేచిచూడడంకన్నా వేరేమీ చేయలేని 'అశక్తత'.
పాలకుల మీద  ప్రజల అపారమైన ఆశ.
ఏవో అధ్బుతాలు చేస్తారన్న అత్యాశ.
నైపుణ్యమున్న మానవ వనరులు లేవు.
ఉన్న అపార మైన సహజ పకృతి వనరులు.
ఇప్పటికిప్పుడు వాటిని వాడుకుని ఆదాయ వనరుగా మార్చుకోలేని అశక్తత.
ప్రతి ఏటా ప్రకృతి కన్నెర్ర. తుఫానులు.
ఫలితం పండిన పంటలు నీటిపాలు.
నీరు సముద్రం పాలు.
పూడ్చలేని ఆర్ధిక నష్టం. రైతులకు అపారపంట నష్టం.
దాంతో పూడ్చలేని ఋణభారం.పేదరికం. వీటికితోడు నిరక్షరాస్యత.
పరిపూర్ణత లేని రాజకీయ 'చెద' రంగ భూమి.
నా సొంత 'రాష్ట్ర'మని 'సాంతంగా' భావించలేని 'ఉద్యోగ గణం'
కడదామన్న కట్టడాల బొమ్మలతో
ఒకరిద్దరికష్టంతో అనుకున్నది చేయలేక
కాలక్షేపం చేస్తున్న 'పాలక ... ప్రజ'    
ఇదీ ప్రస్తుత 'అవశేష ఆంధ్రప్రదేశ్' అంతులేని కధ !
                       


3, మార్చి 2015, మంగళవారం

భారతీయత -మారుతున్నవిలువలు - వైరుధ్యాలు                                          భారతీయత -మారుతున్నవిలువలు - వైరుధ్యాలు
                                          ---------------------------------------------------------------

              ప్రస్తుత భారత ప్రజల జీవనవిధానం, సామాజిక పరిస్థితులను గమనిస్తే,
పెద్దగా గణాంకాల జోలికే వెళ్ళకుండానే అవగతమయ్యే విషయం ఏమంటే 'ఉన్నవారికి పుష్కలమైన సంపద, విలాసవంతమైన జీవితం, సుఖలాలస, అట్టహాసాల జీవిత ప్రదర్శన చేస్తూ పోటీపడి జీవించడమైతే మరొకపక్క కడుపేదరికం - తిండికి, గుడ్డకు, నీడకు కరువు; వీటికై  నిరంతర జీవనపోరాటం'.
ఈ జీవన వైరుధ్యాల సంకట పరిస్థితులతో కుల,మత చట్ర బంధ సమ్మిళితమైన మన సమాజపరిస్థితి,
ఈ దేశ'యువత'ను ఆలోచనలలో గాక అయోమయంలో పడేస్తోందనటంలో
ఏమాత్రం అతిశయోక్తి కాదన్నది పచ్చి నిజం.

ప్రపంచీకరణతో ఈదేశంలోకి చొచ్చుకు వచ్చిన ప్రాక్పశ్చిమ భాష, వేషధారణలు
వాటి పేరిట ముసుగులో దిగజారిన విలువలు ఇవి గాక 'వినోదం' పేరిట 
వ్యాపారుల, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల లాభాపేక్ష, విపరీత వ్యాపార దృష్టి.
భారతీయ సైద్ధాంతిక,మానవీయ, నైతిక విలువలకు తిలోదకం ఇస్తున్నకొన్ని   ప్రసారమాధ్యమాలు అనగా సినిమా, టివీ, వార్తాపత్రికలు,ఇంటర్నెట్ ( అంతర్జాలం), 
వాటి వాటి వ్యాపారధోరణిలో ఒకదానిని మించి మరొకటి పోటీపడి చేస్తున్న
అసభ్య, అశ్లీల, ఆవేశప్రేరిత విషయ సమాచారం, ప్రసారాలు, ప్రచారం,
ఇవన్నీ కలిసి విలువకట్టలేని, ప్రపంచంలో మరెక్కడా లేని మన ఆధ్యాత్మిక ఔన్నత్య
సంపదని మంటగలిపి మన ఋషులు, పూర్వీకులు, కవులు, పండితులు, మేధావులు మనకందించిన శాశ్వత విలువలను పునాదివేళ్ళతో సహా పెకిలించి మన సంస్కృతిని
నాశనం చేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ఆవిలువలే మన భారతజాతిని ఇన్నాళ్ళు కాలపరీక్షకు వెన్నుగాచి నిలిచి,
గెలిచిన విభిన్న భారతీయతను 'భిన్నత్వంలో ఏకత్వం' తో ఒకే గాట కట్టిఉంచాయన్న
సత్యాన్ని మరుగుపరిచి ఆ విలువల్నిఅవాస్తవ, 'ప్రతి' పరిశీలనా, విపరీత విమర్శనాత్మక ధోరణులతో అవహేళన చేయడం,కాలరాయడం రోజువారీ కార్యక్రమమయింది.
ఉదాహరణకు మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, గ్రామీణ సేవా వ్యవస్థ,
సేద్యం మొదలయిన గ్రామీణ వ్యవస్థలన్నీఒక్కొక్కటిగా కుంటుబడడమో,
కుప్పకూలడమో జరుగుతోంది.
గ్రామీణ భారతం కులవృత్తులను మాని పొట్టకూటికై పట్టణాలకు పరుగులెత్తుతోంది. కులవృత్తులను మాని అనడం కంటే ప్రపంచీకరణతో వారికి ఆదరణ కరువై కుటుంబాలు పొట్టకూటికై, పిల్లలభవిష్యత్తు కోసం పట్టణాలకు వలస బాట పట్టాయి.
దీంతో పట్టణీకరణ మితిమీరింది. వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. అంగడిలో వినియోగ
వస్తువులతో బాటు గ్రామాల్లో,అడవుల్లో మాత్రమే లభించేవస్తువులు కూడా పట్టణాల్లో
విరివిగా లభ్యమవ్వడం ప్రారంభమయింది.
ఇక ఈదేశం భవిత 'యువత' ప్రపంచీకరణ ప్రభావంతో ప్రాక్ పశ్చిమ నాగరికత మోజులోపడి అర్ధమే పరమార్ధంగా జీవిస్తూ జీవితాల్ని తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళకు గురిచేసుకుని, లక్ష్యసాధన మరిచి తమ తమ జీవితాల్ని దుర్భరం చేసుకుంటున్నారు.