లేబుళ్లు

9, మార్చి 2012, శుక్రవారం

పిండి పులిహార (Recipe)

                                                         పిండి పులిహార  (Recipe)


కావలసిన  పదార్దములు : ( Ingredients) :-
----------------------------------------------

బియ్యపురవ్వ(సన్నది) (పావుకేజీ)

ఆవాలు, మినపప్పు,  పచ్చి శనగపప్పు, ఇంగువ తగినంత, ఎండు మిరపకాయలు రెండు,     
పచ్చి మిరపకాయలు నాలుగు,  పసుపు చిటికెడు, కరివేపాకు తగినంత, రెండు స్పూనుల నూనె, ఉప్పు తగినంత,   
నిమ్మకాయలు రెండులేక మూడు( రసాన్ని బట్టి) 

తయారుచేసే విధానం :

ముందుగా 'రైస్ కుక్కర్' లో రెండుగ్లాసుల నీరు పోసుకుని ఒక గ్లాస్ ( పావు కేజీ) బియ్యపురవ్వ (సన్నది) చిటెకెడు పసుపు, రెండు స్పూనుల నూనె, తగినంత ఉప్పు  కలిపి  'బియ్యపురవ్వ' ఉడికించవలెను.  ఉడికిన  ఆరవ్వను ఒక పళ్ళెము/ బేసిన్ లోకి తీసుకొని చల్లార్చవలెను.
తరువాత 'పోపు' చేసి కరివేపాకు, పచ్చి మిరపకాయలు తుంపి పోపులోవేసి వేగిన తరువాత  ఉడికించిన
బియ్యపురవ్వలో పోపు మిశ్రమమును బాగా కలిపినా తరువాత తగినంత నిమ్మరసమును రవ్వ మిశ్రమములో 
కలుపుకొనవలెను. అంతే 'మీ పిండి పులిహార' రెడి.


  

8, మార్చి 2012, గురువారం

quotes / సూక్తులు ( పెద్దలమాట చద్దిమూట )

                                          
                                                             quotes / సూక్తులు
                                                         ( పెద్దలమాట  చద్దిమూట )
                                                    ------------------------------------                      ఓర్పు, సహనం ఎంత చేదుగా ఉంటాయో వాటి వల్ల లభించే ఫలం అంత తియ్యగా ఉంటుంది.

                      ఆత్మ విశ్వాశం మనిషికి పెట్టని ఆభరణం.
            
                     భయపడే మనస్తత్వం ఉన్నవారికి ఎప్పుడు ప్రమాదం పొంచే ఉంటుంది.

                     పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి, ఉపయోగపడతాయి.

                     ఇతరుల అభిప్రాయాలకు భయపడినంత కాలం మనం ఏ పనిలోనూ విజయం సాధించలేము.

                    ఈలోకంలో నాకేమీ తెలియదని తప్పించుకునేవాడు చాలా తెలివికలవాడు. నాకు అన్నీ తెలుసు
                    అని చెప్పేవాడు నిందల పాలవుతాడు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడు చాలా
                    బుద్దిమంతుడనిపించుకుంటాడు.


                     రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు. రోజువారీ నీ దినచర్యలోనే ఉంది !


                     హృదయం నిండా ఇతరులపట్ల సానుభూతి పొంగిపొరలే మనిషికి మాత్రమే వారిని విమర్శించే
                     అధికారం ఉంటుంది.


                     ఏ ఆదర్శము లేని మనిషి తెడ్డు లేని నావ వంటివాడు.


                     జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితంరోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాల్ని నేర్పుతుంది.
                     ఏ దేశానికైనా పెద్ద సంఖ్యా బలం ఉంటె చాలదు. ప్రజలు విద్యావంతులై , చైతన్యవంతులై,
                    ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే  'జాతి'  జాగృతమవుతుంది, బాగుపడుతుంది.


                    ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఓర్పు, సహనంతో వెతికితే అది దొరుకుతుంది.


                    ప్రోత్సాహం లేదని మంచిపనిని వాయిదా వేయకండి.


                    అహంకారం కలవారు అవతలిమనిషిని మనసారా అభినందించలేరు.


                    విజయం సాధించిన ప్రతి మనిషి వెనక  ఓ సాహసోపేతమైన నిర్ణయం తప్పక ఉండేవుంటుంది.


                    అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. అది జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.

                    వేలకోట్ల ధనరాసుల కధిపతివైనా ఒక్క 'నిముషం' ఆయుషుని కొనలేవని తెలుసుకో!

                    నీ పొరపాట్లు, తొందరపాటు మరొకరికి అగచాటు కాకూడదు.

                   నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకిచ్చింది 'నీపాలు'.

                   అనుకున్నామని జరగవు అన్నీ....అనుకోలేదని ఆగవు కొన్ని!

                  మనకు కావాలి అనుకున్నది దొరకనప్పుడు మనకు దొరికినదే'కావాలి' అని అనుకోవడంఉత్తమం.

                  జరిగేదేదో జరుగక మానదు.నీ అనవసర ఆందోళనతో జరిగే మార్పు ఏమీ ఉండదు.

                          

                


                                                                                                

6, మార్చి 2012, మంగళవారం

పుదినా రైస్ ( Mint (leaves) Rice)

                                                     పుదినా రైస్ ( Mint (leaves) Rice)
                                                      -------------------------------------


కావలసిన పదార్దములు ( ingredients )
--------------------------------------------
మసూరి /బాస్మతి  బియ్యం పావు కిలో
పుదినా -   ఒక కట్ట
పచ్చి మిర్చి-  నాలుగు లేక అయిదు
కొత్తిమీర - ఒక కట్ట
జీలకర్ర -  తగినంత
ఎండు మిరపకాయలు - రెండు
కరివేపాకు - ఒక రెమ్మ ( పది ఆకులు)
నిమ్మకాయ - ఒకటి
నూనె  - చిన్నకప్పు  
జీడిపప్పు - యాభై గ్రాములు 
ఉల్లిపాయలు - ఒకటి
వెల్లుల్లి - నాలుగు పాయలు
కారం - తగినంత
ధనియాలపొడి - తగినంత
ఉప్పు - తగినంత

                                               తయారుచేయు విధానం

                       ముందుగా 'అన్నం' (rice)  పొడిగా వండుకొని కొద్దిగా చల్లార్చుకోండి. పుదినాను శుభ్రం చేసి ఆకులను వేరుగా చేసుకుని, (కొన్నిపుదినా ఆకులను, కొత్తిమీర, కరివేపాకు ఆకులను)  వేరు చేసి రైస్ రెడి అయిన తరువాత రైస్ పై చల్లడానికి)  తయారుగా ఉంచుకుని మిగతా పుదినా  ఆకునంతా మూకుడుని స్టవ్ మీద మీడియం సెగపై ఉంచి  రెండు టీ స్పూనుల  నూనె వేసి, నూనె వేడి అయినతరువాత పుదినా ఆకులు, పచ్చి మిరపకాయలు తుంపి  చేసి మూకుడులో వేసి వేగించవలెను. పుదినా, మిరపకాయ ముక్కలు వేగాక మూకుడు నుంచి తీసి 'పేస్ట్' గా చేసి దానిని తయారుగా పక్కన ఉంచండి. తరువాత మరల మూకుడు స్టవ్ పై ఉంచి మిగిలిన  నూనె / ఆయిల్ వేసి వేడిఅయిన తరువాత ఎండు మిరపకాయలు తుంపి అవి వేగిన తరువాత జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయలు వేసి దోరగా వేగిన  వెంటనే వెల్లుల్లి, కారం, ధనియాల పౌడరు  సన్నని మంటపై  రెండు నిముషాలు ఉంచి వేగిన తరువాత  'పుదినా పేస్ట్' ని  కూడా మూకుడులో వేసి కొద్దిగా వేగిన తరువాత 'అన్నం/ రైస్ , తగినంత ఉప్పు కూడా ఆ మిశ్రమములో  వేసి  బాగా కలిపుతూ   మూడు లేక నాలుగు నిముషముల పాటు ( మాడకుండా చూసుకుంటూ) స్టవ్ పై సన్నని సెగమీద ఉంచి వెంటనే దింపి  మిగిల్చి ఉంచిన పుదినా ఆకులు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం వేసి   కలపాలి. అంతే  చక్కటి సువాసనతో ఘుమ ఘుమ లాడుతూ  మీ 'పుదినా రైస్' రెడి.