లేబుళ్లు

4, ఆగస్టు 2010, బుధవారం

ఆహార ధాన్యాల వృధా - మానవ తప్పిదాలు-ప్రభుత్వ ఉదాసీనత

                                     ఆహార ధాన్యాల వృధా - మానవ తప్పిదాలు-ప్రభుత్వ ఉదాసీనత.
ఈ రోజు 'ఈనాడు' లో ఆహార ధాన్యాల నిల్వలఫై "పురుగుపట్టి ..మొలకలెత్తి ".. అన్న వార్త చూశాక ఈ విషయం లో
ఇంకా ఎందుకు ప్రభుత్వం  క్రియాశున్యంగా, ఉదాశీనంగా వ్యవహరిస్తుందో అర్ధంకావడం లేదు.
 ఇదివరకే పార్లమెంటు లో ఈవిషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆహరశాఖామాత్యులు
 తక్షణం పరిశీలిస్తామని, ఆహారధాన్యాలు వృధాకాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
మన పొరుగు రాష్ట్రం లో కొంతమంది కటిక పేదలు ఆకాశాన్నం టుతున్నధరలతో సరైన ఆహరం కొనలేక ఎలుకలు,దుంపలు
తింటుంటే చూడలేక శ్రీ దేవాశిష్ భట్టాచార్య అనే వ్యక్తి స.హ చట్టం, క్రింద మనదేశంలో FCI గోదాముల లో క్రిత దశాబ్ద కాలంలో ఆహార ధాన్యాలు ఎంత వృధా అయ్యాయి అన్న సమాచారం కోరి ఎట్టకేలకు సంపాదించ గలిగారు.ఆ సమాచార సారం ప్రకారంగా దాదాపు పది లక్షల టన్నుల పైగా ఆహారధాన్యాలు( 1 .83 lakh M.T గోధుమ, 6. 33 lakh M.T బియ్యం,2.20 MT వరిధాన్యం,111 lakh MT మొక్కజొన్న) FCI గోదాముల్లో క్రిత దశాబ్ద కాలంలో వృధా అయినట్లు ప్రభుత్వం తెలిపింది. (SOURCE : గూగుల్.కాం) అందుకు చూపిన కారణాలు వివిధ గోదాములకు రవాణా, నిలవ,వేరే వేరే ప్రదేశాలకు సరఫరా మొదలైనవి. ఈ వృధా అయిన ఆహార ధాన్యాలు ఒక విశ్లేషణ ప్రకారం ఒక కోటి మంది జనానికి ఒక సంవత్సరం పాటు లేక ఆరు లక్షల మందికి పది సంవత్సరాల పాటు భోజనం పెట్టవచ్చు. ప్రభుత్వం ఈ ఆహార ధాన్యాల నిల్వ కోసం దాదాపు 243 కోట్ల రూపాయలు, ఈ నిల్వలలో మనుషులు వాడడానికి వీలు లేనంత గా పాడై పోయినఆహార ధాన్యాలు పారబోయడానికి ప్రభుత్వ వారి ఖర్చు రెండు కోట్ల రూపాయలు. ఇదండీ మన ప్రభుత్వాల నిర్వాకం. ఒక ప్రక్కన పేదలు, వారి భాష లో 'ఆమ్ ఆద్మీ' అధిక ధరలతో కొనలేక, దొరక్క నానా ఈతి బాధలతో బ్రతుకీడుస్తుంటే, ఈ మానవ తప్పిదాలతో, నిలువెత్తు నిర్లక్ష్యంతో అధికారులు,ప్రభుత్వాలు వారి విధి నిర్వహణలోజాతి (య),మానవతా దృక్పధం లేకపోవడం, వారు చేశే పనిని ఆరాధించలేక పోవడం, పనిలో సరైన ఉద్యోగులను సరైన చోట ఉంచక పోవడం లెక్కలేని ఆహార ధాన్యాలను మానవుపయోగానికి పనికిరాకుండా చేయడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఇదివరకు పార్లమెంటులో హామీ ఇచ్చిన మేరకు
ఆహారశాఖ మంత్రివర్యులు క్రికెట్ బోర్డు, IPL , వ్యవహారాల కంటే ఈఆహార ధాన్యాల సరైన నిల్వల కు ప్రాధాన్యత
ఇస్తే కొంతయినా జాతికి మేలు చేసిన వారవుతారు.
కేశిరాజు వెంకట వరదయ్య .

 draft 8/3/10 by Varadaiah & Rajani Delete
Edit View Methagaalake Common "wealth" kreedothsavam.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి