ఈ దేశం లో ఈ మధ్య అధికంగా పెరుగుతున్న డాలర్ సంపన్నుల సంఖ్య తో ఈ దేశాభి వృద్ధిని ముడిపెట్టి/ పోల్చి చూడడం సరైన అవగాహన లేకపోవడమే అంటున్నారు,ఆర్ధిక శాస్త్రవేత్త, ఈ దేశ ప్రధాని ఆర్ధిక సలహాదారు, శ్రీ రఘురాం రాజన్.
ఆయన 31-7-2010 న TOI, ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఈ దేశంలో వేగంగా పెరుగుతున్నవ్యాపారవేత్తల సంపద గురించి, వారితో ప్రభుత్వ, రాజకీయ నాయకుల సన్నిహితత్వం గురించి మాట్లాడుతూ ఈ దేశ సంపద సృష్టి / పెరగడం గురించి తనకెలాంటి సమస్య లేదని, కాని ఈ సంపద ప్రభుత్వ సాన్నిహిత్యం
వల్ల ఎవరికైనా ఒనకూరిందైతే అది ఒక సమస్యేనని అన్నారు. ప్రపంచం లో ధనికుల జాబితాలో భారత దేశ ధనికుల సంఖ్య
రెండో స్థానం లో వుందని వారిలో చాలామంది software enterpreneurs రంగం లోని వారు కారని, మిగతా కొందరు ప్రభుత్వ అనుమతి ఉత్తరువుల తో (LICENSES) చేశే వ్యాపారులని ఉదాహరణకు భూ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సహజవనరుల ఉత్పత్తుల గుత్తేదార్లు లాంటి వారని ఆయన అన్నారు. దేశం లో నిక్కచ్చిగా వ్యాపారం చేసి బ్రహ్మాండమయిన అభివృద్ధి సాధించిన వాళ్ళెంత మందో వున్నారని , ఉదాహరణకు టెలి కమ్యూనికేషన్ రంగం లో వున్నారని, కాని పోటీ లేని రంగాలు కొన్ని వున్నాయని వాటికి ప్రభుత్వ సాన్నిహిత్యం, అండఉన్న వ్యాపారుల బెడద కొనసాగుతోందని, ఖచ్చితంగా ఇది చింతించ వలసిన విషయమే నని,
ఇది ఇట్లా కొనసాగినట్లయితే, కొంతమంది స్వార్ధ రాజకీయనాయకుల, వ్యాపారస్తుల బంధం విడదీయరానిది గా తయారవుతుందని, వారికి వారి స్వప్రయోజనలే ముఖ్యమని, దీనితో భారతదేశ ఆర్ధిక వ్యవస్థ , మెక్సికో (mexico) దేశం లో జరిగిన ఆర్ధిక దివాలా, దిశగా పయనిస్తున్దేమోనన్న భయం, అలాంటి అపాయము, విపత్తు మన ఆర్ధిక వ్యవస్థకు, మన ప్రజాస్వామ్యానికే ముప్పు పొంచి ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన వాదిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి