లేబుళ్లు

25, డిసెంబర్ 2016, ఆదివారం

ఉదార ఉద్గారం ( కవిత)





ఉదార ఉద్గారం ( కవిత)

కాలుష్యపు విషపు కరకు కోరల్లోంచి స్రవిస్తున్న 
కార్బన్ ఉద్గార గరళం గొంతుజారుతోంది గరిష్టంగా !
ఓ మనిషీ… కలియజూడు !
జాడతెలియని మూలాల్లోంచి
పత్తాలేని పల్లె క్వారీ ల్లోంచి
తరగిన మట్టి దిబ్బల్లోంచి
పగుల్తున్న బండ కొండల్లోంచి  
మరుగుతున్న బడబాగ్నుల్లోంచి
కసిరే కడలి సునామీల్లోంచి
పుడమితల్లి గుండెల్లో గుచ్చిన బావుల్లోంచి 
అడ్డగోలుగా అవతరించిన ఆవాసాల్నుంచి
కుచించుకుపోయిన కీకారణ్యాల్లోంచి,
దివారాత్రాలు విజృంభిస్తున్నధ్వని విధ్వంసం నుంచి
కదులుతున్న వాహనశ్రేణుల్లోనుంచి,
శీతల, మర యంత్రాల్లోంచి, నీవిసిరే ప్లాస్టిక్ గోతాల్లోంచి
మండుతున్న రాక్షస బొగ్గులోంచి,కరుగుతున్నఖనిజాల్లోంచి
ఉద్భవిస్తున్న ఉద్గార గరళం
నీ ఉఛ్వాస నిశ్వాసలనే కాదు 
యావత్ భూగోళాన్నినియంత్రించే కాలమాసన్నమైంది 
నినదించు! దిక్కులు పిక్కటిల్లేలా విధ్వంసం వద్దని!
ఆలసించించావా విలయం తప్పదు
నిక్షిప్తం నీ చెంతనే పొంచిఉంది !  
ఓ మనీషీ! మేలుకో!!

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్  నం. 9849118254