మానసం
----------------
"హేయ్ తేజస్ ! లేవ్వయ్యా ... తొమ్మిది గంటలు దాటింది. నిన్ను, చిన్నినీ నిద్ర లేపడం రోజూ నాకో డ్యూటీ అయింది. మానస్ ని చూడు ...ఉదయాన్నేలేచి స్నానంచేసి ఎలా రెడీ అయి

కూర్చున్నాడో! లే ఇక !" అతను కప్పుకున్న బ్లాంకెట్ లాగేస్తూ అసహనంగా అంది కమల.
"ఈవేళ క్లాసులు లేవు. కాసేపు పడుకోనీ పిన్నీ"
"అదేంటి ? పదింటికి క్లాస్ ఉందన్నావుగా" గుర్తు చేసింది కమల.
సైన్సు టీచర్ అంజని మేడం గుర్తుకి రావడంతో దిగ్గున లేచి పరుగున బాత్రూంకి వెళ్ళాడు తేజస్. అతను వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉన్న బూస్ట్ రెండు గుక్కల్లో తాగి స్కూలుకి బయలుదేరా తేజస్.

మానస్, తేజస్ కవలలు. ఇద్దరు ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
తల్లి అమల, తండ్రీ విశాల్ ఇద్దరు డాక్టర్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అసైన్మెంట్ మీద నైజీరియా వెళ్లి అక్కడ మూడేళ్లు పనిచేసి, అది పూర్తవుతూనే అమెరికా వెళ్లి నాలుగు సంవత్సరాలయింది.
నైజిరియా వెళుతున్నప్పుడే తేజస్, మానస్ లను హైదరాబాద్ లో స్వంత చెల్లెలు 'కమల' దగ్గర ఉంచి వెళ్ళింది అమల. కమలకి ఒక కూతురు. ముద్దుపేరు 'చిన్ని'. అన్నలిద్దరంటే దానికి ప్రాణం తల్లిని అన్నలిద్దరితోబాటే 'పిన్నీ' అని పిలిచేది.

అమెరికా వెళ్లిన వెంటనే పిల్లల్నిఅమెరికా తీసుకెళదామనుకున్నారు అమల ఆమె భర్త విశాల్. అనిశ్చితితో నాలుగేళ్లయినా తీసుకువెళ్ళలేదు. అదిగో, ఇదిగో నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. నాలుగేళ్లలో ఒకసారి హైదరాబాద్ వారు వచ్చి పిల్లల్ని చూసి వెళ్లారు.
క్రిత సంవత్సరం మానస్, తేజస్ తలితండ్రుల దగ్గరకు వెళ్లి వేసవి శలవులు గడిపివచ్చారు.
* * * * *
"పిల్లల్ని హైస్కూల్ లెవెల్లో ఇక్కడికి తీసుకువస్తే 'కోప్ అప్' కాలేరు. అండర్ గ్రాడ్యుయేషన్ కి వస్తే. ఇక ఒక్కసారే ఇంటరయ్యాక తీసుకెళతామే ! ఇన్నేళ్లు పిల్లల్ని కన్నతల్లిలా చూసుకున్నావు.ఈ మూడేళ్లు కూడా కష్టమనుకోకే" అని చెల్లెల్ని అభ్యర్ధించింది అమల.
"అక్కా! తేజస్ ఎక్కడున్నా, ఎవరితోనైనా కలిసిపోతాడు, నెగ్గుకొస్తాడు. మానస్ అలాకాదు.
మౌనంగా ఉంటాడు. మీరెందుకు తీసుకెళ్లడంలేదనే చింత. ఆలోచన. దిగులుగా ఉంటాడు.
వాడింట్లో ఉన్నంత సేపు నాకూతురినీ కూడా ముద్దు చేయను. స్కూల్నుంచి వస్తూనే ''పిన్నీ...పిన్నీ'' అంటూ ఇల్లంతా వెదుకుతాడు.వాడికేదో భయం, అభద్రతక్కా!
సున్నిత మనస్తత్వం. వాడిని మీరింకా ఇక్కడే వదిలిస్తే ...." అంటూ నీళ్లు నమిలింది కమల
"మా అశలు, ఆకాంక్షలూ అంతా వారే కదా! ఇంకా మూడేళ్లు. ఏం చేయగలం చెప్పు వీలు కానప్పుడు....అయినా వాళ్ళిక్కడికొచ్చాక ఇక్కడి రంగుల ప్రపంచాన్ని చూసి అన్నీ మరిచిపోతారు. నువ్వేం కంగారు పడకు" అంది అమల విషయాన్నిదాటవేస్తూ.'వారి బాల్యాన్ని మీరెంతగా కోల్పోయారో గుర్తించేసరికి కాలం కరిగిపోతుందక్కా' అని పైకనలేక మనసులో ఆక్రోశిస్తూ.
"అది కాదక్కా ...." ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నకమలను అడ్డుకుని
"సరే లేవే ! మరీ పెద్ద మాటలు. పిల్లలకేం తెలుసు! మనమెలా పెరిగాం ? నాన్న మాటకు ఎప్పుడైనాఎదురు మాట్లాడామా ? ఎటూ ఇంటర్ పూర్తయ్యాక తీసుకెళతానంటున్నాను కదా! మూడేళ్లు ... చూస్తూ గడిచిపోతాయి. వేసవిశలవుల్లో అందరూ ఇక్కడికి రండి. టికెట్లు బుక్ చేస్తాను.ఇద్దరితో రేపు మాట్లాడుతామని చెప్పు. కొద్దిగా బిజీగా ఉన్నాను '' అంటూనే ఫోను కట్ చేసింది అమల.

'అందుకేనక్కా యదార్ధం చెప్పాలంటేనే నాకు జంకు' అనుకుంటూ పనిలో నిమగ్నమైంది కమల.
"అమ్మేనా ఫోనులో మాట్లాడింది ?"అడిగాడు అప్పుడే అక్కడికొచ్చిన మానస్.
"అవును ! మీతో రేపు మాట్లాడతానంది. వేసవి శలవుల్లో మనందరికీ అమెరికా టికెట్స్ బుక్ చేస్తానంది అమ్మ" అంది కమల మానస్ ని ఉత్సాహపరచడానికి.
"బిస్కట్ లే పిన్నీ! ఇంతకీ మేము అక్కడ స్కూల్లో చేరతున్నామా ? తిరిగి వస్తున్నామా?" కుతూహలంగా ప్రశ్నించాడు మానస్ .
"నాకు తెలీదు నాన్నా! నువ్వే అడిగి తెలుసుకో !" అబద్ధమాడింది కమల, మానస్ ని బాధపెట్టడం ఇష్టంలేక.
"నువ్వు చాలా మంచిదానివి పిన్నమ్మా ! లవ్ యూ" అంటూ గట్టిగా కౌగలించుకున్నాడు మానస్.
"లవ్ యు టూ మానస్ !" అప్రయత్నంగానే మానస్ ని దగ్గరకు తీసుకుని హత్తుకుని, నుదురు మీద ముద్దుపెట్టుకుని ... నువ్వుకూడా చాలా మంచివాడివి మానస్ !" పొంగుకొస్తున్న కన్నీటిని చీరకొంగుతో తుడుచుకుంటూ అంది కమల.
"నువ్వే మా అమ్మవి..."అంటూ వేగంగా వెళ్ళిపోయాడు మానస్ తన గది లోకి .
"మానస్! ... " ఆందోళనతో బిగ్గరగా పిలిచింది కమల.
వెనక్కు చూడకుండా, పలక్కుండా వెళ్ళి గది తలుపువేసుకున్నాడు మానస్.
మూసుకున్న గది తలుపుల వంక చూస్తూ నిరుత్తరి అయింది కమల.
* * * * *
మానస్, తేజస్, కమల,చిన్నీ అమెరికా వచ్చిన వారం రోజులకే వేగస్, గ్రాండ్ కాన్యన్, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్ ట్రిప్ వేసింది అమల.
డాలస్ నుంచి లాస్ వేగస్ వెళ్లే ఫ్లైట్ లో తేజస్ తండ్రి పక్క సెటిలయ్యాడు. ప్రయాణికులు ఒక్కరొక్కరుగా సీట్లలో సెటిలవుతున్నారు. ఎయిర్ హోస్టెస్ కేబిన్ లగేజి సర్దుతోంది.
మానస్ వెళ్లి 'చిన్ని' పక్కన కూర్చున్నాడు.
"మానస్ నువ్విక్కడకి రా ! అక్కడ పిన్ని కూర్చుంటుంది" అంది అమల.
"ఇట్స్ ఓకే మామ్...ఐ యామ్ ఫైన్ హియర్" అన్నాడు మానస్ నిర్లక్ష్యంగా.
చిన్న బుచ్చుకుంది అమల. నిలబడి వారిని గమనిస్తూ వేచి చూసిన కమలను తన పక్కన సీట్లో కూర్చోమంది అమల అసహనంగా.
మానస్ ఉద్దేశ్యపూర్వకంగా తల్లికి దూరంగా మసలడం, అతని ప్రవర్తన, అసంతృప్తి స్పష్టమైన సంకేతాలతో కనిపిస్తోంది.ఎక్కడ అక్క తనని అపార్ధం చేసుకుంటుందేమోనన్న చింతతో

తల్లడిల్లి పోయింది కమల.
"మానస్ ! నువ్వు అమ్మదగ్గర కూర్చో ! నేను చిన్నిదగ్గర కూర్చుంటాను" అంది కమల సీట్లోనుంచి వెనక్కి తిరిగి మాట్లాడుతూ.
"మీరిద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకోండి పిన్నీ!" అన్నాడు మానస్ అదే ధోరణితో.
వారం రోజుల ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక ఆరోజు అమల, విశాల్ కి డే ఆఫ్ కావడంతో అందరూ హాల్లో కూర్చుని ట్రిప్ కబుర్లు చెప్పుకుంటున్నారు.

"మానస్ ! వచ్చిన దగ్గర్నుంచి గమనిస్తున్నాను ? ట్రిప్ లో కూడా గెస్ట్ లా దూరంగా మసిలావు. నువ్వు నీ ఇంటికి వచ్చావ్...తెలుసా ?!" అంది కొడుకుతో మాట్లాడాలని నిర్ణయించుకున్న అమల.
"మామ్! వాడినలా వదిలెయ్ ... ప్లీజ్" అన్నాడు తేజస్ వెంటనే కలుగచేసుకుంటూ.
"వాడిని మాట్లాడనివ్వు తేజస్ ! నువ్వెందుకు మధ్యలో కలుగచేసుకుంటావ్ ?!" సీరియస్ గా అంది అమల, తేజస్ ఎందుకన్నాడో ఆలోచించకుండా, అర్థచేసుకోకుండా.

వారికి ఏకాంతం కల్పిస్తూ అక్కడినుంచి వెళ్ళింది కమల చిన్నితో.
"కమాన్...మానస్ ! మాట్లాడు. నువ్వు.నీ మౌనం,నీ ప్రవర్తన భరించడం... కష్టంగానూ, చికాకుగా ఉంది. టాలరేట్ చేయలేకపోతున్నాను. చెప్పు!నీ ప్రాబ్లెమ్ ఏమిటి ?" కోపావేశంతో అడిగింది అమల.
"నా ఇంటికొచ్చానా ? ... ఐతే నేను హైదరాబాద్ లో ఎందుకున్నాను ?"సూటిగా అడిగాడు మానస్ టి.వి ఆన్ చేస్తూ.
అతని చేతిలోనుంచి రిమోట్ లాక్కుని సోఫాలో గిరాటువేసింది అమల టి.వి ఆఫ్ చేసి .
మానస్ ముఖం కందగడ్డలా ఎర్రగా అయింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. రెండుచేతులతో ముఖాన్నికప్పుకున్నాడు.
అమల,విశాల్ ఇద్దరూ లేచి మానస్ దగ్గరికి వెళ్లారు.
"మానస్! నీ బాధ మాకు తెలుసు.మా సమస్యలే మీకు తెలియవు. మిమ్ముల్నిహైదరాబాద్ లోనే ఎందుకు ఉంచాల్సి వచ్చిందో చెబుతాను విను ! మేమిక్కడికి వచ్చాక రెండు సంవత్సరాలు సరిగ్గా సెటిల్ కాలేక పోయాము. ఇక్కడ ఉండడమా తిరిగి వెనక్కి ఇండియా వచ్చేయడమా అన్న డైలెమాలో ఉన్న కారణంగా మిమ్ముల్నితీసుకురాలే దు. థర్డ్ ఇయర్ తీసుకువద్దామనుకునే సరికి మీ అకడమిక్ ఇయర్ సగం అయిపొయింది. సారీ...మానస్ !" అంటూ మానస్ ని దగ్గరికి తీసుకున్నాడు విశాల్.
"ఇండియా నుంచి వచ్చిన వారికి హైస్కూల్లో కోప్ అప్ కావడం కష్టం అన్నారు ఫ్రెండ్సు.

అందుకే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కి వస్తే మీకే ఇబ్బంది ఉండదని ఆలోచిస్తున్నాము" అంది అమల వారిద్దరినీ సాలోచనగా చూస్తూ.
"మామ్ ! నాకర్ధం కాలేదు నువ్వేం చెప్పావో" అన్నాడు తేజస్.
"ఇంటర్మీడియట్ దాకా అక్కడ, తరువాత యిక్కడ ... యాం ఐ రైట్ మామ్ ?"ధిక్కార స్వరంతో అన్నాడు మానస్.
"అవును మానస్ ! మీ కెరియర్ బాగుండాలనే అన్నీఅలోచించి, మేమీ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది'' అంది అమల.
"చాలా స్టడీ చేశాము. ఫ్రెండ్సుని విచారించాము. వారి పిల్లలతో మాట్లాడాము. మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి వెంటనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ లో చేరిపోవచ్చు.
ఎవ్విరిథింగ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్" అన్నాడు విశాల్.
దిగ్గున లేచి అక్కడ్నుంచి లేచి తన గదిలోకెళ్ళాడు మానస్.
విశాల్ నిరాశగా, నిస్సహాయంగా తనవంక చూడడం గమనించి "డోన్ ట్ వర్రీ. విశాల్ ! హి విల్ బి ఆల్రైట్" అంది అమల భర్తకు ధైర్యం చెబుతూ.
* * * * *
"హే గైస్ ... మూడురోజుల్లో తిరుగు ప్రయాణం. ఈ రోజు సాయంత్రం షాపింగ్ కి వెళదాం. బయటే డిన్నర్ చేసి వద్దాం ! ఒకే బోయిస్ !?" అన్నాడు విశాల్ హుషారుగా.
"ఒకే డాడ్" సంతోషంగా అన్నాడు తేజస్ తండ్రి మాటకు వెంటనే స్పందిస్తూ.
"మానస్ ! ఛీర్ అప్ ..." రెట్టించాడు విశాల్ మౌనంగా ఉన్న మానస్ వంక చూస్తూ.
"విశాల్ ! వాడిని వదిలెయ్" అంది కిచెన్ లోపలి నుంచి అమల.
కిచెన్ లోనికి వెళ్ళాడు విశాల్. కిచెన్లోనుంచి బయటకు వెళ్ళబోయింది కమల.
"నువ్వుండు కమలా! వెళ్ళకు. మానస్ గురించి మాట్లాడాలి... వాడి ప్రవర్తన ఇబ్బందిగా వుంది. ఇద్దరిలో ఎంత తేడా ? అక్కడకూడా ఇలానే ప్రవర్తిస్తాడా ? నువ్వెలా హేండిల్ చేస్తున్నావు వీడిని ?" ఉత్సుకతతో అడిగాడు విశాల్
"బావా! మీరిద్దరూ డాక్టర్లు. మనుషుల్నిచదవగలరు.వాడు చిన్నపిల్లాడు... ".
"సో వాట్... వుయ్ ఫెయిల్డ్ ! వాడి తత్వం ఏవిటో అసలర్థంగావడంలేదు !"
"వారిద్దరితో నాకెన్నడూ, ఎలాటి సమస్యా రాలేదు.వదిలేయండి బావా!
వాడే మెల్లగా కుదురుకుంటాడు. మీరేం వర్రీ కావద్దు" అంది కమల విశాల్ కి ధైర్యం చెబుతూ.
* * * * *
తిరిగి హైదరాబాద్ వస్తూనే స్కూళ్ళు.హడావుడి. తేజస్,మానస్ టెన్త్ క్లాస్ కి ప్రమోట్ అయ్యారు.
అమెరికా వెళ్లి వచ్చిన దగ్గరనుంచి మానస్ లో అనుకోని మార్పు. అందరితో కలవడం, మాట్లాడడం. సంతోషంగా ఉండడం. వారాంతాలలో తల్లీ, తండ్రితో కబుర్లు. ఆహ్లాదంగా గడుస్తున్నాయి రోజులు. మరో మూడు కేలెండర్లు మారాయి.

తేజస్, మానస్ ఇంటర్మీడియట్ పరీక్షలు పాసయ్యారు. ఇద్దరి అమెరికన్ వీసాలు యూ.ఎస్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకి వేలిడేట్ అయ్యాయి.
అమల, విశాల్ హైదరాబాద్ వచ్చారు. ప్రయాణం మూడు రోజుల్లో పడింది.

తేజస్ తన బ్యాగేజీ సర్థండం మొదలెట్టాడు.
"మానస్! ... తేజస్ ప్యాకింగ్ అయింది. రేపు రాత్రికే ప్రయాణం. నువ్వింకా నీ బ్యాగులు సర్దడం మొదలెట్టలేదు" సూట్ కేసు తీసుకువచ్చి హాల్లో పెడుతూ అంది అమల.

మానస్ మనసు ససేమిరా అంటోంది. అయిష్టంగానే ''సరే మామ్!'' అంటూ దారికడ్డంగా ఉన్న సూట్ కేసు మీద నుంచి దుముకుతూ బ్యాలన్సు తప్పిబోర్లా పడ్డాడు మానస్.
"అమ్మా... "అంటూ బాధగా అరిచాడు మానస్.
''మానస్!'' బిగ్గరగా అరుస్తూ పరుగున వచ్చి అతనికి చేయందించి లేపి "దెబ్బేమైనా తగిలిందా నాన్నా!" అంటూ మానస్ ఒళ్ళు తడిమి చూసింది కమల.
"దెబ్బేమీ తగల్లేదు లేవే ! లేచాడుగా... ఎందుకంత కంగారు" అంది అమల కూర్చున్న సోఫా మీదనుంచి లేవకనే.

"ఏం కాలేదు పిన్నమ్మా ! మోచేతి కింద కొద్దిగా గీసుకుపోయిందంతే. జీన్సుప్యాంటు కదా...కాళ్లకు దెబ్బ తగలలేదు. నువ్వు కంగారు పడకు !" అన్నాడు తల్లి, పిన్నమ్మల ఇద్దరి వంక చూస్తూ
తన గదిలోనికి వెళ్ళాడు మానస్.
కమలకి పిల్లల ప్రయాణం అయోమయంగా వుంది. పదేళ్లుగా కలిసి ఉన్నపిల్లలు మరుసటి రోజు నుంచి ఇంట్లో కనిపించరన్న భావనే ఆమెను నిలవనీయడంలేదు. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీరింకి పోయింది.
మానస్ కొద్దిసేపటి తరువాత గదిలో నుంచి బయటకు వచ్చాడు.
"మామ్...డాడ్ ! నేను మీతో అమెరికా రావడం లేదు. నా మనసెంతకూ అంగీకరించడంలేదు. నేనక్కడ ఇమడలేను. అక్కడికొచ్చి మిమ్ముల్ని ఇబ్బంది పెట్టడం నా కిష్టంలేదు.నేనిక్కడే చదువుకుంటాను. నన్ను క్షమించండి!" అంటూ వారి కాళ్లకు తలానించి,నమస్కరించి, తేజస్ ని కౌగలించుకుని ''అల్ ది బెస్ట్ తేజస్'' అన్నాడు ఉద్వేగంగా మానస్.

మాన్పడిపోయింది అమల.
"ఏం మాట్లాడుతున్నావ్ మానస్? ఇన్నేళ్లకు కుదిరింది ఫ్యామిలీ ఏకం కావడానికి.

మూర్ఖంగా రానంటున్నావు. ఒక్కడివిక్కడుండి ఏంచేస్తావ్ ?" తేరుకుని కోపంగా అంది అమల.
"పిన్ని వాళ్లంతా నా ఫామిలీ కాదా!? నీకు తెలుసా మామ్? ఐదేళ్ల క్రితం బాబాయిగారికి సౌదీలో పెద్ద జీతంతో జాబ్ వచ్చింది. ఆయన వెళ్ళలేదు. ఫ్యామిలీ కోసం ఆఫర్ ని వదులుకున్నారు. బాబాయిగారిని అడిగాను.

మామ్, డాడ్ వెళ్లారు కదా విదేశాలకి ... డబ్బు బాగా సంపాదించవచ్చు కదా ! మీరెందుకు సౌదీ వెళ్లడంలేదని ? బాబాయిగారి సమాధానమేమిటో తెలుసా ? కుటుంబాన్నివదిలి వెళ్లడం ఇష్టంలేదని ... ఇక్కడ ఉద్యోగం, సంపాదన తృప్తిగానే ఉందని"
"ఎవరిష్టం వారిది మానస్! మీ కోసం...మీ భవిష్యత్తు కోసమే కదా మేం వెళ్ళింది.మాకోసం కాదు!
నీ నిర్ణయం తప్పు. నువ్వొస్తున్నావు మాతో... దట్సాల్ " పూనకం వచ్చినట్లుగా బిగ్గరగా అరిచింది అమల.
"సారీ మామ్...సారీ డాడ్ !...నన్నొదిలేయండి. నేను రాను. వీలవుతే మీరే ఇండియా తిరిగి వచ్చేయండి. డాక్టర్ల కొదవ చాలా ఉందిక్కడ" తెగేసి ఖచ్చితంగా అన్నాడు మానస్.
"అమలా! ఇక ఆపు. వాదన వదిలెయ్. జరగాల్సింది చూద్దాం !" వారిద్దరి మధ్య కలుగచేసుకుని చొరవగా అన్నాడు విశాల్.

"ఒకే మానస్! ఇక్కడే ఉండి పోతానంటావు ... సరే! తరువాతేమిటి ... ?"
"నేను...నా భవిష్యత్ గురించి స్పష్టమైన అవగాహన వుంది. నేను అమెరికా రానన్నది అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి! పెద్ద,పెద్ద మాటలు చెప్పలేను గాని ఒక్క విషయం ఖచ్చితంగా చెబుతాను. నన్నుపెంచిన అమ్మని, నా దేశాన్నివదలి రాను. నన్ను క్షమించండి. మీరిద్దరూ కావాలి నాకు" ఒక్క ఉదుటున తండ్రి దగ్గరకొచ్చి చుట్టూ చేతులువేసి బావురుమన్నాడు మానస్.

చలించి పోయాడు విశాల్. అతని కళ్ళు చెమర్చాయి. మానస్ ని హత్తుకుంటూ
"ఒకే మానస్ ! నీ ఇష్టం. నాహృదయం చాలా తేలికయింది. సంతోషంగా ఉంది. నువ్వు, నీ ఆదర్శం,అవగాహన, దృఢ సంకల్పం, దృక్పథం...నాకర్ధమయ్యాయి. ఎంతో గర్వంగా ఉంది. త్వరలో ఇండియా వచ్చేస్తాము. ప్రామిస్!" అన్నాడు మానస్ ని గట్టిగా హత్తుకుని విశాల్.
అవాక్కయి చూస్తూ ఉండిపోయింది అమల. సంతోషంగా కళ్ళుతుడుచుకుంది కమల.
~~~ ~~~ ~~~ ~~~ ~~~
రచన :
~~~ ~~~ ~~~ ~~~ ~~~
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
mobile number :9849118254
======================================================================
హామీ పత్రము
-------------------
''మానసం' కధ నా స్వంత రచన. ఏ ఇతర రచనకు అనుసరణగానీ, అనువాదం కానీ కాదు.
ఏ పత్రికలోనూ, వెబ్ పత్రికలలోగానీ, బ్లాగులోగానీ ప్రచురితము కాలేదు. అముద్రితము.
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు : 9849118254
అడ్రస్ :
Flat No.713, SMR Vinay Symphony,
Opp: Brahmakumari Shanti Sarovar,
Indiranagar, Gachibowli,
Hyderabad-500032