'కుంభ' కోణం ( కుంబకోణాల గ్రాఫ్)
రచన : కేశిరాజు వెంకట వరదయ్య
మన్యంలో మాన్యాల్నే కాదు
తంతి తరంగాల 'తరాలనే' కాదు
రాక్షసి బొగ్గునీ బొక్కేస్తునారు!
'బ్రేవ్' మని తేన్చేస్తున్నారు!
ఎవరా అని వెదికితే
ఆచూకీ ఉండదు
ఆనవాలసలే దొరకదు!
ఒకటా రెండా
ఒకదానివెనక ఇంకొకటి
ఒకదాన్నిమించినదొకటి!
పిచ్చిజనం
మరిచిపోతారులే !
బోరుకోట్టి
'బోఫోర్స్' నే మరిచిపోలే ?
అలాగే వీటినీ మరిచిపోతారు
కంగారు లేదు
అసలు సమస్యను'కంగాళీ' చేస్తే పోలే?
అయినా అది వాళ్లకు చెప్పాలా ?
వారికి వెన్నతో పెట్టిన విద్యేగా!
* * * * * * *
రచన : కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నం. 9849118254