లేబుళ్లు

4, డిసెంబర్ 2010, శనివారం

బలవంతులు ( balavantulu )

బలవంతులు

సవ్వడి లేకుండా సర్రున వచ్చిందో సుడిగాలి
వస్తూనే చూపింది తన ప్రతాపం ఓ తాటాకు గుడిసెపై
తాటాకులన్నీ తడుముకుంటూ దగ్గరికైనాయి ....
మాయదారి 'సుడిగాలి' చప్పున ఎగరేసుకు పోతుందని !
సుడిగాలి చూసిందది!
చప్పున కోపం వచ్చింది దానికి
నన్ను కాదని మీరంతా ఒకటవుతారానని
అంతే! మరింత విజ్రుంభించి వీచింది మరొక్క సారి!
మళ్ళీ అంటుకు పోయాయి ఒకదాన్నొకటి ఆ తాటాకులు
ఈ సారి ఊరుకోలేదు 'సుడిగాలి'
గురిచూసి విరిచింది...
ఆదమరిచిన ఆకులని ....
ఎగరేసుకు పోయింది వాటిని పైపైకి
భయంతో వొణికి పోయాయి !
విలపించాయి....
'అన్నా...గాలన్నా...ఒదులు...మమ్మొదలమని'
బతిమాలాయి..బామాడాయి...
అయినా...వినలేదు సుడిగాలి !
విసిరింది..విసిరింది..అటూ ఇటూ!
దారిలేక, తెన్నులేక దారితప్పాయి తాటాకులు!
చేరలేదు తమవారిని!
అది చూసి నవ్వింది 'సుడిగాలి' పడీ, పడీ!
అది మొదలు అడ్దేలేకుండా పోయింది 'గాలికి'
ఎండుటాకుల్ని చూస్తే చాలు ఎగిరెగిరి పడేది!
గర్వ మెక్కింది 'గాలికి'
ఊళ లేస్తోంది!
ఊరేగుతోంది!
తనకెదురేలేదని ఎగిసెగిసి పడుతోంది!
ఆరోజు పెద్ద కొండరాయిని చూసింది!
' ఏయ్ ...లే... అడ్డులే..నాకడ్డులెమ్మంది!
కదల్లేదు....కొండరాయి!
మళ్ళీ కోపమొచ్చింది గాలికి
గట్టిగా వీచింది...
కొండను 'డీ' కొంది...
అంతే! ఎంత గట్టిగా 'డీ' కొట్టిందో
పక్కకి అటు,ఇటు జారింది  గాలి
కొండ కదల్లేదు, మెదల్లేదు!
మళ్ళీ వీచింది
మళ్ళీ మళ్ళీ వీచింది గట్టిగా
కొండను పెకలించి వేయాలని
కాలేదు తనవల్ల!
తోక ముడిచి వెనక్కి తిరిగింది గాలి !
పకాలున నవ్వు వినిపించింది గాలికి !
అవమానంతో సర్రున  కోపంవచ్చింది గాలికి!
అటు, ఇటు చూసింది నవ్విందెవరానని?
తాటి చెట్టుపైన పచ్చని తాటాకులు!
అటువొంక కోపంగా చూసింది గాలి
అయినా మళ్ళీ ఫక్కున నవ్వాయి 'తాటాకులు'

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య

     

మావూరి సౌరభం .....కవిత

మావూరి సౌరభం  
అమ్మల ఆరాటాలు
నాన్నల బ్రతుకు పోరాటాలు
తాతల దగ్గులు
ముసలమ్మల మూల్గులు
కలివిడి కుటుంబాలు
చలిమంటలు
కట్టెల మోపులు
కావిళ్ళతో నీళ్లు
జొన్న సంకటులు
కాలినడకలు
వీధి బడులు
గాడిపొయ్యి
వావిలాకులు
సొంత విత్తనాలు
కుక్కి మంచాలు
పేడ కుప్పలు
గొబ్బెమ్మలు
గూడ బాతులు
గొడ్ల పగ్గాలు
సాలీల మగ్గాలు
కుండల్లో నీళ్లు
'కండ'తో పనులు
కమ్మరి కొలిమి
కుమ్మరి కుండలు
కల్లు ముంతలు
చాకళ్ళ చలువలు
మంగళ్ళ సందడులు
మామిడి ఆకులు
వరి కంకులు
పట్టు పావడాలు
పిచ్చుకల కిచ కిచలు
కోయిలల కుహు..కుహులు
రాజగోపాలస్వామి
రాజగోపుర విశేషాలు
పండుగలు, పబ్బాలు
అల్లుళ్ళ ఆర్భాటాలు   
కప్పల పెళ్ళిళ్ళు
బతుకమ్మపాటలు
ఊరిదేవతల ఊరేగింపులు
గుళ్ళలో పొంగళ్ళు
గోరుముద్దలు
గిల్లిదండలు
గొలీల ఆటలు
గోలీ సోడాలు
ఏమైపోయా ఇవన్నీ!
కొంచెమై పోయాయి!
కరువై పోతున్నాయి!
ఊళ్ళు ఉఉగిసలాడుతున్నాయి
పట్టణాలపంచన చేరడానికి!
ఓ మనిషీ తిరిగి చూడు!
నీ వెక్కడున్నా నీ ఊరి వొంక!
రచన:
కేశిరాజు వెంకట వరదయ్య


   29, అక్టోబర్ 2010, శుక్రవారం

"Naa" tharam.

ఈ "నా" తరం


తరాలు మారుతున్నాయి .

తలరాతలు మారుతున్నాయి. నిన్న మొన్నటి క్రొత్త జీవితాలు నిలువునా కూలుతున్నాయి.

పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. నేటి యువతలో ( యువతీ యువకులు) చాలామందికి .

నేను, 'నా' అన్నమాట తప్ప వేరే ప్రపంచం లేదు. ఎక్కడో ఒకరో, ఇద్దరో తప్ప మిగతావారంత ఇలాగే వున్నారు.

ఈ వ్యవహారం ఇంతవరకయితే సర్దుకుపోవచ్చు. ఈవిషయం ఇక్కడ ఆగి పోవడం లేదు. ఇదొక జాడ్యం గా మారిపోయింది. వారిలో నేను, నాది, నా ఇష్టం అన్న వ్యవహారం తోనే కుటుంబాలలో గొడవలు, తేడాలు, అపార్ధాలు , అల్లర్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవి ఇక్కడ ఆగి పోవడం లేదు. కొన్ని జీవితాల నాశనానికి / అంతానికి నాంది పలుకుతున్నాయి. కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయి. కుటుంబ పెద్దలు దిక్కుతోచక గాలిలో దీపాన్ని చూస్తున్నట్లు కూలుతున్న జీవితాల్ని, విధిలేక, పాలుపోక, ఏమిచేయలేక చేష్టలుడిగి దిక్కు లేని వాళ్ళలాచూస్తూ దుఖ్హం దిగమింగుకుని జీవచ్చవాల్లా బతకల్సివస్తోంది .

ఉడుకురక్తం తో లేనిపోని ఆవేశ కావేశాలతో నిండు జీవితాలు నిలువునా కూల్చుకుంటు న్నారు.

భారత, హిందూ సాంప్ర దాయ వివాహ వ్యవస్థ కే పెద్దముప్పు వచ్చింది. వ్యవస్థ ని ఇప్పుడు కాళహస్తి గాలిగోపురం తో పోల్చవచ్చు. అది కూలింది. ఇది కూలడానికి తయారుగా వుంది. ఇంకా ఎన్నోరోజులు పట్టదు.

ప్రస్తుత ఈ మార్పుకి కారణం మారుతున్న ప్రపంచం, విదేశీ, స్వదేశి చదువులు, విదేశీ ఉద్యోగాలు,మరింతగా విదేశీయాత్రలు,విదేశీ నివాసం, పాశ్చ్యాత్య పోకడలు, ఇంటా, బయటా పరిస్టితులు, ఆర్ధిక ఎదుగుదల , స్వశక్తి , మారుతున్న సమాజ సమీకరణాలు,పురుషాధిక్యత, స్త్రీల ఆర్ధిక స్వావలంబన . ఇవన్ని చెడు చేస్తున్నాయని నేను చెప్పడం లేదు. చెడు ఆలోచనలకి దోహదం చేస్తున్నాయనడానికి ఏమాత్రం సందేహంలేదు. ఇవన్నిఎక్కడెక్కడో మనుషుల్ని ఎంత త్వరితగతిని కలుపుతున్నాయో అంత త్వరగానే విడతీస్తున్నాయి. బహుశా ఈ వ్యాసం చదువుతున్న ప్రతివారికి ఇటువంటి సంఘటనలు తెలిసేవుంటాయి. విడమరిచి చెప్పాలంటే ఎంత త్వరగా జీవితాలు ఒకటవుతున్నాయో అంత త్వరగానే కూలుతున్నాయి. నాకు తెలిసి ఇటువంటి ఘటనలు కోకొల్లలు. ఎందుకవుతోందిలా? కారణం వారా ? వారి తల్లితండ్రు లా ? సమాజమా? లేక పైన చెప్పిన కారణాలా ? ఎవరు దోషి ? ఎవర్ని నిందించి ప్రయోజనం ! దిగుమతి చేసుకున్న, మనదికాని నాగరికత తో ఈరోజున మన యువత కి / మనకి అవుతున్న హాని అంత, ఇంతా కాదు.

ఈ ప్రవాహం లో సమిధలు వాళ్ళే కాదు. మనందరినీ కలిపి లాక్కుని వెళుతున్నారు.కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ ఒకసారి కూలితే మళ్లి పునర్నిర్మించడం సాధ్యమా ? ఇది మానవతకి, మతాలకి కూడా చేటు.

అందుకే అభ్యర్ధిస్తున్నాఅందరిని. ఆలోచించండి ఎక్కడ తప్పటడుగు వేస్తున్నామో . మేధావులు,సంఘ సంస్కర్తలు, శాస్త్రవేత్తలు, ముఖ్యంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు,ఇంకా పెద్దలు గమనించండి ....... జరుగుతున్నది అంత మనమంచికే అవుతే మంచిదే . కాలం నిర్ణయించే లోపులో జరగవలసిన నష్టం, హాని జరుగుతే మనల్ని మనం క్ష మించుకునే రోజు మిగిలి ఉంటుందా అనేది అనుమానమే. అందుకే ఈ వ్యాసం వ్రాస్తున్నాను. పెద్దలూ లేవండి , మేల్కోండి. పిల్లల్ని గమనిస్తు ఉండండి i . మూల వ్యవస్థల్ని కాపాడండి. ఒక్క వివాహవ్యవస్థ నే కాదు . సాంప్రదాయ వ్యవస్థలన్నీ కూలడానికి సిద్దంగా వున్నాయి. ఎప్పుడో హిందూ వ్యవస్థల మీద దాడులు జరిగాయి, జరుగుతున్నాయి ఇదివరకు అవి ఇతరులు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు.చివరకు వెంకన్ననే ఏడుకొండలు నీవికావు పో అన్నారు ఇంకేమి జరగనుందో ఎవరికీ తెలుసు.

ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తా విస్తు న్నానంటే మనవ్యవస్థ మీద మన యువతే దాడులు చేస్తున్నారు.అవి భౌతిక దాడులు కావు. అరువు తెచ్చుకున్న నాగరికతతో అతి అనాగరికంగా ప్రవర్ర్తిస్తూన్నారు. దానికి వారొక్కరే కారణం కాదు. ప్రతి కుటుంబపెద్ద, ప్రతి తల్లి,తండ్రి, గురువు ,సమాజం అందరు సమానంగా కారణమే.

పెంపకాల్లో తేడా వచ్చింది. తప్పుల్ని దిద్దుకోండి. పారాహుషార్ !

తల్లితండ్రుల్లార జాగ్రత్త , ముద్దు, ముచ్చట వరకు మంచిదే. మంచి నేర్పండి.లోకగ్జానం నేర్పండి.మీరెవరు, మీమూలాలేమిటి,చెప్పండి. పేద్దల్ని గౌరవించడం, అన్ని మీకు తెలుసు.వారికి చెప్పండి . మంచిగా పెంచండి. చూసి చూడనట్టు ఉండకండి ! తప్పులేమైన చేస్తే దండించండి ! మళ్లి ఆతప్పు చేయకుండా చూడండి.అలాగని పిల్లలకు స్వేఛ్చ లేకుండా చేయకండి .ఓ చక్కటి స్నేహితుడులా సహకారం ఇవ్వండి.వాళ్ళని చక్కని భారత పౌరుడుగా తీర్చి దిద్దండి.

రోజులు మారుతున్నాయి.

మార్పులు తధ్యం. మార్పు లేకపోతె మనిషి లేడు , మనుగడ లేదు .మనందరిలో మార్పు రావాలి. ఆమార్పురావాలంటే మనమేమి చెయ్యాలి. చెదపట్టిన వ్యవస్థ దానికదే బాగవుతుందా? కాదు!

అందుకే నాకు తోచిన నాలుగు వాక్యాలు వ్రాస్తున్నా!

ప్రపంచం పూర్వంలా లేదు. మారింది. మారుతోంది. మనిషి మారుతున్నాడు. ఆమార్పుమంచిది కావాలి. ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. మార్పు వ్యవస్థీకృతం కావాలి.

ఇప్పుడు దేశంలో హింస ఎలావుంది?

పిల్ల ల్నవదలడం లేదు. పెద్దల్ని వదలడంలేదు.స్త్రీల సంగతి చెప్పనవసరం లేదు.

హింస, నేరాలు,ఘోరాలు కూడా వ్యవస్తలో భాగం అయ్యాయి. ఇంకా చెప్పాలంటే వ్యవస్తీకృతం అయ్యాయి

వ్యవస్తీకృతం అయ్యాయి అని ఎందుకంటున్నానంటే ఒక్క మనిషి గాలిలో చిటికేస్తే దేశంమంతా ఎక్కడంటే అక్కడ దాడులు జరుగుతాయి.ఆ దాడులు చేస్తున్నవరెవరు? పాతికేళ్ల లోపు యువకులు/యువతులు. వారి వారి తల్లితండ్రుల

పెంపకం బాగుంటే అంతమంది దాడులు చేస్తారా? లేదు. చెయ్యరు. కాబట్టి తల్లితండ్రులూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి.

గురువులూ జాగ్రత్త .మీవిధులు మీరు సక్రమంగా నిర్వర్తించడం లేదనడం లో ఎలాంటి సందేహంలేదని ప్రజావాక్కు.దీంట్లో భిన్నాభిప్రాయం లేదు.

సంఘసంస్క్రత్తలూ మేల్కోండి. పత్రికలూ మోరాల్స్ పాటించండి. ఏదో ఒక రాజకీయ పార్టీ కో, సామా జిక వర్గానికో కొమ్ముకాయకండి. సంఘ హితం చూడండి, సొంతలాభం కొంత మానండి.

ఈరోజున యువత తప్పుదోవలో వున్నారంటే ముమ్మాటికి మీరు,మీ టీవీ ఛానల్స్,సినిమాలు చాలావరకు కారణం.

ఎందుకంటే మీకు మీ మీ పత్రికలూ / టివి లు / ratings ముఖ్యం. ఏదో ఒక విషయం లో sensation కావాలి. ముందు

నా ఛానల్ ప్రసారం చేసింది అన్నదే ముఖ్యం మీకు. అందులో కించిత్తు అయిన జనహితం వుందా , లేదా అన్న విషయం మీకు అవసరం లేదు. నయ్ తికత అసలే లేదు. కూలుతున్న కుటుంబ వ్యవస్తని బాగుచేయగల సామర్ధ్యం ఎవరికైనా వుందంటే వారు మీరే. ఇందుకు దయచేసి మీరు మీ మీ పరిధిలో ఏమి చెయ్యగలరో ఆలోచించండి .నడుం బిగించండి.దీనికి కొంత దూకుడు కావాలి. ఇందుకు సర్వశ్రీ శ్రీ రామోజీరావు, రామచంద్ర రావు,వేమూరి బలరాం, వెంకటేశ్వరరావు,టి.వెంకట్రామరేడ్డి ,మాలతీచందూర్,పి.వి.ఆర్.కే.ప్రసాదు,కే.విశ్వనాధ్,ఇంకా నేను తెలియక పేరు వ్రాయని పెద్దలు, తదితరులు కార్యాచరణ మొదలుపెడితే వ్యవస్థ కోలుకోవడానికి శ్రీకారం చుట్టిన వారవుతారు. చరిత్రకారులు అవుతారు. .

చివరిగా ఇంకొక్క విషయం. మొన్ననే జనాభా లెక్కల్లో ఒక విషయం తెల్సింది.

దీనికి పైన విషయాలకి సంబంధం లేదనుకున్నా ఖచ్చితంగా బంధం మాత్రం వుంది . అందుకే దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా.పాలకులు, జనం గమనించండి .

దక్షిణ భారతంలో కుటుంబాలు చక్కగా జనాభా నియంత్రించుకుని జనాభా పెరగకుండా పాలకుల చెప్పింది చెప్పినట్లుగా విని పాటించారు.

ఉత్తర భారతంలో మాత్రం జనాభా పెరుగుదల మాములుగానే వుంది. అందువల్ల దక్షిణభారతంలో వచ్చే పాతిక సంవత్సరాలలో యువత తగ్గి పోయి అంతా వయసు మీరినవాళ్లు తయారవుతారు. ఉత్తర భారత యువత సంఖ్య చక్కగా పెరుగు తుంది. మరి కుటుంబ వ్యవస్థ అవసాన దశ లోవున్న దక్షిణలో ఈ ముసలి వాళ్ళను ఎవరు భరిస్తారో. ఎందుకయినా మంచిది వృద్ధుల ఆశ్రమాలు పెంచుకుందాం.

కేశిరాజు వెంకట వరదయ్య.

Note: This essay (article) is wriiten by me and is not a copy/ translation of any others.

అడ్రస్:

K.V.Varadaiah,
superintendent Central Excise (Rted)

26, అక్టోబర్ 2010, మంగళవారం

నీసొంత మేమీ లేదిక్కడ .....కవిత

నీసొంత మేమీ లేదిక్కడ  
అక్కడెక్కడో మునిసిపాలిటీ వారు
కూల్చేశారట కూలీనుల ఇళ్ళు
కూలిన ఇళ్ళతో బజారున పడ్డాయి బ్రతుకులెన్నో!
ఇక్కడ రోడ్డు విశాలం చేయడంకోసం
కూల్చేశారు పచ్చని వటవృక్షాలనీ
కూల్చిన చెట్లమీద చెదిరిన పక్షులగూళ్ళు,గుడ్లూ!
ఇంకెక్కడో భూమిలో కంపనం వచ్చిందట
దానితో కూలాయి ఇళ్ళు
కూలిన ఇళ్ళలో ఎన్నో కప్పేసిన బ్రతుకులు!
మరెక్కడో పర్వతాల నుంచి జారిన వాగులతో
ఊళ్ళకి ఊళ్ళేపూడిపోయాయట
ఆ ఊళ్ళతో ఇక మిగిలింది మొండి గోడలేనట!
ఇంకా చెప్పేదేముంది!
నిరంతరం తూటాలకి, మానవబాంబులకి
బలవుతున్న జీవితాలకి లెక్కేలేదు!
ఏమిటీ బ్రతుకులు!
నీ బ్రతుకు పగ్గం నీదగ్గర లేనే లేదు!
మరెందుకీ ఉరుకులు పరుగులు.....
సొంతమేమీ లేదు !
అన్నసత్యాన్ని నిత్యం స్మరించు!
అప్పుడు అంతా నిర్మలం!  

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నం. 9849118254   

23, అక్టోబర్ 2010, శనివారం

asooyavaddu...anandam muddu.

అసూయ వద్దు..ఆనందం ముద్దు.మా పక్కింటావిడా నేను బాగా కలిసి మెలిసి ఉంటాము. వాళ్ళు ముంబైలో పదేళ్ళ పైగా వుంది వచ్చారు.

ఆవిడ లేనప్పుడు నేను, నేను బజారుకెల్తే తను, పిల్లల్ని చూసుకుంటూ ఉంటాము. తనకు ఒక బాబు, ఒక పాప నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు. మా పెద్దమ్మాయి ఎంసెట్ లో మంచి రేంక్ తెచ్చుకుంది. సిటి లోనే మంచి కాలేజిలో ఫ్రీ సీటు వచ్చింది. వాళ్ళబ్బాయికి మంచి రేంక్ రాలేదు. పేమెంటు సీటు. అదీకూడా కూడ ఎక్కడో దూరంగా ఏదో చిన్న 'టౌన్' లో వచ్చింది.

అప్పటినుంచి తనలో కొద్దిగా మార్పు చూస్తున్నాను.

ఈర్ష్య సహజం కదా కొద్దిరోజులుంటుంది, తరువాత మమూలయి పోతుందిలే అని నేనే చాలా సర్డుకుపోయాను.

రాను రాను పిల్లల్ని సూటిపోటి మాటలనడం, నాతో సరిగ్గా మాట్లాడక పోవడం ప్రతిమాటకి ఏదో పెడ అర్ధాలు తీయడం మామూలయిపోయింది. వాళ్ళపాప మాబాబు ఇద్దరి టెన్త్ క్లాస్,సెంట్రల్ సిలబస్. ఇద్దరు చక్కటి ఫ్రెండ్స్. కలిసి చదువుకుంటారు. చదువులో ఇద్దరు ఒకరికొకరు పోటీ.

అది వీడికంటే నాలుగంటే,నాలుగు రోజులే పెద్ద. వీడు దాన్ని 'అక్కా' అని తెగ ఏడిపిస్తుంటాడు.

అది స్కూల్ నుంచి వచ్చిందంటే మా ఇంట్లోనే పాగా. తినడం, తాగడం చాలావరకు మా ఇంట్లోనే. మాకు ఎప్పుడూ అది పరాయి పిల్ల అనిపించలేదు.మాఇంట్లో పిల్ల లాగానే వుంటుంది. వాళ్ళ అమ్మలో ఈ మధ్య మార్పు వచ్చాక ఇది రావడం తగ్గింది.

ఒక రోజు అది బయట కన్పించే సరికి ' ఏమిటే రోజు మామూలుగా రావడం లేదు'? అని అడిగాను.

నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా 'మా మమ్మీ కి, మీకు ఏమైనా గొడవ అయిందా ఆంటీ' అనడిగింది.

'లేదే...అలాంటి దేమీ లేదు'....మేము ఎప్పటిలా బాగానే ఉన్నాము అన్నాను నేను.

'అదేం కాదు లే ఆంటీ...నాకు తెలుసు. అక్కకి మంచి ఎంసెట్ రేంకు, ఫ్రీ సీటు వచ్చిందగ్గరనుంచి ఇంట్లో మా అందరిని సతాయిస్తూనే వుంది'.

నన్నుకూడా ఎప్పుడూ లేంది ఎందుకూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతావు అంటోంది.

అందుకే నాకు మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారేమో నని అనుమానం వచ్చింది అంది అది.

నేను సంబాలించుకుని పెద్దవాళ్ళ సంగతులు మీకేందుకే చక్కగా చదువుకోక, అని దాన్ని మందలించి ఏమైనా సరే తనతో మాట్లాడాలి అనుకుని

అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి 'కీస్' పక్కన ఇంట్లో ఇవ్వడం అలవాటు.

ఈ మధ్య తను 'కీస్' తీసుకోవడం లేదు సరికదా నేను బయటకు వెళ్తున్నాను అని అబద్ధం కూడ చెబుతోంది.

అలా అబద్ధం చెప్పి నాకు దొరికి పోయింది కూడా. కారణం లేకుండా దూరమవు తున్నాట్లు అనిపించింది.

తను కూడ 'కీస్' ఇవ్వడం మానేసింది.

ఆరోజు 'దసరా' వస్తోందని షాపింగ్ కి వెళ్లాను.

ఇంటికి వచ్చేసరికి గేటు బయట కూర్చుని వున్నాడు మా బాబు. స్కూల్ టీచరు ఎవరో పోయారట.అందుకు హాఫ్ డే నే స్కూల్ అట.

వాడిని అలా బయట గేటు ముందు కూర్చోవడం చూసే సరికి నా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పిల్లలు చక్కగా కలిసి మెలిసి వుండేవాళ్ళు. అలాటిది వాళ్ళు ఇంట్లో ఉండగానే బాబు గేటు ముందు కూర్చోవడం నేను సహించలేక పోయాను. వెళ్లి ఆవిడను నాలుగు చివాట్లు పెడదామని అనుకుని అలా చేస్తే తనకు నాకు తేడా ఏముంటుంది నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను.

తాళం తీసి వాడికి టిఫెన్ పెట్టి' ఏం నాన్నా....బయట కూర్చున్నావు.. ఆంటీ వాళ్ళింట్లో కూర్చోలేక పోయావా'? అని అడుగుదామని నోటి దాకా వచ్చి కల్మషం తెలీని చిన్న మనసు బాధ పెట్టడం ఎందుకని ...ఊరుకున్నాను.

వాడు ఏమైనా చెపుతాడేమోనని ఎదురు చూశాను. అందుకు కూడా నామనసు ఎంతో బాధ పడింది.

కారణం లేకుండా ఎందుకావిడ ఇలా ప్రవర్తిస్తోందో అర్ధం కావడం లేదు.

లేక నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా తనపట్ల గాని, తన పిల్లల పట్లగాని....ఎంత ఆలోచించినా, అలాటి దేమీ లేదు.

రెండు రోజులయింది. ఆరోజు నుంచి బాబు నాతో ముభావకంగా వుండడం గమనించాను. ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు నాదగ్గరికి వచ్చి పక్కన పడుకుని ఆరోజు విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పే బాబు రెండు రోజులుగా ముభావకంగా వున్నాడు.ఇదే విషయాన్ని ఆయనతో అంటే పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇంకా 'అమ్మకూచి' అని ఎవరైనా ఎడిపించారేమో? కంగారు పడకు అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. నా మనసుమాత్రం ఊరుకోవడం లేదు. స్కూల్లో ఏమైనా జరిగిందా ? లేక నామనసు ఊహిస్తున్నట్లు పక్కింటావిడ ఏదో జరిగింది. బాబుని విషయమేమిటో కనుక్కుందామని నిర్ణయించుకున్నాను. పిల్లలకి ఆరోజు స్కూల్ కి శలవు. ఉదయం మావారు ఆఫీసుకి వెళ్ళడంతో పని ముగించుకుని బాబు గదిలోకి వెళ్లాను. వాడు కంప్యూటరు గేము ఆడుతున్నాడు. 'ఏం నాన్నా...హోం వర్క్ అలాటివేం లేవా'...ఉదయం లేచిన దగ్గర నుంచి చదువుకోక ఎంత సేపు ఆడతావు ఆ గేములు. ఇక ఆపు భోజనం చేసి చదువుకో' అని చెప్పానో లేదో వెంటనే వాడు హెచ్చు స్వరంతో

'చెల్లినైతే ఎంత సేపైనా ఆడుకోనిస్తావు, ఏమనవు. నేను కాసేపు ఆడుకుంటే కోప్పడతావు. నీకు ఆడపిల్లలంటేనే ఇష్టం. ఆంటీ కూడా చెప్పారు' మొదటసారి బాబు ఎదురు మాట్లాడడం చూశాను. అదీ వాడు నా వంక చూడకుండా తలవంచుకుని గట్టిగా మాట్లాడాడు.

ఒక్కక్షణం బిత్తరపోయాను. ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు. అలాగే నిలబడ్డాను. బాబు నన్ను రాసుకుంటూనే విసురుగా వెళ్లి

వాడే కంచం తీసుకుని భోజనం పెట్టుకున్నాడు. నేను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. నన్ను నేను సంబాలించుకున్నాను.

జరిగింది అర్ధం అయింది. పక్కింటావిడ వీడితో ఏదో తప్పుగా మాట్లాడింది. వాడి మనసు తీవ్రంగా గాయ పరిచింది.

ముందు వీడి సంగతి చూడాలి. తరువాత ఆవిడతో మాట్లాడి, పిల్లల దగ్గర పిచ్చి వేషాలేయవద్దని, పిచ్చి మాటలతో వాళ్ళ చిన్ని మనసుల్ని కల్మషం చేయవద్దని హెచ్చరించాలని నిర్ణయించుకున్నాను.

మరుసటి రోజు పని అంతా చేసుకుని పక్కింటికి వెళ్లాను.

నన్ను చూడ్డంతోనే...రా...లక్ష్మీ...షాపింగ్ కి పోలేదా...? రాని నవ్వు తెచ్చుకుంటూఅడిగింది శాలిని.

ఏమిటి 'శాలిని' నా షాపింగ్ తో నీకు చాలా ప్రాబ్లం గావున్నట్లుగా వుందే!

ఈ మధ్య ఇంటి 'కీస్' కూడ తీసుకోవడంలేదుగా! ఇంకా నీకెందుకు బాధ.

'సరేగాని ....సూటిగా అడుగుతున్నాను..చెప్పు? బాబు నేను లేనప్పుడు స్కూల్ నుంచి వస్తే కనీసం వాడిని ఇంట్లో కూర్చోమనలేనంత కఠినంగా తయారయ్యావు. మూడురోజుల క్రితం పండగ వస్తోంది కదా అని షాపింగ్ కి వెళ్ళాను. ఆరోజు నువ్వుకూడా బయటకు వెళ్తానని ఇంటి కీస్ కూడ తీసుకోలేదు. నువ్వు ఎక్కడికి పోలేదు.ఇంట్లోనే వున్నావు. నేను వచ్చేసరికి బాబు గేటు ముందు కూర్చుని వున్నాడు. చిన్నపిల్లాడని జాలి కూడ వేయలేదా? ఏం, ఎందుకు ఉన్నట్లుండి అంత చెడ్డ వాళ్లమయ్యాము ?

అసలు వాడు ఆరోజు మీ ఇంటికి వచ్చాడా? లేదా ? నాకు సమాధానం కావాలి.

'శాలిని' దగ్గరనుంచి సమాధానం లేదు. మౌనం గానే వుంది.

నిన్నే అడుగుతున్నాను శాలినీ సమాధానం చెప్పు రెట్టించి అడిగాను. దాదాపు పది సంవత్సరాలయింది మనం పక్క,పక్కన ఉండబట్టి. ఎప్పుడయినా ఇలా జరిగిందా? నాదగ్గర నీ పిల్లల్ని వుంచి వారం, పది రోజులు నువ్వు, మీవారు వూరికి పోయిన రోజులు మరిచిపోయావా? నీ కూతురు ఈరోజుకీ నా ఇంట్లో నాపిల్లలతో సమానంగా వుంటుంది. ఏరోజైనా తేడాగా చూసినట్లు కనీసం గమనించావా? ఏమైంది నీకు? అసలేం జరిగింది? నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా చెప్పు? తప్పు అయితే తప్పక దిద్దుకుంటాను.

పిల్లల విషయంలో నీ ప్రవర్తన నాకు చాలా అభ్యంతరకరంగా వుంది. నీ కూతురు నాఇంటికి రావడం మీద ఆంక్షలు. ఏమైనా బావుందా?పిల్లల చిన్ని మనసులు ఎంత బాధ పడతాయి. వాళ్లకి మంచి నేర్పాలి కాని 'ద్వేషం' నేర్పుతావా? ఇదేనా పిల్లల్ని పెంచే పద్ధతి? నాకంటే ఎక్కువ చదువుకున్నదానివి. ఇదేనా నీ ఔన్నత్యం. చిన్న పిల్లలు.... వాళ్ళ మనస్సులో ద్వేషం, కల్మషం అలాంటివేమీ వుండవు. అలాంటిది వాడితో తనని ఆడ పిల్లకంటే తక్కువగా చూస్తానని అంటావా? తప్పు కదా శాలినీ.....నీ కూతుర్నే నా కూతుళ్ళతో సమానంగా చూశే నేను నాకొడుకుని తక్కువగా చూడటమా ....ఛీ ...ఎంతగా దిగజారి మాట్లాడావు శాలినీ...

వాడి చిన్న, సున్నిత మనస్సులో ఎంత 'విషం' కక్కావు? ఎందుకు ఇంత అసహ్యంగా ప్రవర్తించావు. చాలా తప్పు చేశావు.

ఇక ఎప్పుడూ నా పిల్లల జోలికి, నా జోలికి రాకు. గుడ్ బై ... అనేసి విసురుగా బయటకు వస్తుంటే...

వెనక నుంచి..'లక్ష్మీ.....లక్ష్మీ....సారీ....సారీ...ప్లీజ్'.....నన్ను క్షమించు..నిజంగా చాలా తప్పు చేశాను.

అసహ్యంగా ప్రవర్తించాను. మీ పెద్దమ్మాయికి మావాడికంటే మంచి 'రేంకు' వచ్చినప్పటినుంచి, ఇంకా దానికి' ఫ్రీ' సీట్ వచ్చేసరికి

నాకు నీ మీద అకారణంగా చాలా అసూయా, ద్వేషం, ఈర్ష్య అన్నీ గూడు కట్టుకున్నాయి. గుడ్డిదాన్నై పోయాను. మీ బాబు స్కూల్ నుంచి వస్తే చాలా అసహ్యంగా మాట్లాడాను. చిన్న పిల్లాడి మనస్సులో 'అనుమానం' నాటాను. ఇన్నేళ్ళ స్నేహానికి అర్ధం లేకుండా చేశాను. ఇప్పుడు నాకు నేనే చాలా అసహ్యంగా కనబడుతున్నాను. తప్పయింది లక్ష్మీ...వాడికి నీ మీద చాడీలు చెప్పాను. వాడికి 'సారీ' చెబుతాను ..లక్ష్మీ... అంటూ బోరున ఏడవడం మొదలెట్టింది.

నా ఆవేశం కూడ తగ్గింది.మామూలు మనిషినయ్యాను.

'చాల్లే'..... ఇక చాలు జరిగిందంతా. ఇంకా సిగ్గు లేకుండా వాడికి 'సారీ' చెబుతానంటున్నావు!

చిన్న పిల్లాడు వాడికి 'సారీ' చెప్పి ఇంకా చిన్నబుచ్చుకోవద్దు. వాడిని దీని గురించి ఇంకా ఆలోచింప చేయవద్దు.

నీకింకా బుద్ధి రాలేదు...అన్నాను అనునయంగా, నవ్వుతూ.

'నా కసలు బుద్ధి ఉంటేగా'? అంది శాలిని.

ఇదండీ కధ. మంచీ, చెడు విడి విడిగా వుండవండీ ఎక్కడా. రెండు మనలోనే వుంటాయి. మన ప్రవర్తనే మన మంచికి, చెడుకీ

గీటురాయి. పిల్లల ముందు మాట్లాడేటప్పుడు మనం ఏది మాట్లాడితే అదే వాళ్ళలో నాటుకుంటుంది. 'చెడు' అయితే చాలా త్వరగా అంటుకుంటుంది. పెద్దవాళ్ళం గమనిస్తూ వుండాలి. పిల్లలందరూ ఒకలా వుండరు. కొందరు బయట పడతారు. బయట పడని వాళ్ళతో, సున్నిత మనస్కులతో చాల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి విషయాల్లో సరైన సమయంలో వారి మనసులో వుండే 'భూతాన్ని' తరిమేయాలి. లేదా తరువాత చింతించినా, వగచినా ఫలితముండదు. తల్లిని మించిన 'శిల్పి' ప్రపంచంలో ఎక్కడా లేదు. తల్లి ఎలా చెక్కుతే ఆ బొమ్మ అలా తయారవుతుంది. ప్రపంచంలో మంచి పౌరులను ఏ దేశానికైనా అందించే భారం ఎప్పుడూ ఈ 'శిల్పు' లదే !

note: ఇది నా స్వానుభవం. పాత్రల పేర్లు మాత్రం మార్చడం జరిగింది.

రచన:-

కేశిరాజు రజని.

30, సెప్టెంబర్ 2010, గురువారం

నిరామయ భారతం .... కవిత

నిరామయ భారతం  

భరతమాతనునేను
భరత ధాత్రిని నేను
తరతరాల దాస్యంతో
ధరిత్రి చరిత్రలో పుటల కెక్కిన నేను
తెల తెల్లని మిన్నాగుల బారినుంచి
బంధనాలుతెంచుకుని
బయల్పడ్డా ననుకొన్నాను
బిడ్డల నీడలో ఒడలంతా
బడలిక తీర్చుకుందా మనుకొన్నాను
దశాబ్దాలు దాటాయి
నాటి మొదలు నేటి వరకు
నా 'శిరోభారం' తీర్చిన వారు లేరు
శిరమే కాదు భారం
ఒడలంతా ఒరుసుకుపోతోంది
తూర్పు, పడమరలు
దక్షిణ, ఉత్తరాలు
ఎటు  చూసినా ఆటుపోట్లు
ఏమిచేస్తే 'మేలో' పాలు పోవడంలేదు లేదు !
అర్దరాత్రి స్వాతంత్ర్యం
అవస్థ పెడుతోందో ?
అవాచ్య విశృంఖలత్వం
విజ్రుంభించిందో ?
'వివక్ష' విభజనగా విస్ఫుటిస్తోందో  ?
మత మహమ్మారి మట్టగిస్తోందో ?
భిన్న సంస్కృతుల నా ప్రజ
'పక్షపాతం' పాలయ్యారో  ?
పాలకుల చేతిలో పగ్గాలు
పక్క దారి పట్టాయో ?
'పబ్బం' గడుపుకునే
'ప్రాపులు'ప్రామాణిక మయ్యారో ?
పొలాల పండుగలు
పట్నవాసం పాలయ్యాయో ?
పౌరసత్వ హక్కులు
పోరుసల్పందే 'పాలు' కావడంలేదో ?
తళుకు,బెళుకులు తలకెక్కాయో ?
తలనెరిసిన వారి తలలు
నీడ కోసం నిట్టూరుస్తున్నాయో  ?
జాతి సంపద 'సంపీడ్య' సాంక్రమిక
హక్కు భుక్త  మవుతోందో ?
ఏమీ తెలియక తెల్లమోహమేసుకుని
అర్ధంకాని, వ్యర్ధమైవుతున్న
స్వాతంత్ర్యంతో
స్వాంతన కరువైన 
స్వజనంతో ఏమని చెప్పను?
ఎవరికి  చెప్పను?
ఉన్నాయి ఊసులు
ఎన్నో, ఇంకెన్నో
ఇంకెవరికి చెప్పను?
నా హిమన్నదాలు ఇంకి పోతున్నాయనా!
నా 'గంగ' ఇంక గట్టుకి చేరదనా !
గమన నియమాలు'నీటికీ' నిబద్ధమనా!
నదీమతల్లుల నాట్యం
నిరంతరం నిరర్గళ మవుతే
నిర్నిబద్ధమేగా పైవారికి
నిరాపేక్షణేయమేగా క్రిందవారికి
అందుకు సన్నద్ధంకండి!
హరితవనాల్ని స'హరితం' చేయండి.
ప్రకృతి ప్రసాదాల్ని
పంచడం మానండి !
అవే ఆదుకునేది నాప్రజని
అప్పుడే 'నిరామయం' నా ప్రజకి .

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.   
   

20, సెప్టెంబర్ 2010, సోమవారం

బూచి ( boochi )

                                                                        బూచి
                                                  
             శనివారం. వినాయక చవితి. నాకు జ్ఞాపక మున్నంత వరకు వినాయక చవితి రోజున ఉదయాన్నేవెళ్లి మట్టి వినాయకుణ్ణి, పత్రి తీసుకునే వచ్చే అలవాటు. రెండు సంవత్స రాల నుంచి మా 'జూనియెర్' 'దియ' నాతో బయటకి తప్పక రావాల్సిందే. దానికిప్పుడు  అయిదేళ్ళు. ఈ సారి కుకట్ పల్లి  'రైతు బజార్'  దగ్గర  దూరంగా బైక్ పార్కు చేసి  ఇద్దరం నడిచి వస్తున్నాం.
పిచ్చిజనం. నడిచేందుకుకూడా సరిగ్గా జాగా లేదు. కుడిలేదు,ఎడమలేదు.
ట్రాఫిక్ సెన్స్ అసలే లేదు.ఆటోలు, బైకులు జనాలని రాసుకుంటూనే వెళ్తున్నాయి. చూస్తుండగానే పాపం మా ముందు నడుస్తున్నావిడ పాదం రాసుకుంటూ 'ఆటో' వెనక చక్రం పోయింది. కుడి చేతిలో మట్టి వినాయకుణ్ణి మెల్లగా సంచిమీద పెట్టి  కాలుపట్టుకుని 'అమ్మా' అంటూ బాధగా అరుస్తూ కూలబడిందావిడ. ఎవరిగోల వారిదే అనుకుంటూ  దాన్నిఎత్తుకుని, ఆవిణ్ణి రోడ్డు పక్కగా తీసుకెళ్ళి కాలు చూశాను, కుడికాలి చిటికినవేలు నలిగి పైన చర్మం చీరుకు పోయింది. నలభై, నలభై ఐదు ఏళ్ళు ఉంటాయావిడకు. కూరగాయల సంచి ఒకచేత్తో, మట్టి వినాయకుడు ఇంకో చేతిలో, కూరల సంచి మోయలేకపాపం ఇబ్బంది పడుతోంది.
ఆవిడ చేయి పట్టుకుని పక్కనే మెడికల్ షాపు మెట్ల మీద తనని కూర్చో బెట్టి షాపులో ఆల్కహాల్ 'వైప్' తెచ్చి గాయం శుభ్రం చేసి ఆవిడకు 'ప్రధమ చికిత్స' చేసి  ఆవిడ వెళ్ళాక నా షాపింగ్ మొదలెట్టాను. వెళ్తూ ఆవిడ కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పింది. ఆ రణగొణ ధ్వనిలో  'డాడీ, డాడీ' తనకు అందిన నా షర్టు అంచును పట్టుకుని లాగుతూ 'ఆమె ఎవరు'? కాలుకు బ్లడ్ ఎందుకు వచ్చింది'? దాని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాను.
ఇంతలోనే  'డాడీ'...'పిన్నిబూచి' ట్రాఫిక్ వేపు చేయి చూపిస్తూ అంది' 'దియ' .
ఆ రద్దీలో నాకు 'దియ' ఏమన్నదో సరిగ్గా వినబడలేదు.'బూచి' అన్న పదం మాత్రం వినబడింది.
అది చూపించిన వేపు చూశాను.హోండా మోటరు బైక్ మీద ఓ కుర్రాడు,వెనకాల ఒక అమ్మాయి వెళుతున్నారు. వెనకాల కూర్చున్నఅమ్మాయి మావంక చూస్తూ నేను కూడా అటుగా చూడడంతో చప్పున ముఖం తిప్పేసుకుంది.
ఆ అమ్మాయి ముఖం మొత్తంలో ఒక్కముక్కు మాత్రమే బయటకు కనిపిస్తోంది.ముసుగుతో ముఖం మొత్తం తలవెనకాలగా రంగు రంగుల చున్నీతో కప్పేసుకుంది.
'ఓహో....ఆ అమ్మాయి వేషాన్ని చూసి 'బూచి' అనుకుందిలే' అని 'దియా'మాటలు పెద్దగా పట్టించుకోలేదు. మార్కెట్లోకావలసిన వన్నీమట్టి వినాయకుడు తో సహా  తీసుకుని ఇంటికి చేరేసరికి 10 గంటలు దాటింది.
'పూజకు అంతా రెడీనా' ? అడిగాను నేను.
'ఇంకాఎక్కడ, అమ్మవంట ఇంకా కాలేదు' సాగతీస్తూ అంది శ్రీమతి.
'పద్మా' నువ్వువంట త్వరగా చేస్తానంటే నేనేమీ వద్దు అన్నానా'? నా మానాన నేను హాయిగా టి.వి చూసుకుంటూ కూర్చునే దాన్ని. వంటచేయమని ఇప్పుడు దెప్పుతావేం ? మరి నాకు చేతనయినట్లు చెస్తాను. నీలాగా ఉరుకులు, పరుగుల మీద చేయలేనే తల్లీ ....' పెద్దగా నిట్టూరుస్తూ సమాధానమిచ్చారు ఉడుక్కుంటూ అత్తయ్య గారు .
'బాబోయ్...మీ కూతురితో వాదన పెట్టుకోకండి అత్తయ్యగారూ, కింద పడ్డ తనదే పైచెయ్యి అంటుంది' అన్నాను నేను మధ్యలో కల్పించు కుంటూ!
'ఆపుతావా నీ సోది అన్నట్లు చూసింది' నా వంక పద్మ.
'అప్పుడే ఆకలిదంచేస్తుంది. కొద్దిగా టీ ఇవ్వు పద్మా' వేడికోలుగా అడిగాడు తను.
'ఏమిటో బాబూ....ఇప్పుడు చూస్తున్నాం కానీ, మా చిన్నతనంలో'... 'అంతెందుకు మీ చిన్నతనం లో పూజ అయిందాకాఅసలు కాఫీ, టీ ఏమైనా తాగే వాళ్ళా'?  అసహనంతో అంది అత్తయ్య గారు.
ఇంతలో టీ తీసుకు వచ్చింది శ్రీమతి, ఆ చేత్తోనే 'దియ' కి కూడా 'బోర్న్ విటా' ఇచ్చింది, చల్లగాఉందేమో గట,గటా త్రాగేసింది దియ.
11 గంటలు. నేను పేపరు చదువుతూ కూర్చున్నాను.అది కిచెన్ సెట్ తో ఆడుతోంది .
నావంక చూస్తూ'ఈ పిల్ల ఇంకా రాలేదు. పూజ టైం లోపునే వస్తానంది' అర్ధగంటలో వస్తానని బయటకు వెళ్ళిన తన చెల్లెలి గురించి అంటోంది మా శ్రీమతి.
'అమ్మా' పిన్ని'బూచి' వేషం వేసుకుని స్కూటరు మీద వెళ్తుంటే చూశాను, అంది 'దియ' .
నేను పేపరులోంచి తల బయటకుపెట్టి మా ఆవిడ వంక ఆశ్చర్యార్ధకంగా చూశాను.
'ఏమిటండీ, ఇదేమిటో అంటోంది' ప్రశ్నార్ధకంగా నావైపు చూస్తూ.
'కమల' స్కూటర్  మీద వెళుతుంటే చూశానంటోంది' అన్నాను నేను.
ఆవిషయం నాకర్ధం అయింది మహానుభావా ?  మీరు బయటకు వెళ్లి నప్పుడే కదా ఇది మీతో వచ్చింది.'మీకు కమల కన్పించిందా  స్కూటరు మీద వెళ్తూ' అనుమానంగా అడిగింది మా శ్రీమతి.
'కొద్దిగా ఆలోచించాను. ' ఇదేమిటి మళ్ళీ అదేమాట అంటోంది. నాకు తానేమీ కన్పించలేదే'. ఇదేమైనా కన్ఫ్యూజ్ అయిందా ? లేక దీనికి  తను కన్పించిందా'? నాకు కొద్దిగా అనుమానం మొదలయింది.
ఇప్పుడు, నేను కొద్దిగా అనుమాన పడినట్లు 'పద్మ'కు అనుమానమొచ్చినా 'కమల' బ్రతుకు బస్స్టాండ్ పాలే.చంపేస్తుంది మాఆవిడ. అందుకే కచ్చితంగా చెప్పాను అది ఎవర్నో చూసి కన్ఫ్యూజ్ అయిందని.
అది విని  ఊరుకోవచ్చుగా, వేలెడంత లేదు, 'డాడీ'చూడలేదు మమ్మీ నేను చూశాను  పిన్నిని'
అంది కళ్ళు తిప్పుకుంటూ  'దియ'.
'ఎక్కడ చూశావే' ? ఆరా తీస్తూ అడిగింది మా ఆవిడ.
'మరేమో'నేనూ' దీర్ఘంతీస్తూ మొదలెట్టింది 'దియ'.
' పద్మా ' ఆపుతావా ఇంక ? అదేదో పేలుతోంది, అక్కడ ఇసుకేస్తే
రాలనంత జనం ఇది ఎవరిని చూసి కమల అనుకుందో' నువ్వేమో పెద్ద క్రాస్ ఎక్జామినేషను! వదిలేయ్' మనసులో ఏదో అనుమానం వేధిస్తున్నా పైకి మాత్రం అలా అన్నాను ఆ టాపిక్ అక్కడికి ఆపేయాలని !
'ఇక లే ముందు. దాని కేదో వేషధారణ చేస్తావుగా, మొదలెట్టు. నేనూ కూడ తయారవుతాను,
ఇక పూజ మొదలెడదాం'.
'పూజ టైంకల్లా కమల వస్తానంది అంటున్నావుగా,వచ్చేస్తుందిలే.కంగారేమిటి? చిన్నపిల్లే మి కాదుగా'అన్నాను నేను.
'అవును' అదే కదా నాబాధ. చిన్నపిల్ల అయితే బావుండేది. పెద్దది కదా' అందుకే నా భయం అంది పద్మ. ఇంతలో రానే వచ్చింది, కమల. 'ఎక్కడి కెళ్లావే' స్కూటరు మీద వెళ్తున్నావట కదా'? అంది పద్మ కమల వంక అనుమానంగా చూస్తూ.
'క్షణం, బిత్తరపోయి, నేనా ? స్కూటరు మీదనా? ఎవరన్నారు? అనుమానంగా నావంక చూసింది కమల.
భుజాలు తడుముకున్నట్లు 'నేను కాదు తల్లీ'దియ' నిన్నుమార్కెట్ దగ్గర స్కూటరు మీద వెళుతుంటే చూసిందట. వాళ్ల అమ్మకు చెప్పింది' తన అనుమానం క్లియర్  చేశాను నేను.
'అది ఎవర్ని చూసిందో నాలాగా ఉన్నవాళ్ళని' అయినా నేను ఇక్కడే పక్కన వీధిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే వున్నా'సంజాయిషీ' ఇస్తున్నట్లు అంది కమల.
'మళ్ళీ అంది 'దియ''ఏం కాదు..నిన్నేచూశాను నేను'.
'నన్నుకూడా చూశావు నువ్వు. 'బూచి' లాగా ముసుగు వేసుకున్నావు కూడా',
'బాబోయ్' ఇప్పుడు ఇంకా అడ్వాన్సు స్టేటుమెంటు' తనని కమల కూడా చూసిందని ఏమాత్రం తొణక్కుండా అంటోంది,'దియ'. నాకు మాత్రం ఏం తోచడం లేదు.
కమల వంక చూశాను సాలోచనగా. తన ముఖ కవళికలు చూశాక తను అబద్ధం చెబుతున్నట్లే అనిపించింది నాకు.
ఇక టాపిక్ ఆపాల్సిందే, లేకుంటే ఏం గొడవో అనుకుంటూ 'సరే' ఇక ఆవండి లేటవుతోంది. పూజకు కూర్చుందాం అని అందరం  కూర్చుని శ్రద్ధగా విఘ్ననాయకుని
పూజను  పూర్తి చేశాము. తరువాత భోజనాలయ్యాయి.
                                                                   * * * * *

                               రెండు రోజుల తరువాత నేను ఆఫీసుకు వెళ్తూ గమనించాను. చాలా మంది అమ్మాయిలూ మోటారుసైకిల్, స్కూటరులు డ్రైవ్ చేస్తు, కుర్రాళ్ళ వెనక కూర్చుని ముఖం పూర్తిగా ముసుగేసుకుని వెళ్ళడం చూశాను. అంతే కాదు రోడ్డు మీద నడుస్తూ, షాపింగ్ మాల్స్  నుంచి బయటకు వస్తూ కూడ చాలా మంది అమ్మాయిలు ముక్కు తప్ప ముఖం పూర్తిగా స్కార్ఫ్ తోనో లేక చున్నీ తోనో  కప్పుకున్నవారిని చూశాను. అంతగా ముఖం పూర్తిగా కప్పుకున్న మనిషిని గుర్తించడం అంత సామాన్య మైన విషయం కాదే.
మరి 'దియ' ఆ రోజేలా ముసుగేసుకున్న పిల్లను  'పిన్ని' అని ఎలా గుర్తించింది.
దాన్నిఅడుగుదామంటే బావుండదు అనిపించి నేనే అడిగే ధైర్యం చేయలేదు. కానీ నా మనసు శాంతించలేదు పైగా ఆఘటన పదే పదే గుర్తుకు వస్తోంది.
ఆ మోటర్ బైక్ మీద ముసుగులో ఉన్నఅమ్మాయి 'కమలే' నా? అయితే తప్పేముంది.
బైక్ మీద ఫ్రెండ్ తో వెళ్ళడం తప్పేమీ కాదే? అయితే  బైక్ మీద తను కాదని, ఫ్రెండ్ ఇంట్లో వున్నానని ఎందుకు చెప్పింది ? అందుకే ఆ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా మనసులో ఏదో అనుమానం తొలుస్తోంది.కావాలనే మైండ్ డైవర్ట్ చేసుకునే వాడిని.
ఒక రోజు నేను, పద్మ, దియ సినిమా కు వెళ్ళాము 'సినిమేక్సు'లో.
సినిమాలో మా పక్కనే ఒక జంట. ఓ కుర్రాడు, అమ్మాయి. ఆ అమ్మాయి హాల్లోకి వస్తూనే ముసుగుతో వచ్చింది.
ఆ పిల్లను చూస్తూనే అమ్మా 'బూచి' అని పెద్దగానే  అంది దియ.
ముసుగుతో ఉన్న అమ్మాయి ముసుగు తీసి నేను 'బూచి'ని కాదు అంది.
'ఏయ్, తప్పుఅలా అనకూడదు' అని 'దియాని' వారించింది 'పద్మ'.వెంటనే నా 'బుర్ర' ఆలోచనలో పడింది.
'దియా' పూర్తిగా ముఖం కప్పుకున్న పిల్లను 'బూచి' అంది కాని 'పిన్ని' అనలేదు.
అంటే 'దియ' ఏదో 'గుర్తు'తో 'కమల'ను' గుర్తించిందన్నమాట.
అయితే ఏమిటా గుర్తు? నాకు రోజురోజుకు ఉత్సుకత పెరుగుతోంది రెండు విషయాల్లో.
ఒకటి,'దియ'ముసుగులో ఉన్న కమలను ఎలా గుర్తించింది?
రెండు, కమల ఎవరితో స్కూటరు మీద వెళ్ళింది ? వెళ్ళినా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ?
'కమల' కనీసం నాతో కూడా ఆరోజు తరువాత ఆవిషయం గురించి మాట్లాడ లేదు.
నాతో తనకి చాల చనువు.  అక్కతో మాట్లాడని విషయాలు కూడా నాతో పంచుకుంటుంది.
తను 'మైక్రోసాఫ్ట్' లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. నాతో ఫ్రెండ్స్ అందరి గురించి అరమరిక ల్లేకుండా మాట్లాడేది.'దియా' బైక్ మీద చూసిన అమ్మాయి నిజంగా 'తనే' అయివుండి, ఇప్పటికీ నాతో చెప్పలేదు అంటే
కచ్చితంగా కమల నాదగ్గర కూడా ఏదో దాస్తున్నట్లే, ఏమైంది తనకి? ఎవరి నైనా ప్రేమిస్తుందా? అని ఆలోచిస్తున్నా.
ఇంతలో సినిమా హాల్లో అందరు పెద్దగా నవ్వేసరికి ఈలోకంలోకి వచ్చాను.
ఇంతలో 'ఏవండీ'ఇది మీ దగ్గరికి వస్తుందట' అని 'దియా 'ని అందించింది పద్మ.
నా ఆలోచనలకూ బ్రేక్ పడ్డది. ఆలోచనలు మాని సినిమాచూడ్డం లో నిమగ్నమయ్యాను.                                                           
తరువాత 'ఏమైనా సరే' ఈ విషయమేదో తేల్చుకోవలసిందే అని నిర్ణయించుకున్నాను.
'దియ' మళ్ళీ ఈ మేటరు ని పెద్దది చేయకుండా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాను.
ఇంటర్వల్ లో లైట్లు వెలగ్గానే పక్కన అమ్మాయి మళ్ళీ ముఖం కవరు చేసుకుంది.
నాకు విషయం స్పష్టంగా అర్ధమైంది.హైడింగ్ ఐడెన్టిటి.ఈ పిల్ల తనని ఎవరు గుర్తించ కుండా ముఖం కప్పుకుంటోంది. అయితే 'కమల' కూడా ఇలానే చేసి ఉండవచ్చు'అన్ననిర్ణ యానికి వచ్చాను. కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్క 'దియ' మాట తప్ప వేరే ప్రూఫ్ ఏమీ లేదు.
ఘంటసాల గారు పాడిన పాట 'శోధించి సాధించాలి' అదియే ధీర గుణం' గుర్తు కి వచ్చింది.
వారం అంతా ఆఫీసు లో పని ఒత్తిడి  వల్ల నా పరిశోధన కొద్దిగా వాయిదా వేసుకున్నాను.
                                                           * * * * *
      
                         మరుసటి రోజు  కమల ఆఫీసుకు బయలు దేరింది. బ్లూ జీన్స్ పేంటు దానిమీద నలుపు, తెలుపు టాప్ వేసుకుంది. బ్యాగు తీసుకుని బయలు దేరింది. నేను తను బయలు దేరిన రెండు నిముషాలకు బాల్కనీలోకి వచ్చితను 'స్కూటరు' మీద వెళ్తుంటే చూశాను.
తలమీద మాత్రం ఒక కేప్ పెట్టుకుంది.అనవసరంగా తనని అనుమానించానా అని అనుమానం వచ్చింది. అయినా ఎలాగు ఈ రోజు శలవు పెట్టాను ఈ పని కోసమే. తొందరపడి ఏ నిర్ణయానికి రాకూడదని, మామూలుగా ఆఫీసు కి బయలు దేరే టైం కి భోజనం చేసి బాక్స్ తీసుకుని బయలు దేరాను. లంచ్ టైం కల్లా 'కమల' వాళ్ళ ఆఫీసు దగ్గర కాపువేశాను. అర్ధగంట, గంట, మధ్యాహ్నం మూడింటి వరకు  వెయిట్ చేశాను. ఏమీ వర్క్ అవుట్ కాలేదు.'కమల'లంచ్ కి బయటకు రాలేదు.వీళ్ళు ఇంటికి ఎప్పుడు బయలుదేరుతారో తెలీదు. అందుకే  ఈసురోమని ఇంటికి తిరిగి వచ్చాను.
'ఏంటండీ' ఇవాళ త్వరగా వచ్చేశారు' అంది పద్మ ఇంట్లోకి రావడంతోనే. 'ఆఫీసు కి వెళ్ళ లేదుగా' నోటి దాకా వచ్చింది. తేరుకుని  కొద్దిగా తలనొప్పిగా వుంది, అందుకే వచ్చేశాను.
'కొద్దిగా టీ ఇవ్వు' అని ఫ్రెష్ అయి వచ్చి 'టీవీ' పెట్టుకుని కూర్చున్నా.
'డాడీ' అంటూ పరుగెత్తు కుంటువచ్చి ఒళ్ళో వాలింది 'దియ'.
దగ్గరికి తీసుకుని 'ముద్దు' పెట్ట్టుకుని స్కూలికి వెళ్ళావా? ఏం చెప్పారు స్కూల్లో ఈరోజు ? తన్ని ఎత్తుకుంటూ అడిగాను.
నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ 'డాడీ, డాడీ' ఈ రోజు నా ఫ్రెండ్  'దీప్తి' బర్త్ డే తెలుసా? అంది దియ నా రెండు చెవులూ సున్నితంగా వెనుకనుంచి పట్టుకుంటూ.
'తెలీదమ్మా' అయినా నువ్వు చెబుతేనే కదా నీ ఫ్రెండ్ గురించి నాకు తెలిసేది' అన్నాను నేను.
'మా అందరికీ చాకోలెట్లు,పెన్సిల్ బాక్స్ ఇచ్చింది' అంది నా మీదనుంచి  జారి పరుగు మొదలెడుతూనే.
'ఏయ్ ... దియా ' ఇలారా...  అని నేను అనే లోపునే 'బర్త్ డే' గిఫ్ట్ 'పెన్సిల్ బాక్స్ తీసుకు వచ్చి నాకు చూపెట్టింది.
నా బర్త్ డే కి కూడ 'గిఫ్ట్'  ఇవ్వాలి  తెలుసా? అంది ముద్దుగా.
'అలాగే' 'సరేనా'అని టీవీ న్యూస్లో మునిగిపోయాను.
పద్మ అమృతాంజనం, 'టీ' తెచ్చి ఇచ్చిపక్కనే కూర్చుంది.అంటే ఏమిటో చెప్పాలన్నమాట.
'ఏమిటి' ? అన్నట్లు తన  ముఖంలోకి చూశాను.
'కమల'కు అమ్మవాళ్ళ చుట్టాలబ్బాయి సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి హైటెక్ సిటీలోనే ఏదో ఎం.ఎన్.సి లో మంచి జాబు చేస్తున్నాడట.లక్షల్లో జీతమట.
'ఆంధ్ర యూనివర్సిటి M .Tech. కుర్రాడు చాలా బావుంటాడు. పేరు రవి. తెలిసిన వాళ్ళే. అడ్రెస్స్, ఫోను నంబరు వున్నాయి.'కమల'తో అమ్మమాట్లాడింది.అది ఇప్పుడే చేసుకోదట.
సంబంధం ఏమీ చూడాల్సిన పనిలేదు అని ఖచ్చితంగా చెప్పిందట.
అమ్మ చాలా భయపడుతుంది. నేను మాట్లాదామంటే అది నాతో అంతా 'క్లోజ్' గా మాట్లాడదు.
మీరు ఒకసారి దాంతో మాట్లాడితే బావుంటుంది. దానికి ఇరవై ఐదేళ్ళువచ్చాయి.
'ఇక పెళ్లి వాయిదా వేయడం కుదరదు అంటోంది అమ్మ' ఆందోళనగా అంది పద్మ.
'బావుంది' మన పరిశోధనకు ఇది ఒక అవకాశమే అనుకుంటూ.
'సరే పద్మా' మీదంతా కంగారు.ఆందోళన పడాల్సిన అవసరం ఏముంది.
ఇప్పుడేగా ప్రయత్నం మొదలెట్టింది. తను ఇదివరకే చెప్పిందిగా 25 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోనని.
తన టేస్ట్ కూడ తెలుసు కోవాలికదా! ఎటువంటి వాడు కావాలో, అన్ని కనుక్కుందాం' నేను తనతో మాట్లాడుతాలే. మీరు కంగారు పడకండి' అన్నాను నేను టి.వి చానెల్ మారుస్తూ.
పద్మలేచి వెళుతూ 'నేను, అమ్మా కాసేపు బయటకు వెళ్లివస్తాము. కొద్దిగాషాపింగ్ వుంది.
'దియ' ని మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళు షాపింగ్ కి వెళ్ళారు.
టీవీ లో ఏచానెల్ లోను మంచి ప్రోగ్రాము రావడం లేదు.
'దియ' నేను బాల్కనీ లో కుర్చీ వేసుకుని కూర్చున్నాం. నా వొళ్ళో కూర్చున్న 'దియ' లేచి 'బాల్కనీ రైలింగు' లోనుంచి బయటకు చూస్తూ నిలబడింది. నేను 'దియ' తో ఆ టాపిక్ ఎలా రైజ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను.
అంతలోనే  'డాడీ' అదిగో 'బూచి' అంది. అదే అవకాశమని 'బూచి' కాదురా!
'కమల' పిన్నికదరా అన్నాను నేను' తన రియాక్షను తెలుసు కుందామని.
'కాదు, 'డాడీ' కమల పిన్ని కాదు. ఈ 'బూచి'కి 'కొత్త చెప్పులు లేవుగా' అంది.
'చెప్పులేమిటి రా'అన్నాను నేనుఇంకా వివరం రాబట్టాలని'
'అదికాదు, డాడీ' 'పిన్ని, నేను వెళ్లి కొత్త  చెప్పులు కొన్నాము కదా!
' బూచి' ఆ చెప్పులు వేసుకోలేదుగా. ఆ చెప్పులు ఇక్కడే వున్నాయిగా ఇప్పుడు'.
'అంటే, ఆ రోజు 'కమల'ను కొత్త చెప్పులు చూసి గుర్తు పట్టిందన్నమాట...'
'ఎక్కడున్నాయిరా కొత్త చెప్పులు'అడిగాను'దియ' ని. పరుగెత్తి కెళ్ళి చెప్పుల జత తెచ్చింది, దియ.
'మరేమో డాడీ' నేను, కమలపిన్ని షాపింగ్ కి వెళ్లి ఈ చెప్పులు కొన్నాము.
'నేనే పిన్నికి ఇవి బావున్నాయి అని చెప్పాను' అంది దియ.
'ఓ.కే. 'దియా' చెప్పులు మళ్ళీ అక్కడ పెట్టి రా' అని నామనస్సులో వినాయక చవితి రోజు మోటర్ బైక్ మీద ఇది చూసిన ముసుగు పిల్ల 'కమలే'నని కన్ఫర్మ్ చేసుకున్నా.అయితే కమల అబద్ధం ఎందుకు చెపుతోంది?
'ఆ అబద్ధానికి ఇప్పుడు పెళ్లి వద్దు అనడానికి ఏమైనా సంబధం ఉందా'?
తనని సూటిగా అడిగి ఈ విషయం క్లారిఫై చేసుకోవాల్సిందే. అని నిర్ణయించుకున్నాను.
తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఆరోజు రానే వచ్చింది.
ఆరోజు అత్తయ్యగారు, పద్మ గుడికి వెళ్తూ 'దియా'ని ఇంట్లో వుంచి వెళ్తుంటే దాని కూడా తీసుకెళ్ల మన్నాను.
'కమల' ఇంట్లోనే వుందికదా మాట్లాడుదామని 'దియా'ని  తీసుకెళ్లమన్నాను.
'గుడికివెళుతున్నామండీ, మనశ్శాంతిగా దేవుడికి దణ్ణం కూడ పెట్టుకోనివ్వదు బాబూ' 
కాసేపు మీరే చూడండి దాన్ని అని వదిలేసి  వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే ఇది కమల రూములో చేరింది.
నేను 'కమలా' ఏం చేస్తున్నావు?  అనుకుంటూ తన రూములోనికి వెళ్లాను.
'దియా' ఏవో బొమ్మలతో ఆడుతోంది, కమల  పడుకుని ఏదో మేగజీన్ చదువుతోంది.
నన్నుచూసి లేచి 'ఏంటి బావా'? అని అడిగింది.
'నీతో కొద్దిగా మాట్లాడాలి 'కమలా' అన్నాను నేను.
'నేను కూడా నీతో మాట్లాడాలి బావా' అంది కమల.
'దాన్నిఏదైనా బొమ్మలతో ఎంగేజీ చేసి ఇలా హాల్లోకి రా' అని చెప్పినేను హాల్లోకి వచ్చికూర్చున్నాను.
రెండు నిముషాల్లో 'కమల'వచ్చి సోఫాలో అటు పక్కగా కూర్చుంది.
నేను లేటు చేయకుండా పాయింట్ కి వచ్చేశాను.
'కమలా నువ్వంటే నాకు చాలా  గౌరవం. నువ్వెప్పుడు అల్లరి చిల్లర పనులుచేసినట్లుగా కూడా నాకు తెలీదు. చక్కగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు.
నాకు తెలిసి దాదాపు ఈ ఎనిమిది సంవత్సరాలలో నువ్వు అబద్ధం చెప్పడం నేను మొట్టమొదటి సారి గమనించాను. 'అదీ' ఏదో పెద్ద విషయానికి కాదు.
 ఫ్రెండ్  బైక్ మీద లిఫ్ట్ తీసుకోవడం తప్పేమీ కాదే.
ఎందుకు ఆ విషయంలో నువ్వు అబద్ద మాడ వలసి వచ్చిందో నాకు అర్ధం కాలేదు.
అదీ 'దియ' చెపితే గాని మాకు తెలీదు. ఆరోజు బైక్ మీద ముసుగు కప్పుకున్న అమ్మాయివి నీవేనని ఖచ్చితంగా నాకు తెలుసు' అన్నాను తన ముఖంలోకి సూటిగా చుస్తూ!
'ఎందుకు తెలీదు.. బావా? చిన్నపిల్లని పట్టుకుని వివరాలు రాబడితే తెలీదేంటి?
ఎదురు  ప్రశ్నవేసింది 'కమల'.బిత్తర పోవడం నావంతయింది.
'అదేంటి''దియ' నేను చెప్పులు చూపించ మన్నవిషయం కమలకు గాని చెప్పిందేమిటి  కొంపముంచి' ఆదుర్దాగా  అనుకున్నాను నాలో నేను. అయినా బింకంగా'చెప్పులేమిటి, కమలా'? అన్నాను నేను.  
'పెద్ద డిటెక్టివ్ లా ఏమిటా పనులు' ?
'అదసలే ఖతర్నాక్  పిల్ల' అటు మీకు నాచెప్పుల గురించి చెప్పింది.
బైక్ మీద వెనుక ముసుగులో వున్నది నేనే నని క్షణంలో అంత ట్రాఫిక్ లో నా చెప్పులు చూసి గుర్తు పట్టింది'.
'ఆ చెప్పులు నేను అది వెళ్లి కొన్నాము. తరువాత చెప్పులు మీకు చూపించానని కూడా నేను అడక్కుండానే నాకు చెప్పింది'.
'ఆరోజు నేను దాన్ని ముసుగులోనుంచే  చూశాను. నేను తనని చూసిన విషయం అది కూడ గమనించింది' బాబోయ్ దానివి గద్ద కళ్ళలాగా చాలా షార్ప్.
'దానికన్నీ నా పోలికలే'.'దియా' ని మెచ్చుకుంటూ అంది కమల.
'నేను ఇక అసలు విషయానికి వస్తాను'. నువ్వే అంతా మేనేజ్ చెయ్యాలి బావా' !
అలా అని నాకు ప్రామిస్ చేస్తే అన్ని విషయాలు మీకు చెపుతాను అంటూ తన కుడి చేతిని ముందుకు చాపింది కమల.
'ఎలాగు…నాకు నాన్నగాని ,అన్నతమ్ముళ్ళు గాని లేరు'.
'అన్ని మీరే నాకు' సీరియెస్ గా అంది కమల తలవంచుకుని చాలా ఎమోషనల్ గా .
నా బుర్ర తిరిగి పోతోంది. ఈ పిల్ల ఏం బాంబుపేల్చ పోతోందో దేవుడా నని.
ఏం ప్రామిస్ చేస్తే ఎలా ఇరుక్కు పోతానోనని క్షణం ఆలోచిస్తూ వుండి పోయాను నా కుడి చేతిని ముందుకు కొద్దిగా వెనక్కి కొద్దిగా జరుపుతూ.
'వినాయక చవితి రోజు బైక్ మీద వెనకాల కూర్చున్నది నేనే.
'దియా' నన్నుగుర్తుపట్టింది' అని చెపుతూ టక్కున ఆపేసింది 'దియ' అక్కడకి రావడంతో.
'ఆపేశావేం'.చెప్పు'కమలా' రెండుకళ్ళ మీద చేతులు పెట్టుకుని అదేదో సినిమా లో డైలాగ్  గుర్తు తెచ్చుకుంటు  కళ్ళుమూసుకుని అన్నాను నేను.
'ఏంటిడాడీ'ఏం చెప్పాలి'? అంది దియ. ఉలిక్కిపడి దిగ్గున లేచాను నేను.
పక పకా నవ్వుతోంది కమల.
నేనింకా తేరుకోలేదు.'దియ' వంక అయోమయంగా చూస్తున్నా.
'మీరేం 'వర్రీ' కాకండి. అంతా ఓకే. మీరల్లా  నాకు కొద్ది మాట సాయం చేయడమే'.
'అక్కకు, అమ్మకు తెలియకుండా మేనేజ్' చెయ్యాలి అంతే' అంది కమల గుంభనగా
విషయం ఏమిటో చెప్పకుండా.
'ఇంకేముంది' ఈ పిల్ల కొంప ముంచేసింది. నేననుకున్నదే కరెక్టు' అనుకున్నాస్వగతంలో.
'అదేమీ కరెక్ట్ కాదు. మీరూహించుకున్నట్లు. నేనేమీ ఎవరి కొంప ముంచలేదు. ముందు నేను చెప్పేది వినండీ బావా' అనునయంగా అంది కమల.
'ఇదేమిటీ...నేను ఏ మాట పైకి అనకుండానే నేనకుంటున్న మాటలు పొల్లుబోకుండా చెప్పేస్తోంది,ఎలాగబ్బా? ఎలా సాధ్యం '? విస్మయంతో అనుకున్నాను స్వగతంలో.
'ఎలాగో తరువాత నేనే చెబుతాగాని ముందు నేను చెప్పేది వినండి' అంది కమల .
నవ్వు ఆపి.
'అది, 'ఆల్ ఇండియా రేడియో', జాగ్రత్త బావా'అని నన్ను హెచ్చరించే సరికి నాకు ఉన్న మతికూడా పోయి, 'ఏం.లేదమ్మా' కమల పిన్ని నాకు కధ చెపుతూ ఆపింది. అందుకు కధ చెప్పమని అడుగుతున్నా, అన్నాను కంగారుగా ఏం మాట్లాడుతున్నానో తెలీకుండానే.
'హూ,హూ....ఇందాక ఎన్నిసార్లు అడిగాను స్టొరీ చెప్పమని. నాకు చెప్పకుండా డాడీ కి చెపుతున్నావా'? రెండు చేతులు ఊపుతూ అలిగినట్లు మారాం చేస్తూ  అంది 'దియ'.
'బావా' కమల అరిచిందో, గదిమిందో'నాకు అర్ధంకాలా. అంతలా అరిచింది కమల.
'నేను,అయిపోయాను'.దానిని ఇప్పుడు ఎలా మేనేజి చెయ్యాలో'? అంటూ లేచి వెళ్లి ఒక  'ఫైవ్ స్టార్ చాకోలేటు' దానికిచ్చి అది ఆడుకునే 'టాయ్' 'కిచెన్ సెట్' తెచ్చిదూరంగా సదిరి, నాకో 'పిజ్జా' డాడీకో 'పిజ్జా' చేసి తీసుకోరా' అని చెప్పి వెనక్కి వచ్చింది కమల.
'చాకోలేటు' తింటూ... కిచెన్ ఆటలో మునిగిపోయింది దియ.
'అమ్మయ్య ' గండం గడిచినట్లు ఊపిరి పీల్చుకున్నాను నేను.
'అయినా ప్రతి చిన్న విషయానికి అంతలా కంగారు పడితే ఎలా బావా'.అయినా నీకు ఉందిలే 'ముసళ్ళపండగ' ముందు, ముందు దీనితో. వెనక్కు తిరిగి ప్రేమగా 'దియా' ని పరిశీలనగా చూస్తూ అంది కమల .
'అవును కమలా'దీని ముందు ఏమి మాట్లాడాలో, ఏది కూడదో కూడా తెలీడం లేదు' అన్నాను నేను మెల్లగా 'దియా' వినకుండా.
'సరేలే బావా'చిన్న పిల్ల అది'.'దాన్నినాకు వదిలేయండిపెద్ద అయిన తరువాత. 'సరేనా' రెట్టించింది కమల.
'సరే తల్లీ సరే'అన్నాను నేను అన్యమస్కంగా. తరువాతగాని నాకు అర్ధంకాలే, నేను ఏమిఅన్నానో...
"సరే,బావా' అమ్మావాళ్ళువచ్చేస్తారు. నేను చెప్పేదేమిటంటే ఆరోజు నేను 'రవీంద్ర' బైక్ మీద  వెళుతుంటేనే  'దియా' చూసింది.
'రవీంద్ర' వాళ్ళు మనవాళ్ళే. ఈ రోజో, రేపో, మీకు ఒక సంబంధం గురించి అమ్మో,అక్కయ్యో ఎవరో ఒకళ్ళు చెపుతారు' అంది కమల.
'అవును కమలా...'ఇప్పుడే పెళ్ళేంటి'సంబంధాలు వద్దన్నావట కదామీ అమ్మతో' అన్నాను నేను సమయానికి పద్మ చెప్పింది గుర్తుకువచ్చి.   
'అయ్యో బావా' అలా అంటేనే అమ్మా వాళ్ళు తొందరపడతారని నాకు తెలుసు' నవ్వుతూ అంది కమల.
'అమ్మా, కమలా,ఎంత గుండెలు తీసిన బంటువి. నువ్వు సామాన్యురాలివి కాదు.
'దియా'  కి నీ పోలికే వచ్చినట్లుంది...అన్నాను నిజంగా గుండెల మీద రెండు అరిచేతులు  ఆనించుకుని.
'బావా'..ఆ పిల్లవాడు..ఈ రవీంద్రనే !
మంచి కుర్రాడు. సంవత్సరంనుంచి గమనిస్తున్నాను. ఏ చెడు అలవాట్లు లేవు, అక్కా వాళ్ళుగుడి నుంచి వచ్చాక మనం బయటకు వెళదాము. అతన్నిపరిచయం చేస్తాను. మీరు అతని తో మాట్లాడండి. మాట్లాడాక అతని
గురించి ఏమైనా 'ఎంక్వయిరి' గట్రా చేస్తానంటే మీఇష్టం. నూటికి నూరుపాళ్ళుమీకు ఆ కుర్రాడు అన్నివిషయాల్లో నచ్చితేనే, నేను ప్రొసీడ్ అవుతాను. మీ కంటే నాకు ఈ ప్రపంచంలోనే 'వెల్విషరు' గానీ 'గాడ్ ఫాదర్' గాని ఎవరు లేరు అంటూ నారెండూచేతుల్ని తనచేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా ఒత్తి వదిలేస్తూ' 
'వాళ్ళు మాకు దూరపు చుట్టాలే. అతని కజిన్ సిస్టర్ కి  నా రెఫెరెన్సు అక్కే సంవత్సరం కింద ఏదో పెళ్ళిలో ఇచ్చిందట. అప్పుడు అతను ఒకరోజు నన్ను ఆఫీసు దగ్గర కలిశాడు. అప్పటినుంచి అతను నాకు తెలుసు. మంచి స్నేహితులం.
మేమిద్దరం ఒకరికి  ఒకరం తెలుసునన్న విషయం ఇటు అమ్మ,అక్కయ్య వాళ్లకి గాని, అటు అతని కజిన్ సిస్టర్ కిగాని,పేరెంట్స్ గాని ఎవరికీ తెలీదు.
కట్నాలు, గిట్నాలు ఏమీ లేవు'
అమ్మావాళ్ళు ఈరోజు మీతో ఈ సంబంధం గురించి చెప్పాక, మీరు మామూలుగానే 'ప్రోసీడు' కండి. ఏదో పరాయి సంబంధం లాగే మాట్లాడుతూ ఉండండి. వాళ్ళ వాళ్ళు వస్తారు. చూస్తారు.ఒప్పుకుంటారు'
''సరేనా,అర్ధం  అయ్యిందా?ఇంకొక విషయం. ఎక్కడయినా తిక్క వేషాలు వేసి అక్కకు గాని, అమ్మకుగాని, వాళ్లకు గాని మీ వల్ల తెలిసిందనుకోండి.
మీ పని బట్టేస్తాను'' అంది కమల నవ్వుతూ చూపుడు వేలు ఊపుతూ!
మళ్ళీ వెంటనే  'ప్లీజ్ బావా జాగ్రత్తగా 'డీల్'  చేయండి. సరేనా' మిమ్ముల్నే 'అంటూ  రెండు చేతులు జోడించి, చనువుగా బతిమాలుతూ,నొక్కి పలుకుతూ నావంక చూస్తూ అంది కమల.
'అర్ధం అయింది నాకు ఒక్కడికే కాదు, సోఫా వెనకాల చూడు' అన్నాడు తను.
కెవ్వున అరిచినంత పనిచేసింది కమల....
'నీకు 'పిజ్జా' ఆర్డర్ ఇచ్చాను కదా' అయిందా'? అంది 'దియా' వంక చూస్తూ
'ఏం కాలేదు. 'నీకు 'వెజ్' పిజ్జానా ? 'నాన్ వెజ్' పిజ్జానా' ? అడుగాదామని వచ్చా.నువ్వేమో 'డాడీ' కి కధ చెపుతున్నావు. అందుకే వింటున్నాను' కమల అడిగిన ప్రశ్నకు  దీర్ఘంగా జవాబు చెప్పింది 'దియ'.
'చచ్చానురా బాబోయ్ ఈ పిల్లతో, ఏం విన్నదో?.ఏం అర్ధమయిందో,.ఎక్కడ ఏం వాగుతుందో'
కంగారుగా అంది కమల.
''మీ కసలు 'జాగ్రత్త' అనేది లేదుబావా. నాతో మాట్లాడుదామనుకున్నప్పుడు, దాన్నివాళ్ళతో తీసుకు పొమ్మని  చెప్పివుండ వచ్చు కదా'' అంటూ కమల దాన్నివళ్ళోకి తీసుకుని కధవిన్నావారా? అని నవ్వుతూ అడిగింది.
'ఆ,విన్నాను. కానీ అంతా అర్ధం కాలే.
'నువ్వు 'రవీంద్ర' అబ్బాయి బైక్ మీద వెనకాల కూర్చున్నావు. అదే అర్ధమయింది.అంతే!
''మొదలు నుంచి చెప్పు స్టొరీ'' ముద్దుగా అడిగింది దియ.
''బావా, ఐ విల్ టెల్ హర్ సం స్టొరీ.ఐ విల్ మేనేజ్ హర్ యు డోంట్ వర్రీ' అండ్ యు ప్రొసీడ్ ఏజ్ ఐ సెడ్ ప్లీజ్'' అంది కమల 'దియా'ని తన  గదిలోకి తీసుకు వెళ్తూ.
''సరేగాని కమలా, నాకు ఇంకొక చిన్నవిషయం చెప్పు.మీ అమ్మాయిలని గుర్తించకుండా ఉండటానికేనా ముఖం అంతా ముసుగు కప్పు కునేది''? గదిలోనికి వెళ్తున్న కమల నుద్దేశించి అన్నాడు తను.
'పిచ్చి బావగారూ...అందరూ మీలామంచి కుర్రాళ్ళు, మనుషులుకారు.
యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్ నుంచి తప్పించు కోవడం కోసమే ఈ కన్సీలింగ్ ఐడెంటిటి, ఇవన్నీమాఆత్మరక్షణ కోసమే. అంతే కాదు ఇంకో రహస్యం కూడ వుంది.
మా అందమైన ముఖాలు దుమ్ము,ధూళి, కాలుష్య బారి నుంచి కాపాడు కోవడానికి కూడా''అంది కమల హాయిగా నవ్వుతూ.
'బావా' రేపట్నుంచి మీ ముఖ సౌందర్యం కాపాడుకోవడం కోసం మీరు ముఖానికి ముసుగు వేసుకోకండేం. జనం కాదు దడుచుకునేది.పోలీసువాళ్ళు"అంది మళ్ళీ హాయిగా నవ్వుతూ కమల.
''సరేలే.ఈ చిట్కా 'రవీంద్రకు' చెపుతా.నాకెందుకు.
ఇంకో "బూచి" తయారవుతాడు మనింట్లో నీకు తోడు" అన్నాడు తను కూడా హాయిగా నవ్వుతూ.
'మీరిద్దరూ ఎందుకు నవ్వుతున్నారు' స్టోరి' అయిపోయిందా ? ఆరా తీసింది ...చిట్టి 'దియా'.

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.
Mob. No.9849118254

27, ఆగస్టు 2010, శుక్రవారం

'sing please'

                                             
                                                           
సింగ్' ప్లీజ్ 
==========

''ఏమయ్యా సుబ్బారావు, ఎన్ని సార్లు చెప్పాలయ్యా నీకు'? 'ఒళ్ళు, బుర్ర దగ్గర పెట్టుకుని పని చేయవయ్యా,ఆఫీసులో ఉన్నంత వరకు', నీ సొంత సమస్యలు ఇంటి దగ్గరే వదిలి రావయ్యా'' విసుక్కుంటూ అన్నాడు మేనేజర్ .
'ఏమిటి, ఏమైంది సర్'? కంగారు పడుతూ మేనేజర్ ని అడిగాడు సుబ్బారావు, చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో సీనియర్ గుమస్తా
'నీకు తెలుసుగా ఈ ఫైలు చీఫ్ ఇంజినీరు గారికి వెళ్తుందని'.
'ఎస్' సర్'  తెలుసండీ.
'అందుకే చాల జాగ్రతగా 'డ్రాఫ్ట్' నోటీసు తయారు చేశానండీ' అన్నాడు సుబ్బారావు
''సరే అయితే, ఒక 'పాట' పాడండి''!
'ఏమిటండీ'?
''ఒక 'పాట'  పాడండీ" మళ్ళీ అన్నాడు మేనేజర్ గారు.
'అర్ధం కావడం లేదండీ మీరేమంటున్నారో'...నేను పెట్టిన ఫైల్ పాత వాహనాల 'వేలంపాట' గురించండీ' అన్నాడు సుబ్బారావు లేని వినయం ప్రదర్శిస్తూ.
"ఆహా, అలాగా…అయితే ఈ డ్రాఫ్ట్ మీద తమరు పెట్టిన ఫైల్ 'ఫ్లాప్' మీద ఏం వ్రాశారో అదే పైకి చదవండీ' అన్నాడు మేనేజర్
'సైన్'  ప్లీజ్" అని వ్రాశానండీ.
"జాగ్రత్తగా చూసి చదువు మిస్టర్'' అది కాదు అక్కడ వ్రాసింది నువ్వు.
'ఫ్లాప్' వ్రాసిన ఇంగ్లీష్ స్పెల్లింగులు చూడండి" ఈసారి గద్దించాడు ఆఫిసర్.
'ఓహ్'… సారీ సర్, సారీ' నొచ్చుకుంటున్నట్లుగా నటించాడు సుబ్బారావు
"అక్కడ ఇంగ్లీష్ స్పెల్లింగు ఉన్నది ఉన్నట్లు చదవండి 'మిస్టర్'  మీరు ఏం వ్రాశారో"
'సింగ్ ప్లీజ్' అంటూ  నాలుక్కరుచుకుని 'ఓ' 'సైన్ ప్లీజ్'  'ఎస్ ఐ జి ఎన్' కి బదులుగా పొరబాటున 'ఎస్ ఐ ఎన్ జి'  వ్రాశాను 'సర్' అన్నాడు సుబ్బారావు.
'మన చీఫ్ ఇంజినీర్ గారి పేరు ఏమిటి'  సుబ్బారావు ? అనునయంగా అడిగాడు మేనేజర్
మౌనంగా నిలబడే వున్న సుబ్బారావు వంక సూటిగా చూస్తూ.
'చెప్పండీ' రెట్టించాడు మేనేజర్
'నిర్మల్ సింగ్' గారు కదండీ …
'ఈ ఫైల్ ఆయన దగ్గరికి ఇలాగే వెళ్తే ఏమయ్యేది'? ఫైల్ పక్కనపెట్టి అడిగాడు మేనేజర్
'ఇప్పుడు నేను మీదగ్గర నేను నిలబడ్డట్లు మీరు అయన దగ్గర చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడి చీవాట్లు తింటూ వుండే వారండీ' అన్నాడు సుబ్బారావు
'ఈ తెలివితేటలు బాగానే వున్నాయి'...
' డ్రాఫ్ట్ నోటీసులో ఇంకొక  'మిస్టేకు' వుంది…గమనించారా' ? అన్నాడు మేనేజర్
'లేదండీ, ఇంకేమీ తప్పులు లేవండీ…ఇది కూడా తొందరలో పొరబాటున  'n' 'లెటర్' అటుదిటు అయింది  'అంతే సర్ ' విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ.
''ఈ డ్రాఫ్ట్  ని మళ్ళీ చూడండీ'' అన్నాడు మేనేజర్ కళ్ళజోడు పైనుంచి సుబ్బారావుని చూస్తూ 'టైం వేస్టు కాకుండా మీరే చెప్పండి సార్' అన్నాడు సుబ్బారావు అసహనంగా అటు ఇటు కదులుతూ.
'వేలం వేసే 'పాత' వాహనాలు ఎక్కడ వున్నాయి'? కోపంగా అడిగాడు మేనేజర్
'పాడేరు' లో 'సర్'
'వేలం పాట ఎక్కడ'?
'పాడేరు'లో మన ఆఫీసులో సర్',
"తమరు డ్రేఫ్ట్ లో వ్రాసిందేమిటో జాగ్రత్తగా చూడండి"?
'ఓహ్'...సారీ సర్,  ఇక్కడ కూడా 'జస్ట్' అటుదిటు అయింది సర్....'సారీ'!
'మిమ్ముల్ని ఏమనాలో అర్ధం కావడం లేదు. మీరు చాలా 'కేర్లెస్' గా పని చేస్తున్నారు
'బీ కేర్ ఫుల్...ఐ విల్ నాట్ టాలరేట్ థిస్ సార్ట్ అఫ్ ఇండిసిప్లిన్' ఇన్ ది ఆఫీస్' కోపంగా అన్నారు మేనేజర్  గారు.
'ఇక నుంచి జాగ్రత్తగా వుంటాను సర్' మేనేజర్ చేతుల్లోనుంచి ఫైల్ అందుకుంటూ
'సరే...ఈ డ్రాఫ్ట్ తీసుకు వెళ్లి ' రీడ్రేఫ్ట్' చేసుకుని 'ఫెయిర్ కాపీ'తో సహా తీసుకురండి రండి,
త్వరగా, క్విక్ '
పది రోజు ల్లోనే కదా వేలం' అన్నాడు మేనేజర్ సుబ్బారావు ని తొందర బెడుతూ
'అవును సర్,' అంటూ
'ఫైల్ వెనక్కు తీసుకు వెళ్తూ అన్నాడు సుబ్బారావు వెనక్కుతిరిగి  'మేనేజర్' ని ఉద్దేశిస్తూ.
'బావా' అక్క కూడా వస్తానంది.పాడేరు...పని ఉందట' నీతో చెప్పమంది' అన్నాడు సుబ్బారావు.

కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు : 9849118254
'సింగ్' ప్లీజ్ 

''ఏమయ్యా సుబ్బారావు, ఎన్ని సార్లు చెప్పాలయ్యా నీకు'? 'ఒళ్ళు, బుర్ర దగ్గర పెట్టుకుని పని చేయవయ్యా,ఆఫీసులో ఉన్నంత వరకు', నీ సొంత సమస్యలు ఇంటి దగ్గరే వదిలి రావయ్యా'' విసుక్కుంటూ అన్నాడు మేనేజర్ .
'ఏమిటి, ఏమైంది సర్'? కంగారు పడుతూ అన్నాడు సుబ్బారావు, చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో సీనియర్ గుమస్తా
"నీకు తెలుసుగా ఈ ఫైలు చీఫ్ ఇంజినీరు గారి కి వెళ్తుందని".
'ఎస్, సర్'  తెలుసండీ.
'అందుకే చాల జాగ్రతగా 'డ్రాఫ్ట్' నోటీసు తయారు చేశానండీ' అన్నాడు సుబ్బారావు
''సరే అయితే, ఒక 'పాట' పాడండి''!
'ఏమిటండీ'?
''ఒక 'పాట'  పాడండీ" మళ్ళీ అన్నాడు మేనేజర్ గారు.
'అర్ధం కావడం లేదండీ మీరేమంటున్నారో'.....నేను పెట్టిన ఫైల్ పాత వాహనాల 'వేలంపాట' గురించండీ' అన్నాడు సుబ్బారావు లేని వినయం ప్రదర్శిస్తూ.
"ఆహా, అలాగా"అయితే ఈ డ్రాఫ్ట్ మీద తమరు పెట్టిన 'ఫ్లాప్'  మీద ఏం వ్రాశారో పైకి చదవండీ"! అన్నాడు మేనేజర్
'సైన్'  ప్లీజ్" అని వ్రాశానండీ.
"జాగ్రత్తగా చూడు మిస్టర్'' అది కాదు అక్కడ వ్రాసింది. నువ్వు వ్రాసిన  ఇంగ్లీష్ స్పెల్లింగులు చూడండి" గద్దించాడు ఆఫిసర్.
'ఓహ్'… సారీ సర్, సారీ' నొచ్చుకుంటున్నట్లుగా నటించాడు సుబ్బారావు
"అక్కడ స్పెల్లింగులు ఉన్నది ఉన్నట్లు చదవండి 'మిస్టర్'  మీరు ఏం వ్రాశారో"
'సింగ్ ప్లీజ్' అంటూ  నాలుక్కరుచుకుని 'ఓ' 'సైన్ ప్లీజ్'  'ఎస్ ఐ జి ఎన్' కి బదులుగా పొరబాటున 'ఎస్ ఐ ఎన్ జి'  వ్రాశాను 'సర్' అన్నాడు సుబ్బారావు.
'మన చీఫ్ ఇంజినీర్ గారి పేరు ఏమిటి'  సుబ్బారావు ? అనునయంగా అడిగాడు మేనేజర్
మౌనంగా నిలబడే వున్న సుబ్బారావు వంక సూటిగా చూస్తూ.
'చెప్పండీ' రెట్టించాడు మేనేజర్
'నిర్మల్ సింగ్' కదండీ …
'ఈ ఫైల్ ఆయన దగ్గరికి ఇలాగే వెళ్తే ఏమయ్యేది'? ఫైల్ పక్కనపెట్టి అడిగాడు మేనేజర్
'ఇప్పుడు నేను మీదగ్గర నేను నిలబడ్డట్లు మీరు అయన దగ్గర చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడి చీవాట్లు తింటూ వుండే వారండీ' అన్నాడు సుబ్బారావు
'ఈ తెలివితేటలు బాగానే వున్నాయి'...
' డ్రాఫ్ట్ నోటీసులో ఇంకొక  'మిస్టేకు' వుంది…గమనించారా' ? అన్నాడు మేనేజర్
'లేదండీ, ఇంకేమీ తప్పులు లేవండీ…ఇది కూడా తొందరలో పొరబాటున  'n' 'లెటర్' అటుదిటు అయింది  'అంతే సర్ ' విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ.
''ఈ డ్రాఫ్ట్  ని మళ్ళీ చూడండీ'' అన్నాడు మేనేజర్ కళ్ళజోడు పైనుంచి సుబ్బారావుని చూస్తూ 'టైం వేస్టు కాకుండా మీరే చెప్పండి సార్' అన్నాడు సుబ్బారావు అసహనంగా అటు ఇటు కదులుతూ.
'వేలం వేసే 'పాత' వాహనాలు ఎక్కడ వున్నాయి'? కోపం గా అడిగాడు మేనేజర్
'పాడేరు' లో 'సర్'
'వేలం పాట ఎక్కడ'?
'పాడేరు'లో మన ఆఫీసులో సర్',
"తమరు డ్రేఫ్ట్ లో వ్రాసిందేమిటో  జాగ్రత్తగా చూడండి"?
'ఓహ్'...సారీ సర్,  ఇక్కడ కూడా 'జస్ట్' అటుదిటు అయింది సర్....'సారీ'!
'మిమ్ముల్ని ఏమనాలో అర్ధం కావడం లేదు. మీరు చాలా 'కేర్లెస్' గా పని చేస్తున్నారు
'బీ కేర్ ఫుల్...ఐ విల్ నాట్ టాలరేట్ థిస్ సార్ట్ అఫ్ ఇండిసిప్లిన్' కోపంగా అన్నారు మేనేజర్  గారు.
'ఇక నుంచి జాగ్రత్తగా వుంటాను సర్' మేనేజర్ చేతుల్లోనుంచి ఫైల్ అందుకుంటూ
'సరే...ఈ డ్రాఫ్ట్ తీసుకు వెళ్లి ' రీడ్రేఫ్ట్' చేసుకుని ఫెయిర్ కాపీ తో సహా తీసుకురండి రండి,
త్వరగా, క్విక్ '
పది రోజు ల్లోనే కదా వేలం' అన్నాడు మేనేజర్ సుబ్బారావు ని తొందర బెడుతూ
'అవును సర్,' అంటూ
'ఫైల్ వెనక్కు తీసుకు వెళ్తూ అన్నాడు సుబ్బారావు వెనక్కుతిరిగి  'మేనేజర్' ని ఉద్దేశిస్తూ.
'బావా' అక్క కూడా వస్తానంది.పాడేరు...పనిఉంఉందట' నీతో చెప్పమంది' అన్నాడు సుబ్బారావు.

కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు : 9849118254

20, ఆగస్టు 2010, శుక్రవారం

Role model

    
                                                    ఎక్కడో ఒకరు
                                            -------------------------- 
మా ఆడపడుచు పెళ్లి అని నాలుగు రోజుల ముందు వచ్చాం అమెరికానుంచి. హైదరాబాదులో పెళ్లి. ఆడపడుచు సాఫ్ట్ వేర్ ఇంజినీర్,బాగా చడువువచ్చిన పిల్ల.M.Tech (IIT ). పిల్లవాడు B.Tech, I I M , అహమ్మదాబాద్, లో M.B.A  చేసాడు. ఏదో MNC  లో వర్క్ చేస్తున్నాడు.మంచి జీతం. చివరి పెళ్లి అని, వాళ్ళు కొద్దిగా పై స్థాయి వాళ్ళని,  మా మామ గారు చాలా ఆడంబరంగా చేస్తున్నారు. మేమే చాలా డబ్బు తెచ్చాము పెళ్ళికని.  పెళ్ళివారి విడిది నుంచి మాటికి మాటికి ఏవో కోరికలు వస్తూనే వున్నాయి. పిల్లాడి తల్లి,వ్యవధి ఇవ్వకుండానే ఏవో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. కనీసం మాకుటుంబం వరకైనా వెండి పళ్ళేలలో టిఫెన్లు పెట్టండి అన్నారు. అప్పటికప్పుడు ఈయన వెళ్లి  వెండి ప్లేట్లు కొనుక్కో వచ్చారు.  పిల్లవాడు, తండ్రి వాళ్ళని ఎందుకు అలా విసిగిస్తారు అని అంటూనే వున్నారు. పెళ్లి కొడుకు తల్లి వయసు  55  సంవత్సరాల పైన మాటే. ఆవిడ పెద్ద హీల్స్ఉన్న చెప్పులు వేసుకుని నడుస్తుంటే నాకు నవ్వు వస్తోంది.ఎక్కడ బొక్క బోర్లా పడుతుందో అని నవ్వుకున్నాను నాలో నేను. పైకి నవ్వితే  ఎక్కడ కోపాలోస్తాయో నని భయ పడి చస్తున్నాను.మా అత్త గారు గమనిస్తూనే వుంది.' జాగ్రత్త వాళ్ళతో.ఆమె సొసైటీ వేరు" అని హెచ్చరించి వెళ్ళారు అక్కడనుండి..
ఎదురుకోళ్ళు అయి పోయాయి.అంతా సరదాగానే వుంది. ఆవిడ, పెళ్లి కొడుకు అక్క గారు ముడుచుకునే వున్నారు.
అసలు పెళ్లి కొడుకు తల్లికి మన సంబంధం ఇష్టం లేదులా వుంది అని పించింది ఆ క్షణాన, నాకైతే.
పెళ్లి ముహూర్తం రాత్రి 10.00  గంటలకి. ఇంకా రెండు గంటలు వుంది. ముందు భోజనాలు  చేస్తా మన్నారు.
పెళ్లి వాళ్ళకి  వడ్డించాలన్నారు. అందరు భోజనం చాలా బాగుంది అన్నారు, ఆవిడ, ఆవిడ కూతురు తప్ప. మిగతా వాళ్ళందరికీ
బుఫే. అతిధులు చాలమంది వచ్చారు.  రాత్రి 9.30 గంటలయింది.  బ్రాహ్మలు పెళ్లి కుమారుణ్ణి, తల్లీ, తండ్రినీ  త్వరగా మంటపానికి  రమ్మని మైకులో పిలుస్తున్నారు. మామగారు, అత్త గారు, ఈయన  అందరు  హడావుడిగా వెళ్ళారు
నేను పెళ్లి కూతురు  దగ్గర వున్నాను.గౌరీ పూజ అయిపొయింది.
ఇంతలో ఈయన చాలా హడావుడిగా వచ్చారు మా గదిలోకి. ఆయన్ని చూసే సరికి నాకు ఏదో జరగ  కూడనిది ఏదో జరిగిందని   పించింది. " పెళ్లి కొడుకు తల్లి  పెళ్లి  మంటపానికి దీపాలతో వస్తూ మెట్లమీద బోర్ల పడింది.
లేవ లేక పోతోంది. ముక్కు,మూతి పగిలినట్లుంది. చాలా రక్తం వస్తోంది. కుడి కాలు కూడ కడప లేక పోతోంది. డాక్టర్ ఎవరోవున్నారు.చూస్తునారు". అని చెప్పి వెళ్ళారు అయన. నువ్వు ఇక్కడే ఉండమని పెళ్లి కూతురుతో చెప్పి నేను ఆవిడ పరిస్థితి ఎలావుందో చూసి వద్దామని వెళ్లాను. డాక్టరు పరీక్ష  అయినట్లుంది. ముక్కు, మూతి శుభ్రం చేసి నట్లున్నారు. ఆవిడని బెడ్ మీదకు చేర్చారు. కుడి కాలు మోకాలి దగ్గర విరిగిందట.
కూర్చోవడానికి  ఏమాత్రం వీలు లేదట. నొప్పి తో కేకలేస్తోంది ఆవిడ. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అని నిర్ణయించారు.
ఆ స్థితిలో కూడ  ఆవిడ పెళ్లి కూతుర్ని నోటికొచ్చినట్లు మాటలంటోంది. పిల్ల  జాతకం మంచిది కాదుట.  ఇంకా నయం నా కొడుక్కేమి కాలేదు. ఈ ముహూర్తానికి మాత్రం పెళ్లి వీల్లేదు అంటోంది అవిడ భర్తతో.ఆయన ఆమెను వారిస్తున్నాడు.
చిన్నదెబ్బలే కదా పెళ్లి ఆపవద్దు. ఎవరికీ మంచిది కాదు. ఆపిల్ల సంగతి కూడ ఆలోచించు.నువ్వు కూడా ఆడపిల్ల తల్లివే. ఆవిడ, పెళ్లి కొడుకు అక్క గారు ససేమిరా అంటున్నారు. సరే తరువాత ఇంకో ముహార్తానికి  చూద్దాం  లెండి అంటోంది  ఆవిడ. ఆయనకీ కూడ ఓపిక పోయినట్లుంది. ఆయన  సూచన మేరకు మామగారు , అత్తయ్య గారు, ఇంకా కొద్ది  మంది పెద్దవాళ్ళు ఆవిడని పెళ్లి వాయిదా వెయ్య వద్దని బతిమిలాడు తున్నారు. అత్తయ్య గారైతే ఆవిడ కాళ్ళు పట్టుకున్నంతగా బతిమిలాడు తున్నారు. విసుక్కుంటోంది ఆత్తయ్య గారిని ఆమె. నాకు చాల బాధగా అనిపించింది.
ఛీ, ఏం మనిషో! ఎంతమంది చెపుతున్నాకనీసం ఆడపిల్ల పెళ్లి  ఇంతా వరకు వచ్చి ఇంత చిన్న కారణానికి, అదీ ఆవిడ అజాగ్రత్త వల్ల జరిగి, ఆగిపోతే ఎంత ఇబ్బంది! అత్తయ్య గారిని ఇవతలకు పట్టుకుని తీసుకు వచ్చాను.
ఆవిడ లో ఏమాత్రం చలనం లేదు. లేదు, ఇప్పుడు కాదు, తరువాత చూద్దాం   తప్ప వేరే మాట లేదు. ఇంక లాభం లేదని అందరూ వెనక్కి వచ్చేశారు. పెళ్లి కొడుకు కూడా నచ్చ చెప్పాడు. ఇప్పుడు కాదు! ముహూర్తం బాగా లేదు. ఇక నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం! ఆవిడ నిర్ణయం చెప్పేసింది. డాక్టరు  ఇంకా మాట్లాడకుండా నొప్పి తెలవ కుండా  ఇంజెక్షను ఇచ్చారు. ఏమీ ప్రమాదం లేదు . ఆవిడను కుర్చీ కూర్చోబెట్టి కార్య క్రమం కానివచ్చు అన్నాడు. మీకేమి భయం లేదండీ అని  చిన్న పిల్లకు చెప్పినట్లు చెప్పారు డాక్టరు గారు. ఇంతలో  అంబులెన్సు వచ్చింది. ఆమె భర్త, పెళ్లి కొడుకు, డాక్టరు  గారు పెళ్లి తంతు గంటలో అయి పోతుంది అప్పుడు వెళదాం  ఎంత వారిస్తున్నాతనే అంబులెన్సు వారిని స్త్రెచెర్ తెమ్మని చెప్పింది. చూస్తూండగానే  ఆవిడ హాస్పిటల్ కి వెళ్ళారు, కూతురుఆవిడతో వెళ్ళింది. మామయ్య గారు ఆఖరి ప్రయత్నం గా మీ తమ్ముడు గారు వాళ్లెవరైనా పీటల మీద కూర్చొని పెళ్లి కాని వ్వచ్చండీ అన్నారు పెళ్లి కొడుకు తండ్రితో. అలాగా ! ఆగండి, అని అయన స్వయానా తమ్ముణ్ణి పిలిచి నువ్వు, మరదలు కూర్చుని పెళ్లి కానివ్వండిరా" అన్నారు. ఆయన తనని పక్కకి తీసుకు వెళ్లి ఏదో మాట్లాడారు.మాటలు కొద్దిగా వినిపిస్తూనే వున్నాయి. వదిన మమ్మల్ని బతకనివ్వదన్నయ్యా' అంటున్నాడు అయన. ఆయన భార్య బావగారు,ఇప్పుడే రిలేషన్లు అంతంత మాత్రం. ఇక అది కూడా తెగ్గొట్టు కొమ్మంటారా మమ్ములని "అంటోంది అవిడ.
మా పరిస్థితి అంతా అగమ్య గోచరం. మామయ్య గారు,అత్తయ్య గారు, పెళ్లి కొడుకు తండ్రితో మళ్ళీ మాట్లాడారు.
ఆయన , క్షమించండి ! నేను, బాబు   శాయ శక్తులా కృషి  చేశాము. మావల్ల కాలేదు.ఆయన పాపం తల దించుకునే మాట్లాడారు. పెళ్లి కొడుకు చూపుల్లోనే తెలుస్తోంది. అతను పడుతున్న బాధ! అపరాధిలా వంచిన తల ఎత్తలేదు.
ఇక తరు వాత ఇంకో ముహూర్తం చూద్దాం. అని, ఆయన పెళ్లి కొడుకుతో  సహా వెళ్ళారు.
ఇంతలో బ్రాహ్మలు 'అయ్యా, ముహూర్త సమయం మించి పోయింది. ఇక మేము వెళ్లి వస్తామండీ'...అంటూ వారు కూడా వెళ్లి పోయారు. ఒకళ్ళ తరు వాత ఒకళ్ళు చూస్తుండగానే పెళ్లి హాలు ఖాళి అయిపొయింది. 'బాజాల వాళ్ళు అయ్యా రేపు ఇంటికి వచ్చి కలుస్తాం' అనగానే మామగారు జేబులో డబ్బు తీసి ఇచ్చారు. నాకు తల తిరిగి పోతోంది. ఈ మనుషులు మారరు!
ఉన్న సమస్య అంతా ఈ ఆడవాళ్ళ తోనే వుంది! ఆనుకున్నా మనస్సులో. లేదు మంచి వాళ్ళు కూడా వున్నారు నీకు తెలుసుగా అంది నా మనస్సు. చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ,వున్నవాళ్ళు, లేని వాళ్ళు అని  కాదు సమస్య. సంస్కారం, కుసంస్కారం!అంతే.
అందరు  ఇంటికి చేరే సరికి రాత్రి 12 గంటలయింది. నేను, అత్తయ్య గారు, ఆడపడుచు ముందే ఇంటికి వచ్చాం.
ఎవ్వరు ఏమీ తినలేదు.అత్తయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రం.నేను వెళ్లి కాసిని పాలు వేడి చేసి ఇచ్చాను.ఆవిడ అవి కూడా తాగి నట్లు లేదు.ఇక పెళ్ళికూతురి మొహం  చూడడానికే నాకు చాలా బాధగా వుంది. మామయ్య గారు రావడమే తన గదిలోకి
వెళ్లి తలుపు వేసుకున్నారు. ఆయనకు కూడ కాసిని వేడి పాలు ఇచ్చి వచ్చాను. ఆయన వచ్చారు. ముఖం కళా విహీనంగాఅయింది. పీక్కు పోయింది. ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. ఆయనకీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.
" ఏమిటిది? ఎందుకిలా అయింది?. పాపం చెల్లి సంగతి తలుచు కుంటేనే భయం వేస్తోంది. అది ధైర్యం కలదే. అమ్మ,నాన్న గారి పరిస్థితి ఏమిటో అర్ధం కావడంలేదు. అసలా పెళ్లి వాళ్ళు మళ్ళీ మన్ని కలవడం కాని, మళ్ళీ ముహూర్తాల ప్రస్తావన  కాని వస్తుందన్న ఆశ మాత్రం నాకు లేదు. ఈ సంగతులన్నీ తెలుస్తే చెల్లి ఆకుర్రాడితో అసలు పెళ్ళికి ఒప్పుకోదు! ఏమిటో అంతా అయోమయంగా వుంది! అసలు పెళ్లి కొడుకు తల్లి కి ఈ పెళ్లి ఇష్టం వున్నట్లు నా కనిపించడం లేదు. అవిడ, అవిడ కూతురు ఇద్దరూ ఇద్దరే! సినిమాల్లో, T V  సీరియల్ లో విలన్ల్నలా వున్నారు. నాకు ఇవాళ అక్కడ పరిస్థితి చూసి మీ చెల్లి పెళ్లి  గుర్తు
కొచ్చింది. మీ చెల్లి అత్తగారికున్నపెద్దమనసు ఈపెద్దమనుషులకి కొద్దిగాయినా వుంటే ఈరోజు ఇలా  జరిగి వుండేది కాదు. ఎందుకు  సంస్కారం లేని చదువులు ! దేశంలో ఇలా ఎక్కడా జరగదనుకుంటా. తప్పు ఆమెది. ఆ వయస్సులో ఆ   హై హీల్స్ చెప్పులేమిటి.  అదీ పెళ్లి మంటపానికి వస్తూ చెప్పులెందుకు. సరే అయిందేదో అయింది. సాటి ఆడ మనిషే! తనకు కూడ ఆడ పిల్ల వుంది. మన సమాజం లో , పెళ్లి ఆగితే ఆడపిల్ల, తల్లి తండ్రుల వెతలు తెలీదా !ఇందుకే కదూ, ఆత్మ హత్యలు, తలి తండ్రుల బలిదానాలు. ఛీ! ఎందుకు ఆడపుటక పుట్టారు",  ఆయన ఆవేశంతో ఊగి పోతు మాట్లాడుతున్నారు.నేను మెల్లగా వెళ్ళాను అయన దగ్గరికి. చేతిలోకి చేయి తీసుకుని  మౌనంగానే వున్నాను చాలా సేపు. అయన కళ్ళ వెంట నీళ్లు వస్తూనే వున్నాయి. గద్గద స్వరం తోనే మాట్లాడుతున్నారు ఇంతసేపు. ఆయన కొద్ది భావోద్రేకం చెందినా గొంతు గీర పోతుంది. నాకు మనసులో మనసు లేదు.' నేను మీ చెల్లి దగ్గరికి వెళుతున్నాను మీరేమైనా తింటారా'? అయన మౌనం గానే వున్నారు. అదే అయన సమాధానం.
నేను మెల్లగా వెళ్లి తన పక్కనే కూర్చున్నాను.తను నిద్ర పోయినట్లు లేదు. వదినా మీ చెల్లి పెళ్లి అప్పుడు ఇలాగే జరిగింది కదా!
అత్తగారికి చాల సీరియస్ గా వళ్ళు కాలింది కదా! అయినా ఆవిడ పెళ్లి చేయమని ,పెళ్లి  ఎట్టి  పరిస్థితిలో  ఆపొద్దు అని చెప్పి పెళ్లేయ్యేలా చూసింది కదా! మరి ఈవిడ ఎందుకిలా చేసింది ?   "ఏదో  బాడ్ లక్. వదిలేయ్. పడుకో.తరువాత మాట్లాడవచ్చు'.అన్నాను నేను. అది కాదు వదినా just  compare ! ఈవిడకు చాల చిన్న దెబ్బలు. ఆవిడకు పెద్ద ప్రమాదం.
40 % కాలిగాయాలు. అసలు పోలికే లేదు. ఈవిడకు ఈ పెళ్లి ఇష్టం లేదు. thats it ! ఇప్పుడు నాకు  ఇష్టం లేదు! ఫినిష్ ! అంతా closed , thats the end  of the matter . 'అంతా మన మంచికే'  అని అటు తిరిగి పడుకుంది తను. బ్రేవ్ గర్ల్ అనుకున్నాను.
నేను మంచానికి ఇటు  చివరగా ఒరిగాను. ఎంత కళ్ళు మూసుకుందామన్నాకళ్ళు మూత పడలేదు.
రెండేళ్ళ క్రింద  మాచెల్లి పెళ్ళిలో జరిగిన  సంఘటన కళ్ళ ముందు కదలాడింది.      
చెల్లి పెళ్లి ముహుర్తానికింకా మూడు,నాలుగు  గంటలు వ్యవధి వుంది. మా అన్నయ్య, మా ఆయన   మగ పెళ్లి  వాళ్ళని తీసుకుని రావడానికి బయలుదేరు తున్నారు. జాగ్రత్త అండీ. ట్రాఫిక్ చాలా ఎక్కువగా వుంది జాగ్రత్త అని వాళ్ళ కారు వెళ్ళగానే లోపలికి వచ్చేసాను.మళ్ళీ టైం చూసుకున్నాను. ముహుర్తానికింక చాల టైము ఉంది. ఒక్క సారి కూర్చుని చెల్లి, నేను,అమ్మ మళ్లి పెళ్లి కావలసిన సామాగ్రి అంతా సరి చూశాము. సారె పెట్టె కూడ సది రేశాను. ఇంకా మంటపం కడుతునే వున్నారు.' ఏమయ్యా బాబూ, ముహూర్తం టైము దాకా కడుతూనే ఉంటారా'?  అనడిగాను నేను. 'అయిపోయిందమ్మా ఇంకా అర్ధగంటలో అయిపోతది'.
వంట వాళ్ళూ ఏమి చేస్తున్నారో చూద్దాం అని అటుగా వెళ్లాను. ఇద్దరు కూరలు తరుగు తున్నారు.మరిద్దరు పిండికలుపుతునారు. అంతా ఎవరి పని లో వాళ్ళు నిమగ్నమై వున్నారు. నన్ను చూసి కేటరర్ మనిషనుకుంటా.
ఏంటమ్మా ఏమైనా కావాలా? మర్యాదగా అడిగాడు.  నాలుగయిదు 'టీ' లు పంపించగలరా? ఫ్రెష్ గా పెట్టండి!
అలాగేనమ్మా ఇప్ప్డుడే పంపిస్తాను' అన్నాడతను. అతిధులు, చుట్టాలు కొంత మంది వచ్చేశారు.
నేను వెనక్కి వచ్చి మా రూములో ఫాను  క్రిందకు  కుర్చీ లాక్కుని కూర్చుని కొద్దిగా రిలాక్సేడ్  గా కూర్చున్నాను.
అమ్మా,చెల్లి కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలకి హాయిగా పెద్ద స్థలం  దొరికిందేమో  తెగ ఆడుతున్నారు. ఇంతలో మా ఆయన
చెప్పిన విషయం గుర్తుకి వచ్చి లేచి మగ పెళ్లి వాళ్ళ కిచ్చిన  రూము వైపు వెళ్లాను. క్రింద కార్పెట్ బాగా మాసి పోయింది.
బాత్ రూం అంతా శుభ్రంగా లేదు. కార్పెట్ మార్చమని రూమంతా శుభ్రం చేయించమని చెప్పినా ఇంకా అలాగే వుంది. అక్కడ
మేనేజర్ ని కలిసి గట్టిగా చెప్పి టీ వచ్చిందేమో నని  గది కి వచ్చి మళ్ళీ ఫాను క్రింద కూర్చున్నా. ఇంతలో 'టీ ' వచ్చింది!   
వేడి 'టీ' తాగే సరికి కొద్దిగా ఉత్సాహం వచ్చింది. చెల్లిని స్నానం చేసి ఇంక తయారు కావే అని చెప్పి ఇటు తిరిగే సరికి  అమ్మ
నాన్న గారి ఫోటో శుభ్రం చేస్తూవుంది. ఒక్కసారి మనసంతా బాధగా అనిపించింది. పాపం నాన్నగారు ఏమీ అనుభవించ
కుండానే వెళ్లి పోయారు. మనవడు, మనవరాలు బాగా  చదువుకుంటున్నారు, నేను,ఆయన  అమెరికాలో మంచి ఉద్యోగాలు చేస్తున్నామంటే  ఎంత సంతోషించే వారు. అమెరికా వచ్చి వుండే వారు. పాపం అయన జీవితం లో ఏమి
 సుఖ పడకుండానే వెళ్లి పోయారు, అని అనుకున్నాను. ఇంతలో అన్నయ్య దగ్గరనుంచి ఫోను. పెళ్ళికొడుకు ఇంటికి చేరారట. అర్ధగంటలో బయలు దేరు తారట.బయలు దేరిన వెంటనే ఫోను చేస్తామని చెప్పాడు వాడు. అమ్మకి ఈ విషయం చెప్పాను.
 పెళ్లి వాళ్ళు రాగానే బయట నుంచే మేళంతో  తీసుక రావాలని, భజంత్రీ లను తయారు గా ఉండమని చెప్పాను.
మంటపం, మగ పెళ్లివాళ్ళ గది అన్నీ మళ్ళీ చూశాను.అంతా సవ్యంగానే వుంది. కేటరింగ్ ఆయనకు చెప్పి ఫలహారం,కాఫీ,టీ,
రెడీ గా ఉంచమని చెప్పాను. వాళ్ళు రాగానే అందరికి ఇవ్వాలని చెప్పాను. ఇంతలో ఆయన దగ్గరనుంచి ఫోను.బయలు దేరామని, అర్ధగంటలో అక్కడుంటామని. అమ్మతో చెప్పి చెల్లి దగ్గరికి వెళ్లాను. అది స్నానానికి వెళ్ళింది.
బయటకు వచ్చాను. మంటపం వెనుకాల వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ, ప్రతిమలను సర్దు తున్నారు.
స్వామి అంతా సవ్యంగా జరిపించు తండ్రీ అని మనః స్పూర్తిగా వేడుకున్నాను. తధాస్తు అన్నట్లు చేతిలో ఫోను మ్రోగింది.
అయన దగ్గరనుంచే. ఒక్కసారిగా, నా నెత్తిన పిడుగు పడ్డట్లు అయింది. స్పృహ వున్నా తల తిరుగుతోంది. ఇప్పుడే కదా స్వామీ నిన్ను మనః స్పూర్తిగా వేడుకున్నాను. ఇంతలా అన్యాయం చేస్తావా? అమ్మకు చెపుదామా, వద్దా అని కంగారు పడుతూ
లోపలి వెళ్ళాను. అప్పటికే ఎవరో వాళ్ళ  చుట్టాలకి కబురంది నట్లుంది...అమ్మ గోల, గోలగా ఏడుస్తోంది. చుట్టాల్లో అంతా గగ్గోలు. అమ్మ నన్ను చూసి ఒక్కసారిగా లేచి నాదగ్గరికి వచ్చి ఇదేంటి ,తల్లీ, పెళ్లి కొడుకు తల్లి వళ్ళంతా  కాలిందట కారులో వస్తుంటే?
అసలు సంగతి ఏమిటే? అమ్మ నన్ను నిలతీసింది. నన్ను నేను కొద్దిగా శాంత పరుచుకొని, కూడ తీసుకుని అమ్మా, ఏమీ లేదు,
కొద్దిగా కాలి   గాయాలు అయ్యాయట ఆవిడకు. కారులో ముందు కూర్చుని కాళ్ళ దగ్గర  ముట్టించిన దీపారాధన కుందులు పెట్టు కుందట. చీర అంటుకుని కాళ్ళకి కొద్దిగా కాలిన గాయాలయ్యా యట. ఏమిటో నమ్మా,అంతా కంగారుగా వుంది.ఆయన, అన్నయ్య అక్కడే వున్నారు. ఇంతలో మళ్ళీ ఫోను వచ్చింది. అన్నయ్య ఫోను. ఆవిడను ఉస్మానియా హాస్పిటలు కి తీసుకు వెళ్లారట , పోలీసులు కూడా వచ్చారట.అన్నయ్య మళ్ళీ ఫోను చేస్తానన్నాడు. మళ్ళీ మంటపం దగ్గరకు వచ్చి స్వామి కి
మొక్కు కున్నాను. పెళ్లి నిర్విఘ్నం గా అయ్యేట్లు చూడు స్వామీ.నీ కొండకు నడిచి వస్తాను  అని  మొక్కు కున్నాను. వచ్చిన  అతిధులు, మగ పెళ్లి వాళ్ళ చుట్టాలు, మాచుట్టాలు, స్నేహితులు అందరు ఆవిడ ప్రమాదం గురించే చర్చ. ఇంకేమి పెళ్లిలే!
తల్లి కి ఇంత అయితే వాళ్లు  అసలు రావొద్దూ! ఎంత అప్రదిష్ట ! పెళ్లి కూతురు సరిగ్గా నోచుకో లేదు. తండ్రీ లేడు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగితే ఇంకేమన్నా ఉందా? బాబోయ్! నలుగురు నాలుగు మాటలు, నానా మాటలు! ఏమి మనుషులు రా బాబూ! ఇంతలో
మంటపం కట్టిన వాళ్ళు అంతా బాగా కట్టినమమ్మ, మంచి పూలతో సజాయిన్చినమమ్మా! శుభ్రం కూడ చేసినం. వాడి చేతిలో రెండు వందలు పెట్టి పక్కకు వచ్చి ఆయనకు ఫోను చేసాను. ఆయనతో  మాట్లాడిన తరువాత కొద్దిగా ఉపశమనం కలిగింది.
ప్రాణ భయం లేదు.దాదాపు 40% వళ్ళుకాలిందట.ఆవిడ స్పృహ లోనే వున్నారు. పోలీసు లకి అంతా తన పొరబాటు వాళ్ళే జరిగిందని చెప్పిందట. పెళ్లి ఎట్టి పరిస్తితుల్లో ఆగడానికి వీల్లేదని వాళ్ల ఆయన్ని వెంటనే కొడుకుని తో  బయలు దేరమని, కొడుకుతో కంగారేమీ లేదని వెంటనే వెళ్ళమని చెప్పిందట. అన్నయ్యను, మా ఆయన్ను కూడా పిలిచి బాబూ నావల్ల ఈ తప్పు జరిగింది. పిల్లకి చెడ్డపేరు రాకూడదు.నలుగురు నానా మాటలు అంటారు. వెంటనే పెళ్లి కుమారుణ్ణి మీతో తీసుకు వెళ్ళండి.మావాళ్ళకి అయన ఫోను చేసి చెప్పారు. ఎవరో ఒకళ్ళు పీటల మీద కూర్చుంటారు. వెంటనే బయలు దేరండి అని ధైర్యం చెప్పిందట. పెళ్లి కొడుకుతో సహా వీలు బయలు దేరారు.ఇంక అర్ధగంటలో ఇక్కడ వుంటారు. నాకు నిజంగా ఆ క్షణంలో ఆవిడ మీద ఎంత గౌరవం పెరిగి పోయింది. అవిడ సంస్కారానికి చేతు లెత్తి మొక్కాను. అమ్మతో జరిగిందంతా చెప్పి  మళ్ళీ మంటపం దగ్గరికి వచ్చి స్వామీ ఏమిటీ పరీక్ష ?  రక్షించావు స్వామీ! ఎన్ని జన్మ లెత్తినా నీ ఋణం తీర్చుకో లేను స్వామీ, అని నమస్కరించాను స్వామికి. పెళ్లి కొడుకు బాబాయి లా వున్నారు, వచ్చి" ముహూర్తానికి అన్నీ సిద్హంగా వున్నాయి కదమ్మా!
అన్నయ్య, వదినా ఇద్దరూ మాట్లాడారు. మమ్ముల్ని కూర్చుని పెళ్లి కానివ్వ మన్నారమ్మాఇక ఆట్టే సమయం లేదు !
వాళ్ళు రాగానే తంతు ప్రారంభిద్దాం" అని అయన అటు వెళ్ళారో,  లేదో బయట గేటు దగ్గర భజంత్రీల వాయిద్యం మొదలయింది. అమ్మయ్య వీళ్ళు వచ్చేసినట్లున్నారు. బ్రాహ్మలు కూడ ఏమవుందో నని స్తబ్దుగా ఉన్న వాళ్ళు హడావుడి మొదలెట్టారు మైకులో. నేను ఇంకా చాలా మంది గేటు దగ్గరికి వెళ్ళాము. పెళ్లి కొడుకు, అతని తమ్ముడు  వచ్చారు. అన్నయ్య పెళ్లి కొడుకు చేయి పట్టుకుని తీసుకు వస్తున్నాడు. వాళ్ళ  చుట్టాలు చాల మంది అతని చుట్టూ మూగి  ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అందరికి కలిపి అతను ఒక్కటే సమాధానం చెప్పాడు. "అమ్మ బావుంది. పెళ్లి కానివ్వమంది. దయచేసి  ఎవరూ  ఏమీ మాట్లాడ వద్దు. its an accident ". అయన పిల్లాడి వెనకాలే  వున్నారు. ఒక్కటే మాటన్నారు.' ఆవిడ సంస్కారం ఆడవాళ్ళ అందరికి మార్గ దర్శకం. ఆవిడ సంస్కారంలో పదో వంతు వున్నా ఈ సంఘం కొంతయినా  బాగు  పడుతుంది. ఆవిడ అయిదవ తరగతి వరకు చదువుకుందట. ఈరోజు ఆవిడ చూపిన సంస్కారం నేను జన్మలో మరచిపోను' అన్నారు అయన.
" పెద్ద కొడుకు పెళ్లి కోసం  కలలు కందిట, ఆవిడ, నాతో అంది. ఆవిడ ఎవరూ అడక్కుండానే ఎంత తెగువ చూపింది. ఆవిడని పొగుడుతూనే వున్నారాయన.
నాకు కూడా నిజంగా వెళ్లి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి రావాలని పించింది. "పిల్లాడిని కొద్దిగా ఫ్రెష్ అవుతారా" అనడిగాను నేను. ' నేను కాదు వదిన గారు, ముందు మీరు ఫ్రెష్ అయి రండి' అంటూ
ఫరవాలేదండీ, ముందు టైం చూడండి. అన్నాడతను నవ్వుతూ. 'తల్లికి తగ్గ కొడుకు అనిపించాడు'. అనుకున్నాను మనసులో.  పెళ్ళికొడుకుని సరాసరి మంటపం లోకి తీసుకు రమ్మన్నారు బ్రాహ్మలు. ముహూర్తానికి వధూ,వరుల్తో  జీలకర్ర, బెల్లం పెట్టించారు . పెళ్లి చాల తృప్తిగా అయింది. భోజనాలయ్యాయి. అతిధులు, చుట్టాలు అందరూ వెళ్లి పోయారు. వాళ్ళ వాళ్ళు ఎవరో హాస్పిటలు కి వెళ్లి తండ్రిని పంపించారు. ఆయన్ని నేను మావారు దగ్గరుండి చూసుకున్నాము. అప్పగింతలు అయ్యేసరికి రాత్రి 12.30 గంటలయింది. పెళ్లి కొడుకు తండ్రి వారిస్తున్నా మావారు ముందు వధూ,వరులని ని హాస్పిటలు కి వెళ్లి తన ఆశీర్వచనం  తీసుకు వెళ్ళాలని పట్టు బట్టారు. పిల్లాడు, తండ్రి అంతా కలిసి హాస్పిటలు కి వెళ్లి  పిల్లలకి ఆవిడ ఆశీర్వచనం తెసుకుని ఇంటికి వెళ్లారు. నేను అన్నయ్య ఇక్కడ పనులన్నీ చేసుకుని ఉదయం హాస్పిటలు కి వెళ్ళాము. తన కాళ్ళని నేను తాకి రెండు చేతులు జోడించి నమస్కారం చేసాను.అమ్మ కూడా ఆమెకు నమస్కారం చేసింది. మనస్సు చాలా తేలిక అయింది. చెల్లి చాలా అదృష్ట వంతు రాలనుకున్నా. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడయినా, ఆమె గురించి టాపిక్ వస్తే మావారు చాల భావోద్రేకులవుతారు.  ఆమెను దేవుడే అంటారు ఆయన. అంతే కాదు ఆయనకు ఆవిడో రోల్ మోడల్. అంతే కదండీ మరి! ఒక్కో సారి మనుషుల  త్యాగాలవల్ల, సందర్భాన్ని పట్టి తీసుకునే నిర్ణయాల వల్ల సంఘం లో ఎంతో కొంత మంది మనుషుల్లో పరివర్తన రావడ మనేది జరుగుతోంది అంటే ఇలాంటి  వాళ్ళే కదా కారణం!
నా వరకు నేను ఈ రోజు జరిగిన ఈసంఘటనతో మానసికంగా ఎంతో ఎదిగాను.పెళ్లి క వచ్చిన వాళ్ళలో కూడ ఎంతో మంది ఆవిడ నిర్ణయాని హర్షించడం నేను విన్నాను.
ఆడపిల్ల ఎంత చదువుకున్నా, ఎంతలేసి వుద్యోగంచేస్తున్నా, ఎంత డబ్బున్నా మనసున్న మనుషులు అందునా భర్త, అత్త మామలు దొరకడం ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం,తలి తండ్రుల చేసుకున్న పూజ ఫలాలే.
కేశిరాజు రజని వరదయ్య.