లేబుళ్లు

31, జులై 2010, శనివారం

Indian billionaires and their peoximity to government.

ఈ దేశం లో ఈ మధ్య అధికంగా పెరుగుతున్న డాలర్ సంపన్నుల సంఖ్య తో ఈ దేశాభి వృద్ధిని ముడిపెట్టి/ పోల్చి  చూడడం సరైన అవగాహన లేకపోవడమే అంటున్నారు,ఆర్ధిక శాస్త్రవేత్త, ఈ దేశ ప్రధాని ఆర్ధిక సలహాదారు, శ్రీ రఘురాం రాజన్.
ఆయన 31-7-2010 న TOI,  ఇంగ్లీష్ దిన పత్రికకు  ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఈ దేశంలో వేగంగా  పెరుగుతున్నవ్యాపారవేత్తల సంపద గురించి, వారితో  ప్రభుత్వ, రాజకీయ నాయకుల  సన్నిహితత్వం గురించి మాట్లాడుతూ ఈ దేశ సంపద  సృష్టి / పెరగడం  గురించి తనకెలాంటి సమస్య లేదని,  కాని ఈ సంపద ప్రభుత్వ సాన్నిహిత్యం
వల్ల  ఎవరికైనా ఒనకూరిందైతే అది ఒక సమస్యేనని అన్నారు. ప్రపంచం లో ధనికుల జాబితాలో భారత దేశ ధనికుల సంఖ్య
రెండో స్థానం లో వుందని  వారిలో  చాలామంది software enterpreneurs   రంగం లోని వారు కారని,  మిగతా కొందరు  ప్రభుత్వ అనుమతి  ఉత్తరువుల తో   (LICENSES) చేశే వ్యాపారులని ఉదాహరణకు  భూ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సహజవనరుల ఉత్పత్తుల  గుత్తేదార్లు లాంటి వారని ఆయన అన్నారు. దేశం లో నిక్కచ్చిగా వ్యాపారం చేసి బ్రహ్మాండమయిన  అభివృద్ధి  సాధించిన వాళ్ళెంత మందో వున్నారని , ఉదాహరణకు  టెలి  కమ్యూనికేషన్  రంగం లో వున్నారని, కాని పోటీ లేని రంగాలు కొన్ని వున్నాయని వాటికి ప్రభుత్వ సాన్నిహిత్యం, అండఉన్న వ్యాపారుల బెడద కొనసాగుతోందని, ఖచ్చితంగా ఇది చింతించ వలసిన విషయమే నని,
ఇది ఇట్లా కొనసాగినట్లయితే, కొంతమంది స్వార్ధ రాజకీయనాయకుల, వ్యాపారస్తుల బంధం విడదీయరానిది గా తయారవుతుందని, వారికి వారి స్వప్రయోజనలే ముఖ్యమని, దీనితో  భారతదేశ ఆర్ధిక వ్యవస్థ , మెక్సికో  (mexico) దేశం లో జరిగిన ఆర్ధిక దివాలా, దిశగా పయనిస్తున్దేమోనన్న భయం, అలాంటి అపాయము, విపత్తు మన ఆర్ధిక వ్యవస్థకు, మన ప్రజాస్వామ్యానికే ముప్పు  పొంచి ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన వాదిస్తున్నారు.

29, జులై 2010, గురువారం

అధిక ధరల పైన బుధవారం పార్లమెంట్ లో జరిగిన చర్చకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీగారు హాజరు కాలేదని పత్రికల్లో చదివి దిగ్ర్భాంతి చెందాను. ఆమ్ ఆద్మీ నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారు అదే ఆమ్ ఆద్మీ ఈరోజు అధిక ధరలతో సతమత మవుతు కూరగాయలే కాదు, కనీస భోజనం కోసం కావాల్సిన గోధుమలు/గోధుమపిండి,బియ్యం, కూరగాయల ధరలు అటకెక్కి, రెక్కలొచ్చి ఆకాశాన్నంటుతుంటే ఆర్ధిక మంత్రి వర్యులు ఏదో సాకు చూపి పార్లమెంటులో చర్చించనవసరం లేదని తేల్చేశారు. ఇటు ప్రజ అధిక ధరలతో నానా ఇబ్బందులు పడుతుంటే ఇంకో ప్రక్కన రైతులు తమ పంటలకు కనీస ధర రాక మార్కెట్ దాక తీసుకవచ్చి పెంట కుప్పల్లో పారబోయవలసిన పరిస్థితి. పెరిగిన ధరల పయిన నియంత్రణ, రైతుల పంటలకు సరైన గిట్టు బాటు ధర వచ్చేటట్లు చూడడం ఇవి ప్రభుత్వ పరిధిలోని అంశాలు కావా? ఏవో కుయుక్తులతో పార్లమెంటులో నెగ్గురావచ్చు.
కానీ ప్రజల కడగండ్లు ప్రభుత్వం వారి మనో నేత్రాలకి కానరావడం లేదా?
ఎలెక్షనలకు ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి, అన్నధీమానా?
ఏలిన వారు ఇప్పటికయినా కళ్ళు తెరిచి 'ఆమ్' ఆద్మీ ని పట్టించుకోండి.
లేకపోతే పుట్టగతులుండవు.
కేశిరాజు వెంకట వరదయ్య.

26, జులై 2010, సోమవారం

powra hakkulu, baadhyatalu.

ఆదివారం 25 జూలై 2010



                                                       పౌర హక్కులు, బాధ్యతలు   
మన దేశ పౌరులలో ఎంతమందికి తమ,తమ హక్కుల గురించిగాని బాధ్యతల గురించిగాని తెలుసు అన్నది తర్కిస్తే వచ్చే సమాధానం ఖచ్చితంగా 35 % కంటే ఎక్కువుండరు అన్నదానిలో ఏమాత్రం సందేహంలేదు. సరే, ఈ 35 % పౌరులగురించి
మాట్లాడుదామంటే వారిలో ఎంతమంది తమ పౌర హక్కులు పోరాడకుండా సాధించుకుంటున్నారు, అలాగే ఎంతమంది తమ బాధ్యతలను నిర్వస్తిస్తున్నారు అని ఆరా తీస్తే వచ్చే సమాధానం సమ్మిళితమే. మన ఈ స్వతంత్ర భారతావనిలో పోరాడకుండా హక్కులు సాధిస్తున్నవారు ఎవరు అంటే ఖచ్చితంగా దాని సమాధానం మాత్రం మన దేశ ప్రస్తుత పార్లమెంటు / అసెంబ్లీ
సభ్యులు, న్యాయాదీశులు, ప్రభుత్వ ప్రధమ శ్రేణి కార్య నిర్వహణాధికారులు, ఆ ఫై కొద్దిమంది అతి ధనవంతులు, ఇతరులు.
ఇదండీ మన స్వతంత్ర భారతావనిలో రాజ్యాంగ బద్ధమైన హక్కులు అనుభావిస్తున్నవారి సంఖ్య.
దీనిలో లేశ మైనా అతిశయోక్తి లేదు.

అసలు పౌర హక్కుల గురించి తెలియక పోవడం వేరు. తెలిసి వాటిని పొందలేకపోవడం అంటే ఏమిటి అని ఈరోజు ఒక పదవతరగతి విద్యార్ధి నుంచి డిగ్రీ చదివే విద్యార్ధి వరకు ప్రశ్నించి చూడండి.
నూటికి 90 మంది పైగా తెల్లముఖం వేసే వాళ్ళే. ఆ పదిమందీ ఎవరయ్యా అంటే పైన
చెప్పిన పౌరుల పిల్లలే వారు కాని సగటు పౌరుల పిల్లలూ మాత్రం కాదు.
ఉదాహరణకు ఒక వీధిలో ఉన్న దేవాలయమో,మసీదు, చర్చి నుంచో మైకు శబ్దం తో ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే నో, నివాస స్థలాల్లో వ్యాపార సంస్థలు ఇబ్బంది పెడుతుంటే నో, మునిసిపాలిటి వారు త్రాగే మంచి నీరు సరఫరా చేయ కుంటే నో,
ఎదైనా ఆసుపత్రిలో ఓ కంటి బదులు ఇంకో కన్ను తీసేస్తోనో, హైదరాబాదు లో పాస్స్పోర్ట్ (Passport) సంబంధించిన పని ఎంతకైనా కాకుంటేనో, ఒక రేషన్ కార్డు పొంద లేకపోతేనో , ఇంటి పక్కన రాజకీయనాయకుడో లేక ప్రభుత్వ ఓ పెద్ద అధికారో నన్ను నా ఇంటినుంచి  అకారణంగా  పొమ్మంటే పోలీసులు నా పిర్యాదు తీసుకోక నా పైనే కేసు బనాయించడమో చేస్తుంటే నో , ఇక్కడ నా హక్కులు ఏమిటి, దానిని ఎవరు కాపాడుతారు? అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
ఎదురుతిరిగామా ఎదురుదెబ్బలు కాచుకునే శక్తి సగటు పౌరునికి ఎంత వరకు వుంది ?
ఈజీవన గమనంలో ప్రతి పౌరుడికి ఇలాంటి సమస్యలు ఎన్నెన్నో!
ఎంతమంది ఇటువంటి విషయాల్లో పోరాడుతున్నారు? ఎంతమంది సర్దుకు పోతున్నారు? ప్రతి వ్యక్తి / పౌరుడు తమ చిన్న చిన్న
హక్కుల కోసం పోరాడాలంటే సాధ్యమా? అతని చిన్న జీవిత గమనానికి ఈ హక్కుల పోరాటం ఎంత అఘాతం?
మొన్న కేరళలో ఒక ఉపాధ్యాయుని చేయి నరికేశారు. ఎందుకు? అతని హక్కులేమయ్యాయి!
మాయగా, ఉన్నట్లు గానే ఉండీ ప్రతి వ్యక్తికి అందని హక్కులు ఉండీ ప్రయోజనం ఏమిటి? ఈ సమాజం లో ప్రతి వ్యక్తి కోసం ఈ వ్యవస్థ పనిచేయడం ఎప్పుడు ప్రారంభ మవుతుంది?

ఈ సమస్యకు మూలం నాకు తెలిసినంతవరకు ఈ దేశ పోలీసు యంత్రాంగమే!
అమెరికాలో దేశాధ్యక్షుని కూతురు త్రాగి గొడవ చేస్తే లోపల వేశేసారు పోలీసులు.ఈవిషయం వెంటనే దేశాధ్యక్షుని సహాయకుడు
ఆయన చెవినవేస్తే, కానివ్వండి, ఆమె తప్పు చేసింది శిక్ష అనుభవించాలి కదా! ఇందులో నేనేమి చేయగలను? అని ఊరుకున్నారు. అలాంటిది ఈ దేశం లో సాధ్యమా?
సవ్యమైన, సక్రమ మైన, నిష్పక్షపాత మైన పోలీసింగ్ (policing) ఉన్న దేశమే మానవ  హక్కుల్ని కాపాడగలదు. అలాటి దేశం లోనే ప్రజ, దేశం  సరైన అభివృద్ధి పధం లో పయనించగలదు. ఈ పోటీ ప్రపంచంలో తగిన స్థానం సంపాదించ గలదు   .   

ఈ దేశంలో పోలీసులని బ్రిటిష్ వారి పాలనలో వారిని ఈదేశ స్వాతంత్ర సమర యోధుల నుంచి, విప్లవ కారుల నుంచి రక్షించు కునేందుకు నియమించుకున్నారు. కాని, ఈరోజు కూడా ఈదేశ పోలీసు వ్యవస్థ పాలకుల రక్షణలో పునీతమవుతోంది.
ఏరోజైతే ఈ దేశ పోలీసు ప్రతి సామాన్య పౌరుడిని  పాలకులతోను, బలవంతులతోను,ధనవంతులతోను సమానంగా చూస్తారో ఆ రోజు పౌర హక్కులు వ్యవస్థీకృత మవుతాయి.
ప్రతి పౌరుడు ఈ దేశ రాజ్యాగం ఇచ్చిన హక్కుల్ని స్వేచ్చగా అనుభవించ గలుగుతాడు.
అంచేత, పోలీసులూ ఈ దేశ భవిత, మానవ హక్కులు  మీ చేతుల్లో వున్నాయి.. మీ 'ప్రమాణాల్ని' సాకారం చేయండి!
ఇక పౌర బాధ్యతల విషయం కొద్దాం.
ఈ దేశ ప్రజలు నూటికి డెబ్బై మంది గ్రామీణులు.వ్యవసాయం మీద ఇతర కులవృత్తులమీద జీవనం సాగించే వాళ్ళే.
వారికి ఈ హక్కులు, బాధ్యతలు,రాజ్యాగం వాటిగురించి పెద్దగా తెలీదు, పట్టించుకునే సమయమూ వుండదు.
కాని వారి బాధ్యతలు మాత్రం అన్ని రాజ్యాంగ పరిధిలోనే నిర్వస్తిస్తుంటారు. అదే చిత్రం.
కుటుంబ పరంగా, పెద్దలనుంచి, తరతరాలనుంచి సంక్రమించిన ఆస్తుల్లా అన్ని బాధ్యతలూ సక్రమంగా
నిర్వస్తిస్తుంటారు. వారికి ఈ బాద్యతలు ఎవరు చెప్పారు? వారు ఎలా నేర్చుకున్నారు?
అంటే ఏదో వ్యవస్థ వారి కుటుంబ వ్యవస్థ లోనే తర తరాలనుంచి పాతుకుపోయి చక్కగా పని చేసుకుపోతోంది.
కాని ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ  తరాల మార్పుతో కొట్టు,మిట్టాడుతోంది.
అందుకే  బాధ్యతల  నిర్వహణ కూడా కుంటుపడింది.
ఇంకా ఇతర కారణాలేమంటే వసతుల లేమి, ఆర్ధిక స్తోమత లేకపోవడం, విచ్చిన్న మవుతున్న కుటుంబ వ్యవస్థ,
కుల వ్యవస్థ, ప్రపంచీకరణ,అర్దమవని విద్యావ్యవస్థ,కూలుతున్న వివాహ వ్యవస్థ.
ఇక మిగతా 30 % ప్రజల విషయాని  కొస్తే వారంతా పట్టణాల్లో వుండేవారు. వారికి పొద్దున్న లేస్తే పరుగులు.
వారి జీవన పరుగులో బాధ్యతలు, హక్కుల గురించి ఆలోచించే తీరిక లేదు.
అందుకే వారి థైనందిన జీవితం లో ఏదైనా బాధ్యత నిర్వర్తించారంటే అది వారి తల్లి తండ్రుల నుంచి కాని, స్కూల్ నుంచి వచ్చిన
క్రమశిక్షణ గాని, స్నేహితుల వల్ల గాని అయివుండవచ్చు. ఈ ఫలితం ఖచ్చితంగా పని చేస్తున్న వ్యవస్థదే. కాని చెప్పడానికీ చాలా బాధ్యతా రాహిత్యాలు చాల వున్నాయి. కొన్ని చిన్నఉదాహరణలు. రోడ్డు మీద సర్కస్ డ్రైవింగ్ , ఉమ్మడం, చెత్త వేయడం , స్త్రీలను, పెద్దవారిని అగౌరవపరచడం. ఆస్తులు ఆక్రమించడం, ఇది వ్యక్తులకి సంబంధించింది.
అసలు పెద్ద బాధ్యతా రాహిత్యం ప్రభుత్వ శాఖలదే. సరి అయిన రవాణా సౌకర్యాలు సమకూర్చక పోవడం, స్వచ్చమయిన త్రాగు నీరు సరఫరా చేయక పోవడం, స్వప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం, తమవారికే  వసతులు కల్పించడం, సగటు మనిషిని వర్గ బేధాలతో పట్టించుక పోవడం, తమ పదవి కోసం, తమ,తమ ప్రభుత్వ స్థాపనకోసం అలవికాని ప్రమాణాలు చేయడం,వాటి కోసం పన్నులు వేయడం, ఇవన్నీ బాధ్యతా రాహిత్యాలే.
అసలు రాజ్యాగం, అందులో పొందుపరిచిన దేశ భద్రత, సార్వభౌమత్వం, జాతీయ ఝండా, అన్ని మతాల్ని గౌరవించడం,ఇంకా ఇతర పౌర బాధ్యతల గురించి , హక్కుల గురించి  తరువాత  చర్చిస్తాను.

కేశిరాజు వెంకట వరదయ్య
Flat No.301, Meenakshi Raji Residency,Rd.No.14, Banjara hills, Hyderabad-500034.
Ph.No.040-23552052. Mob.No. 98491 18254.
 నోట్: ఈ వ్యాసం నా స్వతం. దేనీ  అనువాదం కాదు.

15, జులై 2010, గురువారం

India today ki oka lekha.

'ఆంధ్రజ్యోతి ' లో లేఖల శేర్షిక కో లేఖ.


ది. 1-9-2013  'ఆంధ్రజ్యోతి' కొత్తపలుకు'  శీర్షికలో  'రూపాయేకాదు సర్వం పతనం'  ఆర్.కె  గారి  వ్యాసం చదివాక  ప్రస్తుత భారతదేశ పయనమెటు అన్న ప్రశ్న ప్రతి సగటు భారతీయుని మదిలో రాక తప్పదు. ఆర్దికరంగంలోనే కాదు
 అంతం లేని సవాళ్లు ప్రభుత్వాలముందు ఎన్నో ఎన్నెన్నో వున్నాయి.

ప్రజల కడగండ్లు తీర్చే వారెవరు లేరన్నది సత్యం.

మహాకవి శ్రీ,శ్రీ అన్నట్లు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ప్రజలు కచ్చితంగా తలచడం లేదు

ఎలాగు ప్రభుత్వాలు ప్రజల సమస్యల్ని అంతలా పట్టించుకోవడం లేదు.

కాలం సమస్యల్ని తీరుస్తాయని వారి ఉద్దేశ్యం లా వుంది.

అందుకే తనబిడ్డ్లలను కాపాడమని ఆ భగవంతుని  ప్రార్ధించడం తప్ప ఏమి చేయ లేని సగటు భారతీయులం.

 'భారతావని' లెక్కకు మిక్కిలి బాధలతో సతమతమవుతోంది. ఒక పక్కన పాకిస్తాన్ ఇంకో పక్క చైనా మన దేశాన్ని అస్థిరం చేయడానికి కలిసి కుట్రలు పన్నుతూ  చేయగలిగిందంతా చేస్తున్నారు. చివరకి మాలి, మైనమార్ లాటి దేశాలు కూడా ఈ మహోన్నత దేశాన్ని ఖాతరు చేయడం లేదు.

చేతగాకో, చేవలేకో కేంద్రప్రభుత్వం చేష్టలుడిగి దిక్కులు చూస్తూ కాలం గడుపుతున్నది.

దేశంలో ప్రతి రాష్ట్రం ఏదో ఒక విష సమస్యతో సతమత మవుతూనే వున్నాయి.

అసలు కేంద్ర ప్రభుత్వం ఒకటున్న దన్న దన్ను ఏ పౌరుడుకి లేదు. ఒక సామాన్య పౌరుడు అనుకుంటున్నట్లుగానే గౌరవనీయులు ఈ దేశ ప్రధాని గారే మొన్నీ మధ్య పార్లమెంటులో మాట్లాడుతూ తన వైఫల్యాలని ఇతరులమీద రుద్దడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.  ఉదాహరణకు
మొన్నబీహార్లో జరిగిన రైలు ప్రమాదం గురించి ఎందుకు జరిగిందో రైల్వే మినిస్టర్ గారు  సెలవిచ్చారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ముందుచూపు లేని నిర్ణయం తో సీమాంధ్ర  మొత్తం అట్టుడుకుతోంది

ఇంకో పక్క తెలంగాణా సమస్య వల్ల అభివృద్దే ఆగిపోయింది.

ఇక కర్నాటక సంగతికొస్తే గనులు, జనార్దనం, ధనార్జనం తప్పవేరే వార్తలేమి వున్నాయి.

ఇక ప్రతి రాష్ట్రం గురించి వ్రాయాలంటే అంతం వుండదు.

కాని అంతం లేని సవాళ్లు ప్రభుత్వాలముందు ఎన్నో ఎన్నెన్నో వున్నాయి.

ప్రజల కడగండ్లు తీర్చే వారెవరు లేరన్నది సత్యం.

మహాకవి శ్రీ,శ్రీ అన్నట్లు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ప్రజలు ఖచ్చితంగా తలచడం లేదు

ఎలాగు ప్రభుత్వాలు ప్రజల సమస్యల్ని అంతలా పట్టించుకోవడం లేదు.

కాలం సమస్యల్ని తీరుస్తాయని వారి ఉద్దేశ్యం లా వుంది.

అందుకే మనలని మనం క్షమించుకోలేని రోజు రాకూడదని ఆ భారతమాతని ప్రార్ధించడం తప్ప ఏమి చేయ లేని సగటు భారతీయులం.

కేశిరాజు వెంకట వరదయ్య

14, జులై 2010, బుధవారం

నిజానికి 'ఇజా ' లేమి లేవు ...

ఈనాడు
నిజానికి 'ఇజా ' లేమి లేవు
ఉన్నదల్లా టూరిజం మాత్రమే

అని ఒకాయన అన్నాడని

గింజుకున్నారు గొంతుచించుకున్నారు

నిజం కాదా !

నిన్న మొన్నటి దాకా పోరాటం

నేడు దాసోహం అది కాదా నేటి నైజం

ఏమయిందా ' ఇజం'

పాతేశారా?

పాశవిక దాడులు

పౌర అణు ఒప్పందాలు

మీ నయ్ జా ని కి నిజానికి ఒప్పిదమేనా

వీటన్నిటిలో నీ పాలేమిటి

'లో' పాపాలు ఉత్తుత్తి పోరాటాలతో పోతాయా?

నిద్ర నటిస్తే నిశ్చింతేనా?

నాడు 'చెయ్ తోడు నేడు   'సై'  తోడు

దేనికోసం? ఎవరికోసం ? మీపాట్లు !

పేదోని కష్టం కూస్తయినా గుర్తెరుగు!

పాత వాసనతో నెగ్గుకోచ్చేరోజులు పోయాయి నేస్తమా!

నిద్రలే !

11, జులై 2010, ఆదివారం

sakhi

బంధాలు,అనుబంధాలు ఎంత లేవనుకున్నా,కావనుకున్న అవి తెగి పోవు.ఏదో ఒక సందర్భంలోనో ఎక్కడో ఒకచోట మనుషుల్ని కలుపుతూనే ఉంటాయి. వా టికి భాష, దేశం, వేషం అలాంటి హద్దులేమి లేవు. ఈ మధ్యనే నేను అ మెరికా వెళ్ళివచ్చాను. అక్కడో చిత్రం జరిగింది. అది ఎట్టి పరిస్తుతుల్లోనయిన "సఖు' ల కు చెప్పాలనిపించింది. నేను "సఖి " ప్రోగ్రాము చూడలేదంటే నాకు ఆ రోజు ఒక పెద్ద లోటే.తెలుగుదేశంలో ఈ ప్రోగ్రాము చూడని వారున్నరేమో కాని తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.సరే అసలు జరిగిన ఆ "చిత్రం" గురించి మీకు చెపుతా నన్నాను కదా ! ఇదీ కధ!అమెరికాలో నా కూతురు దగ్గర్నుంచి దగ్గరలో ఉన్న కనెక్టి కట్ లో నా కజిన్ రెండు రోజులు రావే అంటే వెళ్లాను.దాని కూతురు ఇంటర్ చదువుతోంది. చక్కటి డాన్సరు. పదేళ్ళకి పైగా భరత నాట్యం నేర్చుకుంది.మా కజిన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక తమిళియన్ది గోల్డెన్ జుబిలీ మ్యారేజ్ డే ఫంక్షన్ కి వెళ్ళాలంది. నన్ను ఫంక్షన్ కి రమ్మంది.వద్దులేవే. ఏముంది దండలు మార్చుకొవడమేగా అన్నాను. కాదులే చాల సరదా వుంది రమ్మని బలవంతంగా తీసుకెళ్ళింది.అక్కడి ఫంక్షన్ చూస్తే నిజంగా' చిత్రం' అనిపించింది. ఇండియాలో కూడా అంత సాంప్రదాయం పాటించమేమో.అందరికి డ్రెస్ కోడ్ .అమెరికన్లు మగవాళ్ళు ప్యాంటు / పైజమా కుర్త , ఆడవాళ్ళు చీరలు,పంజాబీ డ్రెస్లు,చక్కటి నగలు , పాపిడిచేర్లు.గోరింటాకు, బొట్టు, గాజులు, వేసుకుని వచ్చారు. దాదాపు 200 మంది వరకు అతిధులు వ చ్చారు.దోశలు, ఉప్మా ఇడ్లి ,పొంగలి ,సాంబారు,పరమాన్నం ఓ ఇంకా ఎన్నో తినుబండారాలు వేడి వేడిగా ! వాళ్ళందరి ఉపన్యాసాలు అయ్యేసరికి మధ్యాన్నం రెండు అయ్యింది. కొద్దిగా విరామమిచ్చి టంచనుగా మూడు గంటలకల్ల మాఅమ్మాయి
డాన్సు ప్రోగ్రాము మొదలెట్టారు. చాల చక్కగా అయ్యింది ప్రోగ్రాము. మన తెలుగు వాళ్ళు సరే అమెరికన్లు ప్రతివాళ్ళు అభినందించారు.అసలు చిత్రం ఇక్కడే జరిగింది . ఫంక్షన్ లో ఒక అమెరికన్ లేడీ దాదాపు 80 సం " వుంటాయి.చక్కటి గులాబి రంగు పట్టు చీర కట్టుకుంది.
ఆవిడ వేదిక మీదకు వెళ్లి గోల్డెన్ జూబిలీ జంటకు ఒక బహుమతి ఇచ్చింది. మైకు తీసుకుని మాట్లాడింది.
తను ఇచ్చిన ప్రెజెంటేషను కంచి పట్టు చీర అని అది తనకు 1960 లో తనకు ఇంటిపక్కనున్న ఒక ఇండియన్ బహుమతి గా ఇచ్చిందని,తను ఆ చీరను
చాల ఇండియన్ ఫంక్షన్ల లో కట్టుకున్నానని, ఆ చీర ఈరోజుకి గూడా చెక్కు చెదర కుండా వుందని అదే చీరను ఇప్పుడు కానుకగా ఇచ్చానని,
ఆ ఇంటి పక్కన స్నేహితురాలు ఎవరో కాదు ఇప్పుడు వేదిక మీద కూర్చున్న ఆవిడని, వారిప్పుడు,వేరే సిటీ లో ఉంటున్నామని,
తనకి ఇప్పుడు ఎంతో సంతోషంగా వుందని, ఇప్పటికి వారు చక్కటి స్నేహితులని చెప్పి ఆ చీరని సభికులందరికీ చూపించమని కోరింది.
ఆవిడ అ చీరను  అందరికి వేదిక మీద నుంచి చూపెట్టింది.చక్కటి వంగపండు రంగు చీర , ఆరెంజ్ బోర్డర్, ఝరీ అంచు ధగ ధగ మెరుస్తూ వుంది.
ఆవిడ కళ్ళలో కాంతి,ముఖంలో పట్టలేని సంతోషం దాగలేదు. రెండు నిముషాలు ఆవిడ వేదికమీదనుంచి దిగివెళ్లి తిరిగి వేగంగా వేదికమీదకు వచ్చి
మైకు తీసుకుని తనకు 1958 లో మద్రాసు పెళ్లి అయిందని 1959 తన భర్త తో అమెరికా వచ్చినట్లు, అప్పుడుఈ అమెరికన్ పక్కన ఇంట్లో ఉండేదని,
అమెరికా, భాష కొత్త కావడం తో తనకేమి తెలియదని, సర్వం తానె అయి ఈ అమెరికన్ సాయం చేసిందని, అమెరికా గురించి తనకెంతో నేర్పిందని,
తను అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకున్న నంటే తన ప్రోత్సాహమే కారణమని , చాలా చక్కటి స్నేహితురాలని,
తానిప్పుడు L.A ఉంటుందని తన ఫంక్షన్ కి అంత దూరం నుంచి రావడమేకాక తనకో అపురూపమైన కానుక
ఇచ్చిందని ఇటువంటి స్నేహితులుండడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పింది.
అదండీ స్నేహితం.
ఇంకేముంది. కరతాళధ్వనులు మిన్నంటాయండీ..
నా పరిస్తితి నాకు అర్ధం కాలేదు. కళ్ళు చమర్చాయి .ఎదోలోకంలో వున్నట్లయింది. ఆ క్షణం లో ప్రపంచం ఎంతో సుందరంగా కనిపించింది.
ఇదండీ కధ!

ఈ "నా" తరం

తరాలు మారుతున్నాయి .
తలరాతలు మారుతున్నాయి. నిన్న మొన్నటి క్రొత్త జీవితాలు నిలువునా కూలుతున్నాయి.
పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. నేటి యువతలో ( యువతీ యువకులు) చాలామందికి .
నేను, 'నా' అన్నమాట తప్ప వేరే ప్రపంచం లేదు. ఎక్కడో ఒకరో, ఇద్దరో తప్ప మిగతావారంత ఇలాగే వున్నారు.
ఈ వ్యవహారం ఇంతవరకయితే సర్దుకుపోవచ్చు. ఈవిషయం ఇక్కడ ఆగి పోవడం లేదు. ఇదొక జాడ్యం గా మారిపోయింది. వారిలో నేను, నాది, నా ఇష్టం అన్న వ్యవహారం తోనే కుటుంబాలలో గొడవలు, తేడాలు, అపార్ధాలు , అల్లర్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవి ఇక్కడ ఆగి పోవడం లేదు. కొన్ని జీవితాల నాశనానికి / అంతానికి నాంది పలుకుతున్నాయి. కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయి. కుటుంబ పెద్దలు దిక్కుతోచక గాలిలో దీపాన్ని చూస్తున్నట్లు కూలుతున్న జీవితాల్ని, విధిలేక, పాలుపోక, ఏమిచేయలేక చేష్టలుడిగి దిక్కు లేని వాళ్ళలాచూస్తూ దుఖ్హం దిగమింగుకుని జీవచ్చవాల్లా బతకల్సివస్తోంది .
ఉడుకురక్తం తో లేనిపోని ఆవేశ కావేశాలతో నిండు జీవితాలు నిలువునా కూల్చుకుంటు న్నారు.
భారత, హిందూ సాంప్ర దాయ వివాహ వ్యవస్థ కే పెద్దముప్పు వచ్చింది. వ్యవస్థ ని ఇప్పుడు కాళహస్తి రాజ గాలిగోపురం తో పోల్చవచ్చు. అది కూలింది. ఇది కూలడానికి తయారుగా వుంది. ఇంకా ఎన్నోరోజులు పట్టదు.
ప్రస్తుత ఈ మార్పుకి కారణం మారుతున్న ప్రపంచం, విదేశీ, స్వదేశి చదువులు, విదేశీ ఉద్యోగాలు,మరింతగా విదేశీయాత్రలు,విదేశీ నివాసం, పాశ్చ్యాత్య పోకడలు, ఇంటా, బయటా పరిస్టితులు, ఆర్ధిక ఎదుగుదల , స్వశక్తి , మారుతున్న సమాజ సమీకరణాలు,పురుషాధిక్యత, స్త్రీల ఆర్ధిక స్వావలంబన . ఇవన్ని చెడు చేస్తున్నాయని నేను చెప్పడం లేదు. చెడు ఆలోచనలకి దోహదం చేస్తున్నాయనడానికి ఏమాత్రం సందేహంలేదు. ఇవన్నిఎక్కడెక్కడో మనుషుల్ని ఎంత త్వరితగతిని కలుపుతున్నాయో అంత త్వరగానే విడతీస్తున్నాయి. బహుశా ఈ వ్యాసం చదువుతున్న ప్రతివారికి ఇటువంటి సంఘటనలు తెలిసేవుంటాయి. విడమరిచి చెప్పాలంటే ఎంత త్వరగా జీవితాలు ఒకటవుతున్నాయో అంత త్వరగానే కూలుతున్నాయి. నాకు తెలిసి ఇటువంటి ఘటనలు కోకొల్లలు. ఎందుకవుతోందిలా? కారణం వారా ? వారి తల్లితండ్రు లా ? సమాజమా? లేక పైన చెప్పిన కారణాలా ? ఎవరు దోషి ? ఎవర్ని నిందించి ప్రయోజనం ! దిగుమతి చేసుకున్న, మనదికాని నాగరికత తో ఈరోజున మన యువత కి / మనకి అవుతున్న హాని అంత, ఇంతా కాదు.
ఈ ప్రవాహం లో సమిధలు వాళ్ళే కాదు. మనందరినీ కలిపి లాక్కుని వెళుతున్నారు.కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ ఒకసారి కూలితే మళ్లి పునర్నిర్మించడం సాధ్యమా ? ఇది మానవతకి, మతాలకి కూడా చేటు.
అందుకే అభ్యర్ధిస్తున్నాఅందరిని. ఆలోచించండి ఎక్కడ తప్పటడుగు వేస్తున్నామో . మేధావులు,సంఘ సంస్కర్తలు, శాస్త్రవేత్తలు, ముఖ్యంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు,ఇంకా పెద్దలు గమనించండి ....... జరుగుతున్నది అంత మనమంచికే అవుతే మంచిదే . కాలం నిర్ణయించే లోపులో జరగవలసిన నష్టం, హాని జరుగుతే మనల్ని మనం క్ష మించుకునే రోజు మిగిలి ఉంటుందా అనేది అనుమానమే. అందుకే ఈ వ్యాసం వ్రాస్తున్నాను. పెద్దలూ లేవండి , మేల్కోండి. పిల్లల్ని గమనిస్తు ఉండండి i . మూల వ్యవస్థల్ని కాపాడండి. ఒక్క వివాహవ్యవస్థ నే కాదు . సాంప్రదాయ వ్యవస్థలన్నీ కూలడానికి సిద్దంగా వున్నాయి. ఎప్పుడో హిందూ వ్యవస్థల మీద దాడులు జరిగాయి, జరుగుతున్నాయి ఇదివరకు అవి ఇతరులు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు.

చివరకు వెంకన్ననే ఏడుకొండలు నీవికావు పో అన్నారు ఇంకేమి జరగనుందో ఎవరికీ తెలుసు.
ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తా విస్తు న్నానంటే మనవ్యవస్థ మీద మన యువతే దాడులు చేస్తున్నారు.అవి భౌతిక దాడులు కావు. అరువు తెచ్చుకున్న నాగరికతతో అతి అనాగరికంగా ప్రవర్ర్తిస్తూన్నారు. దానికి వారొక్కరే కారణం కాదు. ప్రతి కుటుంబపెద్ద, ప్రతి తల్లి,తండ్రి, గురువు ,సమాజం అందరు సమానంగా కారణమే.
పెంపకాల్లో తేడా వచ్చింది. తప్పుల్ని దిద్దుకోండి. పారాహుషార్ !
తల్లితండ్రుల్లార జాగ్రత్త , ముద్దు, ముచ్చట వరకు మంచిదే. మంచి నేర్పండి.లోకగ్జానం నేర్పండి.మీరెవరు, మీమూలాలేమిటి,చెప్పండి. పేద్దల్ని గౌరవించడం, అన్ని మీకు తెలుసు.వారికి చెప్పండి . మంచిగా పెంచండి. చూసి చూడనట్టు ఉండకండి ! తప్పులేమైన చేస్తే దండించండి ! మళ్లి ఆతప్పు చేయకుండా చూడండి.అలాగని పిల్లలకు స్వేఛ్చ లేకుండా చేయకండి .ఓ చక్కటి స్నేహితుడులా సహకారం ఇవ్వండి.వాళ్ళని చక్కని భారత పౌరుడుగా తీర్చి దిద్దండి.
రోజులు మారుతున్నాయి.
మార్పులు తధ్యం. మార్పు లేకపోతె మనిషి లేడు , మనుగడ లేదు .మనందరిలో మార్పు రావాలి. ఆమార్పురావాలంటే మనమేమి చెయ్యాలి. చెదపట్టిన వ్యవస్థ దానికదే బాగవుతుందా? కాదు!
అందుకే నాకు తోచిన నాలుగు వాక్యాలు వ్రాస్తున్నా!
ప్రపంచం పూర్వంలా లేదు. మారింది. మారుతోంది. మనిషి మారుతున్నాడు. ఆమార్పుమంచిది కావాలి. ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. మార్పు వ్యవస్థీకృతం కావాలి.
ఇప్పుడు దేశంలో హింస ఎలావుంది?
పిల్ల ల్నవదలడం లేదు. పెద్దల్ని వదలడంలేదు.స్త్రీల సంగతి చెప్పనవసరం లేదు.
హింస, నేరాలు,ఘోరాలు కూడా వ్యవస్తలో భాగం అయ్యాయి. ఇంకా చెప్పాలంటే వ్యవస్తీకృతం అయ్యాయి
వ్యవస్తీకృతం అయ్యాయి అని ఎందుకంటున్నానంటే ఒక్క మనిషి గాలిలో చిటికేస్తే దేశంమంతా ఎక్కడంటే అక్కడ దాడులు జరుగుతాయి.ఆ దాడులు చేస్తున్నవరెవరు? పాతికేల్లలోపు యువకులు/యువతులు. వారి వారి తల్లితండ్రుల
పెంపకం బాగుంటే అంతమంది దాడులు చేస్తారా? లేదు. చెయ్యరు. కాబట్టి తల్లితండ్రులూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి.
గురువులూ జాగ్రత్త .మీలో కొందరు విధులు మీరు సక్రమంగా నిర్వర్తించడం లేదనడం లో ఎలాంటి సందేహంలేదని ప్రజావాక్కు.దీంట్లో భిన్నాభిప్రాయం లేదు.
సంఘసంస్క్రత్తలూ మేల్కోండి. పత్రికలూ మోరాల్స్ పాటించండి. ఏదో ఒక రాజకీయ పార్టీ కో, సామా జిక వర్గానికో కొమ్ముకాయకండి. సంఘ హితం చూడండి, సొంతలాభం కొంత మానండి.
ఈరోజున యువత తప్పుదోవలో వున్నారంటే ముమ్మాటికి మీరు,మీ టీవీ ఛానల్స్,సినిమాలు చాలావరకు కారణం.
ఎందుకంటే మీకు మీ మీ పత్రికలూ / టివి లు / ratings ముఖ్యం. ఏదో ఒక విషయం లో sensation కావాలి. ముందు
నా ఛానల్ ప్రసారం చేసింది అన్నదే ముఖ్యం మీకు. అందులో కించిత్తు అయిన జనహితం వుందా , లేదా అన్న విషయం మీకు అవసరం లేదు. నయ్ తికత అసలే లేదు. కూలుతున్న కుటుంబ వ్యవస్తని బాగుచేయగల సామర్ధ్యం ఎవరికైనా వుందంటే వారు మీరే. ఇందుకు దయచేసి మీరు మీ మీ పరిధిలో ఏమి చెయ్యగలరో ఆలోచించండి .నడుం బిగించండి.దీనికి కొంత దూకుడు కావాలి. ఇందుకు సర్వశ్రీ శ్రీ రామోజీరావు, రామచంద్ర మూర్తి ,వేమూరి బలరాం, వెంకటేశ్వరరావు,టి.వెంకట్రామరేడ్డి ,మాలతీచందూర్,పి.వి.ఆర్.కే.ప్రసాదు,కే.విశ్వనాధ్,ఇంకా నేను తెలియక పేరు వ్రాయని పెద్దలు, తదితరులు కార్యాచరణ మొదలుపెడితే వ్యవస్థ కోలుకోవడానికి శ్రీకారం చుట్టిన వారవుతారు. చరిత్రకారులు అవుతారు. .
చివరిగా ఇంకొక్క విషయం. మొన్ననే జనాభా లెక్కల్లో ఒక విషయం తెల్సింది.
దీనికి పైన విషయాలకి సంబంధం లేదనుకున్నా ఖచ్చితంగా బంధం మాత్రం వుంది . అందుకే దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా.పాలకులు, జనం గమనించండి .
దక్షిణ భారతంలో కుటుంబాలు చక్కగా జనాభా నియంత్రించుకుని జనాభా పెరగకుండా పాలకుల చెప్పింది చెప్పినట్లుగా విని పాటించారు.
ఉత్తర భారతంలో మాత్రం జనాభా పెరుగుదల మాములుగానే వుంది. అందువల్ల దక్షిణభారతంలో వచ్చే పాతిక సంవత్సరాలలో యువత తగ్గి పోయి అంతా వయసు మీరినవాళ్లు తయారవుతారు. ఉత్తర భారత యువత సంఖ్య చక్కగా పెరుగు తుంది. మరి కుటుంబ వ్యవస్థ అవసాన దశ లోవున్న దక్షిణలో ఈ ముసలి వాళ్ళను ఎవరు భరిస్తారో. ఎందుకయినా మంచిది వృద్ధుల ఆశ్రమాలు పెంచుకుందాం.
కేశిరాజు వెంకట వరదయ్య.