లేబుళ్లు

14, ఆగస్టు 2010, శనివారం

Punyabhoomi naa bharathadhatri.

                                                             పుణ్యభూమి నా భరత ధాత్రి.

భరత మాతను నేను. భరత ధాత్రిని నేను. శతబ్దాల  చెరలో ముద్దు బిడ్డలని కసాయిలకు  బలి ఇచ్చిన  బంధకిని  నేను.  లెక్కకు మిక్కిలి  ముష్కర మూకల దాడులతో, మహమ్మదీయుల దండయాత్రలతో, శతాబ్దాల  పరాయి  పాలనలో చిక్కి శల్యమైన నేను  దాస్య శ్రుంఖలాల నుంచి విముక్త మైనా నని అనుకొన్నాను.
నాటి నుంచి  నేటి వరకు నా శిరం భారం. దానికి మందు లేదు నా వాళ్లకి లేదు ముందు చూపు. ఇటు  ప్రక్కన 'ఇసి' వుశి గోల్పుతోంది. మతోన్మాదుల మదం, మాత్సర్యం తో ఇసుమంత విశ్రాంతి లేదు. కాశ్మీరం నా శిరం. నా శిరచ్చేదానికి కుట్రలు, కుతంత్రాలు  నిత్యకృత్యమైపోయాయి. అడ్డుకునే నాధుడే కరువయ్యారు. నా బిడ్డలు మౌనం వీడాలి. కార్యదీక్షా నిబద్దులుకావాలి.
దశాబ్దాలుగా మౌనంగానే వున్నాను. చెర పట్టిన వారిని సైతం కరుణించాను. సహనానికో హద్దుందని ముష్కర మూకలికి అర్ధమయ్యేలా చెప్పండి. మౌన ముని మౌనం వీడి మన్మోహనాస్త్రాన్నిపదును పెట్టాలి.
పర తంత్ర మంత్రాంగమే భారం అంటూ ఉత్త నినాదాలు. వినీ,వినీ విసిగి, వేసారి పోయాను. నిద్ర లేదు నివృత్తి లేదు.
శిరో భారమే కాదు. భుజాలు సైతం బాధతో మెలి తిరుగు తున్నాయి.
ఇటు ప్రక్క' చీనా' చీడలా  తినేస్తుంది. ఈ సరికే నన్ను కొంత కబళించింది. సూర్యబాంధవుడు నన్ను తాకే చోటు నాది కాదు పొమ్మంటోంది. నాకొమ్ము కాశే వారే కరువయ్యారు.
'ఆసాం' తం అల్లర్లు, అల్లకల్లోలం.      
ఇక నా 'వక్షం' వృక్షం అవుంతుందని నలుగురికి నీడ ఇస్తుందని ఆనుకున్నా. 'హస్తి 'నా' పురం కదా వాసి కెక్కుతుంద నుకున్నాను. తనా లేదు, మనా లేదు కీచక పర్వానికి  నీడ గా మారింది. 'నీరోలు' వాసి కెక్కారు. నా బిడ్డలు ఉడిగం  చేస్తున్నారు. నిమ్న జాతులు నీరసిస్తున్నాయి నీచులు నీడ పాటున నా జాతిని నిర్వీర్యం చేస్తున్నారు.
'నా' పురం  నా అంగాంగ భాగాలకి రాచ కురుపుల కేంద్రంగా మారింది.
మరాటులు, అరుణాచల వాసులు గళ  మెత్తారనుకున్న. సింహాసనానికే రాచ మర్యాదలని, తమ, తమ నెలవులుకే భంగపాటు లోస్తాయని, అధినేతల  ఊసెత్తని వారలతో  స్నేహం తమకు తగదని వారు  కూడా  తిరోగమించారు. కార్యదీక్షులు, స్వార్ధం వీడాలి. జాతి సేవకు అంకితం కావాలి. కావలసిన  కార్యాలు, చేయవలసిన పనులు  కాల పరీక్షకు వదలరాదు.
ఇక నా ఉదరం లో ఎటు చూసినా అటు పోట్లు. నిజాయితీ కి నిలు వెల్లా 'కొరవే'. రాజ పుటానులు రోషం మరిచారు. బీహారి బేహారుల్ని బీహారులు బేఖాతరు చేశారు. భిన్నత్వం లో ఏకత్వం అన్న నానుడి నాని పోతోంది. శతాబ్దాల మత సామరస్యం మంట కలిసింది. మంట  రాజేస్తున్న వారు సింధు ప్రక్కనే  రాబందుల్లా  కొలువై వున్నారు. అన్ని తెలిసీ తెగువ లేక చేష్టలుడిగి అచేతనంగా ఉన్న నా  బిడ్డలు  తమ తమ నెలవుల నెచ్చెలుల వీడి పీడిత ప్రజల సేవే పరమార్ధంగా, మాతృభూమి కొలువే కొలమానంగా చేసుకున్న నాడే నాకు నిద్ర. ఎటు చూసినా  జాతి వ్యతిరేక  దాడులు, వాడ వాడలా దంతే వాడలు. కులమార్పుల కల్లోలాలు. తూర్పు సైతం మనదికాని మావోఇజం తో తల్లడిల్లుతోంది. నామధ్యంలో మరాటీల  'మహా' దృష్టి వక్రించి నా ప్రజలను దోషులుగా ద్రుక్కిస్తున్నారు.
క్రిందకు వెళితే ఏముంది కుహనా లౌక్యం, భూభాగోతాలు, 'సెజ్జు'లంటూ 'సజ్జ'  పండే భూమి సైతం సంతలో పెట్టారు. నవాబుల  సైతోడు  జాగీరుల నజరానాలు, నాసహజ వనరుల్నిగునపాల గురితో నజ్జు చేస్తున్నారు. నదీమ తల్లుల్నినాది, నాదంటూ క్రింద మీదవుతున్నారు. నీరు పల్లమెరుగు అన్న సత్యం  అనిత్యం అయిపొయింది.  నాది, నాదంటూ ఎవరికీ వారే లెక్క లేసు కుంటున్నారు. భగీరధుదు  సైతం బామాల్సిందే. అయినా తెగని నీటి నాటకం. చోద్యం చూస్తున్నారు చేవ కలిగిన వారు. ఇంకా చోద్యం  భూ"మధ్య" గీత గీస్తున్నారు. కర్నాటకాన అంతర్నాటకం "రాఘవుని" బళ్ళారి  చుట్టూ ప్రదక్షిణం. నా దేవుని సొంత భూమి నానాటికి విచ్ఛిన్నం. మత  చాందసవాదులాట నిత్య కృత్యం. నా లలాట లిఖితమేదో నిర్లిఖితమైనట్టుంది. ప్రవక్తలు, మత పెద్దలు పంచాలి మంచినే కాని మానవాళిని మట్టు పెట్టరాదు. శ్రమైక జీవులను
పరాన్నభుక్తుల గానే ఉంచాలని, పెంచాలన్న యోచనకు తాళం వెయ్యాలి. శ్రమజీవికి  స్వాంతన కావాలి. వందల వత్సరాల బానిస బ్రతుకేదో "బాంచనే" పోమ్మంటోంది ! మార్పేది లేదు! ఆరు దశాబ్దాల  క్రింద 'నేనేదో' నేడు 'నేనదే' అనడంలో నా కేమీ నగుబాటులేదు. అవినీతి, అనైతికత నాకు జీర్ణమై పోయాయి.
'మోతీ' లాలంటి బిడ్డలు కోకొల్లలు నాకు . నాకెందుకీ 'దత్తు' ? నా కడుపున  పండు సిరులు
ఎంతకయినా చాలు. గోదాముల్లోని నిలవ పురుగులకు  కాదు. నిలవ  నీడ లేక, ముద్దనోటికి రాక కడుపులో కాళ్లేట్టుకు కాల మీడుస్తున్న బిడ్డలందరికి కావాలి. తనువు చాలిచ్చేటంత ముదుసలిని కాను. ఆరు పదులు దాటి ముచ్చటగా మూడేళ్ళు. రోగిష్టి దానిలా  పడుతు,లేస్తున్నాను. జవ్వనివి నీకేమి అంటు వెంట పడుతున్నారు. దొరికినంతకు మేర పీక్కు తింటున్నారు.
ఏ దారి లేదింక. త్రిమూర్తుల వంక తిరిగి చూస్తున్నాను.
వినాయకుణ్ణి పంపి స'నాయకుణ్ణి' తెచ్చి నన్ను నా ప్రజను దీవించమని చెప్పి.
కేశిరాజు వెంకట వరదయ్య .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి