లేబుళ్లు

1, ఏప్రిల్ 2026, బుధవారం

                                                                      బూట్ కేంప్ 
                                                                    --------------------
(శ్రీ కర్లపాలెం గోపాలరావు కొసమెరుపు- సస్పెన్స్ కథల పోటీలో 20-అక్టోబర్, 2025 న 'బహుమతి పొంది రవళి' అంతర్జాల పత్రిక, 2026 - ఏప్రిల్ మాసములో ప్రచురణ)

చీకటి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది. ఉషస్సు ఉరుకులు పెడుతోంది. తూర్పున వెలుగు చీకటికి వెల్లలేస్తోంది. అవని అంచు నుంచి తేజాన్ని పంచుతూ పయనమయ్యాడు భాస్కరుడు. క్షణాల్లో వెలుగుపరుచుకుంది నేల తల్లి ఒంటిమీద.                                                                
క్రితం రాత్రి నిద్రపట్టక ఆలస్యంగా పడుకున్న ప్రకాశరావుకి ఎప్పటిలా ఉదయాన్నేతొందరగా మెళుకువరాలేదు. మొబైల్ ఫోను మోతతో మెలుకువ వచ్చింది. పక్కకు ఒదిగి చేతిమీద భారంవేసి మెల్లగా లేచి, క్షణంపాటు కూర్చుని,  బెడ్ సైడ్ బల్ల  మీద ఉంచిన మొబైల్ అందుకుని "హలో! ఎవరూ... ?" అన్నాడు మగతగా.  
"సార్! కిరాణా సామాను గుర్తు చేయమన్నారు" అన్నాడు తోటమాలి రాజప్ప. 
తోట కెళ్లాలని అప్పుడు గుర్తుకువచ్చింది ప్రకాశరావుకి. 
"సరే! నిన్న చెప్పిన లిస్ట్  గాక ఇంకేమైనా కావాలంటే గంటలోపున చెప్పు? " అని ఫోను పెట్టేసి బాత్రూమ్ వైపు నడిచాడు ప్రకాశరావు. 
"ఈ వారం నాలుగయిదు రోజులపాటు తోటలోనే బస. ఏర్పాట్లన్నీ చూడ్డానికి ఉదయాన్నే తోటకి వస్తానని చెప్పాడు రాజప్పతో. భార్య ఇందుమతి అప్పటికే లేచి వంటింట్లో పనిచేసుకుంటోంది. మాములుగా అవుతే ఆవిడకు తోటకు రావడమంటే మహా ఇష్టం. కానీ ఈసారి ఎందుకో తోటకి రావడానికి ఆవిడ అంతగా సుముఖంగా లేదు. అయినా భర్త వెళదామని అనడంతోనే అయిష్టంగానే  ఒప్పుకుంది. 
"గంటలో బయలుదేరాలి. పిల్లలిద్దరికీ చెప్పాను తోటకెళుతున్నామని " అన్నాడు ప్రకాశరావు 
"ఎన్ని రోజులు మకాం?" 
"తోట పని ఉంది. సుమారు వారం" 
''నెత్తిన పాలు పోశారు. పనిమనిషి ఊరికెళ్లింది. వారంపాటు రాదు'' 
"ఇహనేం...మరి అంత ఉత్సాహంగా లేవు ?" అన్నాడు ప్రకాశరావు . 
'అక్కడైతే పనివారు, తాజా కూరలు, రుచిగా వండిపెట్టే రాజప్ప భార్య రేణుక. 
హాయిగా తోటలో గడపవచ్చు. కానీ ఈసారి... ' ఆమె ఆలోచనకు అడ్డుతతగుల్తూ "నిన్నతెచ్చిన సామానంతా కారులోనే ఉంది. తోట కిచెన్ లో  పప్పులు, పోపు, మసాలా దినుసులు నిండుకున్నాయట. 
తోవలో  కొనుక్కెళదాం. తీసుకెళ్లే బట్టలు, పుస్తకాలు సదురు" అన్నాడు  ప్రకాశరావు.
"వెళ్లిన ప్రతిసారి చెబుతూనే వున్నాను. అక్కడ అల్మెరాలో నెలరోజులకు సరిపడా ఇద్దరివీ బట్టలున్నాయి. మనమేనా? ఇంకెవరైనా వస్తున్నారా?"
"ఈ సారి పరమహంస ఫ్యామిలీతో వస్తున్నాడు. రెండ్రోజులుండి వెళతారు. రాఘవరావు వాళ్లు కూడా ... "
"పరమహంస గారా ? ఆయన సిటీ కి వచ్చాడేంటి ?" 
"అవును ఇందూ! వాళ్ళు కూతురి ఫ్లాట్ లో దిగారు. పోయిన్నెల పూనాలో ఆక్సిడెంట్ లో కూతురూ అల్లుడూ ఇద్దరూ పోయారు తెలుసుగా. మనవడు, మనవరాలు దిక్కులేకుండా అయ్యారని పుట్టెడు దుఃఖ్ఖంలో ఉన్నాడు. పసి పిల్లల భవిష్యత్తు గురించి క్షోభ పడుతున్నాడు. రెండ్రోజులు టెన్షన్ కి దూరంగా వుంటారని నేనే రమ్మన్నాను"
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ! ... సారీ! పిల్లల గురించికాదు నేననేది"
"తప్పు ఇందూ! ప్లీజ్...ఎవరి గురించైనా సరే ఆలా మాట్లాడకు. అతన్ని ఎంతకాలం ద్వేషిస్తావు ? ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు! మనం నోటికి పనిచెబితే మనకే నష్టం. నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎవరిపట్ల దుర్భాష, పరుష వ్యాఖ్యలు వద్దని... మనం ఆతిధ్యమిస్తున్నామన్న విషయం గుర్తుంచుకుని హుందాగా మసులుకో!" భార్యని సున్నితంగా మందలిస్తూ గట్టిగా అన్నాడు ప్రకాశరావు. 
'పరమహంస కాదు... పరమహింసగాడు' కసిగా మనసులో అనుకుంటూ. 
"ఆయన సరే! ... రాఘవరావుగారు వాళ్ళు అమెరికా వెళ్లారుకదా. ఆర్నెల్లు ఉంటామంది వాళ్ళావిడ పోయినసారి కలిసినప్పుడు ... ఇంతలోనే వెళ్లడం... తిరిగి రావడం కూడా అయిందా !? 
ఆశ్చర్యంగా అంది ఇందుమతి. 
"వచ్చి కూడా వారం రోజులయింది" 
"ఎందుకు అంత త్వరగా తిరిగి వచ్చారు ?"
"ఉండలేక వచ్చామన్నాడు రాఘవరావు!" 
"అమెరికాలోనా లేక కొడుకింట్లోనా ?"
ప్రకాశరావు 'మౌనం' లోనే ఆమె సమాధానం వెతుక్కోవాల్సి వచ్చి 
"దట్  స్పీక్స్ వాల్యూంస్ ...!" అంటూ లోనికి వెళ్ళిందక్కడ నుంచి ఇందుమతి. అన్నీ సదురుకుని అర్ధగంటలో బయలుదేరి, కిరాణాషాపులో కావలసిన సామాను తీసుకుని తొమ్మిదిన్నర కల్లా తోటకు చేరారు వారిద్దరు.    
                                                                  * * * * *
 ప్రకాశరావు జైళ్ల అధికారిగా రిటైరయ్యాడు. వయస్సు అరవై ఎనిమిది నిండాయి. ఇద్దరు కొడుకులు. ఇద్దరు అమెరికాలోనే సెటిలయ్యారు. తనది మంచి ఆరోగ్యం. వివాద రహితుడు. సాత్వికుడు. నిజాయితీకి మారుపేరు. 
'ఈ డిపార్టుమెంటు కెందుకువచ్చావయ్యా మా ప్రాణంతీయడానికి' అని విసుక్కునే వారతనిపై   అధికారులు. రిటైర్ కాకముందే సిటీకి కొద్ది దూరంలోఉన్నఆరెకరాల మెట్టభూమిని తోటగా అభివృద్ధి చేశాడు. పెద్ద హాలు రెండు గదుల, కిచెన్ తో ఫార్మ్ హౌస్  కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక తరుచుగా అక్కడే ఉండడం, వ్యవసాయం, తోటపని చేసుకోవడం, అప్పుడప్పుడు స్నేహితులికి, దగ్గరి బంధువులకు తోటలో ఆతిధ్యమివ్వడం అలవాటయ్యింది.  
తోట ఆదాయంలో సింహభాగం ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తాడు. కూరగాయలు, పళ్ళు వృద్ధాశ్రమాలలో పంచడమే కాదు. రాత్రుళ్ళు అన్నార్తులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు పంచడం అలవాటు. కుడిచేత్తో చేసేది ఎడం చేతికి తెలవద్దు అనేవాడు. ఆర్భాటాలు గిట్టవు.
'డౌన్ టు ఎర్త్ ' మనిషి ప్రకాశరావు. 
                                                                   * * * * * 
తోటకి చేరుతూనే ఏర్పాట్లన్నీ పరిశీలించి తోటలో అలా తిరిగి వచ్చేసరికి పరమహంస కారు పార్క్ చేస్తూ కన్పించాడు. ఇంతలో రాఘవరావు ఏదో అర్జెంటు పని వచ్చి రావడం లేదని ఫోను చేయడంతో రాజప్పతో చెప్పి వచ్చాడు ప్రకాశరావు.  
                                                                   * * * * * 
పరమహంస మొదటి భార్య వంటింట్లో వంట గ్యాస్  లీకయి  సిలిండరు పేలి చనిపోయింది. ఆసమయంలో పరమహంస ఇంట్లో లేడు. పోలిసువారు మొదట్లో పరమహంసను అనుమానించినా తరువాత ఏక్సిడెంటల్ కేసుగా పరిగణించారు. కేసు క్లోజయింది.  
ఏడాది తరువాత పరమహంస రెండో పెళ్లి చేసుకుని సిటీ నుంచి  ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే జిల్లాకు వెళ్ళాడు. మళ్ళీ సిటీకి రావడం ఇప్పుడే!.   
అప్పట్లో, పరమహంస భార్యను విపరీతంగా టార్చర్ పెట్టేవాడనే అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆయన 'పరమహంస' కాదు 'పరమ హింస' గాడనుకునేవారు క్వార్ట ర్స్ లో కొందరు. అందరితో బాటే తనూ పరమ 'హింస' గాడనుకునేది ఇందుమతి. 
                                                                   * * * * *
చనిపోయిన ఇందిర పరమహంస మొదటి భార్య. క్వార్టర్స్ లో పక్క పక్కఇండ్లలో  ఉండడంతో ఇందుమతికి, ఇందిరకు మంచి స్నేహం కుదిరింది. పరమహంస భార్యను 'ఇందూ' అని పిలిచేవాడు. దాంతో  ప్రకాశరావు భార్యను పూర్తిపేరుతో పిలవడం అలవాటు చేసుకున్నాడు. ఇందుమతి, ఇందిరా ఖాళీ సమయాల్లో సినిమాలు, షాపింగులకు కలిసి తిరిగేవాళ్లు. దాదాపు పాతిక, ముప్ఫై సంవత్సరాల తరువాత పరమహంసను, ఆయన రెండో భార్యను కలవబోతోంది. ఇందిరతో పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ  కలవరపెడుతున్నాయామెను. 
భర్త మందలించాడని సైలెంట్ గా ఉంది. అయినా ఇందుమతి ఎక్కడ నోరు జారుతుందేమోనని ప్రకాశరావు భయపడుతునే ఉన్నాడు. 
పరమహంస పెద్ద వయసులో తన కొచ్చిన సమస్యని పంచుకుని, సలహా కోసం వస్తున్నానన్నాడు. అందుకే కాదనలేక పోయాడు ప్రకాశరావు. ఈ సమయంలో ఇందుమతి పాత విషయాలు ప్రస్తావించడం బావుండదని ప్రకాశరావు భావన. భార్య సంగతి తెలుసు. ఆమె ఓ ఫెమినిస్ట్. 
ఈమధ్య అఫెన్సివ్ గా ఉంటోంది. ఆడవారిని కించపరిచే వారినెవరిని స్పేర్ చేయడంలేదు. అపరకాళిలా విరుచుకుపడుతోంది. 
మొన్నీమధ్య మొగుడు కొట్టాడని పనిమనిషి చెప్పడమే తరువాయి, ఆమెను పోలీసుస్టేషన్ తీసుకెళ్లి మరెట్టా కంప్లైంట్  ఇప్పించి  భర్తకి వార్నింగ్ ఇప్పించింది. 
అప్పట్లో, పరమహంస మొదటి భార్య చావుకు పరోక్షంగా అతనే కారణమని, చట్టానికి దొరక్కుండా వ్యవహరించాడని వాళ్ళు, వీళ్ళు అనడం విని వాదనకు దిగేది భర్తతో.
                                                                   * * * * *
పరమహంస వస్తూనే భార్యను పరిచయం చేశాడు 'పద్మ' అంటూ. 
"మిమ్ముల్ని ఇంతవరకు కలవనే లేదు" అంది ఇందుమతి. 
"ఎన్నిసార్లు చెప్పినా తనింతవరకు ఏ స్నేహితుల ఇళ్లకు రాలేదు" అన్నాడు పరమహంస. 
"అవును. రాలేదు" అంది పద్మ మెల్లగా. 
'ఈమెను ఎక్కడో, ఎప్పుడో చూసినట్లనిపిస్తోంది' అనుకుంటూ "ఇట్స్ ఓకే. లెట్స్ గో ఇన్ " అంటూ వారితో లోనికి నడిచింది ఇందుమతి. టీ, బిస్కట్స్ అవుతూనే ఆడవారు, మగవారు విడిపోయి ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో తోటంతా కలియ తిరిగారు. బత్తాయి చెట్లు మంచి పూత మీదున్నాయి. పండ్లలాగే పూలు కూడా ఎంతోదూరానికి సువాసనలు విరజిమ్ముతూ  పరిమళభరితంగా ఉన్నాయి. చూస్తుండగానే నల్లటి మబ్బులు కమ్ముకుని వాతావరణం ఆహ్లాదంగా మారింది. చిరుజల్లు మొదలయింది. చినుకుల్లో తడుస్తూ ఫార్మ్ హౌజ్ కి చేరి కబుర్లలో పడ్డారు. 
వేడి టీ  రావడంతో తాగుతూ కబుర్లలో పడ్డారు మగవారు. .  
"చెప్పండి ... పిల్లలు ఎలా ఉన్నారు? పెద్దవాళ్ళం ఎలాటి ఆటు పోట్లనైనా తట్టుకోగలం. పసికూనలు. మీరే ఇక వారికి సర్వస్వం !" అన్నాడు ప్రకాశరావు.  
పెద్ద నిట్టూర్పు విడిచి "ప్రస్తుతం ఇద్దరూ వాళ్ళ నానమ్మ, తాత దగ్గర ఉన్నారు. వాళ్లిద్దరూ బాగా పెద్దవారు. ఉన్న ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వీళ్లూ, అక్కడే సెటిలయ్యారు. కొడుకు, అదే మా అల్లుడు పోవడంతో హైదరాబాద్  వచ్చారు. అత్త, చిన్నమ్మ, బాబాయి పిల్లల్నిపెంచడం మావల్ల కాదన్నారు. ఇక మాకు తప్పిందికాదు. జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. మేమూ పెద్ద వాళ్లమయ్యాము. 
రేపనే రోజు తలుచుకుంటే వెన్నుల్లోంచి భయం తన్నుకొస్తోంది. పద్మ ఖచ్చితంగా నావల్ల కాదంటోంది. అయినా, వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో ... పిల్లల భవిష్యత్తు ఏమిటోనని బహు బెంగగా ఉంటోంది. రాత్రిళ్ళు నిద్ర కరువయింది" అన్నాడు పరమహంస ప్రకాశరావు వంక దీనంగా చూస్తూ. 
"నీ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం 'పరం'! ... 'కాలం'... కాలమే సమాధానం చెప్పాలి. 
మనం నిమిత్త మాత్రులం. ఊహించనిది జరిగింది. ఇలాటి ఘోర విపత్తు నీ జీవితంలో రెండో సారి వచ్చింది! కాలంతో కలిసి నడవడం తప్ప నీకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మొదటిసారి శక్తి నిచ్చిన భగవంతుడు ... ఇప్పుడూ నీతో ఉంటాడు. ఎప్పుడెలాటి సాయం కావాలన్నా చెప్పు. 
నాకు చేతనయింది చేయడానికెప్పుడూ సిద్ధం" అన్నాడు ప్రకాశరావు. 
కళ్ళ నీరు తుడుచుకుంటూ "అందుకే ప్రకాశం నీ దగ్గరికి వచ్చాను. నాకు కొండంత ధైర్యం వచ్చింది. థాంక్స్!" అన్నాడు పరమహంస ప్రకాశరావు రెండు చేతులు పట్టుకుని, కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని కప్పిపుచ్చుతూ. 
"ఇంకొక విషయం. పిల్లల్ని గారాబం చేయవద్దు. చదువు, క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం ఉపేక్ష వద్దు" అన్నాడు రాఘవరావు. 
"నీ సలహా తప్పక పాటిస్తాను'' అన్నాడు పరమహంస.  
రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి. 
                                                                       * * * * *
పరమహంస, పద్మ బయలుదేరారు. వారు కారు ఎక్కుతున్నప్పుడు 
"పద్మగారూ! రెండురోజులనుంచి ప్రయత్నం చేస్తుంటే నాకిప్పుడు గుర్తుకి వచ్చింది. మీరు ఇందిర కజిన్ కదా! ఆక్సిడెంట్ ముందు రోజు ఇందిరవాళ్ళింటికి వచ్చివెళ్లారు. ఇందిర మిమ్ముల్ని నాకు పరిచయం చేసింది గుర్తుందా? 
ఆరోజు తనకి  తలనొప్పిగా ఉంటే మీరు మంచి 'టీ' పెట్టి ఇచ్చారని కూడా చెప్పింది ఇందిర నాతో.  
పరమహంస గారు అసలు మిమ్ముల్ని పెళ్లి చేసుకోవలసిందని, ఏవో కారణాలచేత మీ ఇద్దరి పెళ్లి తప్పిపోయిందని కూడా ఇందిర నాతో స్పష్టంగా చెప్పింది" కూల్ గా అంది ఇందుమతి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. 
పద్మ మౌనంగా పరమహంస వంక చూస్తూ హ్యాంకీతో నుదురు మీద పట్టిన చిరు చెమట తుడుచుకుంది.  
"వెళ్లొస్తాం" అని కారు స్టార్ట్ చేశాడు పరమహంస.
  
                                                      * * * * *    అయి పోయింది     * * * * *

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు :9849118254


                                                                      బూట్ కేంప్ 
                                                                    --------------------
చీకటి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది. ఉషస్సు ఉరుకులు పెడుతోంది. తూర్పున వెలుగు చీకటికి వెల్లలేస్తోంది. అవని అంచు నుంచి తేజాన్ని పంచుతూ పయనమయ్యాడు భాస్కరుడు. క్షణాల్లో వెలుగుపరుచుకుంది నేలతల్లి ఒంటిమీద.                                                                
క్రితం రాత్రి నిద్రపట్టక ఆలస్యంగా పడుకున్న ప్రకాశరావుకి ఎప్పటిలా ఉదయాన్నేతొందరగా మెళుకువరాలేదు. మొబైల్ ఫోను మోతతో మెలుకువ వచ్చింది. పక్కకు ఒదిగి చేతిమీద భారంవేసి మెల్లగా లేచి, క్షణంపాటు కూర్చుని,  బెడ్ సైడ్ బల్ల  మీద ఉంచిన మొబైల్ అందుకుని "హలో! ఎవరూ... ?" అన్నాడు మగతగా.  
"సార్! కిరాణా సామాను గుర్తు చేయమన్నారు" అన్నాడు తోటమాలి రాజప్ప. 
తోట కెళ్లాలని అప్పుడు గుర్తుకువచ్చింది ప్రకాశరావుకి. 
"సరే! నిన్న చెప్పిన లిస్ట్  గాక ఇంకేమైనా కావాలంటే గంటలోపున చెప్పు? " అని ఫోను పెట్టేసి బాత్రూమ్ వైపు నడిచాడు ప్రకాశరావు. 
"ఈ వారం నాలుగయిదు రోజులపాటు తోటలోనే బస. ఏర్పాట్లన్నీ చూడ్డానికి ఉదయాన్నే తోటకి వస్తానని చెప్పాడు రాజప్పతో. భార్య ఇందుమతి అప్పటికే లేచి వంటింట్లో పనిచేసుకుంటోంది. మాములుగా అవుతే ఆవిడకు తోటకు రావడమంటే మహా ఇష్టం. కానీ ఈసారి ఎందుకో తోటకి రావడానికి ఆవిడ అంతగా సుముఖంగా లేదు. అయినా భర్త వెళదామని అనడంతోనే అయిష్టంగానే  ఒప్పుకుంది. 
"గంటలో బయలుదేరాలి. పిల్లలిద్దరికీ చెప్పాను తోటకెళుతున్నామని " అన్నాడు ప్రకాశరావు 
"ఎన్ని రోజులు మకాం?" 
"తోట పని ఉంది. సుమారు వారం" 
''నెత్తిన పాలు పోశారు. పనిమనిషి ఊరికెళ్లింది. వారంపాటు రాదు'' 
"ఇహనేం...మరి అంత ఉత్సాహంగా లేవు ?" అన్నాడు ప్రకాశరావు . 
'అక్కడైతే పనివారు, తాజా కూరలు, రుచిగా వండిపెట్టే రాజప్ప భార్య రేణుక. 
హాయిగా తోటలో గడపవచ్చు. కానీ ఈసారి... ' ఆమె ఆలోచనకు అడ్డుతతగుల్తూ "నిన్నతెచ్చిన సామానంతా కారులోనే ఉంది. తోట కిచెన్ లో  పప్పులు, పోపు, మసాలా దినుసులు నిండుకున్నాయట. 
తోవలో  కొనుక్కెళదాం. తీసుకెళ్లే బట్టలు, పుస్తకాలు సదురు" అన్నాడు  ప్రకాశరావు.
"వెళ్లిన ప్రతిసారి చెబుతూనే వున్నాను. అక్కడ అల్మెరాలో నెలరోజులకు సరిపడా ఇద్దరివీ బట్టలున్నాయి. మనమేనా? ఇంకెవరైనా వస్తున్నారా?"
"ఈసారి పరమహంస, ఆయన వెళ్ళాక రాఘవరావు ఫ్యామిలీతో వస్తున్నారు. రెండ్రోజులుండి వెళతారు"
"పరమహంస గారా ? ఆయన సిటీ కి వచ్చాడేంటి ?" 
"అవును ఇందూ! వాళ్ళు కూతురి ఫ్లాట్ లో దిగారు! పోయిన్నెల పూనాలో ఆక్సిడెంట్ లో కూతురూ అల్లుడూ ఇద్దరూ పోయారు తెలుసుగా. మనవడు, మనవరాలు దిక్కులేకుండా అయ్యారని పుట్టెడు దుఃఖ్ఖంలో ఉన్నాడు. పసి పిల్లల భవిష్యత్తు గురించి క్షోభ పడుతున్నాడు. రెండ్రోజులు టెన్షన్ కి దూరంగా వుంటారని నేనే రమ్మన్నాను"
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ! ... సారీ! పిల్లల గురించికాదు నేననేది"
"తప్పు ఇందూ! ప్లీజ్..ఎవరిగురించైనా సరే ఆలా మాట్లాడకు. అతన్ని ఎంతకాలం ద్వేషిస్తావు ? ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు! మనం నోటికి పనిచెబితే మనకే నష్టం. నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎవరిపట్ల దుర్భాష, పరుష వ్యాఖ్యలు వద్దని! మనం ఆతిధ్యమిస్తున్నామన్న విషయం గుర్తుంచుకుని హుందాగా మసులుకో!" భార్యని సున్నితంగా మందలిస్తూ గట్టిగా అన్నాడు ప్రకాశరావు. 
'పరమహంస కాదు... పరమహింసగాడు' కసిగా మనసులో అనుకుంటూ. 
"ఆయన సరే! ... రాఘవరావుగారు వాళ్ళు అమెరికా వెళ్లారుకదా. ఆర్నెల్లు ఉంటామంది వాళ్ళావిడ పోయినసారి కలిసినప్పుడు ... ఇంతలోనే వెళ్లడం... తిరిగి రావడం కూడా అయిందా !? 
ఆశ్చర్యంగా అంది ఇందుమతి. 
"వచ్చి కూడా వారం రోజులయింది" 
"ఎందుకు అంత త్వరగా తిరిగి వచ్చారు ?"
"ఉండలేక వచ్చామన్నాడు రాఘవరావు!" 
"అమెరికాలోనా లేక కొడుకింట్లోనా ?" మాటలు నొక్కి పలుకుతూ అంది ఇందుమతి. 
ప్రకాశరావు సమాధానం చెప్పలేదు. 
అతని  'మౌనం' లోనే ఆమె సమాధానం వెతుక్కోవాల్సి వచ్చి 
"దట్  స్పీక్స్ వాల్యూంస్ ..." భుజాలెగరేసి లోనికి వెళ్ళిందక్కడ నుంచి ఇందుమతి. కావలసిన సమానంతా  సదురుకుని అర్ధగంటలో బయలుదేరి, తోవలో ఆగి, కిరాణాషాపులో కావలసిన సామాను తీసుకుని తొమ్మిదిన్నర కల్లా తోటకు చేరారు వారిద్దరు.    
                                                                 * * * * *
 ప్రకాశరావు జైళ్ల అధికారిగా రిటైరయ్యాడు. వయస్సు అరవై ఎనిమిది సంవత్సరాలు నిండాయి. ఇద్దరు కొడుకులు. ఇద్దరు అమెరికాలోనే సెటిలయ్యారు. తనది మంచి ఆరోగ్యం. వివాదరహితుడు. సాత్వికుడు. నిజాయితీకి మారుపేరు. 
'ఈ డిపార్టుమెంటు కెందుకువచ్చావయ్యా మా ప్రాణంతీయడానికి' అని విసుక్కునే వారతనిపై   అధికారులు. రిటైర్ కాకముందే సిటీకి కొద్ది దూరంలోఉన్నఆరెకరాల మెట్టభూమిని తోటగా అభివృద్ధి చేశాడు. పెద్ద హాలు రెండు గదుల, కిచెన్ తో ఫార్మ్ హౌస్  కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక తరుచుగా అక్కడే ఉండడం, వ్యవసాయం, తోటపని చేసుకోవడం, అప్పుడప్పుడు స్నేహితులికి, దగ్గరి బంధువులకు తోటలో ఆతిధ్యమివ్వడం అలవాటయ్యింది.  
తోట ఆదాయంలో సింహభాగం ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తాడు. కూరగాయలు, పళ్ళు వృద్ధాశ్రమాలలో పంచడమే కాదు. రాత్రుళ్ళు అన్నార్తులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు పంచడం అలవాటు. కుడిచేత్తో చేసేది ఎడం చేతికి తెలవద్దు అనేవాడు. ఆర్భాటాలు గిట్టవు.
'డౌన్ టు ఎర్త్ ' మనిషి ప్రకాశరావు. 
                                                                   * * * * * 
తోటకి చేరుతూనే ఏర్పాట్లన్నీ పరిశీలించి తోటలో అలా తిరిగి వచ్చేసరికి పరమహంస కారు పార్క్ చేస్తూ కన్పించాడు. ఇంతలో రాఘవరావు ఏదో అర్జెంటు పనివచ్చి రావడంలేదని ఫోను చేయడంతో వంటవారికి చెప్పి వచ్చాడు ప్రకాశరావు.  
                                                                   * * * * * 
పరమహంస మొదటి భార్య వంటింట్లో వంట గ్యాస్  లీకయి  సిలిండరు పేలి చనిపోయింది. ఆసమయంలో పరమహంస ఇంట్లో లేడు. పోలిసువారు మొదట్లో పరమహంసను అనుమానించినా తరువాత ఏక్సిడెంటల్ కేసుగా పరిగణించారు. కేసు క్లోజయింది.  
ఏడాది తరువాత పరమహంస రెండో పెళ్లి చేసుకుని సిటీ నుంచి  ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే జిల్లాకు వెళ్ళాడు. మళ్ళీ సిటీకి రావడం ఇప్పుడే!.   
అప్పట్లో, పరమహంస భార్యను విపరీతంగా టార్చర్ పెట్టేవాడనే అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆయన 'పరమహంస' కాదు 'పరమ హింస' గాడనుకునేవారు క్వార్ట ర్స్ లో కొందరు. అందరితో బాటే తనూ పరమ 'హింస' గాడనుకునేది ఇందుమతి. 
                                                                   * * * * *
చనిపోయిన ఇందిర పరమహంస మొదటి భార్య. క్వార్టర్స్ లో పక్క పక్కఇండ్లలో ఉండడంతో ఇందుమతికి, ఇందిరకు మంచి స్నేహం కుదిరింది. పరమహంస భార్యను 'ఇందూ' అని పిలిచేవాడు. దాంతో  ప్రకాశరావు భార్యను పూర్తిపేరుతో పిలవడం అలవాటు చేసుకున్నాడు. ఇందుమతి, ఇందిర ఖాళీ సమయాల్లో సినిమాలు, షాపింగులకు కలిసి తిరిగేవాళ్లు. 
ఇప్పుడు, దాదాపు పాతిక, ముప్ఫై సంవత్సరాల తరువాత పరమహంసను, ఆయన రెండో భార్యను కలవబోతోంది ఇందుమతి. ఇందిరతో పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ  కలవరపెడుతున్నాయామెను. 
భర్త మందలించాడని సైలెంట్ గా ఉంది. 
అయినా ఇందుమతి ఎక్కడ నోరుజారుతుందేమోనని ప్రకాశరావు భయపడుతునే ఉన్నాడు. 
పరమహంస పెద్ద వయసులో తనకొచ్చిన జటిల సమస్యని పంచుకుని, సలహా కోసం వస్తున్నానన్నాడు. అందుకే కాదనలేక పోయాడు ప్రకాశరావు. ఈ సమయంలో ఇందుమతి పాత విషయాలు ప్రస్తావించడం బావుండదని ప్రకాశరావు భావన. భార్య సంగతి తెలుసు. ఆమె ఓ ఫెమినిస్ట్. 
ఈమధ్య అఫెన్సివ్ గా ఉంటోంది. ఆడవారిని కించపరిచే వారినెవరిని స్పేర్ చేయడంలేదు. అపరకాళిలా విరుచుకుపడుతోంది. 
మొన్నీమధ్య మొగుడు కొట్టాడని పనిమనిషిచెప్పడమే తరువాయి, ఆమెను పోలీసుస్టేషన్ తీసుకెళ్లి మరెట్టా వాడికి వార్నింగ్ ఇప్పించింది. 
అప్పట్లో పరమహంస చట్టానికి దొరక్కుండా వ్యవహరించాడని వాళ్ళు, వీళ్ళు అనడం విని వాదనకు దిగేది భర్తతో. భార్య చావుకు పరోక్షంగా అతనే కారణమని ఆమె నమ్మకం. 
                                                              * * * * *
పరమహంస వస్తూనే భార్యను పరిచయం చేశాడు 'పద్మ' అంటూ. 
"ఇన్నేళ్ళలో మిమ్ముల్ని ఇంతవరకు కలవనే లేదు" అంది ఇందుమతి. 
"ఎన్నిసార్లు చెప్పినా తనింతవరకు ఏ స్నేహితుల ఇళ్లకు  రాలేదు" అన్నాడు పరమహంస. 
"అవును రాలేదు!" అంది పద్మ మెల్లగా. 
'ఈమెను ఎక్కడో, ఎప్పుడో చూసినట్లనిపిస్తోంది' అనుకుంటూ "ఇట్స్ ఓకే. లెట్స్ గో ఇన్" అంటూ వారితో లోనికి నడిచింది ఇందుమతి. 
టీ, బిస్కట్స్ అవుతూనే ఆడవారు, మగవారు గ్రూపులుగా విడిపోయి ఆహ్లాదకర వాతావరణంలో తోటంతా కలియ తిరిగారు. బత్తాయి చెట్లు మంచి పూత మీదున్నాయి. పండ్లలాగే బత్తాయి పూలు కూడా ఎంతోదూరానికి సువాసన విరజిమ్ముతూ  పరిమళభరితంగా ఉన్నాయి. చూస్తుండగానే నల్లటి మబ్బులు కమ్ముకుని వాతావరణం ఆహ్లాదంగా మారింది. చిరుజల్లు మొదలయింది.  మబ్బుల్లో పెద్ద రంగుల హరివిల్లు విరిసింది. అందరూ చినుకుల్లో తడుస్తూ ఫార్మ్ హౌజ్ కి చేరి కబుర్లలో పడ్డారు. వేడి టీ, ఉల్లి పకోడీలు రావడంతో తాగుతూ, తింటూ కబుర్లలో పడ్డారు. 
                                                             * * * * *  
"చెప్పు పరం! ఎలావున్నావు ? పిల్లలెలా ఉన్నారు? పెద్దవాళ్ళం మనం ఎలాటి ఆటు పోట్లనైనా తట్టుకోగలం. సర్వం కోల్పోయిన పసికూనలకి మీరే ఇక సర్వస్వం! దేవుడు మీకు ఓ బాధ్యత అప్పచెప్పాడు. ధైర్యం కోల్పోవద్దు. లక్ష్యం ఒక్కటే. అప్రమత్తంగా ఉండు. పిల్లలు జాగ్రత్త!"  అన్నాడు ప్రకాశరావు.  
పెద్ద నిట్టూర్పు విడిచి "ప్రస్తుతం ఇద్దరూ వాళ్ళ నానమ్మ, తాత దగ్గర ఉన్నారు. వాళ్లిద్దరూ బాగా పెద్దవారు. ఉన్న ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వీళ్లూ, అక్కడే సెటిలయ్యారు. కొడుకు, అదే మా అల్లుడు పోవడంతో వచ్చారు. అత్త, చిన్నమ్మ, బాబాయి పిల్లల్నిపెంచడం మావల్ల కాదన్నారు. ఇక మాకు తప్పిందికాదు. జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. మేమూ పెద్ద వాళ్లమయ్యాము. 
రేపనే రోజు తలుచుకుంటే వెన్నుల్లోంచి భయం తన్నుకొస్తోంది. పద్మ ఖచ్చితంగా నావల్ల కాదంటోంది. అయినా, వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో ... పిల్లల భవిష్యత్తు ఏమిటో నని బహు బెంగగా ఉంటోంది. రాత్రిళ్ళు  నిద్రకరువయింది" అన్నాడు పరమహంస ప్రకాశరావు వంక దీనంగా చూస్తూ. 
"నీ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం 'పరం'! చెప్పానుగా... 'కాలం'... కాలమే సమాధానం చెప్పాలి. మనం నిమిత్త మాత్రులం. ఊహించనిది జరిగింది. ఇలాటి ఘోర విపత్తు నీ జీవితంలో రెండో సారి వచ్చింది. కాలంతో కలిసి నడవడం తప్ప నీకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మొదటిసారి శక్తి నిచ్చిన భగవంతుడు...ఇప్పుడూ నీతో ఉంటాడు. ఎప్పుడెలాటి సాయం కావాలన్నా చెప్పు. నాకు చేతనయింది చేయడానికెప్పుడూ సిద్ధం" అన్నాడు ప్రకాశరావు. 
కళ్ళ నీరు తుడుచుకుంటూ "అందుకే ప్రకాశం నీ దగ్గరికి వచ్చాను. నాకు కొండంత ధైర్యం వచ్చింది. థాంక్స్!" అన్నాడు ప్రకాశరావు రెండు చేతులు పట్టుకుని, కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని కప్పిపుచ్చుతూ. 
"ఇంకొక విషయం. పిల్లల్ని గారాబం చేయవద్దు. చదువు విషయంలో ఏమాత్రం ఉపేక్ష వద్దు" అన్నాడు రాఘవరావు. 
"ఈ విషయాలు తప్పక పాటిస్తాను'' అన్నాడు పరమహంస.  
రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి. 
                                                                       * * * * *
పరమహంస, పద్మ బయలుదేరారు. వారు కారు ఎక్కుతున్నప్పుడు 
"పద్మగారూ! రెండురోజులనుంచి ప్రయత్నం చేస్తుంటే నాకిప్పుడు గుర్తుకి వచ్చింది. మీరు ఇందిర కజిన్ కదా! ఆక్సిడెంట్ ముందు రోజు ఇందిరవాళ్ళింటికి వచ్చివెళ్లారు. ఇందిర మిమ్ముల్ని నాకు పరిచయం చేసింది గుర్తుందా? 
ఆరోజు తనకి  తలనొప్పిగా ఉంటే మీరు మంచి టీ పెట్టి ఇచ్చావని కూడా అంది ఇందిర. 
పరమహంసగారు అసలు మిమ్ముల్ని పెళ్లి చేసుకోవలసిందని, ఏవో కారణాలచేత  పరమహంసగారితో మీపెళ్లి తప్పిపోయిందని కూడా ఇందిర నాతో చెప్పింది" కూల్ గా అంది ఇందుమతి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. 
పద్మ మౌనంగా పరమహంస వంక చూస్తూ హ్యాంకీతో నుదురు మీద పట్టిన చిరు చెమట తుడుచుకుంది.  
"వెళ్లొస్తాం" అని కారు స్టార్ట్ చేశాడు పరమహంస.
  
                                           * * * * *    అయిపోయింది     * * * * *

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు :9849118254




                                                                      బూట్ కేంప్ 
                                                                    --------------------
చీకటి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది. ఉషస్సు ఉరుకులు పెడుతోంది. తూర్పున వెలుగు చీకటికి వెల్లలేస్తోంది. అవని అంచు నుంచి తేజాన్ని పంచుతూ పయనమయ్యాడు భాస్కరుడు. క్షణాల్లో వెలుగుపరుచుకుంది నేలతల్లి ఒంటిమీద.                                                                
క్రితం రాత్రి నిద్రపట్టక ఆలస్యంగా పడుకున్న ప్రకాశరావుకి ఎప్పటిలా ఉదయాన్నేతొందరగా మెళుకువరాలేదు. మొబైల్ ఫోను మోతతో మెలుకువ వచ్చింది. పక్కకు ఒదిగి చేతిమీద భారంవేసి మెల్లగా లేచి, క్షణంపాటు కూర్చుని,  బెడ్ సైడ్ బల్ల  మీద ఉంచిన మొబైల్ అందుకుని "హలో! ఎవరూ... ?" అన్నాడు మగతగా.  
"సార్! కిరాణా సామాను గుర్తు చేయమన్నారు" అన్నాడు తోటమాలి రాజప్ప. 
తోట కెళ్లాలని అప్పుడు గుర్తుకువచ్చింది ప్రకాశరావుకి. 
"సరే! నిన్న చెప్పిన లిస్ట్  గాక ఇంకేమైనా కావాలంటే గంటలోపున చెప్పు? " అని ఫోను పెట్టేసి బాత్రూమ్ వైపు నడిచాడు ప్రకాశరావు. 
"ఈ వారం నాలుగయిదు రోజులపాటు తోటలోనే బస. ఏర్పాట్లన్నీ చూడ్డానికి ఉదయాన్నే తోటకి వస్తానని చెప్పాడు రాజప్పతో. భార్య ఇందుమతి అప్పటికే లేచి వంటింట్లో పనిచేసుకుంటోంది. మాములుగా అవుతే ఆవిడకు తోటకు రావడమంటే మహా ఇష్టం. కానీ ఈసారి ఎందుకో తోటకి రావడానికి ఆవిడ అంతగా సుముఖంగా లేదు. అయినా భర్త వెళదామని అనడంతోనే అయిష్టంగానే  ఒప్పుకుంది. 
"గంటలో బయలుదేరాలి. పిల్లలిద్దరికీ చెప్పాను తోటకెళుతున్నామని " అన్నాడు ప్రకాశరావు 
"ఎన్ని రోజులు మకాం?" 
"తోట పని ఉంది. సుమారు వారం" 
''నెత్తిన పాలు పోశారు. పనిమనిషి ఊరికెళ్లింది. వారంపాటు రాదు'' 
"ఇహనేం...మరి అంత ఉత్సాహంగా లేవు ?" అన్నాడు ప్రకాశరావు . 
'అక్కడైతే పనివారు, తాజా కూరలు, రుచిగా వండిపెట్టే రాజప్ప భార్య రేణుక. 
హాయిగా తోటలో గడపవచ్చు. కానీ ఈసారి... ' ఆమె ఆలోచనకు అడ్డుతతగుల్తూ "నిన్నతెచ్చిన సామానంతా కారులోనే ఉంది. తోట కిచెన్ లో  పప్పులు, పోపు, మసాలా దినుసులు నిండుకున్నాయట. 
తోవలో  కొనుక్కెళదాం. తీసుకెళ్లే బట్టలు, పుస్తకాలు సదురు" అన్నాడు  ప్రకాశరావు.
"వెళ్లిన ప్రతిసారి చెబుతూనే వున్నాను. అక్కడ అల్మెరాలో నెలరోజులకు సరిపడా ఇద్దరివీ బట్టలున్నాయి. మనమేనా? ఇంకెవరైనా వస్తున్నారా?"
"ఈసారి పరమహంస ఫ్యామిలీతో వస్తున్నాడు. రెండ్రోజులుండి వెళతారు"
"పరమహంస గారా ? ఆయన సిటీ కి వచ్చాడేంటి ?" 
"అవును ఇందూ! వాళ్ళు కూతురి ఫ్లాట్ లో దిగారు! పోయిన్నెల పూనాలో ఆక్సిడెంట్ లో కూతురూ అల్లుడూ ఇద్దరూ పోయారు తెలుసుగా. మనవడు, మనవరాలు దిక్కులేకుండా అయ్యారని పుట్టెడు దుఃఖ్ఖంలో ఉన్నాడు. పసి పిల్లల భవిష్యత్తు గురించి క్షోభ పడుతున్నాడు. రెండ్రోజులు టెన్షన్ కి దూరంగా వుంటారని నేనే రమ్మన్నాను"
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ! ... సారీ! పిల్లల గురించికాదు నేననేది"
"తప్పు ఇందూ! ప్లీజ్..ఎవరిగురించైనా సరే ఆలా మాట్లాడకు. అతన్ని ఎంతకాలం ద్వేషిస్తావు ? ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు! మనం నోటికి పనిచెబితే మనకే నష్టం. నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎవరిపట్ల దుర్భాష, పరుష వ్యాఖ్యలు వద్దని! మనం ఆతిధ్యమిస్తున్నామన్న విషయం గుర్తుంచుకుని హుందాగా మసులుకో!" భార్యని సున్నితంగా మందలిస్తూ గట్టిగా అన్నాడు ప్రకాశరావు. 
'పరమహంస కాదు... పరమహింసగాడు' కసిగా మనసులో అనుకుంటూ. 
"ఆయన సరే! ... రాఘవరావుగారు వాళ్ళు అమెరికా వెళ్లారుకదా. ఆర్నెల్లు ఉంటామంది వాళ్ళావిడ పోయినసారి కలిసినప్పుడు ... ఇంతలోనే వెళ్లడం... తిరిగి రావడం కూడా అయిందా !? 
ఆశ్చర్యంగా అంది ఇందుమతి. 
"వచ్చి కూడా వారం రోజులయింది" 
"ఎందుకు అంత త్వరగా తిరిగి వచ్చారు ?"
"ఉండలేక వచ్చామన్నాడు రాఘవరావు!" 
"అమెరికాలోనా లేక కొడుకింట్లోనా ?"
ప్రకాశరావు 'మౌనం' లోనే ఆమె సమాధానం వెతుక్కోవాల్సి వచ్చి 
"దట్  స్పీక్స్ వాల్యూంస్ ..." అంటూ లోనికి వెళ్ళిందక్కడ నుంచి ఇందుమతి. అన్నీ సదురుకుని అర్ధగంటలో బయలుదేరి, కిరాణాషాపులో కావలసిన సామాను తీసుకుని తొమ్మిదిన్నర కల్లా తోటకు చేరారు వారిద్దరు.    
                                                                 * * * * *
 ప్రకాశరావు జైళ్ల అధికారిగా రిటైరయ్యాడు. వయస్సు అరవై ఎనిమిది నిండాయి. ఇద్దరు కొడుకులు. ఇద్దరు అమెరికాలోనే సెటిలయ్యారు. తనది మంచి ఆరోగ్యం. వివాదరహితుడు. సాత్వికుడు. నిజాయితీకి మారుపేరు. 
'ఈ డిపార్టుమెంటు కెందుకువచ్చావయ్యా మా ప్రాణంతీయడానికి' అని విసుక్కునే వారతనిపై   అధికారులు. రిటైర్ కాకముందే సిటీకి కొద్ది దూరంలోఉన్నఆరెకరాల మెట్టభూమిని తోటగా అభివృద్ధి చేశాడు. పెద్ద హాలు రెండు గదుల, కిచెన్ తో ఫార్మ్ హౌస్  కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక తరుచుగా అక్కడే ఉండడం, వ్యవసాయం, తోటపని చేసుకోవడం, అప్పుడప్పుడు స్నేహితులికి, దగ్గరి బంధువులకు తోటలో ఆతిధ్యమివ్వడం అలవాటయ్యింది.  
తోట ఆదాయంలో సింహభాగం ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తాడు. కూరగాయలు, పళ్ళు వృద్ధాశ్రమాలలో పంచడమే కాదు. రాత్రుళ్ళు అన్నార్తులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు పంచడం అలవాటు. కుడిచేత్తో చేసేది ఎడం చేతికి తెలవద్దు అనేవాడు. ఆర్భాటాలు గిట్టవు.
'డౌన్ టు ఎర్త్ ' మనిషి ప్రకాశరావు. 
                                                                   * * * * * 
తోటకి చేరుతూనే ఏర్పాట్లన్నీ పరిశీలించి తోటలో అలా తిరిగి వచ్చేసరికి పరమహంస కారు పార్క్ చేస్తూ కన్పించాడు. ఇంతలో రాఘవరావు ఏదో అర్జెంటు పనివచ్చి రావడంలేదని ఫోను చేయడంతో వంటవారికి చెప్పి వచ్చాడు ప్రకాశరావు.  
                                                                   * * * * * 
పరమహంస మొదటి భార్య వంటింట్లో వంట గ్యాస్  లీకయి  సిలిండరు పేలి చనిపోయింది. ఆసమయంలో పరమహంస ఇంట్లో లేడు. పోలిసువారు మొదట్లో పరమహంసను అనుమానించినా తరువాత ఏక్సిడెంటల్ కేసుగా పరిగణించారు. కేసు క్లోజయింది.  
ఏడాది తరువాత పరమహంస రెండో పెళ్లి చేసుకుని సిటీ నుంచి  ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే జిల్లాకు వెళ్ళాడు. మళ్ళీ సిటీకి రావడం ఇప్పుడే!.   
అప్పట్లో, పరమహంస భార్యను విపరీతంగా టార్చర్ పెట్టేవాడనే అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆయన 'పరమహంస' కాదు 'పరమ హింస' గాడనుకునేవారు క్వార్ట ర్స్ లో కొందరు. అందరితో బాటే తనూ పరమ 'హింస' గాడనుకునేది ఇందుమతి. 
                                                                   * * * * *
చనిపోయిన ఇందిర పరమహంస మొదటి భార్య. క్వార్టర్స్ లో పక్క పక్కఇండ్లలో  ఉండడంతో ఇందుమతికి, ఇందిరకు మంచి స్నేహం కుదిరింది. పరమహంస భార్యను 'ఇందూ' అని పిలిచేవాడు. దాంతో  ప్రకాశరావు భార్యను పూర్తిపేరుతో పిలవడం అలవాటు చేసుకున్నాడు. ఇందుమతి, ఇందిరా ఖాళీ సమయాల్లో సినిమాలు, షాపింగులకు కలిసి తిరిగేవాళ్లు. దాదాపు పాతిక, ముప్ఫై సంవత్సరాల తరువాత పరమహంసను, ఆయన రెండో భార్యను కలవబోతోంది. ఇందిరతో పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ  కలవరపెడుతున్నాయామెను. 
భర్త మందలించాడని సైలెంట్ గా ఉంది. అయినా ఇందుమతి ఎక్కడ నోరుజారుతుందేమోనని ప్రకాశరావు భయపడుతునే ఉన్నాడు. 
పరమహంస పెద్ద వయసులో తనకొచ్చిన సమస్యని పంచుకుని, సలహా కోసం వస్తున్నానన్నాడు. అందుకే కాదనలేక పోయాడు ప్రకాశరావు. ఈ సమయంలో ఇందుమతి పాత విషయాలు ప్రస్తావించడం బావుండదని ప్రకాశరావు భావన. భార్య సంగతి తెలుసు. ఆమె ఓ ఫెమినిస్ట్. 
ఈమధ్య అఫెన్సివ్ గా ఉంటోంది. ఆడవారిని కించపరిచే వారినెవరిని స్పేర్ చేయడంలేదు. అపరకాళిలా విరుచుకుపడుతోంది. 
మొన్నీమధ్య మొగుడు కొట్టాడని పనిమనిషిచెప్పడమే తరువాయి, ఆమెను పోలీసుస్టేషన్ తీసుకెళ్లి మరెట్టా వాడికి వార్నింగ్ ఇప్పించింది. 
అప్పట్లో పరమహంస మొదటి భార్య చావుకు పరోక్షంగా అతనే కారణమని, చట్టానికి దొరక్కుండా వ్యవహరించాడని వాళ్ళు, వీళ్ళు అనడం విని వాదనకు దిగేది భర్తతో.
                                                              * * * * *
పరమహంస వస్తూనే భార్యను పరిచయం చేశాడు 'పద్మ' అంటూ. 
"మిమ్ముల్ని ఇంతవరకు కలవనే లేదు" అంది ఇందుమతి. 
"ఎన్నిసార్లు చెప్పినా తనింతవరకు ఏ స్నేహితుల ఇళ్లకు  రాలేదు" అన్నాడు పరమహంస. 
"అవును రాలేదు" అంది పద్మ మెల్లగా. 
'ఈమెను ఎక్కడో, ఎప్పుడో చూసినట్లనిపిస్తోంది' అనుకుంటూ "ఇట్స్ ఓకే. లెట్స్ గో ఇన్ " అంటూ వారితో లోనికి నడిచింది ఇందుమతి. టీ, బిస్కట్స్ అవుతూనే ఆడవారు, మగవారు విడిపోయి ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో తోటంతా కలియ తిరిగారు. బత్తాయి చెట్లు మంచి పూత మీదున్నాయి. పండ్లలాగే పూలు కూడా ఎంతోదూరానికి సువాసనలు విరజిమ్ముతూ  పరిమళభరితంగా ఉన్నాయి. చూస్తుండగానే నల్లటి మబ్బులు కమ్ముకుని వాతావరణం ఆహ్లాదంగా మారింది. చిరుజల్లు మొదలయింది. చినుకుల్లో తడుస్తూ ఫార్మ్ హౌజ్ కి చేరి కబుర్లలో పడ్డారు. 
వేడి టీ  రావడంతో తాగుతూ కబుర్లలో పడ్డారు మగవారు. .  
"చెప్పండి ... పిల్లలు ఎలా ఉన్నారు? పెద్దవాళ్ళం ఎలాటి ఆటు పోట్లనైనా తట్టుకోగలం. పసికూనలు. మీరే ఇక వారికి సర్వస్వం !" అన్నాడు ప్రకాశరావు.  
పెద్ద నిట్టూర్పు విడిచి "ప్రస్తుతం ఇద్దరూ వాళ్ళ నానమ్మ, తాత దగ్గర ఉన్నారు. వాళ్లిద్దరూ బాగా పెద్దవారు. ఉన్న ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వీళ్లూ, అక్కడే సెటిలయ్యారు. కొడుకు, అదే మా అల్లుడు పోవడంతో వచ్చారు. అత్త, చిన్నమ్మ, బాబాయి పిల్లల్నిపెంచడం మావల్ల కాదన్నారు. ఇక మాకు తప్పిందికాదు. జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. మేమూ పెద్ద వాళ్లమయ్యాము. 
రేపనే రోజు తలుచుకుంటే వెన్నుల్లోంచి భయం తన్నుకొస్తోంది. పద్మ ఖచ్చితంగా నావల్ల కాదంటోంది. అయినా, వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో ... పిల్లల భవిష్యత్తు ఏమిటో నని బహు బెంగగా ఉంటోంది. రాత్రిళ్ళు  నిద్రకరువయింది" అన్నాడు పరమహంస ప్రకాశరావు వంక దీనంగా చూస్తూ. 
"నీ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం 'పరం'! ...  'కాలం'... కాలమే సమాధానం చెప్పాలి. 
మనం నిమిత్త మాత్రులం. ఊహించనిది జరిగింది. ఇలాటి ఘోర విపత్తు నీ జీవితంలో రెండో సారి వచ్చింది! కాలంతో కలిసి పోవడం తప్ప నీకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మొదటిసారి శక్తి నిచ్చిన భగవంతుడు ...  ఇప్పుడూ నీతో ఉంటాడు. ఎప్పుడెలాటి సాయం కావాలన్నా చెప్పు. నాకు చేతనయింది చేయడానికెప్పుడూ సిద్ధం" అన్నాడు ప్రకాశరావు. 
కళ్ళ నీరు తుడుచుకుంటూ "అందుకే ప్రకాశం నీ దగ్గరికి వచ్చాను. నాకు కొండంత ధైర్యం వచ్చింది. థాంక్స్!" అన్నాడు ప్రకాశరావు రెండు చేతులు పట్టుకుని, కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని కప్పిపుచ్చుతూ. 
"ఇంకొక విషయం. పిల్లల్ని గారాబం చేయవద్దు. చదువు విషయంలో ఏమాత్రం ఉపేక్ష వద్దు" అన్నాడు రాఘవరావు. 
"ఈ విషయాలు తప్పక పాటిస్తాను'' అన్నాడు పరమహంస.  
రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి. 
                                                                       * * * * *
పరమహంస, పద్మ బయలుదేరారు. వారు కారు ఎక్కుతున్నప్పుడు 
"పద్మగారూ! రెండురోజులనుంచి ప్రయత్నం చేస్తుంటే నాకిప్పుడు గుర్తుకి వచ్చింది. మీరు ఇందిర కజిన్ కదా! ఆక్సిడెంట్ ముందు రోజు ఇందిరవాళ్ళింటికి వచ్చివెళ్లారు. ఇందిర మిమ్ముల్ని నాకు పరిచయం చేసింది గుర్తుందా? 
ఆరోజు తనకి  తలనొప్పిగా ఉంటే మీరు మంచి టీ పెట్టి ఇచ్చావని కూడా అంది ఇందిర. 
పరమహంసగారు అసలు మిమ్ముల్ని పెళ్లి చేసుకోవలసిందని, ఏవో కారణాలచేత  పరమహంసగారితో మీపెళ్లి తప్పిపోయిందని కూడా ఇందిర నాతో చెప్పింది" కూల్ గా అంది ఇందుమతి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. 
పద్మ మౌనంగా పరమహంస వంక చూస్తూ హ్యాంకీతో నుదురు మీద పట్టిన చిరు చెమట తుడుచుకుంది.  
"వెళ్లొస్తాం" అని కారు స్టార్ట్ చేశాడు పరమహంస.
  
                                           * * * * *    అయిపోయింది     * * * * *

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు :9849118254







16, మార్చి 2026, సోమవారం

పునరుక్తం

                                                                        పునరుక్తం
                                                                      -----------------
                       
                                                                       
పెళ్లయిన నెలరోజుల్లోనే తన అల్లరి చిన్నకూతురు 'అక్షర' అత్తారింట చక్కగా ఇమిడి పోయిందన్న కబురు. అందునా వియ్యపురాలి నోటివెంట ఆమాట వినడం ఒకింత సంతోషాన్నిచ్చినా, రాగిణికి  కూతురు కాపురానికి వెళ్లిన నాటి నుంచి ఏదో వెలితి.   
ముప్ఫై ఏళ్ల వైవాహిక జీవితం. మంచి భర్త. ఇద్దరు పిల్లలు. వారి చదువులు, ఉద్యోగాలు.పెళ్ళిళ్ళయి ఎటువారటు వెళ్లిపోయాక, ప్రస్తుతం ఇంట తను, వయసు మీదపడి రోజుల్లో పడిన కుక్క పైలట్.  భర్త రాఘవ ప్రస్తుతం విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. రెండు వారాలకొకసారి హైదరాబాద్ వచ్చి వెళుతున్నాడు. తిరిగి హైదరాబాద్  ట్రాన్స్ఫర్  కావడానికి నాలుగయిదు నెలలు పడుతుంది. పెద్ద కూతురు ఆకర్ష  ఫామిలీ న్యూజిల్యాండ్ లో సెటిలయింది. 
సిటీ పొలిమేరల్లో చిన్న కాలొనీ లో కట్టుకున్న ఇల్లే తన ప్రపంచం. వేరే వ్యాపకం లేక మనసు చంచలంగా ఉంది. ఈనాడు దినపత్రిక పట్టుకుని పట్టుమని మొదటి పేజీ పూర్తిగా చదవకనే పక్కన పడేసింది. 
తన కుటుంబం ఓ ట్రాన్సిషన్, మార్పులో పయనిస్తున్నదన్న విషయాన్ని మరిచి తన
అస్థిత్వాన్ని తనే అప్రయత్నంగానే ప్రశ్నించుకోసాగింది. 'ఐడిల్ మేన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్  షాప్' అని 'సెయింట్ జెరోమ్' ఆషామాషీగా అనలేదు. 
పాతికేళ్ల క్రితం కుటుంబం కోసం, పిల్లల కోసం తను ఉద్యోగం మానేయకుండా ఉన్నట్టవుతే ... తనకంటూ వేరొక ప్రపంచం, స్నేహితులు, సరదాలు ఉండేవి కదా...  అన్న నిగూఢ భావన ఆమె మదిన గాఢంగా తిరుగాడింది. ప్రపంచం శూన్యమయినట్లుగా నిస్పృహ. మనసును నియంత్రించ లేక కళ్ళు మూసుకుని సోఫాలో జేరగిలి పడుకుంది రాగిణి. 
సోఫా అంచున కింద పడుకున్న పైలట్ లేచి అతికష్టం మీద సోఫా పైకెక్కి రాగిణి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది. 'గుడ్ బేబీ' అంటూ దానిని తట్టి, మెల్లగా నిమిరింది. 
"ఇక కొద్ధి రోజులేనమ్మా....బాగా చూసుకోండి!" అని 'వెట్'  చెప్పిన మాటలు గుర్తొచ్చి మరింత భావావేశానికి లోనయింది రాగిణి. ఆమె కంట జారిన నీటి చుక్క పైలట్ కంటి నీటి ధారతో కలిసింది.     
                                                                       * * * * *
గోడ గడియారం వంక చూసింది రాగిణి. ఎన్ని గంటలు పైలట్ తలను ఒళ్ళో పెట్టుకుని అలా కూర్చుందో తెలియనే లేదు. సాయంత్రం ఆరు గంటలు దాటింది. చీకటి మెల్లగా వెలుగును కబళిస్తోంది. చీకటికి తోడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 
                                                                       * * * * *
చిన్న కూతురు అక్షర పెళ్ళికుదిరాక  రెండు, మూడు నెలల ముందు నుంచీ వీలైనప్పుడల్లా తనూ, అక్షర ఇద్దరూ స్కూటీ మీద వెళ్లి పెళ్లి షాపింగ్, బయట లంచ్...తీరికలేని క్రితపు రోజులు ఒక్కొక్కటీ గుర్తుకి వస్తూ ఆమె మనసు కొద్దిగా తేరుకుంది. 'ఇలా అవుతే కుదరదు. లైఫ్ ఈజ్ టు లివ్....'  అనుకుంటూ ఉత్సాహం తెచ్చుకుంది. భర్త పడుతున్న కష్టాన్ని గుర్తుకు తెచ్చుకుంది. అక్షర  వస్తానన్న విషయం గుర్తుకు వచ్చి పైలట్  తలను దిండు మీదుంచి లేచి హాల్లో లైట్  వేసింది. .   
                                                                      * * * * *  
ఆ రోజు ఉదయాన్నే అక్షర ఫోను చేసింది. 
"అమ్మా! వీలవుతే, సాయంత్రం అటుగా వస్తే, నేను, ఆదిత్య డిన్నర్ వస్తాము. వచ్చేది, రానిది సాయంత్రం కన్ఫర్మ్ చేస్తాను" అంది అక్షర. 
ప్రాణం లేచి వచ్చింది రాగిణికి. కాసేపు పిల్లలతో గడవచ్చని. సాయంత్రం ఆరు గంటలు దాటింది. 
కూతురి ఫోను కోసం ఎదురు చూస్తోంది. వారు వస్తానంటే వంట చేయాలి. తనే కూతురికి ఫోను చేద్దామని ఫోను చేతికి తీసుకున్నవెంటనే 
"అది అత్తవారింట సెటిల్ కావాలి. మనం దానికి తరుచుగా ఫోను చేయవద్దు" అక్షర మూడు నిద్రలకు వెళ్లిన రోజు భర్త అన్న మాటలు గుర్తుకి వచ్చి ఫోను పక్కన పెట్టేసి టి.వి ఆన్ చేసింది రాగిణి. వెంటనే ఫోను మోగింది. రాఘవ దగ్గరనుంచి ఫోను. 
"మీరా..." అంది రాగిణి. 
"... ఎవరి ఫోనుకోసమైనా ఎదురు చూస్తున్నావా?" మృదువుగా అడిగాడు రాఘవ 
"సారీ! చిన్నది ఉదయమనగా ఫోను చేసింది. వీలవుతే అల్లుడిగారితో డిన్నర్ కి  వస్తామని...ఇంతవరకు ఫోనూ లేదు. వాళ్ళూ రాలేదు. దాని ఫోనుకోసం ఎదురుచూస్తుండగా మీ ఫోను వచ్చింది. అందుకే అలా అన్నాను" నిర్లిప్తంగా అంది రాగిణి. 
"ఓ! అదా సంగతి. అయితే ఫోను పెట్టేస్తాను. అది ఫోను చేస్తుందేమో. తరువాత ఫోను చేస్తాను" హడావుడిగా ఫోను పెట్టేశాడు రాఘవ. 
'అయ్యో! అనవసరంగా ఆయన మనుసు బాధ పెట్టినట్లున్నాను' అనుకుంటుండగానే మళ్లీ ఫోను మోగింది. ఫోను రిసీవ్ చేసుకుంది రాగిణి. 
"అమ్మా! మేము ఎనిమిదింటికి వస్తాము. డిన్నర్ చేసి వెంటనే వెళతాము'' మారు మాట్లానివ్వకుండానే ఫోను పెట్టేసింది అక్షర. 
టైం చూస్తూ వంటింట్లోకి నడిచింది రాగిణి. వంటముగిసే సరికి ఎనిమిది అయింది. 
త్వరత్వరగా స్నానంచేసి బట్టలు మార్చుకుని టేబుల్ మీద డిన్నర్ సదిరి, టి వి ఆన్ చేసి అలా కూర్చుందో లేదో ఇంటి ముందు కారాగిన శబ్దం విని బయటకు వచ్చింది. 
అక్షర, భర్త ఆదిత్య కారు దిగి వస్తున్నారు. 
తల్లిని చూస్తూనే చెంగున వచ్చి "మిస్ యూ మామ్!"  
అంటూ గట్టిగా కౌగలించుకుని కాసేపు పైలట్ దగ్గర కూర్చుని లేస్తూ  "ఇన్నిరోజులకు డాడీ మూడు, నాలుగు సార్లు ఫోను చేశారు. నువ్వూ అంతే! నన్ను అప్పుడే మరిచిపోయారు" అంది డైనింగ్ టేబుల్ వైపు నడిచి వంటగిన్నెల మూతలు తీసి చూస్తూ. 
"ఆకలి దంచేస్తోంది. చేమగడ్డ వేపుడు, గోంగూర పచ్చడి...వావ్ ... ఆదిత్యా త్వరగా రా... నువ్వు వడ్డించమ్మా! తిని త్వరగా వెళ్ళాలి" గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది అక్షర. 
"అదేమిటే !? చెప్పుల్లో కాళ్లు పెట్టుకుని వచ్చారు" అంది రాగిణి ఇద్దరికి వడ్డిస్తూ. 
"లేదమ్మా! అంత టైం లేదు. త్వరగా వెళ్ళాలి" అంది అక్షర.  
"మీరుకూడా కూర్చోండి అత్తయ్యా!" మర్యాదగా అన్నాడు ఆదిత్య 
"నువ్వెంత అడిగినా అమ్మ మనతో కూర్చోదులే. నువ్వు కూర్చో!" ఆర్దరు వేసింది ఆకర్ష. 
"ఏంటా...ఏకవచనం మాటలు?" కూతురిని సున్నితంగా మందలించింది రాగిణి. 
భోజనాలవుతూనే బయలుదేరారు కూతురు, అల్లుడు. 
"అప్పుడే వెళతారా ? కాసేపు కూర్చోండి. డాడీ ఫోనుచేస్తానన్నారు" అంది రాగిణి 
"లేదమ్మా! త్వరగా వెళ్ళాలి. అత్తయ్యగారొక్కరే ఉన్నారు ఇంట్లో ..." అంది అక్షర.
"అవును కదా! మరిచిపోయాను" అంది రాగిణి.  
"అత్తయ్యగారు ఒక్కత్తి అసలు ఉండలేరు. నీ అంత ధైర్యవంతురాలు కాదావిడ ..." మళ్ళీ అంది ఆరిందలా అక్షర.   
పాతికేళ్ల క్రితం పుట్టింటినుంచి అత్తారింటికి వెళుతూ, నాలుగురోజులు ఉండమన్న అమ్మతో తనన్న మాటలు యధాతథంగా కూతురి నోట పునరుక్తం కావడంతో కూతురి వంక విస్మయంగా చూస్తూ ఉండిపోయింది రాగిణి.    
                                            ---------------------- xxx---------------------                  
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు :9849118254
  

                                                                          
 

  రవళి - మెరుపు కథలు - ఫలితాలు

రవళి ఆహ్వానించిన మెరుపు కథలు అంశానికి విశేషమైన స్పందన వచ్చింది. మొదటి జల్లెడ తర్వాత ఇద్దరు న్యాయనిర్ణేతలు  ప్రత్యేక సంచికకై ఎంపిక చేసిన కథలతో పాటుగా చీఫ్ ఎడిటర్ , మేనేజింగ్ ఎడిటర్  మరికొన్ని ప్రామాణికమైన కథలను రవళి లో ప్రచురణకు ఎంపిక చేసారు. 
రవళి ప్రత్యేక సంచికలో కొన్ని ( అన్నీ వేయడానికి పుస్తకం పేజీల సంఖ్య వల్ల కుదరదు కదా ! ) ఆపై ప్రతీనెలా కథలు వరుసగా ప్రచురణ అవుతాయి. This order of stories is random order, number of the story mentioned is not rank! Please note ! 

కథకులకు అభినందనలు
న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు

ప్రచురణకు ఎన్నికైన కథకులు -శ్రీ /శ్రీమతి ---కథలు 

1. మల్లాప్రగడ రామారావు - తగిన శాస్తి 
2. నాగమంజరి గుమ్మ- ఆదివారం మసాలా 
3. సరస్వతి కరవది - సమయానికి తగు
4. రేణుక జలదంకి - కాటరాక్ట్ 
5. ఉప్పలూరి మధుపత్ర శైలజ-వికలాంగులెవరు 
6. కెవి లక్ష్మణరావు - టామ్ అండ్ జెర్రీ 
7. పారుపల్లి అజయ్ కుమార్ -టిట్ ఫర్ టాట్ 
8. కట్టా రాంబాబు 
9. సి యమున. మధురం 
10. పి ఆమరజ్యోతి - నాకునీవు నీకునేను 
11. సంధ్యాశర్మ - చీడ పురుగు 
12. బసు పోతన - పాత్ర 
13. మంగు కృష్ణకుమారి - మాయం 
14. జి ఎస్ జి కృష్ణమాచార్యులు - చివరి నవ్వు 
15. టి శ్రీనివాసరావు - నాలుగు బిల్లులు కథ 
16. దినవహి సత్యవతి - చిన్న పిల్లాడు 
17. బలభద్రపాత్రుని ఉదయశంకర్ - గరుడాచల గమకాలు 
18. గండ్రకోట సూర్యనారాయణ శర్మ - ఇచ్చోటనే
19. సింహప్రసాద్ -కర్త కర్మ క్రియ 
20. కవిత బేతి - వర్క్ ఫ్రమ్ హోమ్  
21. పూజితా చరణ్ - వల 
22. జి ఎన్ వి సత్యనారాయణ - పాత డైరీ 
23. శ్రీ చరణ్ మిత్ర- అర్థ విజేత
24. కేశిరాజు వెంకట వరదయ్య - పునరుక్తం 
25. గొర్తి వాణీ శ్రీనివాస్ - మనోద్వారాలు 
26. చలపాక ప్రకాష్ - కన్నీటి బొట్లు 
27. మేడా మస్తాన్ రెడ్డి - టక్కు టమారం 
28. సి హెచ్.నాగార్జున శర్మ - వాణ్ణి పిలవమంటావా !
29. రాజేశ్వరి దివాకర్ల - చిట్కా చికిత్స 
30. జ్యోతి మువ్వల - డియర్ ఫ్యామిలీ 
31. లింగంనేని సుజాత -బంధం 
32. వి శ్రీనివాస మూర్తి -అంతా ఆనందమయం 
33. ఎం ఆర్ వి సత్యనారాయణ మూర్తి - బంధం 
34. వాడపల్లి పూర్ణకామేశ్వరి -పునర్జన్మ దాత 
35. మంగారత్నం పి - ఓ జీతం రోజు 
36. శింగరాజు శ్రీనివాసరావు -శిక్ష 
37. నిష్ఠల సుబ్రహ్మణ్యం - మెరుపు కథ 
38. బివిడి ప్రసాదరావు - చిన్నబోయాయి 
39. నన్ద త్రినాథరావు - నిరీక్షణ 
40. శ్రీపతి లలిత - కుదిరింది పెళ్లి 
41. వివివి కామేశ్వరి - ఆపద్బాంధవుడు 
42. వీణా మునిపల్లె - ఋణానిబంధ రూపేణా 
43. సింహాద్రి నాగ శిరీష - ముసుగు 
44. గడ్డం దేవీప్రసాద్ - డార్లింగ్ 
45. రావుల కిరణ్మయి - అర్చన 
46. ప్రమీలాశర్మ - పేపర్ బోయ్ 
47. రత్నాకర్ పెనుమాక - మున్ని 
48. బైతి దుర్గయ్య -స్వాతి ముత్యం 
49. నామాని సుజనాదేవి - కొత్త పాఠం 
50. కృపాకర్ పోతుల - మూడు రాత్రులు 
51. మాధవి బైటారు - అమ్మ ఎక్కడికి వెళ్ళింది 
52. మన్నవ సాయిరామ్ భార్గవి ప్రియ - షాక్ 
53. కలబరిగి భాను భూషణ్ - కిటికీలో చందమామ 
54. చంద్రకళ యలమర్తి - అభిలాష 
55. ఇంద్రగంటి నరసింహమూర్తి - ఐ లవ్ యూ డియర్ 
56. అ వే రా - ఇంస్టాగ్రామ్లో ఇష్టారాజ్యం 
57. డి వి డి ప్రసాద్ - ఆలస్యం 
58. పంతుల ధనలక్ష్మి - ఆ హ ని దినోత్సవం 
59. అనిశెట్టి శ్రీధర్ - మనసుకో దాహం
60. లక్ష్మీ మైథిలి - మానవత్వానికి చిరునామా 
61. మీనాక్షి శ్రీనివాస్ - పొలాల్లో ఇల్లు 
62. సుస్మితా రమణమూర్తి -గాన బ్రహ్మ 
63. పాట్నీడి వి వి సత్యనారాయణ - పెనుభూతం 
64. జీడిగుంట నరసింహమూర్తి -షాక్ 
65. బులుసు సరోజిని దేవి - అతి సర్వత్రా 
66. వెగ్గలం ఉషశ్రీ -బాధ్యత 
67. శానాపతి ( ఏడిద ) ప్రసన్నలక్ష్ని - ప్రేమ నాటకం 
68. కొత్తపల్లి రవికుమార్ -దొందూ దొందే 
69. లక్ష్మీనాయుడు లోగిశ -కొంచెం ఎక్కువ సమానం 
70. అరుణ సందడి -సాహసం చేయరా 
71. వల్లీశ్వర్ - బాలార్కలు ఇలా ఉంటారు 
72. నిష్ఠల కృష్ణవేణి - తోడు నీడ 
73. అర్చన కోవూరు - మూసిన పుస్తకం 
74. వీరేశ్వర రావు మూల -ఫుల్ స్టాప్ 
75. విజయ శ్రీముఖి - కాంతి రేఖ 
76. డా ఎం సుగుణరావు - జీవ ఫలం చేదు విషం 

ఇంకో రెండు కథలున్నాయి! కథకుల పేర్లు సరిగ్గా రాయలేదు. అవి కనుక్కుని ప్రకటిస్తాము!

This order of stories is random order, number of the story mentioned is not rank! Please note ! 

అందరికీ అభినందనలు! 

రామ్ & రవళి టీమ్


22, ఫిబ్రవరి 2026, ఆదివారం



       
   
                                                                    పాకెట్ మనీ  
                                                                 ---------------------  
       '' నాన్నగారు ఉదయం ఏడుగంటలనంగా వాకింగ్ కి వెళ్లారు ఇంకా రాలేదు.  పదిన్నరవుతోంది. రోజూ ఎనిమిదిన్నర తొమ్మిదింటి కల్లా వచ్చేస్తారు.
గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమోనని కూడా కనుక్కున్నాను, అక్కడా లేరు.
ఫోను కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. భయంగానూ, కంగారుగానూ ఉందమ్మా...నువ్వు మీఆయన త్వరగా రండి'' అని తల్లి విశాలాక్షి ఉదయం సరిగ్గా పది గంటలకు ఫోను చేయడంతో ఆఫీసులో పెర్మిషన్ తీసుకుని వెంటనే తల్లీ,తండ్రి ఉండే బాలాజీ అపార్టుమెంట్ కి వచ్చింది అర్పిత.
వస్తూనే తల్లితో మాట్లాడి అపార్ట్ మెంట్ లో తండ్రి రాఘవరావు 'వాకింగ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఇంటర్ కామ్ నుంచి ఫోన్ చేసి వారితో మాట్లాడి, రాఘవరావు మొబైల్ కి ఫోను చేసింది అర్పిత.
'ఫోన్ స్విచ్డ్ ఆఫ్' అని వాయిస్ మెసేజ్ వస్తోంది.వెంటనే అపార్ట్ మెంట్ సెక్యూరిటీకి కూడా ఫోను చేసి ఆరా తీసింది.
''చూస్తనే ఉన్నమమ్మా పెద్దమ్మ చెప్పింరు…సార్ క్రింద ఎక్కడా లేరు. మాకెవరికైనా అగపడితే మీకు ఫోనుచేసి చెబుతమమ్మా" అని అన్నాడు మెయిన్ గేట్ సెక్యూరిటి గార్డ్.
ఇంతలో అపార్ట్ మెంట్ లో  నలుగురు వచ్చి వివరాలు కనుక్కుని ''ఎక్కడైనా కూర్చుని కబుర్లు చెప్పుకోవడమో లేక ఎవరైనా పాతఫ్రెండ్స్ కలిశారో లేక లైబ్రరీకేమైనా వెళ్ళారేమో మీరేమీ కంగారు పడకండి'' అని అమ్మకు  ధైర్యం చెప్పి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళారు. రాఘవరావు తో పరిచయంలేని వాళ్ళు అపార్ట్ మెంట్ లో చాల తక్కువేమో. ఆరోజు  ఆదివారం కావడంతో అపార్ట్ మెంట్ లో ఒక్కొక్కళ్ళు వచ్చి ఏమైందని ఆరాతీస్తూ ఫ్లాట్ బయట పెద్ద గుంపు తయారయింది.
రాఘవరావు తో వాకింగ్ కు వెళ్ళే ఫ్రెండ్స్ బయటకు వెళ్లి తిరిగి వచ్చి 'మాతో వాకింగ్ నుంచి తిరిగి వచ్చాక గేటు దగ్గరనుంచి ఎక్కడికెళ్లారో ఏమో ఎక్కడా కన్పించలేదమ్మా' అని చెప్పి వెళ్లారు.
                                                                     * * * * *
                 మధ్యాన్నం 12' గంటలయిందిఅర్పిత, భర్త శశాంక్ వెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇచ్చివచ్చారు. ఫ్లాట్ బయట ఒకళ్ళిద్దరు తప్ప అందరు వెళ్ళిపోయారు. అడపా తడపా ఎవరో ఒకళ్ళు రావడం 'సార్' వచ్చారా అని అడగడం గాని ఇంటర్ కామ్ లో గాని ఎంక్వయిరీ చేస్తున్నారు. రాఘవరావు వాకింగ్ వెళ్లి వచ్చే త్రోవలో ఆక్సిడెంట్ కేసులేమయినా ఉన్నాయా ? అని కూడా ఎంక్వయిరీ చేశారు. కేసులేమీ లేవని తెలిసింది. రాఘవరావుకు పడనివారంటూ  ఎవరూ లేరు. రిటైర్ అయికూడా పదేళ్ళయింది.రోజూ వాకింగ్ నుంచి అపార్టుమెంటుకి తిరిగి వచ్చాక ఇంకొద్దిసేపు వాకింగ్  చేయడమో లేక వాళ్ళతో, వీళ్ళతో బాతాఖాని వేయడమో గానీ చేసేవారు. ఆ విషయమై ఆయనతో భార్య విశాలాక్షికి తరచూ వాగ్వాదం జరుగుతుండేది.
బ్రేక్ ఫాస్ట్ టిఫెన్ చల్లారి పోవడంగాని లేక ఆయన టిఫెన్ ఆమె వంటకి అడ్డం రావడం గాని జరిగేది. అందుకే ఆయన్నివాకింగ్ అయ్యాక తిన్నగా ఇంటికి రమ్మని పోరేది విశాలాక్షి.
అయన ఆమాటను ఎప్పుడూ ఖాతరు చేయలేదు.    
'టైం' దాదాపు ఒంటిగంట అవుతోంది. రాఘవరావు ఇంటికి రాలేదు
పోలీస్ ఇన్స్పెక్టర్ 'సురేందర్' వచ్ఛి అపార్టుమెంట్ సెక్యూరిటీ వారితో, రాఘవరావు వాకింగ్ ఫ్రెండ్స్ తో మాట్లాడి వచ్చి ఫ్లాట్ ముందు గుమికూడిన వారితో కూడా మాట్లాడి ఇంట్లోకి వచ్చాడు
''ఏమీ కంగారు లేదమ్మా, వచ్చేస్తారు. రాఘవరావుగారితో నాకు కొద్ధి పరిచయముందమ్మా '' అంటూఅయన '' ఎవరైనా బంధువులుగానీ స్నేహితుల ఇండ్లకేమైనా వెళ్ళే చాన్సు ఉందామ్మా"? అనడిగాడు పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా ఫ్రెండ్లీగా.
''ఉహూ… ఎప్పుడూ అలా వెళ్ళలేదు.వెళ్ళరు. వెళ్తేచెప్పే వెళతారు. ఆయన ఫోను ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేయరు. టిఫెన్ చేయలేదు. స్నానం చేయలేదు. ఆకలికి ఆగే మనిషి కాదు.
ఏం మనిషో ఏమో, చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళారో, ఏమో ? ఇవతల మనుషులు కంగారు పడతారన్నధ్యాస కూడా లేకపాయే'' అన్నది విశాలాక్షి గద్గదస్వరంతో కళ్ళలో ఉబుకుతున్న కన్నీళ్లను చీర కొంగుతో ఒత్తుకుంటూ.
''అమ్మా ఏడవకు, ఇన్స్పెక్టర్ గారన్నట్లు బాబాయి ఇంటికి గాని లేక ఫ్రెండ్ ఇంటికేమైనా వెళ్ళేరేమో''? నేను శ్రీనివాస్ అంకుల్ కి నరేందర్ అంకుల్ కి ఫోను చేస్తాను'' అని పైకి గంభీరంగా అన్నా 'ఎక్కడికి వెళ్లి ఉంటారు' అనుకుంది అర్పిత మనసులో వ్యాకులపడుతూ.
''సార్ కి ఎవరితోనైనా శత్రుత్వం గానీ, ఏమైనా ప్రాపర్టీ గొడవలు గానీ, డబ్బు లావాదేవీలుగానీ ,
ఈ మధ్య గానీ, ఇదివరలో గానీ…సార్ ఎవరితోనైనా గొడవ పడ్డారా? 'అన్ వాంటెడ్ ఫోన్ కాల్స్ గానీ బెదిరిస్తూ ఫోన్లు ఏమైనా వచ్చాయా... కొద్దిగా గుర్తు చేసుకుని చెప్పండి'' ?  అన్నాడు కేసు పరిశోధనకు కావాల్సిన వివరాల్నిసేకరించే పనిలో పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్.
''లేదు బాబూ…మాకేమీ ప్రాపర్టీ గొడవలు లేవు. ఎవరి దగ్గర  డబ్బుఅప్పుగా తీసుకోవడం గానీ ఇవ్వడం గానీ లేదు. నెలనెలా పెన్షన్ వస్తుంది. కొద్దో గొప్పో రిటైర్మెంట్ డబ్బు బ్యాంకు లోనే
మా ఇద్దరి పేరా డిపాజిట్ చేశారు. ఉన్నది ఇదొక్కటే ఫ్లాట్. ఇంటా బయట ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు. ఎవరైనా గొడవ పడుతుంటే వాళ్లకి కూడా సర్ది చెపుతారు.
''అంతెందుకు...నీకు తెలుసో లేదో బాబూ'...ఆయన ఇక్కడి  'పోలీస్ స్టేషన్' కి కూడా ఒకటి రెండు సార్లు ఈ ఫ్లాట్స్ లో వాళ్ళు గొడవలు పడితే వచ్ఛి కేసు కాకుండా సర్ది చెప్పి వచ్చారు'' అంటూ సమాధానమిచ్చింది విశాలాక్షి.
''ఆ సంగతి నాకు తెలుసమ్మా. సార్ అలాగే నాకు పరిచయం అయ్యారు.అందుకే ఇందాక నేను వస్తూనే అన్నాను సార్ నాకు తెలుసునని'' అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్.
''అపార్ట్ మెంట్ లో ఎవరితో నైనా ఎప్పుడైనా గొడవపడ్డారా ? గుర్తు తెచ్చుకుని చెప్పండమ్మా'' అన్నాడు ఇన్స్పెక్టర్  మళ్ళీ గుచ్చి గుచ్చి అడుగుతూ.
''ఊహు… అలాంటిదేమీలేదు'' అంది అమ్మ నిక్కచ్చి గా.
''పొద్దుననంగా వెళ్లిన మనిషి రాలేదు.ఇక ఇప్పుడు...ఏం చేయాలి'' ? ఇన్స్పెక్టర్ గారూ
''ప్రాపర్టీ గొడవలు లేవు. ఎవరితోనూ గొడవలు లేవు. ఎవరినీ పల్లెత్తు మాట అనరట.ఇప్పటివరకూ నేను చేసిన ఎంక్వయిరీ లో అయన గురించి ఇక్కడున్న వారెవరూ చెడుగా చెప్పలేదు. ఆయన మీద అందరికీ గౌరవమే. ఆయన కనబడకుండా వెళ్ళడానికి ఏమీ 'లీడ్స్' కాని 'క్లూ గాని దొరకలేదు' అవి ఏమైనా దొరుకుతే కాని మా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అనుకోవడానికి ఎలాటి మోటివ్ గాని ఆధారం గానీ కనిపించడం లేదు. ఎటువంటి బెదిరింపు,డిమాండ్ ఫోన్ కాల్స్ రాలేదు.
కాబట్టి ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.ఆయన కెలాంటి ప్రాణభయం లేదు.సెక్యూరిటీ వాళ్ళతోనూ, అవసరమైతే ఆయన ఫ్రెండ్స్ తో మళ్ళీ మాట్లాడి వెళతాను'' అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ వెళుతూ చూడండమ్మా ''ఇప్పటివరకు నాకు చెప్పని కొత్త విషయం మీకేదైనా గుర్తుకు వచ్చినా, మీరింకేదైనా చెప్పదలుచుకున్నా నాకు వెంటనే ఫోను చేయండి'' అని నాన్నగారికి  సంబంధించిన  విషయాలన్నీ,రిటైర్మెంట్ కాకముందు ఆఫీసు విషయాలతో సహా అన్నీ వ్రాసుకుని తన పర్సనల్ ఫోను నంబరు ఇచ్చి వెళ్ళాడు ఇన్స్పెక్టర్.
ఆయన అటు వెళ్ళారో లేదో ''ఇదెక్కడి ప్రారబ్డమే తల్లీ... ఉన్నదేదో తింటూ ఎవరిమీద ఆధార పడకుండా మామానాన మేము బ్రతుకుతుంటే ఇదెక్కడి గొడవే తల్లీ'' అంటూ కూతురితో బాధ పంచుకుని కంట నీరు పెట్టుకుంది విశాలాక్షి.
''ప్రాణ భయం ఏమీ లేదన్నారు కదమ్మా ఇన్స్పెక్టర్ గారు.చూద్దాం సాయంత్రం వరకు'' అంటూ ఫోనునంబర్లు ఉన్న డైరీతీసి ఆయన పాత ఫ్రెండ్స్ కి, దగ్గరి బందువులకు ఒక్కొక్కరికీ ఫోనుచేసింది అర్పిత. ఒక్కరూ రాఘవరావు వచ్చారని చెప్పలేదు. తెలిసిన వారెవరి ఇండ్లకి రాఘవరావువెళ్లలేదన్న విషయం స్పష్టమైంది.ఇంటర్ కామ్ నిర్విరామంగా మోగుతూనే ఉంది.
'సార్' వచ్చారా లేదానని అపార్ట్ మెంట్ లో చాలామంది అడుగుతూనే ఉన్నారు.
విసుగొచ్చి కాసేపు ఫోను పక్కగా పెడితే ఒక్కొక్కళ్ళు స్వయంగా వచ్చి మరీ అడుగుతున్నారు.
ఇల్లంతా తిరణాలలా తయారయింది. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అర్ధం కావడంలేదు. ఆ అపార్టుమెంటు లిటిల్ ఇండియా... ''ఐసా కైసా హోగా అంకుల్ కె సాత్ 'ఇతనా ఆచ్ఛా ఆద్మీ హై ! ఆంటీజీ ' కుచ్ భీ హెల్ప్ హోనా జరూర్ పూచియే. 'హం పోలీస్ కె పాస్ జానే కేలియే భీ తయార్ హై. ఆప్ అకేలే నై హై" అంటూ కొందరు విశాలాక్షికి ధైర్యం చెబుతూనే ఉన్నారు.
''ఆంటీ, నేను పోలీస్ కమీషనర్ గారితో మాట్లాడాను.ఇంకాసేపులో 'సి.ఐ.డి' వాళ్ళు వస్తారు.
నేను వాళ్ళతో మాట్లాడతాను 'మీరేమీ కంగారు పడవద్దు. మన అపార్ట్ మెంట్ లో పెద్దాయన.'ఇలా మాయమవుతే మేమూరుకుంటామా '' ? అన్నాడు అమ్మతో అతని డాబు ప్రదర్శిస్తూ
శంకరరావు అదే ఫ్లాట్ లో ఉండే ఒక వ్యాపారవేత్త.      
                                                         * * * * *
సాయంత్రం నాలుగు గంటలు. ఇంట్లో ఎవ్వరూ ఏమీ తినలేదు. చుట్టుపక్కలవారు  టీ, కాఫీ తెచ్చిస్తున్నారు. ఎవరెవరో ఏదో ''ఫుడ్' తీసుకువచ్చి ఇంట్లో పెట్టి వెళ్లారు. ఇంకా తెస్తూనే ఉన్నారు. ఫుడ్ చాలా మంది తెచ్చారు' అని చెబుతే వాపసు తీసుకు వెళ్ళారు. అర్పిత కు  ఆకలేసి ఏదో కొద్దిగా తినేసింది. ఇన్స్పెక్టర్ గారికి ఫోను చేస్తే ఇంకా ఏమీ తెలియరాలేదని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పిఫోను పెట్టేశాడు. బాబాయిలు,అత్తలు,ఫ్రెండ్స్ ఒక్కొక్కరు దిగుతున్నారు.ఇల్లంతా ఒకటే సందడి, అల్లరి.
''వీరందరికీ  పడకలు,భోజనాలు ఎలాగా"? అని ఆలోచిస్తూ అదేమాట భర్త తో అంది అర్పిత.
''నువ్వేం కంగారు పడకు వాళ్ళు రాత్రికి ఉంటామంటే కొందరిని మనింటికి తీసుకు వెళ్దాం.  భోజనాలు బయటనుంచి తెప్పిద్దాం.కంగారేమీ లేదు'' అని ధైర్యం చెప్పాడు అర్పితకు భర్త శశాంక్. అది విన్నా స్థిమిత పడింది అర్పిత.
ఇంతలో ఎవరో ఇంటర్ కాంలో ఫోన్ చేసిరాఘవరావు ఉదయం నుంచి కనిపించడం లేదన్నవార్త, ఆయన ఫోటో ఏదో తెలుగు టి.వి లో వస్తోందని చెప్పిపెట్ట్టేశారు. మరుక్షణంలో తండ్రి గుర్తుకొచ్చి అర్పిత మనస్సులో తెలీని భయం, బాధ కలగలిపి కడుపులో వికారంగా అనిపించింది.
అర్పిత కళ్ళు మూసుకుని 'నాన్నగారు కనిపించకుండా పోవడమేమిటి' ?
ఆయన్ని అందరు అజాత శత్రువు' అంటారు. 'అంటే ఏమిటని' ఒక తాత గారిని అడుగుతే ఆయన చెప్పారు 'అజాత శత్రువు అంటే శత్రువు లేని వాడని అర్ధమని'...
'అలాంటాయనను ఎవరైనా కిడ్నాప్ చేశారా'? చేస్తే ఎందుకు చేసి ఉంటారు ?
అయన దగ్గర డబ్బూ లేదు,దస్కంలేదు.దన్నులేదు.
ఎవరి జోలికి వెళ్ళరు. తనకు మాలిన ధర్మమెక్కువ. చేతిలో డబ్బుంటే ఎంతో
కొంత ఎవరికైనా ఇచ్చిందాకా ఆయనకు నిద్ర పట్టదు. అల్జీమర్స్ లాంటి వ్యాధి ఏమైనా ఇంత సడెన్ గా ఒక్కరోజులో వస్తుందా ?  లేక ఈ పార్శం గాక నాన్నగారి జీవితంలో వేరే ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా ? మా దగ్గరేమైన దాచారా ?.ఏదో సినిమాల్లో చూసినట్లు…మనసులో పరిపరి విధాల పిచ్చి ఆలోచనలతో తల తిరిగి పోతోంది ఆర్పితకు .
''ఛా, ఛా…నాన్నగారి గురించా నేనిలా ఆలోచించింది. నాకేమాత్రం బుద్ధి లేదు.తప్పయింది''
తనలో తాననుకుంటూ  'ఠపా...ఠపా' మని అర్పిత లెంపలు వేసుకోవడం గమనించి
''అదేమిటే లెంపలు వేసుకుంటున్నావు, నీలో నీవే ఏదో గొణుక్కుంటూ'' అంటూ విశాలాక్షి,శశాంక్ అర్పిత దగ్గరిగా వచ్చారు ఆమెను వింతగా,పరీక్షగా చూస్తూ.
అప్పటికి గాని ఆమెకు అర్ధంగాలేదు తను అసంకల్పితంగా లెంపలేసుకున్నానన్నసంగతి !
                                                                  * * * * *
సాయంత్రం ఏడుగంటలవుతోంది. రాఘవరావు ఇంకా తిరిగిరాలేదు.
ఆయన మొబైల్ ఫోను స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తే వారూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఉదయం వచ్చిన శంకరరావు గారితో కలిసి 'పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్' అట, ఇంకొకతను 'మఫ్టీ' లో గంట క్రితం వచ్చి మళ్ళీ అన్నీ విషయాలడిగి రాసుకుని వెళ్ళాడు.
'రొటీన్ గా నైనా ఇంట్లో ఏమైనా మాట,మాట అనుకున్నారా? కోప తాపాలేమైనా వచ్చాయా'? డబ్బుకు ఏమైనా ఇబ్బంది ఉందా ?...
అలాగవుతే ఒకటి రెండు రోజుల్లో తిరిగి రావడం గానీ లేక చుట్టాల దగ్గర నుంచి ఫోను రావడంగాని జరుగుతుందని చెప్పి ఆయన 'విజిటింగ్ కార్డ్' ఇచ్చి ఏమైనా కొత్త సమాచారం తెలిస్తే వారిని ఫోను చేయమని చెప్పివెళ్ళాడు.
శంకరరావుగారు మళ్ళీ వచ్చి 'ఏం కంగారు పడకండి. అంకుల్ గారికేమీ కాదు.
క్షేమంగా తిరిగి వస్తారని' మాకు కొద్దిగా ఊరటగా మాట్లాడి వెళ్ళారు.
పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఇలా వచ్చి వెళ్ళాడో  లేదో ఉదయంవచ్చిన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేందర్ మళ్ళీ తిరిగి వచ్చి ''ఏమ్మా రెండు నిముషాలు మాట్లాడవచ్చా''? అని అడిగి లోనికి వచ్చి కూర్చుని ''ఉదయం నాన్నగారు అపార్ట్ మెంట్ కి తిరిగి వచ్చిన తరువాతనే ఎక్కడి కైనా వెళ్ళడం గాని ఎవరితోనైనా కలిసి వెళ్ళడం గానీ లేక తప్పిపోవడం గానీ జరిగి ఉండవచ్చు. అపార్ట్మెంట్ సెల్లారుతో సహా మావాళ్ళు అంతా క్షుణ్ణంగా వెదికారు.ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.  మా కమీషనర్ గారు కూడా ఎ.సి.పి గారికి ఈకేసు తనని స్వయంగా చూడమని ఫోను చేశారట.
ఇంతకుముందే ఎ.సి.పి గారు కూడా ఇక్కడికి వచ్చివెళ్ళారు. మీసెక్యూరిటీ టీమ్ తో మాట్లాడుతున్నాము. జరిగిన విషయాలన్నీ కలిపి ఆలోచిస్తే రాఘవరావుగారు ఎవరో తెలిసిన వాళ్ళతో  తన ఇష్టప్రకారమే వెళ్లారు అనుకోవడానికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే అపార్ట్ మెంట్ మెయిన్ గేటు దగ్గర అరడజను మంది గార్డులున్నారు. అక్కడ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమీ అనుమానాస్పద ఘటన జరగలేదు. దురదృష్టం ఏమిటంటే ఇక్కడ  సి.సి కెమెరాలు లేవు. అదీకాక నాన్నగారితో ఉదయం నడకకు వెళ్ళిన ఫ్రెండ్స్ తోనే నాన్నగారు గేటు దాకా తిరిగి వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి".
"సో ఈ కేసు...హండ్రెడ్ పెర్సెంట్ సార్ కి బాగా తెలిసిన వ్యక్తులు ఆయనను మభ్యపెట్టి తీసుకెళ్ళి ఉంటారన్నకోణంలో చూస్తున్నాము. అయితే అలా జరగడానికి 'మోటివ్' కావాలి. దానికి ఆయనకేమయినా పాత కక్షలేమైనా ఉన్నాయా,? అపార్ట్ మెంట్ లో ఎవరితోనైనా గొడవ పడ్డారా'? ఇది ఎవరి పని...అన్నది తెలుసుకోవడానికి  మీరు ఇచ్చిన 'ఇన్పుట్' ఇన్ఫర్మేషన్ తో ఏ 'మోటివ్'కన్పించలేదు. ఏదైనా విషయం నాదగ్గర దాచి ఉంటే ఇప్పటికైనా మీరు చెబుతే ఈ కేసు సాల్వ్ చేయడానికి సార్ ని త్వరగా 'ట్రేస్' చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి మళ్ళీ వచ్చాను'' అని చెబుతూ మా మొహాల వంక కుతూహలంగా, పరీక్షగా, పరిశీలనగా చూశాడు ఇన్స్పెక్టర్.సురేందర్.
''అయ్యో…ఇన్స్పెక్టర్ గారూ' నో..నో అలాంటిది నిజంగా ఏమైనా ఉంటే మీకు చెప్పకుండా
దాచివుంచాల్సిన ప్రసక్తే లేదు. అమ్మగాని, నేను గాని నాన్నగారితో గొడవపడే అవకాశమే లేదు. కోపంగా ఎవరైనా ఏమైనా అన్నా ఆయన చాలా  తేలిగ్గా తీసుకునే మనిషి. మీరు అనుమానించ దగ్గ విషయమేమీ జరగలేదు.'' అని నేను చెబుతుండగానే ''డాడీ ఆరోగ్యం ఎలా ఉంది.ఏమైనా అల్జీమర్స్ గానీ ఇంకేదైనా ఆరోగ్యం ప్రాబ్లం ఏమైనా ఉందా''? అనడిగాడు ఇన్స్పెక్టర్ సూటిగా.  ''సర్ …నిజానికి నాకూ అదే అనుమానం వచ్చింది. ఆయనకు అలాటి జబ్బు ఏదీ లేదు. ఆయన ఆరోగ్యం చాలా బాగుంది. ఆయన ఫ్రెండ్స్ ని కూడా ఇదే  విషయం ప్రశ్నించి చూశాను.
'అదేమీ లేదు ఉదయం వాకింగ్ నుంచి వచ్చినతరువాత కూడా గేటు దగ్గర కూడా నవ్వుతూ సరదాగా ఎప్పటిలానే  ఉన్నారని ఎలాంటి టెన్షన్ తో ఉన్నట్లుగా కూడాలేరని' వారు చెప్పారు.
''క్రితం వారం నుంచి టెలిఫోను కాల్స్ చెక్ చేశాము. మీకు, మీ అమ్మగారికి, వాళ్ళ తమ్ముళ్ళకు, ఇద్దరిఫ్రెండ్స్ తోను,ఇక్కడ అపార్ట్ మెంట్ ఆఫీసు వాళ్ళతోనూతప్ప వేరే అనుమానాస్పద కాల్స్ ఏమీలేవు.అంతా మిస్టరీగా ఉంది'' అన్నాడు ఇన్స్పెక్టర్ తల వంచుకుని ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా.
''ఇంకొక్కవిషయం మిమ్ముల్ని అడగడం మరిచాను'. ''సార్ కి వాళ్ళ అన్నదమ్ములతో గాని అక్క చెల్లెళ్ళతోగాని ఆస్తుల విషయంలోకానివేరే ఏవైనా ఇతర గొడవలేమైనా ఉన్నాయా ''? ఏదో ఆలోచిస్తూ అడిగాడు 'ఇన్స్పెక్టర్.
''లేదు. మా బాబాయిలందరికి నాన్నగారంటే చాలా ప్రేమ, గౌరవం. వాళ్లకి ఆస్తులే లేవు.అయినా అలాటి విషయమేఏదైనా ఉంటే మీకు ముందుగానే చెప్పేదాన్నికదా ఇన్స్పెక్టర్ గారూ'' అన్నాను నేను చాలా విశ్వాసంగా.
''సరేనమ్మా…ఇక వస్తాను. ఏది ఏమైనా రాఘవరావు గారు క్షేమంగా త్వరగా తిరిగి వస్తారన్ననమ్మకం నాకుంది. కంగారేమీ పడవద్దు'' అని చెప్పి మళ్లీ కలుద్దామని చెప్పి ఇన్స్పెక్టర్ తలమీద కేప్ సర్దుకుంటూ వడి వడిగా వెళ్ళిపోయాడు.
ఇన్స్పెక్టర్ గారు అంత ఖచ్చితంగా, ధైర్యంగా డాడీ త్వరలో తిరిగి వస్తారని అంటున్నారంటే పోలీసులకి ఏమైనా క్లూ దొరికిందా? దొరికితే ఇంకా మనల్ని ఇతర విషయాల గురించి ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరమేముంది.
'ఏమో'... ఏదైనా క్లూ కోసం పోలీసులు ఇలాటి ప్రశ్నలు వేయడం చాలా సార్లు చదివినట్లుగా గుర్తుంది. అంతా అయోమయంగా ఏదో మిస్టరీలా ఉంది.
నాన్నగారు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు మొక్కుకుని అలా సోఫాలో ఒరిగాను. అమ్మ గదిలో పడుకునే ఉంది. అత్తయ్యలు, బాబాయివాళ్ళు ఇంకో గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
                                                               * * * * *
రాత్రి 10 గంటల 30 నిముషాలు. 
దగ్గరికి వేసి వున్నబయట తలుపు నిశ్సబ్దంగా, మెల్లగా తెరుచుకుంది.
హలో సోఫాలో పడుకున్నఅర్పిత ఆత్రుతగా గుమ్మం వంక చూసింది. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది.
రాఘవరావు …తలుపు నెట్టుకుని  మెల్లగా లోనికి వచ్చారు.
'డాడీ' అంటూ ఉన్నపళాన లేచి రెండంగలలో దగ్గరికి వెళ్లి ఆయనను చుట్టేసుకుంది అర్పిత. ఆమె కన్నీళ్లు రాఘవరావు 'టీ' షర్ట్ ని తడిపేస్తున్నాయి.
''ఎవరికీ చెప్పకుండా 'ఎక్కడికెళ్ళారు? ఫోను ఎందుకు ఎత్తలేదు'' ? ఆప్యాయంగా అడిగింది అర్పిత ఆయన రెండు చేతులను పట్టుకుని ఆయన ముఖంవంక నిశితంగా పరిశీలనగా చూస్తూ... ఒక్కపూట కే గడ్డం మాసి, ఎడమ పక్కన మీసానికి చిన్నబ్రౌన్ కలర్ పేపర్ అంటుకుని ఉంటే తీసింది అర్పిత.
'అబ్బా' అన్నారు రాఘవరావు బాధగా మీసపు వెంట్రుకలకి అంటుకుని ఉన్న   
ఎధెసివ్ టేప్ ముక్కని అర్పిత ఒక్కసారిగా లాగడంతో.
అర్పితకు ఒక్కసారిగా తట్టింది ఆయన అరవకుండా నోటికి ఎవరో 'టేప్' వేశారని.
అంటేఆయనను ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేశారని అర్ధమయిందామెకు.
వెంటనే ఆయన ముంజేయి,చేతులు,మణికట్టు, కాళ్ళను పరిశీలనగా తడిమి చూసింది.
ఏదో తాడు వత్తుకుపొయిన గాట్లు, అక్కడక్కడ చర్మం ఎర్రగా కందిపోయి స్పష్టంగా కనిపించింది.
''ఏంటమ్మా...ఏం చేస్తున్నావు''? అంటూ సున్నితంగా నన్ను తప్పించుకుని లోనికి నడిచారు రాఘవరావు నింపాదిగా. ఆయన ముఖమంతా పీక్కు పోయింది.
తలమీద ఉన్న కొద్ది జుట్టు అస్తవ్యస్తంగా ఉంది. పొద్దున 'వాకింగ్' కి వేసుకెళ్ళిన జాగింగ్ 'పైజమా' 'టి షర్ట్' మీదనే ఉన్నారాయన. వెంటనే పోలీస్ స్పెక్టర్ ఫోన్ చేయాలనుకుంది అర్పిత ముందుగా నాన్నగారి సంగతి చూడడం ముఖ్యమని ఆయన చేయిపట్టుకుని సోఫాలో కూర్చొబెట్టి మంచినీళ్ళు ఇచ్చి 'గీజర్' ఆన్ చేసివచ్చి కొద్దిగా 'ఫ్రూట్ జ్యూస్' ఇచ్చాను.
ఆకలిగా ఉందేమో చప్పున జ్యూస్ త్రాగి గ్లాస్ తిరిగి ఇచ్చారు.
విశాలాక్షి ఆయన పక్కనే కూర్చుంది. ఆయన తమ్ముళ్లు, అక్కా, చెల్లెలు ఆయన చుట్టూ మూగి ఎక్కడికెళ్ళావని, మొబైల్ ఫోనుకేమయిందని ప్రశ్నలు మొదలెట్టారు.
పెద్దత్తయితే కళ్ళు తుడుచుకోవడం గమనించింది అర్పిత. వాళ్ళిద్దరి అనుబంధం గురించి తనకు తెలుసు. అందుకే పెద్దత్త దగ్గరిగా వెళ్లి డాడీవచ్చారు కదా అత్తా ఊరుకొమ్మని అనునయించింది. ఆమె తన ఎడం చేతిని అర్పిత భుజం చుట్టూ వేసి వీపు తడిమి వదిలింది.ఎంతో హాయిగా  అనిపించింది అత్త స్పర్శ ఆక్షణంలో అర్పితకు.
తోడబుట్టిన వారి అనుబంధం,ఆత్మీయత అంటే ఏమిటో చాలా దగ్గరిగా చూశాననిపించిండామెకు. ఇంతలో ఎలాతెలిసిందో ఏమిటో 'అపార్ట్ మెంట్ జనం ఒక్కొక్కళ్ళు వచ్చి పరామర్శించడం మొదలెట్టారు. పొద్దున్న మాట్లాడుదాం అని అందరికి చెప్పి తలుపులు వేసింది. ఇంటర్ కామ్ మోగుతూనే ఉంది.
బాబాయిని 'ఇంటర్ కాం' ఫోను దగ్గర కూర్చోబెట్టి చుట్టాలింటికి వెళ్లి వచ్చారని చెప్పమని
బాత్రూంలో వేడి నీళ్ళు బకెట్లోనింపడానికి వెళ్లి అక్కడినుంచే పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ''నాన్నగారు తిరిగి వచ్చారండీ''...అని నేను చెబుతుండగానే ''నాకు తెలుసమ్మా...నేనే ఇంటిముందు వదిలి వెళ్ళాను. ముందా పెద్దాయన సంగతి చూడమ్మా ... పాపం బాగా అలిసి పోయినట్లున్నారు. ఏదైనా కొద్దిగా తిన్నాక ఒక నిద్ర మాత్ర వేసి పడుకో పెట్టేసేయమ్మా"...
రేపుదయం ఒకసారి స్టేషన్ కి వచ్చి కలవమని చెబుతూనే గుడ్ నైట్ చెప్పి మారు మాట్లాడనీయకుండా ఫోన్ కట్ చేశాడు ఇన్స్పెక్టర్ సురేందర్.
అర్పితకేమీ అర్ధం కాలేదు.
'పోలీస్ ఇన్స్పెక్టర్ 'డాడీ' ని ఫ్లాట్ దగ్గర వదిలి ఇంట్లోకి రాకుండా వెళ్ళడం ఏమిటి?
అంత మిస్టరీ గా ఉంది. 'డాడీ' ని ఇప్పుడు వివరమడిగే పరిస్థితి లేదు. బాగా టైర్డ్ గా ఉన్నారు.
ఇన్స్పెక్టర్ చెప్పినట్లు ఆయన ఏదైనా తిన్నాక, నిద్రమాత్ర ఇచ్చి పడుకోమని చెప్పాలి' అనుకుంటూ వెనక్కి వచ్చి ఆయన స్నానం చేసి వచ్చి తిని బెడ్ రూమ్ లోకి వెళ్ళాక
స్థిమిత పడ్డది అర్పిత.
                                                       * * * * *
                              
                  మరుసటి రోజు ఉదయం పది గంటలకల్లా పోలీస్ స్టేషన్ కి వెళ్లింది అర్పిత. ఇన్స్పెక్టర్ సురేందర్ గారింకా రాలేదు.'సార్ అయిదు నిముషాల్లో వస్తారమ్మా. సార్ రూం లో కూర్చోండనిచెప్పి వేడి టీ తెప్పించి ఇచ్చి వెళ్ళాడు ఓ కానిస్టేబుల్.
అంతలోనే ఇన్స్పెక్టర్ వస్తూనే నన్ను చూసి ''అరే…అప్పుడే వచ్చారా''?
'ఇట్స్ ఓకే…టు మినిట్స్' అని ఇద్దరు సబిన్స్పెక్టర్లను పిలిచి ఏవో కేసుల అప్ డేట్స్ తీసుకుని, వారికేవో సూచనలు చేసి ''ఆ ఇక  చెప్పమ్మా' ? ఎలాఉన్నారు డాడీ ? బ్యాక్ టు నార్మల్ కదా''...అంటూ చాలా నార్మల్ గా మాట్లాడారు స్పెక్టర్ సురేందర్.
''చెప్పండి సర్ …అసలేం జరిగింది'' ? అన్నది అర్పిత ఆత్రుతగా జరిగింది తెలుసుకోవాలన్న కుతూహలంతో. ఇన్స్పెక్టర్ సురేందర్ కేసు గురించి సీక్వెన్షియల్ చెప్పడం మొదలెట్టాడు.                                                                          * * * * *            
              గాంధీనగర్ పోలీస్ స్టేషను. రాత్రి తొమ్మిది గంటలు.
ఇన్స్పెక్టర్ సురేందర్ తన సబ్ ఇన్స్పెక్టర్ లతో కూర్చుని రాఘవరావు మిస్సింగ్ కేసు ప్రోగ్రెస్  చర్చిస్తున్నారు. టైం' ఎనిమిదిన్నర  దాటుతోంది. "ఇక మీరు బయలుదేరండి సర్. ఏమైనా అర్జెన్సీ ఉంటే ఫోను చేస్తాను'' అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంటుండగానే ఇన్స్పెక్టర్ 'సురేందర్' 'మొబైల్' రింగయింది.
''హలో…నేనే సాబ్ 'యాదయ్య'ను 'బాలాజీ అపార్ట్ మెంట్ సెక్యూరిటి గార్డ్' ని  మాట్లాడుతున్నా. మీరు చెప్పినట్లు మూడో ఫ్లోర్లో ఆ 'ఫ్లాట్' కాడనే అటు ఇటూ తిరుగుతున్నసార్ .ఫ్లాట్ ఉదయం కెల్లి 'బందే' ఉంది.ఇయాల వాళ్ళెవరు కిందకు రాలేదు. ఆ ముగ్గురు పిల్లలు  లోపలే ఉన్నట్లుంది సాబ్. నాకు మస్తు అనుమానంగా ఉంది సాబ్. మీరు గిప్పుడే వచ్చేయండి. ఇద్దరు 'పోరలు' లోపలకి బయటకు తిరుగుతున్నరు. దర్వాజ ఊరికూరికే బందు చేస్తున్నరు. ఆ ఫ్లాట్ లోనే ఉండే ఇద్దరు పోరలు ఇంతవరకు ఈ దినం బయటకు రాలే. వాళ్ళ నాయనా, అమ్మా ఊరికి పోయింరంట. రెండు మూడు రోజులు దాకారారంట.' మీరు జల్దీ వచ్చేయండ్రి...నేను ఈడనే ఉంటా." అన్నాడు యాదయ్య సెక్యురిటి గార్డ్.
''సరే, యాదయ్యా నువ్వు అక్కడే ఉండు. నేను పది నిముషాల్లో అక్కడికొస్తున్నా'' అని ఫోను కట్ చేసి టైం చూసుకున్నాడు ఇన్స్పెక్టర్ సురేందర్. టైం తొమ్మిది గంటల ముఫై
నిముషాలవుతోంది.వెంటనే తను,సబ్ ఇన్స్పెక్టర్,ఇద్దరు కానిస్టేబుళ్ళ తో బాలాజీ అపార్ట్ మెంట్  పది నిముషాల్లో చేరుకున్నారు.
'గేటు దగ్గరినుంచి ఇంకొక గార్డ్ ని తీసుకుని లిఫ్ట్ లో థర్డ్ 'ఫ్లోర్' కి వెళ్లారు. 
ఫ్లోర్ చాల పొడుగ్గా ఉంది. అక్కడక్కడ 'లైట్స్' వెలగక పోవడంతో అంతగా వెలుగులేదు.
ఇంతలో 'యాదయ్య' నేను ఈడున్నాను సాబ్' అంటూ అటు చివరనుంచి అరిచాడు. పోలీసులు  ఆ టైం లో రావడం, ఉదయం నుంచి రాఘవరావు గారు కనిపించక పోవడంతో అదే ఫ్లోర్ లో బయటనే కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు రెసిడెంట్స్ పోలీసుల వెనకాలే నడుస్తూ 'రాఘవరావు  గారి సంగతి ఏమైనా తెలిసిందా 'సర్' అని అడగడం ఇన్స్పెక్టర్ 'సురేందర్' ఏమీ సమాధానం చెప్పకుండా 'ఫాలో మీ' అంటూ తనతో వాళ్ళని రమ్మని సైగ చేశాడు. వాళ్ళు ఏమిటో తెలియని 'క్యూరియాసిటి' తో పోలీస్ ఇన్స్పెక్టర్ ని వెనకాలే నడిచారు.
'యాదయ్య' చూపిన ఫ్లాట్ తలుపు కొట్టాడు ఓ మఫ్టిలో ఉన్న కానిస్టేబుల్.
మిగతావారంతా ఓ పక్కగా చీకటి నీడలో నిలబడి నిశ్సబ్దంగా గమనిస్తూ ఉన్నారు.
మెల్లగా తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఓ కుర్రాడు షుమారు 15 సంవత్సరాలు ఉంటాయేమో
తల కొద్దిగా బయటపెట్టి 'కౌన్ హై'... హూ ఈజ్ దట్ ? అన్నాడు రెండు భాషల్లో.
'వెంటనే కానిస్టేబుల్ మీ డాడీని పిలువమ్మా...నన్ను రమ్మన్నారు' అన్నాడు కానిస్టేబుల్.
'డాడీ ఈజ్ అవుట్ అఫ్ స్టేషన్ .. హి విల్ కం డే ఆఫ్టర్ టుమారో'.. యు కం లేటర్' అంటూ తలుపు వేయబోయే సరికి కానిస్టేబుల్ తన ఎడంకాలు లోపల అడ్డంగా బెడుతూ తలుపు గట్టిగా పట్టుకుని 'ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుంటే పిలువు బాబూ"... కొద్దిగా పనిఉంది అంటూ తల లోనికి ఉంచి ఇంట్లోకి చూశాడు కానిస్టేబుల్.
'ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను ఇంకెవరు లేరు. మా పేరెంట్స్ ఊరి కెళ్ళారు' అన్నాడా కుర్రాడు తలుపు నెడుతూ. కానిస్టేబుల్ ఆ అబ్బాయి తలుపు మూయకుండా బలంగా వెనక్కి నెట్టడంతో ''హేయ్...వాట్ ది హెల్ ఆర్ యు డూయింగ్...ఐ విల్ కాల్ పోలీస్'' అంటూ అతనితో ఇంకొక కుర్రాడు కలిసి మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ని బయటకు నెట్టడానికి ప్రయత్నం చేస్తుండగానే పోలీసులంతా గుమ్మం ముందుకు వచ్చారు.
ఇన్స్పెక్టర్ సురేందర్ తనవెంట వచ్చిన ఇద్దరు రెసిడెంట్స్ కి అప్పటికే చెప్పాడు...  రాఘవరావుగారిని ఆ ఫ్లాట్లో బందీగా ఉంచినట్లుగా 'ఇన్ఫర్మేషన్' ఉందని,
తలుపు తీసిన కుర్రాడితో మాట్లాడి వాళ్ళపేరెంట్స్ ఫోను నంబరు తీసుకోమన్నాడు ఇన్స్పెక్టర్ సురేందర్. ఇంతలో తలుపు తీసిన కుర్రాడు అమాంతం బయటకు వచ్చి మెట్ల వైపు పరుగెత్తడం మొదలెట్టాడు. అనుకోని ఆ సంఘటనకు ఇద్దరు రెసిడెంట్స్ బిత్తరపోయి చూస్తుండగానే ఒక కానిస్టేబుల్ పరుగెత్తి  ఆకుర్రాడిని పట్టుకురావడం అతను ఏడుస్తూ ''నాకేమీ తెలీదు....వికాస్, నితిన్...వాళ్లిద్దరే 'అంకుల్'ని గదిలోఉంచారు'' అని గింజుకుంటూ పెద్దగా ఏడుస్తూ చెప్పాడు.
ఇన్స్పెక్టర్ సురేందర్, ఇద్దరు రెసిడెంట్స్ ఫ్లాట్ లోనికి వెళ్లారు.
ఒక్క బెడ్ రూం మినహా ఫ్లాట్ లో రెండు పడక గదులు తెరిచే ఉన్నాయి.
ఒక బెడ్ రూం లోపలినుంచి క్లోజ్ చేసి ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉంది.
ఇన్స్పెక్టర్ చేసిన 'సైగ' తో ఒక రెసిడెంట్ తలుపు కొట్టి 'నితిన్' నేను ప్రకాష్ అంకుల్ ని మాట్లాడుతున్నాను.
''మీ డాడీ ఫోన్ లో ఉన్నారు మీతో మాట్లాడాలట'' అని చెప్పడంతో తలుపు తీసిన వెంటనే  మొదట ఒక కానిస్టేబుల్ ఇద్దరు రెసిడెంట్స్, తరువాత ఇన్స్పెక్టర్ లోనికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి అందరు ఆవాక్కయి నోటమాట రాక ఒక్కక్షణం పాటు నిశ్చేష్టులై అయ్యారు.
'రాఘవరావుగారిని' ఒక డైనింగ్ టేబుల్ కుర్చీకి ప్లాస్టిక్ తాడుతో చేతులు వెనక్కి కట్టేసి కుర్చీని గదిలో ఒక మూలగా ఉంచి డైనింగ్ టేబుల్ అడ్డుగా ఉంచి, నోటికి ఎధెసివ్ టేప్ వేసి ఇద్దరు కుర్రాళ్ళు కాపలా ఉన్నరా గదిలో. కానిస్టేబుల్ వెంటనే ఆకుర్రాళ్ళను, ఆగదిని, వచ్చేటట్లుగారెండు మూడు ఫోటోలు, కట్టేసి ఉన్న రాఘవరావు గారిని క్షణంలో ఎవిడెన్స్ కి కావలసిన ఫోటోలు తీశారు. ఆ తరువాత బయటకు వచ్చి ఫ్లాట్ నంబరు వచ్చేట్లుగా ఫోటోలు తీశాడు. వెంటనే ఆయన కట్లు విప్పి కిచెన్ లోని  వెళ్లి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చిఇచ్చారు ఒక రెసిడెంట్. మొత్తం నలుగురు పిల్లలు వంచిన తలలు పైకి ఎత్తడం లేదు.
''ఎలా ఉన్నారు 'సర్' 'మీ ఫ్లాట్ దాక నడవగలరా'? అనడిగాడు రాఘవరావు గారిని ఇన్స్పెక్టర్ సురేందర్.
''ఆ' ఫరవాలేదు నడవగలను''  అన్నారు రాఘవరావు గారు.
లేచి మంచినీళ్ళు త్రాగి ఆయన తూలేసరికి పోలీస్ కానిస్టేబుల్ ఆయన్ని భుజాలచుట్టు చేయివేసి ఆయనతో నడిచి హాల్లో  'సోఫా'లో కూర్చోబెట్టి ఆయన దగ్గరే నిలబడి ఉన్నాడు. ఆయన కుడి చేత్తో ముఖం అంతా రాసుకుని ఎడం భుజాన్ని కుడిచేత్తో సర్దుకున్నారు.
సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఆ రూం అంతా సోదా చేసి, ఎధెసివ్ టేప్ రోల్ ని, ప్లాస్టిక్  తాళ్ళను, రాఘవరావు గారిని కట్టేసిన కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. పిల్లల నలుగురి పోకేట్ సోదా చేసి వాళ్ళ దగ్గరనుంచి రెండు మొబైల్ ఫోనులు స్వాధీనం చేసుకుని పిల్లల పేరెంట్స్ ని కాంటాక్ట్ చేశారు పోలీసులు.
ఇద్దరు పిల్లల పేరెంట్స్, అక్కడే ఉన్నరెసిడెంట్స్ తోమాట్లాడాక ఢిల్లీ నుంచి ఉదయమే వచ్చి పోలీసులను కలుస్తామన్నారు.
మిగతా ఇద్దరు పిల్లల పేరెంట్స్ వచ్చి ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతున్నారు.
అక్కడే ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ 'పంచనామా' పాపేరువర్క్ పూర్తిచేశారు.
కొద్దిగా తేరుకున్న 'రాఘవరావుగారు' లేచి తను వెళ్తానని ఆపిల్లలని 'పోలీస్ స్టేషన్'కి అప్పుడు తీసుకు వెళ్లవద్దని, వీలుంటే రాత్రి కాకుండా మరుసటి రోజు పిల్లలని 'ప్రశ్నించమని పోలీస్ ఇన్స్పెక్టర్ ని' అభ్యర్ధించారు రాఘవరావుగారు.
అందుకు ఒకింత ఆశ్చర్యం తో ఇన్స్పెక్టర్ ''అలాకుదరదు. వీళ్ళని ఇప్పుడు వదిలేసి వెళ్ళమని  మీరంటున్నారా' మంచితనానికి కి కూడా ఒక హద్దు ఉండాలి. ఇలాటి వాళ్ళు మంచితనాన్నిఅసమర్ధత, చేతకానితనంగా తీసుకుని రెచ్చిపోతూ ఉంటారు'' అన్నాడు అసహనం వెళ్లగక్కుతూ కరకుగానే పిల్లల వైపు చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్
నలుగురు కుర్రాళ్ళని,అంత దగ్గరుండి చూసిన రెసిడెంట్స్ ని, వేరే ఇద్దరి పేరెంట్స్ తో సహా పోలీస్ స్టేషన్ కి బయలుదేరాడు ఇన్స్పెక్టర్. రాఘవరావు గారితో ఆయన 'ఫ్లాట్' వరకు నడిచి ఇక మీరు వెళ్ళండి 'సర్' అని ఆయన ఇంటిలోనికి వెళ్ళడం చూసి.
                                                         * * * * *
''అదమ్మా జరిగిన కధ'' అన్నాడు ముందు రాత్రి జరిగినదంతా పూస గుచ్చినట్లుగా చెబుతూ.
''అంత బాగానే ఉంది ఇన్స్పెక్టర్ గారూ...అసలు  వాళ్ళు డాడీ ని ఎందుకు కిడ్నాప్ చేసినట్లు ? అసలు వాళ్ళ ఉద్దేశ్యమేమిటి ? మీరు ఆ టైం కి వెళ్ళక పోతే ఎం జరిగేది' ?
ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నలుగానే  ఉండిపోయయికదా ? అసలు ఈ క్రైమ్ కి ప్రేరణ, కారణం ఏమిటి?
డాడీనే వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు? నాకర్ధం కాలేదు'' అంది నిరుత్సాహంగా.
''ఈ ప్రశ్ననువ్వేస్తావని నాకు తెలుసు.నేను చెప్పేదానికన్నానువ్వు నీ కళ్ళతో చూసి నీ చెవులతో విను'' అంటూ కాలింగ్ బెల్ బజర్ నొక్కాడు ఇన్స్పెక్టర్.
'సర్' అంటూ స్టిఫ్ గా సెల్యూట్ చేశాడు లోనికి వచ్చిన కానిస్టేబుల్.
'ఆ నలుగురు కుర్రాళ్ళను వాళ్ళ పేరెంట్స్ ని లోనికి పంపించు ఇంకో రెండు కుర్చీలు  వేయించు ఇక్కడ" అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇన్స్పెక్టర్.
'నువ్వు ఇటు పక్కకి వచ్చి కూర్చోని సైలెంట్ గా జరిగేది చూడు,విను.
నీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది' అన్నాడు సురేందర్ ఇన్స్పెక్టర్ సీరియస్ గా.
ఆ నలుగురు కుర్రాళ్ళు, వాళ్ళ పేరెంట్స్,రాత్రి వచ్చిన ఇద్దరు రెసిడెంట్స్ కాక ఇంకా చాలా మంది రెసిడెంట్స్,ఇద్దరు లాయర్లు వచ్చినా వారిని తర్వాత కలుస్తానని లోనికి 'ఎలవ్' చేయలేదు ఇన్స్పెక్టర్.
పేరెంట్స్,ఇద్దరు రెసిడెంట్స్ కూర్చున్నాక 'లుక్ బాయ్స్' ''మీరు నలుగురు ఒకరి తరువాత ఒకరు జరిగింది జరిగినట్లు  చెప్పండి.
''అసలు ఏంజరిగింది ? రాఘవరావు గార్నిఎందుకు కిడ్నాప్ చేయవలసి వచ్చింది ? ఎలా చేశారు? మేము రాత్రి వచ్చి ఉండనట్లవుతే ఆయన్నిమీరు ఏం చేసేవారు? నాకు అంతా స్పష్టంగా గా చెప్పండి" అన్నాడు ఇన్స్పెక్టర్.
పేరెంట్స్ ఎవరూ పిల్లలు మాట్లాడేటప్పుడు కలగ చేసుకోవద్దు. దిస్ ఈజ్ ఎ వార్నింగ్ టు యూ  ఆల్' అండ్ హిజ్ స్టేట్ మెంట్ విల్ బీ రికార్డెడ్ ఇన్ వీడియో...'నౌ కమాన్ ప్రొసీడ్'.
''నితిన్' ముందుగా నువ్వు చెప్పు '' అన్నారు ఇన్స్పెక్టర్.
'సర్' అంకుల్ గారు మంచి ఆయనే గాని మేము అపార్ట్ మెంట్ లో క్రికెట్ ఆడితే జాగ్రత్త
హార్ద్ బాల్ ఎవరికైనా తగుల్తే ప్రాబ్లం. టెన్నిస్ బాల్ తో ఆడండి. ఫుట్ బాల్ ఆడితే గ్లాసెస్ పగుల్తాయి అనేవాడు. సైకిల్ రైడ్ చేస్తే  స్లో గా వెళ్ళండి అంటాడు, ఆయన వస్తున్నాడు అంటే మాకు ఎప్పుడూ ఫ్రీడమ్ ఉండేది కాదు.
అపార్ట్మెంటులో ఒక రోజు ఒక పెయింటర్ సాయంత్రం వెళుతూ తన సామానంతా సెల్లార్ లో ఒక పార్కింగ్ లో పెట్టి వెళ్ళాడు. అది మేము చూశాము.
'మేము అంటే ఎవరెవరు' ? అన్నాడు ఇన్స్పెక్టర్ కొద్దిగా కరకుగా.
'నేను,సంజీవ్' చూశాము. ముందు ఏదైనా వాల్ కి పెయింట్ వేద్దామనుకున్నాము.
నెక్స్ట్ డే 'సండే' వచ్చింది. నేను సంజీవ్ కలిసి ఆ 'స్ప్రే' పెయింట్ గన్ తీసుకుని ఒక   కార్నర్ వాల్ కి వేస్తుంటే అది కొద్దిగా కార్ విండ్ షీల్డ్ మీద పడ్డది. దాంతో తుడవడానికి ప్రయత్నం చేశాము. కానీ గ్లాస్ అంతా నల్లగా పెయింట్ పట్టుకుంది. దాంతో  భయపడి పెయింట్ గన్ దాచేశాము. దాంతో సొసైటీ లో ఎవరో 'కార్ గ్లాస్' మీద పెయింట్ వేశారని బాగా గొడవయింది.
'వుయ్ హేడ్ ఫన్'. తరువాత వీలుదోరికినప్పుడెల్లా ఏదో ఒక కార్ విండ్ షీల్డ్ మీద పెయింట్ వేశాము. అలా అయిదు కార్ల గ్లాస్ మీద పెయింట్ వేశాము. సొసైటీ లో బాగా గొడవయ్యేది.
మేము నలుగురం బాగా నవ్వుకునే వాళ్ళం.
'మిగతా ఇద్దరి పేర్లేమిటి' ? ఇన్స్పెక్టర్ గట్టిగా అడిగాడు.
"నేను సంజీవ్ గాక  మిగతా ఇద్దరు వికాస్, దుశ్యంత్" అన్నాడు నితిన్.
ఇంతలో ఒక రోజు మా డాడీ 'ఆ పెయింట్ మా పిల్లలే వేస్తున్నారని సొసైటీ మీటింగ్ లో 'అడ్మిట్' చేశారు. ఆయనకు ఎలా తెలిసిందో మాకు తెలీదు'.
అది అడ్మిట్ చేసినందుకు ఆయనకు 'పదివేల రుపాయలు' పెనాల్టీ వేశారు సొసైటి వాళ్ళు. దాంతో మా 'మామ్' 'డాడ్' పనిష్మెంట్ గా మాకు 'పాకెట్ మనీ' ఇవ్వడం మానేశారు.
పెయింట్ మేము వేశామని మా డాడీ కి అంకుల్ 'పితూరీ' చెప్పి ఉంటారని మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు తెలిసింది మా బట్టల మీదపెయింట్ చూసి మా'మామ్' డాడీ కి చెప్పిందని...అది అంకుల్ కాదని.
ఆ గొడవ తరువాత మేము ఎక్కడికి వెళ్ళిన కమ్యూనిటిలో అందరు మమ్ముల్ని'క్రిమినల్' లాచూసే వారు.మాతో వేరెవరూ ఆటకు రావడం లేదు. ఫ్లాట్ కూడా వెకేట్ చేయమన్నారు.
మా 'పాకెట్ మనీ' పోవడమే గాక ఇదంతా అంకుల్ వల్లే  జరిగిందన్న కోపంతో ఆయనకు వార్నింగ్ ఇద్దామని మాఇంటికి తీసుకెళ్ళాను.
"అంకుల్ అంటే ఎవరు"? రెట్టించి అడిగాడు ఇన్స్పెక్టర్. రాఘవరావు అంకుల్. అంటే ?
నిన్న మేము మాఇంట్లో కట్టేసినతను"... స్పష్టంగా వారు చెప్పిందాకా రెట్టించాడు ఇన్స్పెక్టర్. "తరువాత ఏంజరిగింది" కంటిన్యూ అన్నాడు ఇన్స్పెక్టర్.
"మీరు రాక పోయినా, మీరు డిటెక్ట్ చేయకపోయినా అంకుల్ ని ఉదయమే
వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాము అనుకున్నాము. కానీ వదిలేయడానికి వీల్లేకుండా మాఎదురు ఫ్లాట్ లో నిన్న ఉదయం నుంచి ఏదో ఫంక్షన్ అయింది. ఫంక్షన్ కి వచ్చినవారు మా ఫ్లాట్ ఎదురుగా వరుసగా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు.  వారంతా వెళ్లేసరికి సాయంత్రం అయింది.
అప్పటికే 'అంకుల్' కిడ్నాప్' అయినట్లు కమ్యూనిటీలో అందరికీ తెలిసింది. అంకుల్ ని అడగండి మేమందరం చాలాసార్లు 'సారీ' చెప్పాము. అంకుల్ బయటకు వెళ్లి అందరికి చెబుతారేమోనని భయపడ్డాము.
అదీగాక మా ఫ్లోర్ లో ఫంక్షన్, సెక్యూరిటీ గార్డ్ అక్కడే తిరుగుతూ ఉండడం వల్ల ఆయనను వదలడానికి వీలు కాలేదు. అంతే గాని ఆయన్ని మేము కట్టివేయాలనుకోలేదు.
ఇదంతా ఆక్సిడెంటల్ గా జరిగింది. మేము కావాలని చేసింది కాదు.  
ఇదంతా నావల్లే జరిగింది. మా పేరెంట్స్ కి గాని ఎవరికీ తెలీదు.
మిగతా ముగ్గురు నాకు హెల్ప్ చేశారు అంతే. తప్పంతా నాదే. ఇక ఎప్పుడూ ఇలా చేయను. మమ్ముల్నివదిలేయండి 'ప్లీజ్'...అంటూ బావురుమని ఏడుపు మొదలెట్టాడు నితిన్.
'అవునూ... ఆయనను మీ ఫ్లాట్ లోనికి ఎలా తీసుకు వెళ్ళారు' ? అడిగాడు ఇన్స్పెక్టర్ నితిన్ ముఖం లోకి నిశితంగా చూస్థూ.
'అంకుల్ ఉదయాన్నే వాకింగ్ నుంచి తిరిగిరావడం గేట్ దగ్గరే ఉన్న నేను గమనించాను.
ఆయన ఒక్కరే లిఫ్ట్ ఎక్కుతుంటే నేను ఆయనతో లిఫ్ట్ ఎక్కి మాటలు కలిపాను.
ఒక్కసారి ఫ్లాట్ కి వచ్చి మా ఫ్లాట్ లో దేవుడి ఫోటోని ఎక్కడపెట్టాలో మామ్ మిమ్ముల్ని అడగి  రమ్మంది,రండి అంకుల్ అని రిక్వెస్ట్ చేసి ఫ్లాట్ లోకి అయనను తీసుకువచ్చాను. రావడంతోనే మా బెడ్ రూమ్ లో దేవుడి ఫోటో ఎక్కడ పెట్టాలి అంకుల్ అని గది లోనికి తీసుకు వెళ్ళగానే  అక్కడే బయటనున్న ఉన్న'వికాస్' బయటనుంచి తలుపు వేశాడు.
'అరేయ్ 'పిల్లలూ' తప్పురా.మీ 'ఫ్యూచర్' పాడవుతుందిరా, వద్దురా బాబూ... నన్ను వదిలేయండి.
నేను ఎవ్వరికి చెప్పను' అని అయన బిగ్గరగా అనడంతో భయపడి నేనే బలవంతంగా నోటికి టేప్ వేశాను ఎక్కడ అరుస్తారోనన్న భయంతో.
''మేము కార్' మీద పెయింట్ వేశామని మా డాడీ కెందుకు చెప్పారు?  చెప్పండి ?
ఇక ముందు మాజోలికి రామని, మమ్ముల్ని టార్గెట్ చేయనని ప్రామిస్ చేయండి.మిమ్ముల్ని ఇప్పుడే వదిలేస్తాము" అని మేము చెప్పామో లేదో అంకుల్ ని అడిగి క్లారిఫై చేసుకోండి'' అన్నాడు నితిన్ ఏడుస్తూ !
తరువాత మిగతా ముగ్గురు పిల్లలు ఇంచు మించు ఇదే స్టోరీ రిపీట్ చేశారు.
ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ని పిలిచి పిల్లల ముందే వాళ్ళ తలితండ్రులకు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇలా జరగకుండా చూస్తామని తలితండ్రుల దగ్గర, మళ్ళీ ఇలాటి 'క్రైమ్' చేయమని పిల్లల దగ్గర లీగల్ అండర్ టేకింగ్, 'స్టేట్ మెంట్స్' తీసుకొమ్మని చెప్పి' అందరిని తన రూము బయటకు పంపించాడు ఇన్స్పెక్టర్ సురేందర్.
''ఏమ్మా … అంత  చూశావుగా'' అదీ యదార్ధంగా జరిగిన సంగతి' అన్నాడు ఇన్స్పెక్టర్.
ఇన్స్పెక్టర్ ని సాలోచనగా చూస్తూ 'నాకు ఇంకొక విషయం ఇంకా అర్ధం  కాలేదు ఇన్స్పెక్టర్ గారూ' అంది ప్రభ
''షూట్' నీ డౌట్ ఏమిటో చెప్పు''. అన్నాడు ఇన్స్పెక్టర్.
''ఫ్లాట్ లో పిల్లలే డాడీని కిడ్నాప్ చేశారన్నడౌట్ మీకు ఎలా వచ్చింది ? అంది ప్రభ ఇన్స్పెక్టర్ వంక సూటిగా చూస్తూ.   .
'ఈ కేసులో కిడ్నాప్ చేయడానికి మోటివ్ ఏమిటని ఆలోచిస్తే మీదగ్గర ఏవిధమైన క్లూ దొరకలేదు. ఏకేసైనా మోటివ్ తెలిస్తే గాని కేసుని సాల్వ్ చేయలేము. ఈకేసులో ఏవిధమైన నెగటివ్ ఎవిడెన్స్ లేదు. కాబట్టి బయటవాళ్ళెవరూనాన్నగారిని కిడ్నాప్ చేయలేదన్ననిర్ధారణకు వచ్చాము.
ఇక మిగిలింది ఫ్రెండ్స్, బంధువులు, ఇంట్లోవాళ్ళు. మీతో రెండు సార్లు మాట్లాడాక
అదీ రూల్ అవుట్ చేసుకున్నాము.
ఇక మిగిలింది అపార్టుమెంట్ లోవారు. అక్కడ ఎంతమందితో మాట్లాడినా రాఘవరావు గారి గురించి వ్యతిరేకంగా ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు.
'సెక్యురిటి గార్డ్' ఒకడు 'సార్' ఈ కాంప్లెక్ లో నలుగురు అల్లరి పోరలు ఉన్నారు.
వాళ్ళకి రాఘవరావు సార్ అంటే కోపం ఉంది సార్. ఒకణ్ణి ఇయాల పొద్దున్ననేను డ్యూటీ కి రాంగానే గేటుముందు చూసిన సార్. ఆ పిల్లగాడి తండ్రికి ఇక్కడ 'సొసైటీ'వాళ్ళు ఈ పోరల మూలంగానే ఏదో 'పెనాల్టీ' వేసింరు.
'రాఘవరావు సారేమో ఎప్పటికి ఆ పోరల్ని అట్టా చేయద్దు...క్రికేట్ గట్టి బంతితో ఆడొద్దు' అని చెబుతుండే.పోరలకేమో మస్తు కోపం వస్తుండే' అన్నఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
ఆ చిన్నక్లూతో ఆనలుగురు పిల్లల మీద వాచ్ పెట్టించాను.
అదీ సంగతి. రేపు నేనో లేక  మా సబ్ ఇన్స్పెక్టర్ గాని వచ్చి నాన్నగారిని కలుస్తామని చెప్పు.
కొద్ది పని ఉంది అంటూ కధ ముగించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్.
"డాడీ కంప్లైంట్ వెనక్కి తీసుకొమ్మని చెప్పి పంపారు నన్ను'' అంది అర్పిత.
"రాఘవరావుగారితో మాట్లాడాను. వారి స్టేటుమెంట్ తీసుకోవాలి. మధ్యాన్నం వరకు వస్తానన్నారు. ఆయన కంప్లైంట్ వాపస్ తీసుకుంటామని నాకూ ఫోన్ చేసి చెప్పారు.
ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశాము. మీరు ఏంచేయదలుచుకున్నా వ్రాసియివ్వండి. కోర్ట్ వారు నిర్ణయం తీసుకుంటారు"స్పష్టంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ సురేందర్. 
 
                                        * * * * *   సమాప్తం   * * * * *                                                                  
 
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
Mob. No.9849118254                        
          






















                                                                   
                                 



    
        

            

   
                 

 

గవేషణం 
======== 

గెలుపోటముల గుంజాటనలో
 
మానవయత్నం మానకు !

గతాన్ని గుమ్మంలో గుమ్మరించుకుంటూ 

గతస్మృతులే గమ్యంగా గతి లేని జీవితం గడపకు! 

గల గలా నవ్వడం మానేశానన్నా 

బతుకే చేదయిందన్నా... ఎవరిక్కావాలి నీ గోడు ?

గాథాభరితులు ఈ ఇలలో కోకొల్లలు

నీకేం!? నువ్వెంతో మేలు

నిచ్చెనలుంటాయి అందిపుచ్చుకో! 

చేవ తెచ్చుకుని తోవ చేసుకుంటూ చేతనైనట్లు బతుకు!

నీ బతుకు నీది, సారూప్యం వద్దు 

గడిచిన నిముషం పొద్దు, పద్దులోకే పోతుంది 

నిన్నటి మొన్నటి దాకా నువ్వేంచేశావో 

నిక్కచ్ఛిగా గణించుకో! 

వీసమెత్తైనా, గవాక్ష గవేషణలో నిదర్శనం నినదించాలి!

గతమంతా మేలేనని సాంత్వన చెందావా అంతే ! 

నీనడకింక నిద్రాణమే! 

నిరర్గళంగా పయనించాలి 

స్వాప్నికాస్వామ్యావిష్కారం  కోసం!

దారుల్లో దగాకోరులుంటారు

నివారకాలుంటాయి

నిరాశవద్దు, నిస్తేజం వలదు! 

ఉత్తేజం కావాలి! 

ఊసుల్లో ఊరేగొద్దు, 

ఉషస్సులో కురకాలి

మందలో వద్దు 

వందల్లో ఒక్కడివిగా ఛేదించి సాధించు!

వంది మాగధుల వందనాలు వద్దు

స్వావలంబన చేరువయ్యే వరకు విశ్వప్రయత్నం చేస్తూనే వుండు !

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
గచ్చిబౌలి, హైదరాబాద్ 
మొబైల్ నంబరు : 9849118254


 

 



                                                           పరోపకారం ఇదం శరీరం 

             ( ఈ కథ సాక్షి - ది. 7, సెప్టెంబర్ నెల - ఆదివారం - ఫన్ డే  లో ప్రచురింపడింది )   


"అన్నయ్యా! రామారావు బాబాయికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఈసారి ఆయన  కండిషన్ క్రిటికల్ అన్నాడు డాక్టర్. నువ్వు చూసి వెళితే బావుంటుంది" స్వంత బాబాయి అనారోగ్యం కబురు తెలిసిన రెండురోజుల తరువాత ఊళ్ళో ఉన్న అన్న విశ్వనాధ్ కి తీరిగ్గా ఫోను చేశాడు తమ్ముడు శంకరం.  
"నేను సిటీకి నిన్ననే వచ్చాను. హాస్పిటల్లో ఉన్నాను. బాబాయి ఇంతకు ముందే పోయాడు.  కబురింకా ఎవరికీ చెప్పలేదు. బిల్లు డబ్బు పూర్తిగా కడితే గాని శవాన్నిఇవ్వరట...చంద్రం డబ్బు కోసం వెళ్ళాడు" నిర్లిప్తంగా అన్నాడు విశ్వనాధ్.
"సరేలే! ఈ వాదులాట మనకెప్పుడు ఉన్నదేగా! నిన్ననంగా సిటీకి  వచ్చినవాడివి ఇంటికి రాలేదు. 
నీ ఆరోగ్యం మాత్రం పట్టించుకోవు!" నిష్ఠుర మాడాడు శంకరం 
"బాబాయి దగ్గర నేనొక్కడినే ఉన్నాను. ఇంకెవరూ రాలేదు. అందుకే రాలేకపోయాను" సంజాయిషీ ఇచ్ఛాడు విశ్వనాధ్
''ఏం వాడింట్లో మనుషులేమయ్యారు ? అన్నీ నాటకాలు..." ఉడుక్కుంటూ  అంటుండగానే  సిస్టర్ వచ్చి 'రామారావు పేషెంటు తాలూకు ఎవరున్నారో లోనికి రండి' అని చెప్పి వెళ్ళింది. తమ్ముడి ఫోను కట్ చేసి లోనికి వెళ్ళాడు విశ్వనాధ్. 
"డబ్బు కట్టి, రూమ్ నంబరు పద్దెనిమిదికి వెళ్ళండి. 'బాడీ' ఎంబామ్ అవుతోంది" అంటూ తొందరపెట్టింది సిస్టర్. 
''ఎంబామ్' అవుతోందా! అంటే ...  ?" ప్రశ్నించాడు విశ్వనాథ్. 
"ఏం లేదు! బాడీని 'రెడీ' చేస్తున్నాము" అని వివరం చెప్పకుండా లోనికి వెళ్ళింది నర్సు.  
చంద్రం సాయంత్రం ఆరుగంటల కొచ్చి బిల్లు కట్టాక శవాన్ని ఇచ్చారు. చంద్రం తన కారులో, విశ్వనాధ్ బాడీతో అంబులెన్సు లో చంద్రం ఇంటికి బయలుదేరారు.
                                                                   * * * * *
మరుసటిరోజు రామారావు దహన సంస్కారాలు పూర్తయ్యేసరికి ఉదయం పదకొండు గంటలు దాటింది. అక్కడికొచ్చిన బంధువులు,స్నేహితులు ఒక్కొకరుగా స్మశానం వీడి వెళుతున్నారు. 
స్నానం చేసి, బట్టలు ఆరేసి ఓమూల బెంచీమీద నీరసంగా కూర్చుని ఉన్నాడు విశ్వనాథ్. . 
"శంకరం ఇంటికి వెళుతున్నావుగా... కర్మలకు రా అన్నా!" అని చెప్పివెళ్ళాడు చంద్రం.  
"పద! ఇక మనం కూడా వెళదాం " అన్నాడు శంకరం అన్న దగ్గరికొచ్చి.
ఆరేసిన బట్టలు మడిచి సంచిలో పెట్టుకుని "ఒంట్లో నలతగా, తల దిమ్ముగా ఉందిరా ! నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. ఆకలవుతోంది. అన్నం తిని వెంటనే ఊరికి బయలుదేరాలి. తెచ్చుకున్న డబ్బు ఖర్చయి పోయింది. దారి ఖర్చుకు డబ్బులు కావాలి" స్మశానం బయటకు నడుస్తూ, మొహమాటపడుతూ తమ్ముడితో మెల్లగా అన్నాడు విశ్వనాథ్. 
అదే సమయానికి వారి పక్కనుంచి 'మహాప్రస్థానం వేన్'  పెద్ద శబ్దం చేస్తూ వెళ్ళింది. ఆ రొదలో విశ్వనాథ్ మాటలు గాలిలో కలిసిపోయాయి. తన మాటలు శంకరం వినలేదని విశ్వనాథ్ గమనించలేదు. ఇద్దరూ స్మశానం నుంచి బయట రోడ్డు మీద ఆటో స్టాండ్ కి వచ్చారు. అదే సమయానికి ఫోను రావడంతో పక్కకి వెళ్లి మాట్లాడాడు శంకరం. 
తిరిగి వస్తూనే "అన్నయ్యా! మీ మరదలు ఫోను చేసింది. తనకు పట్టింపులు ఎక్కువ. స్మశానం నుంచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లాలట. నీకూ తెలిసేవుంటుంది. అందుకే నువ్వు సరాసరి వూరికి వెళ్ళు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు" అని పక్కనే నిలబడి, పాసెంజర్  కోసం తమనే గమనిస్తున్నఆటోని  పిలిచాడు శంకర్. 
"సార్ ని  బస్టాండ్ లో దింపు!" అని ఆటో డ్రైవర్ కి  చెప్పి, ఇంకొక ఆటో ఎక్కి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు శంకరం నిర్దయగా. 
                                                                 * * * * * 
తమ్ముడేమన్నాడో సరిగ్గా అర్ధమయ్యీ గాక క్షణంపాటు తొట్రుపాటుకి లోనయ్యాడు విశ్వనాథ్. 
తమ మధ్య జరిగిన సంభాషణ మననం చేసుకున్నాడు. తమ్ముడన్న మాట అప్పుడు అర్ధమైంది. . 
'అవును. వాడన్నది నిజమే. కొందరికిలాటి పట్టింపులు ఉంటాయి...అయినా స్వంత అన్నతమ్ముల మధ్య ఇలాటి ఆంక్షలా ?' విరుద్ధ ఆలోచనలతో విశ్వనాధ్ మనసు కళ్లెం లేని గుఱ్ఱంలా పరుగెట్టింది. 
అంతటి నిస్సత్తువ, అశక్తతలోను అతని పెదవులపై వెర్రి చిరునవ్వొక్కటి తళుక్కుమని మాయమైంది. ఇంటికి చేరాలి. ఎలా వెళ్ళాలి? అన్న ఆలోచన మిగతా ఏ ఆలోచనను దరిచేరనివ్వలేదు. ఏం చేయాలో తోచడం లేదు. 
తెచ్చుకున్నడబ్బు బాబాయి అత్యవసర మందులకు ఖర్చయింది. ఆ డబ్బును చంద్రాన్ని అడిగి తీసుకుందామనుకున్నాడు. మనసొప్పక అడగలేదు. ఇప్పుడు బస్ టికెట్ కి కూడా సరిపడా డబ్బు లేదు. ఎవర్ని అడగాలి. దిక్కు తోచని స్థితి. శరీరంలో సత్తువ క్షీణించింది. నాలుక పిడచగట్టింది. మెదడు మొద్దుబారింది. చుట్టూ ఏం జరుగుతుందో, తనెక్కడ వున్నాడో సైతం అర్ధం కావడంలేదనికి. ఆలోచనా శక్తి మందగించింది. ఎవరో...ఏదో...అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది.   
"ఏ బస్  స్టాండ్  కి వెళ్ళాలి  సార్ ?" అడుగుతున్నాడు ఆటో డ్రైవర్. 
సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. అతనికి మెదడు నుంచి నోటిమాటకి సంకేతం అందడం లేదు. యాంత్రికంగా జేబులు తడుముకున్నాడు విశ్వనాధ్. 
జేబులో మిగిలి వున్న ఒక్క ఏభై రూపాయల నోటు, మొబైల్ ఫోను చేతిలోకి తీసుకున్నాడు.      
"ఎక్కడికెళ్ళాలి సార్ !?" మళ్ళీ అడిగాడు ఆటో డ్రైవర్, విశ్వనాధ్ ని పరికించి చూస్తూ. 
"ఆటో వద్దు. డబ్బు...ల్లేవు... " అతని నోట మాటలు ముద్దగా వచ్చాయి. .  
"'గూగుల్ పే'  ఉంది సార్! " 
"నాకు లేదు. బస్ స్టాండ్ కి దారి చెప్పు. నడిచి వెళతాను" ఒంట్లో శక్తి నంతా కూడదీసుకుని అంటూనే మొదలు నరికిన మానులా కుప్పకూలాడు విశ్వనాథ్. 
ఆటో అతను కంగారు పడుతూ ఆటో పక్కకు ఆపి, ఇంజిన్ ఆఫ్  చేసి, పడిపోయిన విశ్వనాధ్ ని తట్టి లేపుతూ, స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్నాడు.. పరుగున ఆటో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి విశ్వనాధ్  ముఖం మీద నీళ్లు చల్లుతూ  "సార్ ... సార్!' అంటూ తట్టి లేపే ప్రయత్నంచేశాడు.  
రెండు,మూడు నిముషాల తరువాత కొద్ది తెలివివచ్చి, మగతగా కళ్ళు తెరిచాడు విశ్వనాధ్. 
విశ్వనాథ్ వీపు చుట్టూ చేయివేసి కూర్చోడానికి సాయం చేశాడు. వాటర్ బోటిల్ అందించి "కాసిని నీళ్లు తాగండి సార్ !" అన్నాడు ఆటో డ్రైవర్.  
నీళ్లు తాగి "నా కేమయింది... ?" పీలగా లోగొంతుతో ప్రశ్నించాడు విశ్వనాథ్. 
"మీరు స్పృహ తప్పి పడిపోయారు. మీరు పడిపోయినప్పుడు ... మీ ఫోను, ఏభై రూపాయల నోటు  కింద పడ్డాయి'' అని వాటిని, బట్టలున్న బ్యాగ్ ని విశ్వనాధ్ చేతికి అందించాడు ఆటో డ్రైవర్.  
ఆ నోటుని తిరిగి అతనికే ఇచ్చి తినడానికి ఏమైనా తెమ్మని సైగ చేశాడు విశ్వనాధ్. 
అతను పరుగున వెళ్లి పక్కనే పాన్ షాపులో బిస్కట్ ప్యాకెట్ తెచ్చి ''ఇవి తినండి! మీ షుగర్ లెవెల్ పడిపోయినట్లుంది" అని పక్కనే ఉన్న పళ్ళ బండి మీదనుంచి రెండు అరటిపండ్లు తెచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగి, నాలుగు బిస్కట్టు,అరటి పండు తిని రెండో పండు బ్యాగులో వేసుకుని 
''చాలా సాయం చేశావు. థాంక్యూ తమ్మీ! ఒంట్లో ఇప్పుడు బాగుంది. కొద్దిగా శక్తి వచ్చింది" అని లేచి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు విశ్వనాధ్. 
"నిన్ను ఇందాక నా ఆటో కాడ వదిలి వెళ్ళినతను ఎవరు?" ఆటో డ్రైవర్ అడిగాడు 
"నా తమ్ముడు" అన్నాడు విశ్వనాథ్
"సొంత తమ్ముడా !? ఇందాక ఆయనన్న మాటలు నేను ఇన్నా. నిన్ను ఇంటికి రావద్దు. సీధా ఊరికి పొమ్మన్నడు కదా... !" అన్నాడు ఆటో డ్రైవర్
మౌనంగా  లేచి నిలబడి  "నేను వెళతాను" అన్నాడు విశ్వనాధ్. 
"ఎలా వెళతారు... ? డబ్బులు లేవన్నారు కదా!" అన్నాడు ఆటో  డ్రైవర్.  
"నడిచి వెళతాను. ఎవరైనా తెలిసిన వాళ్లకి ఫోను చేద్దామన్నా ఫోను ఛార్జ్ అయిపోయినట్టుంది.  నంబర్లు అందులో ఉన్నాయి. దేవుడేదో విధంగా తప్పక సాయం చేస్తాడు" అన్నాడు విశ్వనాధ్ ఆకాశంలోకి చూస్తూ. 
"అంతదూరం నడవడం కష్టమన్నా! నువ్వు నడిచే స్థితిలోలేవు. నిన్ను బస్సు స్టాండ్ లో దింపి వెళతాను" అని  విశ్వనాధ్ భుజం చుట్టూ చేయి వేసి ఆటో దగ్గరికి నడిచాడతను. 
"నీ పేరేంటి ?" అడిగాడు విశ్వనాధ్  
"శంకర్ "
"ఓ...నీది నా తమ్ముడి పేరే''
"తమ్ముళ్ళందరూ ఒకేలా ఉండరన్నా!"
"ఎందుకలా అన్నావు ?"
"మీకు తెల్వదా ? ... ఇంతకీ ఏ వూరెళ్ళాలి ?"  మాట మారుస్తూ అడిగాడు శంకర్   
"కోదాడ వెళ్ళాలి... శంకర్! నువ్వు నా ఫోను తీసుకో. నాకు బస్సు ఛార్జి మందం మూడు వందలివ్వు. ఫోను ఖరీదు వెయ్యి పదిహేను వందలుంటుంది" అన్నాడు విశ్వనాథ్. 
"తప్పు సార్! అట్టా మాట్లాడొద్దు. అవసరం ఎప్పుడు, ఎట్టా, ఎవరికి, ఎవరితో వస్తుందో ఎవరికి 
ఎరుకన్నా! సాయానికి వెల కట్టకూడదు" అన్నాడు ఆటో శంకర్. 
ఆటో స్పీడ్ అందుకుంది. కాసేపట్లో బస్సు స్టాండ్ ఎంట్రీ గేటు దాటి ఆటోని ఓ మూలగా పార్క్ చేశాడు శంకర్. విశ్వనాధ్ ని  క్యాంటీన్ కి తీసుకువెళ్లి భోజనం అయ్యాక, కోదాడ టికెట్ తీసుకుని బస్ ఎక్కించాడు.   
"శంకర్! నీ ఫోను నంబరు ఒక చిట్టి మీద రాసియివ్వు. ఊరికెళ్ళగానే డబ్బు పంపిస్తాను. 
నువ్వు చేసిన సాయం జీవితాంతం మరచిపోను. నీకు కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. చిన్న వాడివయినా చేతులెత్తి  దణ్ణం పెడుతున్నాను" నమస్కరిస్తూ అన్నాడు విశ్వనాథ్. 
చిట్టీ మీద తన ఫోను నంబరు రాసి ఇస్తూ "అన్నా! అట్టా చేయకు. నాకస్సలు నచ్చదు. నీ పానం బాగా లేదని కండక్టర్ కి చెప్పి, నా ఫోను నంబరు ఇంకో చిట్టీ మీద రాసిచ్చిన. తోవలో అవసరమొస్తే  నాకు ఫోను చెయ్యమని చెప్పిన. ఎందుకైనా మంచిది నీ తమ్ముడి ఫోను నంబరు నోటికి గుర్తుంటే నాకు చెప్పన్నా" అడిగాడు ఆటో శంకర్. 
ఫోను నంబరు చెప్పాడు విశ్వనాథ్. నంబరు నోటు చేసుకుని "ఇంటికి చేరంగానే ఫోను చెయ్యన్నా. నమస్తే! నేనుంట" అని చెప్పి బయటకు వచ్చి బస్సు స్టాండులో పబ్లిక్ ఫోను నుంచి విశ్వనాథ్  తమ్ముడు శంకరానికి ఫోను చేశాడు ఆటో శంకర్. 
                                                                     * * * * * 
 "హలో! 'సంకరం' గారేనా మాట్లాడేది ?"అన్నాడు ఆటో శంకరం 
"నాపేరు శంకరం... సంకరం కాదు" 
"సంకరన్నా! ఇది ఇను. ఇందాక ఒక పెద్దాయన అమీర్ పేట స్మశానం బయట ఆటో స్టాండు కాడ  స్పృహతప్పి  పడిపోయిండు. ఆయన ఫోను నుంచి గిదే నంబరుకి చివర ఫోను చేసిండు. అందుకే నీకు ఫోను చేసిన. ఆయన నీకు చుట్టమో, పక్కమో నాకు తెల్వదు. అంబులెన్సుకు నేనే ఫోను చేసిన. వాల్లొచ్చి ఆయన్ని తీసుకుపోయింరు. ఏ హాస్పిటల్ కి  తీసుకపోయిన్రో వివరాలు నాకు తెల్వదు. ఆమనిషి నీకు తెలిసుంటే వివరం కనుక్కుంటావని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోను చేసిన. గింతే... " అని ఫోను పెట్టేశాడు ఆటో శంకర్.   
                                                                     * * * * *
'అన్న' విశ్వనాథ్ కి ఏమైనా ప్రమాదం జరిగిందా నన్న అనుమానం వచ్చి భయపడ్డాడు శంకరం. వెంటనే అన్నకి ఫోను చేశాడు. ఫోన్ పనిచేయడంలేదని రికార్డెడ్ మెసేజ్ వస్తోంది. 
''రమా! అన్నయ్య స్మశానం దగ్గర ఆటో స్టాండ్ దగ్గర స్పృహతప్పి పడిపోయాడట. అంబులెన్సు వాళ్ళు ఏదో ఆస్పత్రికి తీసుకెళ్లారట. నీ మాట విని బుద్ధిలేని పని చేశాను. నీకు పట్టింపని నన్ను పెంచిన అన్నని  నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలి వచ్చాను. ఇంటికి రాకూడదన్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించాను. చేతిలో డబ్బుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అన్నయ్యను ఎక్కడని వెదకాలి ?" అని తలపట్టుకుని బాధ పడుతూ వెంటనే బయలుదేరాడు. 
ఆమీర్ పేట చుట్టు పక్కల వున్నఆసుపత్రులన్నీ మూడు గంటల పాటు వెదికాడు.
గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ చెక్ చేశాడు. జాడ  తెలియలేదు. మళ్ళీ అన్నకి ఫోను చేశాడు. ఇంకా ఫోన్ పనిచేయడంలేదని మెసేజ్ వస్తోంది. ఏం చేయాలో పాలు పోలేదు. 
ఊళ్ళో వదినకు ఫోను చేశాడు. అన్న ఇంకా రాలేదని, ఆయన ఫోను కూడా పనిచేయడంలేదని వదిన చెప్పింది. శంకరానికి ఇంకా కంగారెక్కువయింది. తను చేసిన పనికి శంకరం మనసు వ్రయ్యలయింది.  
ఇంతలో ఫోను మోగింది. ఫోను తీశాడు శంకరం. ఏదో ల్యాండ్ లైన్ నుంచి ఫోను. 
"శంకరం! ఇప్పుడే కోదాడలో బస్ దిగి నువ్వు కంగారు పడతావేమోనని బస్ స్టాండ్ నుంచి ఫోను చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళాక నీరసంతో కళ్ళుతిరిగి కూలబడ్డాను. 
ఎవరో ఆటో అతను ... అతని పేరు శంకరమే! స్వంత తమ్ముడిలా నాకు భోజనం పెట్టించి, టికెట్ కొని బస్  ఎక్కించి వెళ్ళాడు. క్షేమంగా ఊరికి చేరానని చెప్పడానికి ఫోను చేశాను. వుంటాను" అని చెప్పి ఫోను పెట్టేశాడు విశ్వనాధ్!    

                                    * * * * *            సమాప్తం          * * * * *

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254