లేబుళ్లు

25, డిసెంబర్ 2014, గురువారం

ఇండియాలో 2014 వరకు 'భారతరత్న' బిరుదాంకితులు

                                   ఇండియాలో  1954 - 2014  వరకు  'భారతరత్న' బిరుదాంకితులు
                                   ----------------------------------------------------------------------

 
1954      సర్వశ్రీ.   1. సర్వేపల్లి  రాధాకృష్ణ,             2. సి. రాజగోపాలాచారి                  3.  సర్. సి.వి. రామన్
  
1955          "       4. భగవాన్ దాస్                       5. మోక్షగుండం  విశ్వేశ్వరయ్య        6. జవహర్లాల్ నెహ్రు 

1957          "       7. గోవింద వల్లభ పంత్ 

1958          "       8. దొండో కేశవ్  కార్వే 

1961          "       9. బిధాన్ చంద్ర రాయ్              10. పురుషోత్తం దాస్ టాండన్ 

1962          "     11. రాజేంద్ర ప్రసాద్ 

1963          "     12. డా.జాకీర్ హుస్సేన్               13. పాండురంగ వామన్ కాణే

1966          "     14. లాల్ బహదూర్ శాస్త్రి 

1971          "     15. ఇందిరా గాంధీ

1975          "     16. వి.వి.గిరి 

1976          "     17. కె. కామరాజ్ 

1980          "     18. మదర్ థెరిసా 

1983          "     19. ఆచార్య. వినోబా భావే

1987          "      20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 

1988          "      21. ఎం. జీ. రామచంద్రన్ 

1990          "      22. డా.  బి. ఆర్. అంబేద్కర్      23. నెల్సన్ మండేలా 

1991          "      24. రాజీవ్ గాంధీ                     25. వల్లభ భాయ్ పటేల్         26. మొరార్జీ దేశాయ్ 

1992          "      27. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్  28. జె ఆర్ డీ. టాటా       29. సత్యజిత్  రే

1997          "      30. గుల్జారీ లాల్ నందా          31. ఏ పీ జె. అబ్దుల్ కలాం       32. అరుణా అసఫ్ ఆలి 

1998          "      33. ఎం ఎస్. సుబ్బలక్ష్మి           34. చిదంబరం సుబ్రహ్మణ్యం 

1999          "      35. జయ ప్రకాష్ నారాయణ      36. అమర్త్య సేన్                    37. గోపీనాథ్ బర్దోలాయి 
                          38. పండిట్. రవిశంకర్ 
2001          "      39. లతా మంగేష్కర్                40. ఉస్తాద్. బిస్మిల్లా ఖాన్      

2009          "      41. పండిట్. భీమ సేన్ జోషి 

2014          "      42. సి ఎన్ ఆర్. రావు               43. సచిన్  టెండూల్కర్ 

2015          "      44. అటల్ బిహారీ వాజపాయీ   45. పండిట్. మదన్ మోహన్ మాలవీయ 

 

30, జులై 2014, బుధవారం

కొండ


                                                         కొండ
                                                -----------------------
దాదాపు రాత్రి  రెండు గంటలవుతోంది. రేపు శలవు కదాని కొద్దిగా ఎక్కువ సేపు చదువుకొని ఇప్పుడే  పడుకున్నాను. ఇంతలో ఇంటి వెనకాల ఉన్న మా చేద భావినుంచి  'దబ్బు' మని  ఏదో పడ్డ శబ్దం. దానితో పాటు భావిలోగూటిలో ఉన్న పావురాలు భావిలోనే ఎగురుతున్న శబ్దం.
ఊళ్ళో విపరీతంగా దొంగతనాలు. ఎందుకైనా మంచిదని నాన్నగారిని కుడా లేపి ఇంటి వెనకాల లైట్స్ వేసి ఇద్దరం దొడ్లోకి వెళ్ళాము. భావిలో ఇంకా పావురాలు విపరీతంగా ఎగురుతున్న శబ్దం వస్తూనే వుంది. టార్చిలైట్ భావి లోకి ఫోకస్ చేశాను.
లైట్ కాంతి కన్పించే సరికి పావురాలు రెండు పైకి ఎగిరి బయటకి వచ్చేశాయి.
భావిలో నీళ్లు ఏదో పెద్ద వస్తువు పడ్డట్లుగా అలలతో కల్లోలంగా వుంది.
టార్చిలైట్ తో భావిలో అన్ని పక్కలా చూశాను. ఒక పక్కన కొద్ది ఒడ్డు పట్టుకుని చెయ్యి ఊపుతూ 'సార్ , సార్' రక్షించండి. భావి చాలా లోతుగా వుంది. తాడు వెయ్యండి'.
వాడి మాటలు ప్రతిధ్వనిస్తూ వినిపించాయి.
నాన్నగారు నేను బిత్తర పోయాం.
'అసలు ఎవడు వాడు ?  దొంగా? అయితే భావిలో ఎందుకు పడ్డాడు'? అంతా అయోమయంగా వుంది అనుకుంటూ 'ఎవరినన్నా పిలుద్దాం నాన్నా' అన్నాను నేను.
ముందు చేంతాడు వెయ్యి భావిలో. వాడు చస్తే మన చావుకొస్తుంది అన్నారు  నాన్నగారు.
నాకేమి అర్ధం కాలేదు. గబగబా భావిలోకి తాడు వదిలాను.
వాడు ఇటు పక్కకి కొద్దిగా ఈది తాడు పట్టు కున్నాడు.
చేంతాడు అంతా బలంగా లేదు నాన్నగారూ! వెళ్లి మోకు తెస్తాను. ఈ తాడు తెగితే వాడు మళ్ళీ  పడి చస్తాడు.
ఆ తాడు పైన ముడి వేసి పరుగెత్తి వెళ్లి మోకు తెచ్చి పైన కట్టి భావి లోకి వదిలాను.
రెండు తాళ్ళు జత చేసి  మెలిక వేశాను. వాడు మెల్లగా పైకి వచ్చిఒక్కసారిగా భావి అంచు మీదనుంచి దూకి పరుగు లంకించు కున్నాడు. నేను ధైర్యం చేసి ఒక్క ఉదుటున  పరుగెత్తి పట్టుకున్నాను వాడిని. వాడు గింజు  కుంటున్నాడు. లైట్ కాంతి లో వాడి ముఖం చక్కగా కనిపించింది.
నాన్నగారూ, వీడు 'కొండ' గాడు. ఈసారి బిత్తర పోవడం నాన్నగారి వంతు అయింది.
వాణ్ని లాక్కుని వరండా లోకి వచ్చాము.వాడు నిక్కరు నుంచి నీళ్లు  ఒడుస్తున్నాయి.
'ఏరా కొండా', భావిలోకి ఈవేళ  ఎందుకు దిగావు ? మేం రాక పోతే చచ్చేవాడివి గదరా 'గాడిద కొడకా' అన్నారు నాన్నగారు.
'మాట్లాడవేం? నాలుగు తగిలించ మంటావా'? కోపంగా లేచారు నాన్నగారు.
వాడు తలెత్తడం లేదు. చేతులు కట్టు కున్నాడు.
నేను లేచి నాన్నగారిని కూర్చో బెట్టి 'చెప్పరా'? మాట్లాడు. రెట్టించాను నేను.
మీకు తెలుసు గదండి అయ్యగారూ, మానాయనకి పక్ష వాతమని.
'పావురం ఇంటిలో పెంచుతే 'వాతం' నయమైతదని ఎవరోఅంటే ఇన్నాను.
చీకట్లో వాటికి కళ్ళు కన్పించవు కదా సులువుగా పట్టుకోవచ్చనుకొని భావిలోకి దిగాను. పావురాలని పట్టుకెళ దామని....పాడు పావురాలు చీకట్లోముఖం మీద తన్నినై. అందుకే పట్టు తప్పి భావిలో పడ్డ నయ్యా!
మిమ్ముల్ని ఆడుగుతే ఇవ్వరని, పావురాల్ని పట్టుకోనివ్వరని,అర్థరాత్రి భావిలో దిగి
ఇట్టాపట్టు బడ్డనయ్య. తప్పయింది.అంటు ఏడుపు లంకించుకున్నాడు 'కొండ'.
'పిచ్చి ముండా కొడకా' చచ్చే వాడివికదా! పదా, అన్నారు, నాన్నగారు లేస్తూ .
'ఈరాత్రి వేళ మీరెక్కడికి నాన్నగారూ'? అన్నాను నేను
'వీణ్ణి ఈవేషంలోనే తల్లి కి చూపించి రావాలి' అని బయలుదేరారు.
 'నేనూ వస్తాను' అని తలుపులు బయటనుంచి వేసి బయలు దేరాం.
'అయ్యా, బాయి వెనకాల చొక్కా వుందయ్యా, తెచ్చుకుంటా' అని పరుగెత్తాడు కొండ.
'అది అక్కడే  వుండనియ్యి. వాణ్ని లాక్కుని రా వెధవని' అంటూనే బయదేరారు నాన్నగారు.
నాన్నగారి వెంట నేను, వాడు వాళ్ళింటికి  వెళ్ళాం.
కొండ తలుపు కొట్టాడు.
తల్లి తలుపు తీసి, కొండను, నన్ను, నాన్నగారిని చూసి కంగారు పడింది.
కొడుకుని తడి నిక్కరుతో చూసింది.
"ఏరా అయ్యగారి భావిలో దిగినవా"?  వద్దని చిలక్కి చెప్పినట్లు చెప్పిన గదరా....అంటూనే రెండు చెంపలు వాయించింది" సీతమ్మ.
'ఏం దయ్యగారు…ఇయ్యాల టప్పుడు మీరు ఇట్లా వచ్చింరు' ? అంది సీతమ్మ.
నాన్నకి నాకు అంతా అయోమయం. నాన్న గారు కోపం అపులేకపోయారు.
అంటే  వీడు నీకు తెలిసే వచ్చాడా?  బుద్ధుందా అసలు.
పావురం  కోసం  అర్దరాత్రి భావిలో దింపుతావా? వాడు మునిగి చస్తే?
బిత్తరచూపులు చూసింది ...సీతమ్మ!
'పావురాలేంది అయ్యగారూ'నాకు అర్ధం కావట్లే అంది సీతమ్మ.
'అదేంటే ? తండ్రికి పక్ష వాతం కదా. పావురాన్ని ఇంట్లో పెంచుతే పక్ష వాతం తగ్గు తుందని ఎవరో చెప్పారని చెప్పాడే వాడు అన్నారు నాన్నగారు.
నన్ను అడిగితే కాదంటా నని అర్దరాత్రి భావిలో దిగాడు వాటిని పట్టుకుందామని .....
"అయ్యో...కాదయ్యగారు....అందుకు కాదు వాడు భావిలో దిగింది. ఏడుస్తూ అంది" సీతమ్మ.
విస్తుబోయి  నాన్నగారి వంక చూశాను నేను..నాన్నగారి పరిస్థితి కూడ అలాగే వుంది.
'కొండ' దిగ్గున ఒక్కసారి గా ముందుకు వచ్చి "అయ్య గారు నిద్రలో లేచింది...రాత్రి కొద్దిగా తాగింది కూడ...ఏదేదో మాట్లాడుతోంది అమ్మ " అంటూనే
తప్పయి పోయింది ....చమించండయ్యా...అంటూ నాన్నగారి కాళ్ళుపట్టుకున్నాడు 'కొండ'.
"వెధవ తాగినట్లున్నాడు...ఇందాకట్నుంచీ అందుకే నోరు విప్పలే.. అన్నారు నాన్నగారు వెనక్కి జరుగుతూ.
"అయ్యా నేను రేపు చెపుతా ఈడు ఎందుకు భావిలో దిగాడో", ఇప్పుడు  మీ రెల్లండి' అంది సీతమ్మ ఏడుస్తూనే కొడుకుని ఉరిమి చూస్తూ.
"సరే, పదరా వెళదాం. రేపు చూద్దాం ఈ వెధవ సంగతి." అన్నారు నాన్నగారు ఇంటికి నడుస్తూ.
'పావురం కాకపొతే వీడెందుకు భావిలో దిగినట్లు'?..'పావురం కాదురా, ఇంకేదో వుంది.
వాడేదో దొంగతనానికి వచ్చి ఏదైనా అలికిడి వల్ల భావిలో దిగాడా? ఎందుకు దిగినట్లు?
భావిలో బిందె గాని, వెండి వస్తువులు గాని ఏమైనా పడిపోయాయా కనుక్కో"అన్నారు నాన్నగారు..  '.అయినా సీతాలు రేపు చేపుతానందిగా'...నడువు అన్నారు నాన్నగారు వడిగా అడుగులు వేస్తూ.
ఇంటికెళ్ళే టప్పటికి మూడున్నర అయింది. అమ్మ లేచే వుంది. ఏమిటీ ? ఏమయింది? 'అర్దరాత్రి ఎక్కడికి వెళ్ళారు, తండ్రీ, కొడుకు'!
'తలుపులు కూడా సరిగ్గా వేయలేదు. గేదెలు గాని మళ్ళీ విడిపించుకున్నాయా?
మొక్కలన్నీ తోక్కేశాయా? ఎన్ని సార్లు చెప్పినా వాటికి ఇనుప గొలుసులు  తేరు.
మొక్కలన్నీ ధ్వసం'. అమ్మ గొణుక్కుంటూనే పడుకుంది.
'నువ్వు కూడ వెళ్లి పడుకోరా రాత్రి చాలా సేపు చదివినట్లున్నావుగా', అన్నారు నాన్నగారు.
పడుకున్నానే గాని నిద్ర రాలేదు. సీతమ్మ మీదే ధ్యాస అంతా.ఇంటిల్లి పాదికీ తలలో నాలుకలా వుంటుంది.
నేను పుట్టక ముందు నుంచి పనిచేస్తోంది ఇంట్లో అన్నలు, అక్కలు, మా చుట్టాలు, అంతెందుకు,బావలందరూ కూడ
చాలా అభి మానిస్తారు తనని. ఈ ఇంట్లో పని మనిషి గా ఎప్పుడు అనుకోలేదు తనని.
అమ్మ కూడా పల్లెత్తు మాట అనదు.
'కొడుకని కుడా చూడకుండా వాడు పావురానికి కాదు, వచ్చింది' అని చెప్పింది.
వెధవ 'కొండ' గాడు కూడా ఈ ఇంట్లో మనిషిలానే ఉంటాడు. నాకు వాడికి వయసులో అయిదు నెలల తేడా అని సీతమ్మ చెపుతూ వుంటుంది. వాణ్ని చదువుకొమ్మని నాన్నగారు చాలా ప్రోత్సహించారు. కానీ వాడికి చదువు అబ్బ లేదు. ఆరో తరగతి మధ్యలో  మానేశాడు.
ఇంట్లో అందరి దగ్గరా చనువు వాడికి. ఒకళ్ళకి తెలీకుండా అందరి దగ్గరా కొద్దో , గొప్పో డబ్బులు తీసుకుంటూనే ఉంటాడు. సోమరి వెధవ. ఈ మధ్య  వెధవకి
వ్యసనాలు కూడ అలవాటు  అయినట్లుంది. ఈమధ్య రెండు, మూడు సార్లు అయిదు,
పదీ కనపడలేదనీ అమ్మా అందీ, నా రూములో కూడ కొద్దిగా డబ్బులు మిస్సయినట్లు అనుమానం వచ్చింది. వెధవ పాడయ్యాడు.
వాడి తండ్రికి మందులు కూడా చాలా వరకు మాఇంటి నుంచే వెళ్తాయి.
ఒకసారి దీపావళి పండక్కి బావలు, అక్కలు,అన్నలు అందరు వచ్చారు.
వదిన నా  షర్టు గుండీ కుట్టి సూది వాడి చేతికిచ్చి కేలండర్ కి గుచ్చమంది.
'కొండ'గాడు వెళ్లి సూదిని  పవర్ సాకెట్ లో పెట్టాడు. కరెంటు షాక్కి వచ్చి మా బావగారి వొళ్ళో పడ్డాడు. అందరం ఒకటే నవ్వు కున్నాము.
ఏమయిందిరా అంటే 'దిమ్మ తిరిగింది,తరువాత ఏమయిందో తెలవదు.బావగారి ఒళ్ళో ఎట్టా పడ్డానో తెలీదు' అన్నాడు.
అది గుర్తు వచ్చినప్పుడల్లా అందరం పడీ,పడీ నవ్వు కుంటాం.
అలాంటి అమాయకపు వెధవ ఇలా తయారయ్యాడు అనుకుంటూ నిద్రకు కుపక్రమించాను.
తెల్లారింది.
నేను వేప పుల్ల నోట్లో వేసుకుని వాకిట్లోనే  వున్నా. సీతమ్మ వచ్చి తలెత్తకుండా వాకిలి వూడవడం మొద లెట్టింది. ఇంతలో నాన్నగారు కాఫీ  కప్పుతో వరండా లోకి వచ్చి" ఏమే' సీతాలు' రాత్రి ఏదో అంటివి.వాడు పావురాయి కోసం కాదా భావిలో దిగింది" మరి దేని కోసం ? అన్నారు , నాన్నగారు.,' ఏందో నయ్యా రాత్రి నిద్రలో  ఏం మాట్లాడానో, ఏందో ! వాడు పావురాయి'  కోసమే వచ్చిండటయ్యా'! అంది తల వంచుకుని వాకిలి ఊడుస్తూనే.
తను నిజం చెప్పడం లేదని ఏదో ఒత్తిడిలో వుందని సీతాలు ముఖ కవలికలే చెబు తున్నాయి. 'సరేలే వాడు జాగ్రత్త. వెధవ చేతికందకుండా పోయేటట్లు న్నాడు.
వాణ్ని ఒక కంట కనిపెడుతూ వుండు'అన్నారు నాన్నగారు లోపలి కి వెళ్తూ.
ఇంతలో పక్కింటావిడ గోడ మీద నుంచి పిలుస్తూ " ఏంటి కిట్టయ్య గారు రాత్రి గొడవ" అంది.
'కొండ'  రాత్రి పావురం కోసం భావిలో దిగాడు. 'అట్టానే అనుకోండి కిట్టయ్య గారు, ఎప్పుడో వాడు మీ ఇంటికో,మా ఇంటికో కన్నం వేసిందాక' అంది పక్కింటావిడ వెటకారంగా.
"అదేందమ్మా అట్లంటారు వాడేం చేశాడమ్మా" అంది సీతాలు.
సీతాల్తో మాట్లాడకుండా "ఇదిగో కిట్టయ్య గారు మొన్న మీరు  వూరు వెళ్లి నప్పుడు మీ పాత రేకులు వాడు సర్దు తుంటే చూశాను. తరువాత మీ అమ్మగారు వూరి నుంచి వచ్చాక రేకులు పోయినై, పాతవే నని పట్టించుకోలేదని" అన్నారు.
రాత్రి 'కొండ' భావి లో పావురాల్లకోసమే దిగాడంటే నేను నమ్మను. సరిగ్గా కనుక్కోండి' అంటూ వెళ్లినా ఆవిడ మాటలు విన్న నాకు అసలీ సంగతేమిటో తేల్చాలి అన్న భావన గట్టిగా స్థిరపడింది నామదిలో.
సీతాలు  తల ఎత్తకుండా పనిచేసు కుంటూనే  వుంది. వెధవ వాడి మూలాన్న సీతమ్మ మాట పడాల్సి వస్తోంది ఆనుకున్నా నేను. ఇంతలో నాన్నగారు  'కృష్ణా' ఇలారా! అన్నారు.
నేను నోట్లో వేప పుల్ల తీసి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను.
'సీతమ్మని  నువ్వు గాని ,అమ్మ గాని ఎవరూ ఏమి అడగొద్దు. దానంతట అది ఏమైనా చెపుతే నాకు చెప్పండి. మళ్ళీ చెపుతున్నా దాన్ని ఎవరూ ఏమీ అడగకండి.అమ్మకు కుడా చెప్పు' అన్నారు నాన్నగారు. అదీ దాని మీద మా అందరికి ఉన్న అభి మానం. వారం, పది రోజులయ్యాయి.
కొండ గాడు మళ్ళీ  కన్పించ లేదు. నాన్న  గారు మాత్రం వాడికి దగ్గర పట్టణం లో ఏదైనా వుద్యోగం వేయిద్దామని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుసు. దాదాపు నెల రోజుల తరు వాత అనుకుంటా నాన్న గారు పొలంలో నాట్లు. నువ్వు కూడా   పొలానికి రమ్మని చెప్పి ఉదయమే వెళ్ళారు. నేను నాన్నగారికి టిఫెన్ తీసుకుని తొమ్మిది గంటలకల్లా పొలానికి వెళ్ళాను. కొండ గాడు నారు కట్టలు అందిస్తూ, కుదప తొక్కుతూ పై పనులు చేస్తూ కన్పించాడు. ఎప్పుడు వస పిట్టలా వాగే వెధవ నావంకే సరిగ్గా చూడ్డం లేదు.' ఏరా కొండా  ఆరోజు నుంచి కనిపించడం మానేశావు   ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు'? అనడిగాను వాణ్ని.' అదేంటి కిట్టయ్య గారూ, నాన్న గారు చెప్పా లేదా! అయ్య గారు పట్నంలో
ఉద్యోగం వేయించారు. టెంపరవరి.  1500 /- జీతం కిట్టయ్య గారు.బుద్ధి వచ్చింది. చేరి కూడా పది రోజులయింది.
అయ్యగారు ఇవాళ కూలి కి రమ్మన్నారు. వచ్చినా' అన్నాడు హుషారుగా కొండ.
'సరేలే...పని చూసుకో' అని నాన్న గారికి   టిఫెన్ ఇస్తే  వద్దన్నారు. ఇంటికెళ్ళి స్నానం చేసి వస్తానన్నారు. సరే నాన్నగారూ..స్నానం చేసి,  భోజనం కూడా చేసి వచ్చేయండి  నేను ఇక్కడే వుంటాను,అన్నాను.'నాన్నగారు ఇంటికి వెళ్ళారు. ఇక నేను వాడితో కలిసి పని మొదలెట్టాను. ఎలా అయినా సరే ఆరోజు సంగతి ఇప్పుడు తేల్చాల్సిందే,  అనుకున్నా. దాదాపు పన్నెండు అయింది టైం.
కూలీ లంత భోజనాలు చేస్తున్నారు. నా దగ్గర టిఫెన్ తీసి తినడం మొదలెట్టా. కొండ గాడిని కూడ పిలిచా.
'ఏందీ కిట్టయ్య గారు టిఫెన్'? అన్నాడు కొండ. ఇడ్లీ ,దోస రెండు వున్నాయి రా...తిందాం." అన్నాను నేను.
ఎలాగయి నా సరే వాడి దగ్గరనుంచి ఆ రోజు విషయం లగాల్సిందే అనుకున్నా.
వాడు దగ్గరకొచ్చి కూర్చున్నాడు.
ఇద్దరం టిఫెన్ తినడం మొదలెట్టాం. నేను ఎలా మొదలు పెట్టాలి టాపిక్ అని ఆలోచిస్తున్నా.
"కిట్టయ్య గారూ, ఎందుకంత ఆలోచిస్తారు. మీకు కావలసింది ఆరోజు నేను భావిలో ఎందుకు దిగానని కదా"! ఇదుగోండి, వినుకోండి.నేను భావిలో దిగిన రోజు రెండు రోజుల ముందు మీపిన్ని గారు వచ్చారు కదా.
ఆవిడ రెండు రోజులు వున్నారుకదా.ఆవిడ బాగా నగలేసుకొచ్చారు.అమ్మగారు ఎందుకె ఇన్ని నగలేసుకోచ్చావు? అనడిగారు
అప్పుడు నేను అక్కడే వున్నాను. అమ్మగారు పిన్నిగారితో అసలే ఈ వూళ్ళో దొంగలు కదనే.జాగ్రత్త, ఎక్కడ దాస్తావు ఈ రెండు రోజులు? అనడిగారు అమ్మగారు.
'నీకెందుకే భయం. నానగలు, నేను ఎక్కడయినా దాచుకుంటాను. అదేనే ఎక్కడ దాస్తావు'? అని అమ్మగారు మళ్ళీ అడిగారు. "అబ్బా నీ భయం పాడుగాను. కంగారు పడకు. వాటిని ఒక ఇనుప తీగకు చుట్టి ప్లాస్టిక్ సంచిలో వుంచి మీ భావి లో వేశేశాను, దాచేశాను". అన్నారు మీ పిన్ని గారు."ఆ, అయ్యో..అయ్యో.. మళ్ళీ వాటిని ఎట్లా తీస్తావే? ఏమిటో ఈ పిల్ల అఘాయిత్యం"  ఏమండీ... అంటూ అమ్మగారు లోనికి వెళ్ళారు. పిన్ని గారేమో పగలబడి నవ్వుతు,
ఏరా 'కొండా' మీ అమ్మగారికి ఇంతా భయమేమిటి రా"? అన్నారు.
అబ్బ, భలే చాన్సులే అప్పుడే మనసులో అనుకున్నాను.
ఎలాగయినా సరే ఆ నగల్ని భావిలోనుంచి తీసి అమ్ముకుందా మనుకున్నాను.
వెంటనే నేను చేతిలో పని ఆపు చేసి భావి లోకి  తొంగి చూస్తుంటే అమ్మగారు, ఏం చేస్తున్నావురా అక్కడ అని గద్దించారు కూడా!  అదీ సంగతి… ఆ నగల కోసం దిగాను భావిలో. వెతికి,వెతికీ చచ్చాను. అసలు మీ పిన్ని గారు నగల్ని భావిలో వేయలేదు.
ఆవిడ ఎక్కడో దాచి అమ్మగార్ని నవ్వులాట  పట్టిస్తుంటే నేను నిజమే అనుకున్నాను.
బుద్ధి వచ్చింది కిట్టయ్య గారు.మళ్ళీ జన్మలో దొంగతనం గురించి ఆలోచన గూడా చేయను. అయినా దేవుడి లాంటి అయ్యగారింట్లో నే దొంగతనం చెయ్యాలనుకున్నా.చాలా తప్పు చేసినాను కిట్టయ్యగారు.
అమ్మ ఈ విషయం అయ్యగారికి చెప్పి చమించమని కాళ్ళు పట్టుకోమంది.లేకుంటే చస్తానని కూడ అన్నది. చమించండి. అయ్యగారికి, అమ్మగారికి చెప్పండి. నాకు అయ్యగారికి చెప్పే ధైర్నం లేదు. ఎంత పెద్ద మనసో అయ్యగారిది. ఇంకొక్క విషయం కిట్టయ్య గారు...అక్కలకి, అన్నలకి ఎవరికీ ఈ విషయం మాత్రం చెప్పొద్దు. నా పరువు పోద్ది.మళ్ళీ ఒక్క పైసా కూడ రాలదు.
వెధవ నీ బుద్ధి మారదురా అనుకున్నా.అయినా సరే వాడి మీద నాకు, కోపం గాని,అసహ్యం కాని కలగలేదు.ఇదంతా సీతమ్మ మీద మా కున్న అభిమానం.
ఇక చూడండి.......నాకు నవ్వు ఆగలేదు.ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి...ఎప్పుడు అందరికి చెప్పాలి, అన్న ధ్యాసలో పడ్డాను. ఈ విషయం గుర్తు కొచ్చినప్పుడల్లా అందరం తెగ నవ్వు కునే వాళ్ళం. సీతమ్మకూడా మాతో కలిసి నవ్వు కునేది.

కేశిరాజు వెంకట వరదయ్య.


25, జూన్ 2014, బుధవారం

WHAT IS THERE TO FEEL PROUD OF..........




WHAT IS THERE TO FEEL PROUD OF..........
                 What is there to celebrate ?............we have so little to celebrate with human development indicators lower in key areas than our south Asian neighbours and south Africa.
We are eating less in terms of calories than a decade ago. We have millions of males than females in our population and social consequences of this male surplus will be massive .Our education system is in shambles. our infrastrucure is scarily bad. The only town in India with clean water is jamshedpur.   
We have a fiscal crisis looming, shuttering growth, rising prices, stagnating Agriculture, caste,and religious descrimination, partisan politics to the maximum and policy paralysis. Governance, particularly at State levels where one Chief Minister replaces another, is so awful that you run out of adjectives. (by Kanti Bajoai TOI, 28-04-2012)) 

‎15 - GREAT THOUGHTS BY CHANAKYA

‎15 GREAT THOUGHTS BY CHANAKYA

1) "Learn from the mistakes of others... you can...'t live long enough to make them all yourselves!!"

2)"A person should not be too honest. Straight trees are cut first and Honest people are screwed first."

3)"Even if a snake is not poisonous, it should pretend to be venomous."

4)"There is some self-interest behind every friendship. There is no friendship without self-interests. This is a bitter truth."


5)" Before you start some work, always ask yourself three questions - Why am I doing it, What the results might be and Will I be successful. Only when you think deeply and find satisfactory answers to these questions, go ahead."


6)"As soon as the fear approaches near, attack and destroy it."


7)"The world's biggest power is the youth and beauty of a woman."


8)"Once you start a working on something, don't be afraid of failure and don't abandon it. People who work sincerely are the happiest."


9)"The fragrance of flowers spreads only in the direction of the wind. But the goodness of a person spreads in all direction."


10)"God is present in your feelings. The soul is your temple."


11) "A man is great by deeds, not by birth."


12) "Never make friends with people who are above or below you in status. Such friendships will never give you any happiness."


13) "Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends."


14) "Books are as useful to a stupid person as a mirror is useful to a blind person."


15) "Education is the Best Friend. An Educated Person is Respected Everywhere. Education beats the Beauty and the Youth."

 

Laughing Faces / Keeping Silence:

Laughing Faces:

Laughing faces do not mean that they do not have any problem, difficulty and sorrow.
It means that they have ability to deal with and face them.

Keeping Silence:

Keeping silent does not always mean 'yes'. Sometimes it means " I am tired of explaining to people
who don't even care to understand me" !

Financial Stability:
When God blesses you financially do not raise your standard of living. Raise your standard of Giving.
Relationship :
Relationship never die a natural death. They often killed by attitude, ego, behaviour, ignorence and hidden benefits.
Winners :
Winners are those people who never fail in their attempts but those who never quit their attempts.


తెలుగు భాష

 తెలుగు భాష


  • 'నాగరిక జాతి' మాతృభాషలోనే మాట్లాడుతుంది' అని ప్రముఖ ఆంగ్ల కవి  డబ్ల్యూ.బి.ఈట్స్ వాఖ్యానించాడు. దీన్నిబట్టి  మనం మనది అంటే 'తెలుగు వారిది' నాగరిక జాతి  అవునో, కాదో నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమయింది.


  • 'డాలరు గడ్డకైనా, ఇంకేదేశానికయినా  వెళ్ళడానికి కావలసిన ఆంగ్లమెంత' ? దానికోసం 'మాతృభాషను' నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. కాని అదే జరుగుతోంది. దీన్ని నియంత్రించుకోవాలి. 


  • 'తెలుగుభాష' అంతరిస్తుందన్న భయం అవసరం లేదు. ఒక జాతి సజీవంగా, చైతన్యవంతంగా ఉన్నంతకాలం, కొన్ని ప్రలోభాలకు లోబడినంత మాత్రాన 'భాష' అంతరించదు. కాని ఆజాతి కళ్ళు తెరవాల్సిన సమయం, తమను తాము, తమ భాషకు పునర్వైభవం తీసుకురావా ల్సిన ఆసన్నమయింది.. అందుకు యువత నడుంకట్టాలి.తెలుగు మాట్లాడుతూ పుంఖాను పుంఖాల ఆంగ్ల పదాలు వాడే దుస్సంస్కృతిని విడనాడాలి.  


  • అన్యభాషాపదాల్ని కలుపుకునే 'భాషే' సుసంపన్నంగా ఉంటుంది. కాలానుగుణంగా అన్య భాషా పదాలనూ స్వీకరించాలి. ఇముడ్చుకోవాలి. 


  • రాసినట్లే ఉచ్ఛరించడం, ఉచ్ఛరించినట్లే  రాయడం (వ్రాయగలగడం) 'తెలుగు భాష' కు ఉన్న ప్రధాన లక్షణం.    ఏ భాషకు ఈ సౌలభ్యం లేదు.

సూచన :  పైన వ్రాసిన ఈ పరిశీలనా వాఖ్యలు 'తెలుగువెలుగు' మాస పత్రికలో  పద్మభూషణ్ డాక్టర్. సి. నారాయణరెడ్డిగారి 'తెలుగదేలయన్న' వ్యాసము లోనివి. తెలుగువారిలో 'జాగృతి' రావాలి. 'తెలుగు' భాషకు పునర్వైభవం రావాలి.     

అనుమానం పెనుభూతం

అనుమానం పెనుభూతం
                                     
                                                             అనుమానం పెనుభూతం

              అనుమానం పెనుభూతం. అది మనిషిని ఎంతటి నీచత్వానికైనా దిగజారుస్తుంది పెద్దలెన్నడో చెప్పారు.
మదిలో ఒకసారి అనుమాన బీజం పడితే చాలు  అది మనిషిని దిద్దుకోలేని తప్పులు చేయిస్తుంది. మనసును నిలువెల్లా కలుషితం చేసి హేతుబద్ధమైన ఆలోచనాశక్తిని నాశనం చేస్తుంది.
అంతటితో ఆగదు. బుద్ధిని వక్రమార్గం పట్టిస్తుంది. నిజం చెప్పాలంటే నీచత్వానికి దిగజారుస్తుంది.
అంతే కాదు. మనిషిని క్రూరులుగా మారుస్తుంది.          

Many will Dream .... Few will Race ... One will win !

Many will Dream .... Few will Race ... One will win !

11, జూన్ 2014, బుధవారం

    Often we forget   and  complain about life  and the negative things  that happen to us, forgetting that everything that happens is for a purpose. God knows why you are reading this message today, please bless someone with it  by sharing it.
God is Great.

26, జనవరి 2014, ఆదివారం

తెలుగు వారములు /మాసముల పేరు/ ఇంగ్లీష్ మాసముల పేర్లు / ఋతువులు / ధర్మాలు ( Names of Telugu Weeks, months and details how the names came into existence) :

 తెలుగు వారములు /మాసముల  పేరు/ ఇంగ్లీష్ మాసముల  పేర్లు  / ఋతువులు  /   ధర్మాలు.   
  
 ౧.  చైత్రము             ......  మార్చి / ఏప్రిల్       -  వసంతఋతువు    - చెట్లు చిగిర్చి పూలు పూస్తాయి.  
౨.  వైశాఖము          ......   ఏప్రిల్ / మే             -                    "           "
౩.   జ్యేష్టము            ......   జ్యేష్టం / జూన్          -   గ్రీష్మఋతువు       - ఎండలు ఎక్కువ.   
౪.  ఆషాడము         ......   జూన్ / జులై            
౫.  శ్రావణము         ......   జూలై / ఆగస్టు         -     వర్షఋతువు        - వర్షాలు కురుస్తాయి.  
౬.  భాద్రపదము      ......  ఆగష్టు / సెప్టెంబరు  
౭.  ఆశ్వయుజము   .....   సెప్టెంబర్ / అక్టోబరు -   శరదృతువు           - వెన్నెల కాస్తుంది. రాత్రులు ఆహ్లాదం.   
౮.  కార్తీకము           .....     అక్టోబర్ / నవంబరు
౯.  మార్గశిరము       .....    డిసెంబరు / జనవరి  -   హేమంతఋతువు - చలి. మంచు కురుస్తుంది.     
౧౦. పుష్యమి           .....    జనవరి / ఫిబ్రవరి 
౧౧. మాఘము        .....    జనవరి / ఫిబ్రవరి     -    శిశిరఋతువు     -  చెట్ల ఆకులు రాలును.
౧౨. ఫాల్గుణం          .....   ఫిబ్రవరి / మార్చి

తెలుగు వారాలు  వాటి  ఆవిర్భావ విశేషాలు : ( Names of  Telugu Weeks and details how the names came into existence) :
1.   ఆది వారం     :    ఆదిత్యుని (సూర్యుని) (రవి) పేరున ఏర్పడిన రోజు. దీనిని        ఆదిత్యవారం అనేవారు.అదే ఆదివారంగా మారింది. 
2.  సోమవారం      :   సోముని ( చంద్రుని)  పేరున ఏర్పడిన రోజు ఇది. ఆంగ్లములో చంద్రుణ్ణి 'మూన్' అంటారు. 
 'మూన్ డే ' కాస్తా కాలక్రమేణా  'మండే' అయింది. 
3.  మంగళ వారం :   కుజ గ్రహం (మంగళ/మార్స్) పేరున ఏర్పడిన రోజు ఇది.
4.  బుధవారం        :   బుధ గ్రహం( మెర్క్యురి) పేరున ఏర్పడిన  రోజు ఇది.
5.  గురు వారం       :   గురుగ్రహం ( జూపిటర్) పేరున ఏర్పడిన రోజు ఇది.
6.  శుక్రవారం         :   శుక్ర గ్రహం (వీనస్) పేరున ఏర్పడిన  వారం ఇది.
7.  శనివారం          :   శని గ్రహం   (సేటర్న్) పేరున ఏర్పడిన వారం ఇది. 

13, జనవరి 2014, సోమవారం

'రాశులు' వాటి తెలుగు, ఇంగ్లీష్ పేర్లు,వాటి గుర్తులు.

                            'రాశులు' వాటి తెలుగు, ఇంగ్లీష్ పేర్లు వాటి గుర్తులు   


                                                       రాశి'  పేరు

                                 తెలుగులో          ఇంగ్లీష్ లో         వాటి గుర్తులు
                                ------------        -----------        -------------
                                 మేషం                ఏరిస్                  మేక
                              వృషభం               టారస్                 ఎద్దు
                              మిధునం               జెమిని               కవలలు
                            కర్కాటకం               కేన్సర్               ఎండ్రకాయ
                                సింహం                లియో                 సింహం
                                  కన్య                  వర్గొ                   యువతి
                                 తుల                  లిబ్రా                  త్రాసు
                             వృచ్చికం              స్కార్పియో             తేలు
                             ధనుస్సు             శాజిటేరియన్           ధనుస్సు
                              మకరం                  కేప్రికార్న్            మొసలి
                              కుంభం                 అక్వారిస్         కొమ్ములున్నచేప
                               మీనం                   పైసెస్               రెండు చేపలు

                         

దేశ, విదేశ ప్రముఖ సంఘ సంస్కర్తలు ( Social Reformers)

దేశ, విదేశ ప్రముఖ సంఘ సంస్కర్తలు  :

గౌతమ బుద్ధుడు       క్రీ.పూ. 6-5  వ. శతాబ్దము - అశోకుని కాలమునుండి 'బౌద్ధమతము' ఆంధ్రులలో  వ్యాపించినది.

మహావీరుడు                    "    "    "               - చంద్రగుప్తుని కాలమునుండి 'జైన మతం' ఆంధ్ర దేశం లో కాలూనింది.

ఏసుక్రీస్తు (క్రీస్తు శకకర్త) 18 వ. శతాబ్దము  నుండి  ఆంధ్రదేశములో 'క్రైస్తవ మతం' ఆంధ్రదేశంలో వేళ్ళూనింది.

నాగార్జునుడు         క్రీ.శ. 3 వ. శతాబ్దము  - మహాయాన బౌద్ధమతోద్దారకుడు.

మహమ్మద్            క్రీ.శ. 6 వ. శతాబ్దము  - 13 వ. శతాబ్దము నుండి 'ఇస్లాం మతం' ఆంధ్రదేశంలో వ్యాపింపబడింది.

బసవేశ్వరుడు          "    8 వ.      "      -  వీరశైవమతం  ఆంధ్రదేశంలో వ్యాపింపబడింది.

శంకరాచార్యులు     క్రీ..శ. 8 వ.      "   -    అద్వైత వైదికమతం ,బాదరాయణ సూత్రములు, భగవద్గీత వ్యాప్తి.

రామానుజాచార్యులు. క్రీ.శ.11 వ   "  -    వైష్ణవ విశిష్టాద్వైతమతము - ఆంధ్రదేశమున  వ్యాప్తి-ప్రఖ్యాతి.

ఆనందతీర్ధులు             "   13 వ. "    -   ద్వైతమతం (మాధ్యమతం)- ఆంధ్ర దేశమున వ్యాప్తి చెందినది.

రాజారామమోహనరాయ్ "  19 వ. "    -   బ్రాహ్మసమాజ సంఘసంస్కార స్థాపకుడు - ఆంధ్రదేశమున వ్యాప్తి.

కేశవచంద్రదేవ్                "  19 వ. "    -    బ్రాహ్మసమాజ మత  వ్యాపకుడు.

బిపిన్ చంద్రపాల్,
హేమచంద్రసర్కార్.      " 19,20 వ."    -   బ్రహ్మసమాజ మత వ్యాపకులు -రాజకీయాశయ ప్రభోదకులు.

రామకృష్ణ పరమహంస   "   19 వ.  "   -   ఆధ్యాత్మిక, నైతిక మత పభోధకుడు.

స్వామి వివేకానంద          "    "       "   -   ఆధ్యాత్మిక, నైతిక మత ప్రచారకులు.

అనిబిసెంట్                 "  19,20 వ. " -   దివ్యజ్ఞాన సమాజ మతోద్ధారకురాలు.

జిడ్డు కృష్ణమూర్తి          "     20 వ.  "  -         "          "      మత ప్రచారకులు.

దయానందస్వామీ        "       "      "   -   ఆర్యసమాజ మతోద్దారకుడు.

శ్రీ రమణమహర్షి          "       "      "   -    నూతన భక్తి మర్గోపదేశకులు.

కుసుమ హరనాధ బాబా      "      "    -       "        "          "

రాధాస్వామి               "      "      "     -       "        "         "

సాయిబాబా               "      "      "     -       "        "         "

అరవిందమహర్షి          "      "      "    -   పూర్ణ యోగ ఆధ్యాత్మిక విద్యావ్యాపకుడు.

బాల గంగాధర తిలక్   "      "      "    -    రాజకీయవేత్త ,గీతా రహస్య ప్రభోధకుడు.

రవీంద్రనాధఠాగోర్       "      "      "    -     నైతిక విద్యాప్రభోధకులు- మహాకవి

మహాత్మాగాంధీ          "      "      "    -  జాతిపిత - భారత స్వాతంత్ర్యసమర నాయకుడు-జాతీయోద్యమ నాయకుడు.

కార్ల్ మార్క్స్          "      "      "    -      సామ్యవాద స్థాపకుడు.

లెనిన్                       "      "      "    -      సామ్యవాద ప్రచారకుడు.