లేబుళ్లు

27, ఆగస్టు 2010, శుక్రవారం

'sing please'

                                             
                                                           
సింగ్' ప్లీజ్ 
==========

''ఏమయ్యా సుబ్బారావు, ఎన్ని సార్లు చెప్పాలయ్యా నీకు'? 'ఒళ్ళు, బుర్ర దగ్గర పెట్టుకుని పని చేయవయ్యా,ఆఫీసులో ఉన్నంత వరకు', నీ సొంత సమస్యలు ఇంటి దగ్గరే వదిలి రావయ్యా'' విసుక్కుంటూ అన్నాడు మేనేజర్ .
'ఏమిటి, ఏమైంది సర్'? కంగారు పడుతూ మేనేజర్ ని అడిగాడు సుబ్బారావు, చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో సీనియర్ గుమస్తా
'నీకు తెలుసుగా ఈ ఫైలు చీఫ్ ఇంజినీరు గారికి వెళ్తుందని'.
'ఎస్' సర్'  తెలుసండీ.
'అందుకే చాల జాగ్రతగా 'డ్రాఫ్ట్' నోటీసు తయారు చేశానండీ' అన్నాడు సుబ్బారావు
''సరే అయితే, ఒక 'పాట' పాడండి''!
'ఏమిటండీ'?
''ఒక 'పాట'  పాడండీ" మళ్ళీ అన్నాడు మేనేజర్ గారు.
'అర్ధం కావడం లేదండీ మీరేమంటున్నారో'...నేను పెట్టిన ఫైల్ పాత వాహనాల 'వేలంపాట' గురించండీ' అన్నాడు సుబ్బారావు లేని వినయం ప్రదర్శిస్తూ.
"ఆహా, అలాగా…అయితే ఈ డ్రాఫ్ట్ మీద తమరు పెట్టిన ఫైల్ 'ఫ్లాప్' మీద ఏం వ్రాశారో అదే పైకి చదవండీ' అన్నాడు మేనేజర్
'సైన్'  ప్లీజ్" అని వ్రాశానండీ.
"జాగ్రత్తగా చూసి చదువు మిస్టర్'' అది కాదు అక్కడ వ్రాసింది నువ్వు.
'ఫ్లాప్' వ్రాసిన ఇంగ్లీష్ స్పెల్లింగులు చూడండి" ఈసారి గద్దించాడు ఆఫిసర్.
'ఓహ్'… సారీ సర్, సారీ' నొచ్చుకుంటున్నట్లుగా నటించాడు సుబ్బారావు
"అక్కడ ఇంగ్లీష్ స్పెల్లింగు ఉన్నది ఉన్నట్లు చదవండి 'మిస్టర్'  మీరు ఏం వ్రాశారో"
'సింగ్ ప్లీజ్' అంటూ  నాలుక్కరుచుకుని 'ఓ' 'సైన్ ప్లీజ్'  'ఎస్ ఐ జి ఎన్' కి బదులుగా పొరబాటున 'ఎస్ ఐ ఎన్ జి'  వ్రాశాను 'సర్' అన్నాడు సుబ్బారావు.
'మన చీఫ్ ఇంజినీర్ గారి పేరు ఏమిటి'  సుబ్బారావు ? అనునయంగా అడిగాడు మేనేజర్
మౌనంగా నిలబడే వున్న సుబ్బారావు వంక సూటిగా చూస్తూ.
'చెప్పండీ' రెట్టించాడు మేనేజర్
'నిర్మల్ సింగ్' గారు కదండీ …
'ఈ ఫైల్ ఆయన దగ్గరికి ఇలాగే వెళ్తే ఏమయ్యేది'? ఫైల్ పక్కనపెట్టి అడిగాడు మేనేజర్
'ఇప్పుడు నేను మీదగ్గర నేను నిలబడ్డట్లు మీరు అయన దగ్గర చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడి చీవాట్లు తింటూ వుండే వారండీ' అన్నాడు సుబ్బారావు
'ఈ తెలివితేటలు బాగానే వున్నాయి'...
' డ్రాఫ్ట్ నోటీసులో ఇంకొక  'మిస్టేకు' వుంది…గమనించారా' ? అన్నాడు మేనేజర్
'లేదండీ, ఇంకేమీ తప్పులు లేవండీ…ఇది కూడా తొందరలో పొరబాటున  'n' 'లెటర్' అటుదిటు అయింది  'అంతే సర్ ' విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ.
''ఈ డ్రాఫ్ట్  ని మళ్ళీ చూడండీ'' అన్నాడు మేనేజర్ కళ్ళజోడు పైనుంచి సుబ్బారావుని చూస్తూ 'టైం వేస్టు కాకుండా మీరే చెప్పండి సార్' అన్నాడు సుబ్బారావు అసహనంగా అటు ఇటు కదులుతూ.
'వేలం వేసే 'పాత' వాహనాలు ఎక్కడ వున్నాయి'? కోపంగా అడిగాడు మేనేజర్
'పాడేరు' లో 'సర్'
'వేలం పాట ఎక్కడ'?
'పాడేరు'లో మన ఆఫీసులో సర్',
"తమరు డ్రేఫ్ట్ లో వ్రాసిందేమిటో జాగ్రత్తగా చూడండి"?
'ఓహ్'...సారీ సర్,  ఇక్కడ కూడా 'జస్ట్' అటుదిటు అయింది సర్....'సారీ'!
'మిమ్ముల్ని ఏమనాలో అర్ధం కావడం లేదు. మీరు చాలా 'కేర్లెస్' గా పని చేస్తున్నారు
'బీ కేర్ ఫుల్...ఐ విల్ నాట్ టాలరేట్ థిస్ సార్ట్ అఫ్ ఇండిసిప్లిన్' ఇన్ ది ఆఫీస్' కోపంగా అన్నారు మేనేజర్  గారు.
'ఇక నుంచి జాగ్రత్తగా వుంటాను సర్' మేనేజర్ చేతుల్లోనుంచి ఫైల్ అందుకుంటూ
'సరే...ఈ డ్రాఫ్ట్ తీసుకు వెళ్లి ' రీడ్రేఫ్ట్' చేసుకుని 'ఫెయిర్ కాపీ'తో సహా తీసుకురండి రండి,
త్వరగా, క్విక్ '
పది రోజు ల్లోనే కదా వేలం' అన్నాడు మేనేజర్ సుబ్బారావు ని తొందర బెడుతూ
'అవును సర్,' అంటూ
'ఫైల్ వెనక్కు తీసుకు వెళ్తూ అన్నాడు సుబ్బారావు వెనక్కుతిరిగి  'మేనేజర్' ని ఉద్దేశిస్తూ.
'బావా' అక్క కూడా వస్తానంది.పాడేరు...పని ఉందట' నీతో చెప్పమంది' అన్నాడు సుబ్బారావు.

కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు : 9849118254
'సింగ్' ప్లీజ్ 

''ఏమయ్యా సుబ్బారావు, ఎన్ని సార్లు చెప్పాలయ్యా నీకు'? 'ఒళ్ళు, బుర్ర దగ్గర పెట్టుకుని పని చేయవయ్యా,ఆఫీసులో ఉన్నంత వరకు', నీ సొంత సమస్యలు ఇంటి దగ్గరే వదిలి రావయ్యా'' విసుక్కుంటూ అన్నాడు మేనేజర్ .
'ఏమిటి, ఏమైంది సర్'? కంగారు పడుతూ అన్నాడు సుబ్బారావు, చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో సీనియర్ గుమస్తా
"నీకు తెలుసుగా ఈ ఫైలు చీఫ్ ఇంజినీరు గారి కి వెళ్తుందని".
'ఎస్, సర్'  తెలుసండీ.
'అందుకే చాల జాగ్రతగా 'డ్రాఫ్ట్' నోటీసు తయారు చేశానండీ' అన్నాడు సుబ్బారావు
''సరే అయితే, ఒక 'పాట' పాడండి''!
'ఏమిటండీ'?
''ఒక 'పాట'  పాడండీ" మళ్ళీ అన్నాడు మేనేజర్ గారు.
'అర్ధం కావడం లేదండీ మీరేమంటున్నారో'.....నేను పెట్టిన ఫైల్ పాత వాహనాల 'వేలంపాట' గురించండీ' అన్నాడు సుబ్బారావు లేని వినయం ప్రదర్శిస్తూ.
"ఆహా, అలాగా"అయితే ఈ డ్రాఫ్ట్ మీద తమరు పెట్టిన 'ఫ్లాప్'  మీద ఏం వ్రాశారో పైకి చదవండీ"! అన్నాడు మేనేజర్
'సైన్'  ప్లీజ్" అని వ్రాశానండీ.
"జాగ్రత్తగా చూడు మిస్టర్'' అది కాదు అక్కడ వ్రాసింది. నువ్వు వ్రాసిన  ఇంగ్లీష్ స్పెల్లింగులు చూడండి" గద్దించాడు ఆఫిసర్.
'ఓహ్'… సారీ సర్, సారీ' నొచ్చుకుంటున్నట్లుగా నటించాడు సుబ్బారావు
"అక్కడ స్పెల్లింగులు ఉన్నది ఉన్నట్లు చదవండి 'మిస్టర్'  మీరు ఏం వ్రాశారో"
'సింగ్ ప్లీజ్' అంటూ  నాలుక్కరుచుకుని 'ఓ' 'సైన్ ప్లీజ్'  'ఎస్ ఐ జి ఎన్' కి బదులుగా పొరబాటున 'ఎస్ ఐ ఎన్ జి'  వ్రాశాను 'సర్' అన్నాడు సుబ్బారావు.
'మన చీఫ్ ఇంజినీర్ గారి పేరు ఏమిటి'  సుబ్బారావు ? అనునయంగా అడిగాడు మేనేజర్
మౌనంగా నిలబడే వున్న సుబ్బారావు వంక సూటిగా చూస్తూ.
'చెప్పండీ' రెట్టించాడు మేనేజర్
'నిర్మల్ సింగ్' కదండీ …
'ఈ ఫైల్ ఆయన దగ్గరికి ఇలాగే వెళ్తే ఏమయ్యేది'? ఫైల్ పక్కనపెట్టి అడిగాడు మేనేజర్
'ఇప్పుడు నేను మీదగ్గర నేను నిలబడ్డట్లు మీరు అయన దగ్గర చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడి చీవాట్లు తింటూ వుండే వారండీ' అన్నాడు సుబ్బారావు
'ఈ తెలివితేటలు బాగానే వున్నాయి'...
' డ్రాఫ్ట్ నోటీసులో ఇంకొక  'మిస్టేకు' వుంది…గమనించారా' ? అన్నాడు మేనేజర్
'లేదండీ, ఇంకేమీ తప్పులు లేవండీ…ఇది కూడా తొందరలో పొరబాటున  'n' 'లెటర్' అటుదిటు అయింది  'అంతే సర్ ' విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ.
''ఈ డ్రాఫ్ట్  ని మళ్ళీ చూడండీ'' అన్నాడు మేనేజర్ కళ్ళజోడు పైనుంచి సుబ్బారావుని చూస్తూ 'టైం వేస్టు కాకుండా మీరే చెప్పండి సార్' అన్నాడు సుబ్బారావు అసహనంగా అటు ఇటు కదులుతూ.
'వేలం వేసే 'పాత' వాహనాలు ఎక్కడ వున్నాయి'? కోపం గా అడిగాడు మేనేజర్
'పాడేరు' లో 'సర్'
'వేలం పాట ఎక్కడ'?
'పాడేరు'లో మన ఆఫీసులో సర్',
"తమరు డ్రేఫ్ట్ లో వ్రాసిందేమిటో  జాగ్రత్తగా చూడండి"?
'ఓహ్'...సారీ సర్,  ఇక్కడ కూడా 'జస్ట్' అటుదిటు అయింది సర్....'సారీ'!
'మిమ్ముల్ని ఏమనాలో అర్ధం కావడం లేదు. మీరు చాలా 'కేర్లెస్' గా పని చేస్తున్నారు
'బీ కేర్ ఫుల్...ఐ విల్ నాట్ టాలరేట్ థిస్ సార్ట్ అఫ్ ఇండిసిప్లిన్' కోపంగా అన్నారు మేనేజర్  గారు.
'ఇక నుంచి జాగ్రత్తగా వుంటాను సర్' మేనేజర్ చేతుల్లోనుంచి ఫైల్ అందుకుంటూ
'సరే...ఈ డ్రాఫ్ట్ తీసుకు వెళ్లి ' రీడ్రేఫ్ట్' చేసుకుని ఫెయిర్ కాపీ తో సహా తీసుకురండి రండి,
త్వరగా, క్విక్ '
పది రోజు ల్లోనే కదా వేలం' అన్నాడు మేనేజర్ సుబ్బారావు ని తొందర బెడుతూ
'అవును సర్,' అంటూ
'ఫైల్ వెనక్కు తీసుకు వెళ్తూ అన్నాడు సుబ్బారావు వెనక్కుతిరిగి  'మేనేజర్' ని ఉద్దేశిస్తూ.
'బావా' అక్క కూడా వస్తానంది.పాడేరు...పనిఉంఉందట' నీతో చెప్పమంది' అన్నాడు సుబ్బారావు.

కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు : 9849118254

20, ఆగస్టు 2010, శుక్రవారం

Role model

    
                                                    ఎక్కడో ఒకరు
                                            -------------------------- 
మా ఆడపడుచు పెళ్లి అని నాలుగు రోజుల ముందు వచ్చాం అమెరికానుంచి. హైదరాబాదులో పెళ్లి. ఆడపడుచు సాఫ్ట్ వేర్ ఇంజినీర్,బాగా చడువువచ్చిన పిల్ల.M.Tech (IIT ). పిల్లవాడు B.Tech, I I M , అహమ్మదాబాద్, లో M.B.A  చేసాడు. ఏదో MNC  లో వర్క్ చేస్తున్నాడు.మంచి జీతం. చివరి పెళ్లి అని, వాళ్ళు కొద్దిగా పై స్థాయి వాళ్ళని,  మా మామ గారు చాలా ఆడంబరంగా చేస్తున్నారు. మేమే చాలా డబ్బు తెచ్చాము పెళ్ళికని.  పెళ్ళివారి విడిది నుంచి మాటికి మాటికి ఏవో కోరికలు వస్తూనే వున్నాయి. పిల్లాడి తల్లి,వ్యవధి ఇవ్వకుండానే ఏవో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. కనీసం మాకుటుంబం వరకైనా వెండి పళ్ళేలలో టిఫెన్లు పెట్టండి అన్నారు. అప్పటికప్పుడు ఈయన వెళ్లి  వెండి ప్లేట్లు కొనుక్కో వచ్చారు.  పిల్లవాడు, తండ్రి వాళ్ళని ఎందుకు అలా విసిగిస్తారు అని అంటూనే వున్నారు. పెళ్లి కొడుకు తల్లి వయసు  55  సంవత్సరాల పైన మాటే. ఆవిడ పెద్ద హీల్స్ఉన్న చెప్పులు వేసుకుని నడుస్తుంటే నాకు నవ్వు వస్తోంది.ఎక్కడ బొక్క బోర్లా పడుతుందో అని నవ్వుకున్నాను నాలో నేను. పైకి నవ్వితే  ఎక్కడ కోపాలోస్తాయో నని భయ పడి చస్తున్నాను.మా అత్త గారు గమనిస్తూనే వుంది.' జాగ్రత్త వాళ్ళతో.ఆమె సొసైటీ వేరు" అని హెచ్చరించి వెళ్ళారు అక్కడనుండి..
ఎదురుకోళ్ళు అయి పోయాయి.అంతా సరదాగానే వుంది. ఆవిడ, పెళ్లి కొడుకు అక్క గారు ముడుచుకునే వున్నారు.
అసలు పెళ్లి కొడుకు తల్లికి మన సంబంధం ఇష్టం లేదులా వుంది అని పించింది ఆ క్షణాన, నాకైతే.
పెళ్లి ముహూర్తం రాత్రి 10.00  గంటలకి. ఇంకా రెండు గంటలు వుంది. ముందు భోజనాలు  చేస్తా మన్నారు.
పెళ్లి వాళ్ళకి  వడ్డించాలన్నారు. అందరు భోజనం చాలా బాగుంది అన్నారు, ఆవిడ, ఆవిడ కూతురు తప్ప. మిగతా వాళ్ళందరికీ
బుఫే. అతిధులు చాలమంది వచ్చారు.  రాత్రి 9.30 గంటలయింది.  బ్రాహ్మలు పెళ్లి కుమారుణ్ణి, తల్లీ, తండ్రినీ  త్వరగా మంటపానికి  రమ్మని మైకులో పిలుస్తున్నారు. మామగారు, అత్త గారు, ఈయన  అందరు  హడావుడిగా వెళ్ళారు
నేను పెళ్లి కూతురు  దగ్గర వున్నాను.గౌరీ పూజ అయిపొయింది.
ఇంతలో ఈయన చాలా హడావుడిగా వచ్చారు మా గదిలోకి. ఆయన్ని చూసే సరికి నాకు ఏదో జరగ  కూడనిది ఏదో జరిగిందని   పించింది. " పెళ్లి కొడుకు తల్లి  పెళ్లి  మంటపానికి దీపాలతో వస్తూ మెట్లమీద బోర్ల పడింది.
లేవ లేక పోతోంది. ముక్కు,మూతి పగిలినట్లుంది. చాలా రక్తం వస్తోంది. కుడి కాలు కూడ కడప లేక పోతోంది. డాక్టర్ ఎవరోవున్నారు.చూస్తునారు". అని చెప్పి వెళ్ళారు అయన. నువ్వు ఇక్కడే ఉండమని పెళ్లి కూతురుతో చెప్పి నేను ఆవిడ పరిస్థితి ఎలావుందో చూసి వద్దామని వెళ్లాను. డాక్టరు పరీక్ష  అయినట్లుంది. ముక్కు, మూతి శుభ్రం చేసి నట్లున్నారు. ఆవిడని బెడ్ మీదకు చేర్చారు. కుడి కాలు మోకాలి దగ్గర విరిగిందట.
కూర్చోవడానికి  ఏమాత్రం వీలు లేదట. నొప్పి తో కేకలేస్తోంది ఆవిడ. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అని నిర్ణయించారు.
ఆ స్థితిలో కూడ  ఆవిడ పెళ్లి కూతుర్ని నోటికొచ్చినట్లు మాటలంటోంది. పిల్ల  జాతకం మంచిది కాదుట.  ఇంకా నయం నా కొడుక్కేమి కాలేదు. ఈ ముహూర్తానికి మాత్రం పెళ్లి వీల్లేదు అంటోంది అవిడ భర్తతో.ఆయన ఆమెను వారిస్తున్నాడు.
చిన్నదెబ్బలే కదా పెళ్లి ఆపవద్దు. ఎవరికీ మంచిది కాదు. ఆపిల్ల సంగతి కూడ ఆలోచించు.నువ్వు కూడా ఆడపిల్ల తల్లివే. ఆవిడ, పెళ్లి కొడుకు అక్క గారు ససేమిరా అంటున్నారు. సరే తరువాత ఇంకో ముహార్తానికి  చూద్దాం  లెండి అంటోంది  ఆవిడ. ఆయనకీ కూడ ఓపిక పోయినట్లుంది. ఆయన  సూచన మేరకు మామగారు , అత్తయ్య గారు, ఇంకా కొద్ది  మంది పెద్దవాళ్ళు ఆవిడని పెళ్లి వాయిదా వెయ్య వద్దని బతిమిలాడు తున్నారు. అత్తయ్య గారైతే ఆవిడ కాళ్ళు పట్టుకున్నంతగా బతిమిలాడు తున్నారు. విసుక్కుంటోంది ఆత్తయ్య గారిని ఆమె. నాకు చాల బాధగా అనిపించింది.
ఛీ, ఏం మనిషో! ఎంతమంది చెపుతున్నాకనీసం ఆడపిల్ల పెళ్లి  ఇంతా వరకు వచ్చి ఇంత చిన్న కారణానికి, అదీ ఆవిడ అజాగ్రత్త వల్ల జరిగి, ఆగిపోతే ఎంత ఇబ్బంది! అత్తయ్య గారిని ఇవతలకు పట్టుకుని తీసుకు వచ్చాను.
ఆవిడ లో ఏమాత్రం చలనం లేదు. లేదు, ఇప్పుడు కాదు, తరువాత చూద్దాం   తప్ప వేరే మాట లేదు. ఇంక లాభం లేదని అందరూ వెనక్కి వచ్చేశారు. పెళ్లి కొడుకు కూడా నచ్చ చెప్పాడు. ఇప్పుడు కాదు! ముహూర్తం బాగా లేదు. ఇక నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం! ఆవిడ నిర్ణయం చెప్పేసింది. డాక్టరు  ఇంకా మాట్లాడకుండా నొప్పి తెలవ కుండా  ఇంజెక్షను ఇచ్చారు. ఏమీ ప్రమాదం లేదు . ఆవిడను కుర్చీ కూర్చోబెట్టి కార్య క్రమం కానివచ్చు అన్నాడు. మీకేమి భయం లేదండీ అని  చిన్న పిల్లకు చెప్పినట్లు చెప్పారు డాక్టరు గారు. ఇంతలో  అంబులెన్సు వచ్చింది. ఆమె భర్త, పెళ్లి కొడుకు, డాక్టరు  గారు పెళ్లి తంతు గంటలో అయి పోతుంది అప్పుడు వెళదాం  ఎంత వారిస్తున్నాతనే అంబులెన్సు వారిని స్త్రెచెర్ తెమ్మని చెప్పింది. చూస్తూండగానే  ఆవిడ హాస్పిటల్ కి వెళ్ళారు, కూతురుఆవిడతో వెళ్ళింది. మామయ్య గారు ఆఖరి ప్రయత్నం గా మీ తమ్ముడు గారు వాళ్లెవరైనా పీటల మీద కూర్చొని పెళ్లి కాని వ్వచ్చండీ అన్నారు పెళ్లి కొడుకు తండ్రితో. అలాగా ! ఆగండి, అని అయన స్వయానా తమ్ముణ్ణి పిలిచి నువ్వు, మరదలు కూర్చుని పెళ్లి కానివ్వండిరా" అన్నారు. ఆయన తనని పక్కకి తీసుకు వెళ్లి ఏదో మాట్లాడారు.మాటలు కొద్దిగా వినిపిస్తూనే వున్నాయి. వదిన మమ్మల్ని బతకనివ్వదన్నయ్యా' అంటున్నాడు అయన. ఆయన భార్య బావగారు,ఇప్పుడే రిలేషన్లు అంతంత మాత్రం. ఇక అది కూడా తెగ్గొట్టు కొమ్మంటారా మమ్ములని "అంటోంది అవిడ.
మా పరిస్థితి అంతా అగమ్య గోచరం. మామయ్య గారు,అత్తయ్య గారు, పెళ్లి కొడుకు తండ్రితో మళ్ళీ మాట్లాడారు.
ఆయన , క్షమించండి ! నేను, బాబు   శాయ శక్తులా కృషి  చేశాము. మావల్ల కాలేదు.ఆయన పాపం తల దించుకునే మాట్లాడారు. పెళ్లి కొడుకు చూపుల్లోనే తెలుస్తోంది. అతను పడుతున్న బాధ! అపరాధిలా వంచిన తల ఎత్తలేదు.
ఇక తరు వాత ఇంకో ముహూర్తం చూద్దాం. అని, ఆయన పెళ్లి కొడుకుతో  సహా వెళ్ళారు.
ఇంతలో బ్రాహ్మలు 'అయ్యా, ముహూర్త సమయం మించి పోయింది. ఇక మేము వెళ్లి వస్తామండీ'...అంటూ వారు కూడా వెళ్లి పోయారు. ఒకళ్ళ తరు వాత ఒకళ్ళు చూస్తుండగానే పెళ్లి హాలు ఖాళి అయిపొయింది. 'బాజాల వాళ్ళు అయ్యా రేపు ఇంటికి వచ్చి కలుస్తాం' అనగానే మామగారు జేబులో డబ్బు తీసి ఇచ్చారు. నాకు తల తిరిగి పోతోంది. ఈ మనుషులు మారరు!
ఉన్న సమస్య అంతా ఈ ఆడవాళ్ళ తోనే వుంది! ఆనుకున్నా మనస్సులో. లేదు మంచి వాళ్ళు కూడా వున్నారు నీకు తెలుసుగా అంది నా మనస్సు. చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ,వున్నవాళ్ళు, లేని వాళ్ళు అని  కాదు సమస్య. సంస్కారం, కుసంస్కారం!అంతే.
అందరు  ఇంటికి చేరే సరికి రాత్రి 12 గంటలయింది. నేను, అత్తయ్య గారు, ఆడపడుచు ముందే ఇంటికి వచ్చాం.
ఎవ్వరు ఏమీ తినలేదు.అత్తయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రం.నేను వెళ్లి కాసిని పాలు వేడి చేసి ఇచ్చాను.ఆవిడ అవి కూడా తాగి నట్లు లేదు.ఇక పెళ్ళికూతురి మొహం  చూడడానికే నాకు చాలా బాధగా వుంది. మామయ్య గారు రావడమే తన గదిలోకి
వెళ్లి తలుపు వేసుకున్నారు. ఆయనకు కూడ కాసిని వేడి పాలు ఇచ్చి వచ్చాను. ఆయన వచ్చారు. ముఖం కళా విహీనంగాఅయింది. పీక్కు పోయింది. ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. ఆయనకీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.
" ఏమిటిది? ఎందుకిలా అయింది?. పాపం చెల్లి సంగతి తలుచు కుంటేనే భయం వేస్తోంది. అది ధైర్యం కలదే. అమ్మ,నాన్న గారి పరిస్థితి ఏమిటో అర్ధం కావడంలేదు. అసలా పెళ్లి వాళ్ళు మళ్ళీ మన్ని కలవడం కాని, మళ్ళీ ముహూర్తాల ప్రస్తావన  కాని వస్తుందన్న ఆశ మాత్రం నాకు లేదు. ఈ సంగతులన్నీ తెలుస్తే చెల్లి ఆకుర్రాడితో అసలు పెళ్ళికి ఒప్పుకోదు! ఏమిటో అంతా అయోమయంగా వుంది! అసలు పెళ్లి కొడుకు తల్లి కి ఈ పెళ్లి ఇష్టం వున్నట్లు నా కనిపించడం లేదు. అవిడ, అవిడ కూతురు ఇద్దరూ ఇద్దరే! సినిమాల్లో, T V  సీరియల్ లో విలన్ల్నలా వున్నారు. నాకు ఇవాళ అక్కడ పరిస్థితి చూసి మీ చెల్లి పెళ్లి  గుర్తు
కొచ్చింది. మీ చెల్లి అత్తగారికున్నపెద్దమనసు ఈపెద్దమనుషులకి కొద్దిగాయినా వుంటే ఈరోజు ఇలా  జరిగి వుండేది కాదు. ఎందుకు  సంస్కారం లేని చదువులు ! దేశంలో ఇలా ఎక్కడా జరగదనుకుంటా. తప్పు ఆమెది. ఆ వయస్సులో ఆ   హై హీల్స్ చెప్పులేమిటి.  అదీ పెళ్లి మంటపానికి వస్తూ చెప్పులెందుకు. సరే అయిందేదో అయింది. సాటి ఆడ మనిషే! తనకు కూడ ఆడ పిల్ల వుంది. మన సమాజం లో , పెళ్లి ఆగితే ఆడపిల్ల, తల్లి తండ్రుల వెతలు తెలీదా !ఇందుకే కదూ, ఆత్మ హత్యలు, తలి తండ్రుల బలిదానాలు. ఛీ! ఎందుకు ఆడపుటక పుట్టారు",  ఆయన ఆవేశంతో ఊగి పోతు మాట్లాడుతున్నారు.నేను మెల్లగా వెళ్ళాను అయన దగ్గరికి. చేతిలోకి చేయి తీసుకుని  మౌనంగానే వున్నాను చాలా సేపు. అయన కళ్ళ వెంట నీళ్లు వస్తూనే వున్నాయి. గద్గద స్వరం తోనే మాట్లాడుతున్నారు ఇంతసేపు. ఆయన కొద్ది భావోద్రేకం చెందినా గొంతు గీర పోతుంది. నాకు మనసులో మనసు లేదు.' నేను మీ చెల్లి దగ్గరికి వెళుతున్నాను మీరేమైనా తింటారా'? అయన మౌనం గానే వున్నారు. అదే అయన సమాధానం.
నేను మెల్లగా వెళ్లి తన పక్కనే కూర్చున్నాను.తను నిద్ర పోయినట్లు లేదు. వదినా మీ చెల్లి పెళ్లి అప్పుడు ఇలాగే జరిగింది కదా!
అత్తగారికి చాల సీరియస్ గా వళ్ళు కాలింది కదా! అయినా ఆవిడ పెళ్లి చేయమని ,పెళ్లి  ఎట్టి  పరిస్థితిలో  ఆపొద్దు అని చెప్పి పెళ్లేయ్యేలా చూసింది కదా! మరి ఈవిడ ఎందుకిలా చేసింది ?   "ఏదో  బాడ్ లక్. వదిలేయ్. పడుకో.తరువాత మాట్లాడవచ్చు'.అన్నాను నేను. అది కాదు వదినా just  compare ! ఈవిడకు చాల చిన్న దెబ్బలు. ఆవిడకు పెద్ద ప్రమాదం.
40 % కాలిగాయాలు. అసలు పోలికే లేదు. ఈవిడకు ఈ పెళ్లి ఇష్టం లేదు. thats it ! ఇప్పుడు నాకు  ఇష్టం లేదు! ఫినిష్ ! అంతా closed , thats the end  of the matter . 'అంతా మన మంచికే'  అని అటు తిరిగి పడుకుంది తను. బ్రేవ్ గర్ల్ అనుకున్నాను.
నేను మంచానికి ఇటు  చివరగా ఒరిగాను. ఎంత కళ్ళు మూసుకుందామన్నాకళ్ళు మూత పడలేదు.
రెండేళ్ళ క్రింద  మాచెల్లి పెళ్ళిలో జరిగిన  సంఘటన కళ్ళ ముందు కదలాడింది.      
చెల్లి పెళ్లి ముహుర్తానికింకా మూడు,నాలుగు  గంటలు వ్యవధి వుంది. మా అన్నయ్య, మా ఆయన   మగ పెళ్లి  వాళ్ళని తీసుకుని రావడానికి బయలుదేరు తున్నారు. జాగ్రత్త అండీ. ట్రాఫిక్ చాలా ఎక్కువగా వుంది జాగ్రత్త అని వాళ్ళ కారు వెళ్ళగానే లోపలికి వచ్చేసాను.మళ్ళీ టైం చూసుకున్నాను. ముహుర్తానికింక చాల టైము ఉంది. ఒక్క సారి కూర్చుని చెల్లి, నేను,అమ్మ మళ్లి పెళ్లి కావలసిన సామాగ్రి అంతా సరి చూశాము. సారె పెట్టె కూడ సది రేశాను. ఇంకా మంటపం కడుతునే వున్నారు.' ఏమయ్యా బాబూ, ముహూర్తం టైము దాకా కడుతూనే ఉంటారా'?  అనడిగాను నేను. 'అయిపోయిందమ్మా ఇంకా అర్ధగంటలో అయిపోతది'.
వంట వాళ్ళూ ఏమి చేస్తున్నారో చూద్దాం అని అటుగా వెళ్లాను. ఇద్దరు కూరలు తరుగు తున్నారు.మరిద్దరు పిండికలుపుతునారు. అంతా ఎవరి పని లో వాళ్ళు నిమగ్నమై వున్నారు. నన్ను చూసి కేటరర్ మనిషనుకుంటా.
ఏంటమ్మా ఏమైనా కావాలా? మర్యాదగా అడిగాడు.  నాలుగయిదు 'టీ' లు పంపించగలరా? ఫ్రెష్ గా పెట్టండి!
అలాగేనమ్మా ఇప్ప్డుడే పంపిస్తాను' అన్నాడతను. అతిధులు, చుట్టాలు కొంత మంది వచ్చేశారు.
నేను వెనక్కి వచ్చి మా రూములో ఫాను  క్రిందకు  కుర్చీ లాక్కుని కూర్చుని కొద్దిగా రిలాక్సేడ్  గా కూర్చున్నాను.
అమ్మా,చెల్లి కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలకి హాయిగా పెద్ద స్థలం  దొరికిందేమో  తెగ ఆడుతున్నారు. ఇంతలో మా ఆయన
చెప్పిన విషయం గుర్తుకి వచ్చి లేచి మగ పెళ్లి వాళ్ళ కిచ్చిన  రూము వైపు వెళ్లాను. క్రింద కార్పెట్ బాగా మాసి పోయింది.
బాత్ రూం అంతా శుభ్రంగా లేదు. కార్పెట్ మార్చమని రూమంతా శుభ్రం చేయించమని చెప్పినా ఇంకా అలాగే వుంది. అక్కడ
మేనేజర్ ని కలిసి గట్టిగా చెప్పి టీ వచ్చిందేమో నని  గది కి వచ్చి మళ్ళీ ఫాను క్రింద కూర్చున్నా. ఇంతలో 'టీ ' వచ్చింది!   
వేడి 'టీ' తాగే సరికి కొద్దిగా ఉత్సాహం వచ్చింది. చెల్లిని స్నానం చేసి ఇంక తయారు కావే అని చెప్పి ఇటు తిరిగే సరికి  అమ్మ
నాన్న గారి ఫోటో శుభ్రం చేస్తూవుంది. ఒక్కసారి మనసంతా బాధగా అనిపించింది. పాపం నాన్నగారు ఏమీ అనుభవించ
కుండానే వెళ్లి పోయారు. మనవడు, మనవరాలు బాగా  చదువుకుంటున్నారు, నేను,ఆయన  అమెరికాలో మంచి ఉద్యోగాలు చేస్తున్నామంటే  ఎంత సంతోషించే వారు. అమెరికా వచ్చి వుండే వారు. పాపం అయన జీవితం లో ఏమి
 సుఖ పడకుండానే వెళ్లి పోయారు, అని అనుకున్నాను. ఇంతలో అన్నయ్య దగ్గరనుంచి ఫోను. పెళ్ళికొడుకు ఇంటికి చేరారట. అర్ధగంటలో బయలు దేరు తారట.బయలు దేరిన వెంటనే ఫోను చేస్తామని చెప్పాడు వాడు. అమ్మకి ఈ విషయం చెప్పాను.
 పెళ్లి వాళ్ళు రాగానే బయట నుంచే మేళంతో  తీసుక రావాలని, భజంత్రీ లను తయారు గా ఉండమని చెప్పాను.
మంటపం, మగ పెళ్లివాళ్ళ గది అన్నీ మళ్ళీ చూశాను.అంతా సవ్యంగానే వుంది. కేటరింగ్ ఆయనకు చెప్పి ఫలహారం,కాఫీ,టీ,
రెడీ గా ఉంచమని చెప్పాను. వాళ్ళు రాగానే అందరికి ఇవ్వాలని చెప్పాను. ఇంతలో ఆయన దగ్గరనుంచి ఫోను.బయలు దేరామని, అర్ధగంటలో అక్కడుంటామని. అమ్మతో చెప్పి చెల్లి దగ్గరికి వెళ్లాను. అది స్నానానికి వెళ్ళింది.
బయటకు వచ్చాను. మంటపం వెనుకాల వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ, ప్రతిమలను సర్దు తున్నారు.
స్వామి అంతా సవ్యంగా జరిపించు తండ్రీ అని మనః స్పూర్తిగా వేడుకున్నాను. తధాస్తు అన్నట్లు చేతిలో ఫోను మ్రోగింది.
అయన దగ్గరనుంచే. ఒక్కసారిగా, నా నెత్తిన పిడుగు పడ్డట్లు అయింది. స్పృహ వున్నా తల తిరుగుతోంది. ఇప్పుడే కదా స్వామీ నిన్ను మనః స్పూర్తిగా వేడుకున్నాను. ఇంతలా అన్యాయం చేస్తావా? అమ్మకు చెపుదామా, వద్దా అని కంగారు పడుతూ
లోపలి వెళ్ళాను. అప్పటికే ఎవరో వాళ్ళ  చుట్టాలకి కబురంది నట్లుంది...అమ్మ గోల, గోలగా ఏడుస్తోంది. చుట్టాల్లో అంతా గగ్గోలు. అమ్మ నన్ను చూసి ఒక్కసారిగా లేచి నాదగ్గరికి వచ్చి ఇదేంటి ,తల్లీ, పెళ్లి కొడుకు తల్లి వళ్ళంతా  కాలిందట కారులో వస్తుంటే?
అసలు సంగతి ఏమిటే? అమ్మ నన్ను నిలతీసింది. నన్ను నేను కొద్దిగా శాంత పరుచుకొని, కూడ తీసుకుని అమ్మా, ఏమీ లేదు,
కొద్దిగా కాలి   గాయాలు అయ్యాయట ఆవిడకు. కారులో ముందు కూర్చుని కాళ్ళ దగ్గర  ముట్టించిన దీపారాధన కుందులు పెట్టు కుందట. చీర అంటుకుని కాళ్ళకి కొద్దిగా కాలిన గాయాలయ్యా యట. ఏమిటో నమ్మా,అంతా కంగారుగా వుంది.ఆయన, అన్నయ్య అక్కడే వున్నారు. ఇంతలో మళ్ళీ ఫోను వచ్చింది. అన్నయ్య ఫోను. ఆవిడను ఉస్మానియా హాస్పిటలు కి తీసుకు వెళ్లారట , పోలీసులు కూడా వచ్చారట.అన్నయ్య మళ్ళీ ఫోను చేస్తానన్నాడు. మళ్ళీ మంటపం దగ్గరకు వచ్చి స్వామి కి
మొక్కు కున్నాను. పెళ్లి నిర్విఘ్నం గా అయ్యేట్లు చూడు స్వామీ.నీ కొండకు నడిచి వస్తాను  అని  మొక్కు కున్నాను. వచ్చిన  అతిధులు, మగ పెళ్లి వాళ్ళ చుట్టాలు, మాచుట్టాలు, స్నేహితులు అందరు ఆవిడ ప్రమాదం గురించే చర్చ. ఇంకేమి పెళ్లిలే!
తల్లి కి ఇంత అయితే వాళ్లు  అసలు రావొద్దూ! ఎంత అప్రదిష్ట ! పెళ్లి కూతురు సరిగ్గా నోచుకో లేదు. తండ్రీ లేడు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగితే ఇంకేమన్నా ఉందా? బాబోయ్! నలుగురు నాలుగు మాటలు, నానా మాటలు! ఏమి మనుషులు రా బాబూ! ఇంతలో
మంటపం కట్టిన వాళ్ళు అంతా బాగా కట్టినమమ్మ, మంచి పూలతో సజాయిన్చినమమ్మా! శుభ్రం కూడ చేసినం. వాడి చేతిలో రెండు వందలు పెట్టి పక్కకు వచ్చి ఆయనకు ఫోను చేసాను. ఆయనతో  మాట్లాడిన తరువాత కొద్దిగా ఉపశమనం కలిగింది.
ప్రాణ భయం లేదు.దాదాపు 40% వళ్ళుకాలిందట.ఆవిడ స్పృహ లోనే వున్నారు. పోలీసు లకి అంతా తన పొరబాటు వాళ్ళే జరిగిందని చెప్పిందట. పెళ్లి ఎట్టి పరిస్తితుల్లో ఆగడానికి వీల్లేదని వాళ్ల ఆయన్ని వెంటనే కొడుకుని తో  బయలు దేరమని, కొడుకుతో కంగారేమీ లేదని వెంటనే వెళ్ళమని చెప్పిందట. అన్నయ్యను, మా ఆయన్ను కూడా పిలిచి బాబూ నావల్ల ఈ తప్పు జరిగింది. పిల్లకి చెడ్డపేరు రాకూడదు.నలుగురు నానా మాటలు అంటారు. వెంటనే పెళ్లి కుమారుణ్ణి మీతో తీసుకు వెళ్ళండి.మావాళ్ళకి అయన ఫోను చేసి చెప్పారు. ఎవరో ఒకళ్ళు పీటల మీద కూర్చుంటారు. వెంటనే బయలు దేరండి అని ధైర్యం చెప్పిందట. పెళ్లి కొడుకుతో సహా వీలు బయలు దేరారు.ఇంక అర్ధగంటలో ఇక్కడ వుంటారు. నాకు నిజంగా ఆ క్షణంలో ఆవిడ మీద ఎంత గౌరవం పెరిగి పోయింది. అవిడ సంస్కారానికి చేతు లెత్తి మొక్కాను. అమ్మతో జరిగిందంతా చెప్పి  మళ్ళీ మంటపం దగ్గరికి వచ్చి స్వామీ ఏమిటీ పరీక్ష ?  రక్షించావు స్వామీ! ఎన్ని జన్మ లెత్తినా నీ ఋణం తీర్చుకో లేను స్వామీ, అని నమస్కరించాను స్వామికి. పెళ్లి కొడుకు బాబాయి లా వున్నారు, వచ్చి" ముహూర్తానికి అన్నీ సిద్హంగా వున్నాయి కదమ్మా!
అన్నయ్య, వదినా ఇద్దరూ మాట్లాడారు. మమ్ముల్ని కూర్చుని పెళ్లి కానివ్వ మన్నారమ్మాఇక ఆట్టే సమయం లేదు !
వాళ్ళు రాగానే తంతు ప్రారంభిద్దాం" అని అయన అటు వెళ్ళారో,  లేదో బయట గేటు దగ్గర భజంత్రీల వాయిద్యం మొదలయింది. అమ్మయ్య వీళ్ళు వచ్చేసినట్లున్నారు. బ్రాహ్మలు కూడ ఏమవుందో నని స్తబ్దుగా ఉన్న వాళ్ళు హడావుడి మొదలెట్టారు మైకులో. నేను ఇంకా చాలా మంది గేటు దగ్గరికి వెళ్ళాము. పెళ్లి కొడుకు, అతని తమ్ముడు  వచ్చారు. అన్నయ్య పెళ్లి కొడుకు చేయి పట్టుకుని తీసుకు వస్తున్నాడు. వాళ్ళ  చుట్టాలు చాల మంది అతని చుట్టూ మూగి  ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అందరికి కలిపి అతను ఒక్కటే సమాధానం చెప్పాడు. "అమ్మ బావుంది. పెళ్లి కానివ్వమంది. దయచేసి  ఎవరూ  ఏమీ మాట్లాడ వద్దు. its an accident ". అయన పిల్లాడి వెనకాలే  వున్నారు. ఒక్కటే మాటన్నారు.' ఆవిడ సంస్కారం ఆడవాళ్ళ అందరికి మార్గ దర్శకం. ఆవిడ సంస్కారంలో పదో వంతు వున్నా ఈ సంఘం కొంతయినా  బాగు  పడుతుంది. ఆవిడ అయిదవ తరగతి వరకు చదువుకుందట. ఈరోజు ఆవిడ చూపిన సంస్కారం నేను జన్మలో మరచిపోను' అన్నారు అయన.
" పెద్ద కొడుకు పెళ్లి కోసం  కలలు కందిట, ఆవిడ, నాతో అంది. ఆవిడ ఎవరూ అడక్కుండానే ఎంత తెగువ చూపింది. ఆవిడని పొగుడుతూనే వున్నారాయన.
నాకు కూడా నిజంగా వెళ్లి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి రావాలని పించింది. "పిల్లాడిని కొద్దిగా ఫ్రెష్ అవుతారా" అనడిగాను నేను. ' నేను కాదు వదిన గారు, ముందు మీరు ఫ్రెష్ అయి రండి' అంటూ
ఫరవాలేదండీ, ముందు టైం చూడండి. అన్నాడతను నవ్వుతూ. 'తల్లికి తగ్గ కొడుకు అనిపించాడు'. అనుకున్నాను మనసులో.  పెళ్ళికొడుకుని సరాసరి మంటపం లోకి తీసుకు రమ్మన్నారు బ్రాహ్మలు. ముహూర్తానికి వధూ,వరుల్తో  జీలకర్ర, బెల్లం పెట్టించారు . పెళ్లి చాల తృప్తిగా అయింది. భోజనాలయ్యాయి. అతిధులు, చుట్టాలు అందరూ వెళ్లి పోయారు. వాళ్ళ వాళ్ళు ఎవరో హాస్పిటలు కి వెళ్లి తండ్రిని పంపించారు. ఆయన్ని నేను మావారు దగ్గరుండి చూసుకున్నాము. అప్పగింతలు అయ్యేసరికి రాత్రి 12.30 గంటలయింది. పెళ్లి కొడుకు తండ్రి వారిస్తున్నా మావారు ముందు వధూ,వరులని ని హాస్పిటలు కి వెళ్లి తన ఆశీర్వచనం  తీసుకు వెళ్ళాలని పట్టు బట్టారు. పిల్లాడు, తండ్రి అంతా కలిసి హాస్పిటలు కి వెళ్లి  పిల్లలకి ఆవిడ ఆశీర్వచనం తెసుకుని ఇంటికి వెళ్లారు. నేను అన్నయ్య ఇక్కడ పనులన్నీ చేసుకుని ఉదయం హాస్పిటలు కి వెళ్ళాము. తన కాళ్ళని నేను తాకి రెండు చేతులు జోడించి నమస్కారం చేసాను.అమ్మ కూడా ఆమెకు నమస్కారం చేసింది. మనస్సు చాలా తేలిక అయింది. చెల్లి చాలా అదృష్ట వంతు రాలనుకున్నా. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడయినా, ఆమె గురించి టాపిక్ వస్తే మావారు చాల భావోద్రేకులవుతారు.  ఆమెను దేవుడే అంటారు ఆయన. అంతే కాదు ఆయనకు ఆవిడో రోల్ మోడల్. అంతే కదండీ మరి! ఒక్కో సారి మనుషుల  త్యాగాలవల్ల, సందర్భాన్ని పట్టి తీసుకునే నిర్ణయాల వల్ల సంఘం లో ఎంతో కొంత మంది మనుషుల్లో పరివర్తన రావడ మనేది జరుగుతోంది అంటే ఇలాంటి  వాళ్ళే కదా కారణం!
నా వరకు నేను ఈ రోజు జరిగిన ఈసంఘటనతో మానసికంగా ఎంతో ఎదిగాను.పెళ్లి క వచ్చిన వాళ్ళలో కూడ ఎంతో మంది ఆవిడ నిర్ణయాని హర్షించడం నేను విన్నాను.
ఆడపిల్ల ఎంత చదువుకున్నా, ఎంతలేసి వుద్యోగంచేస్తున్నా, ఎంత డబ్బున్నా మనసున్న మనుషులు అందునా భర్త, అత్త మామలు దొరకడం ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం,తలి తండ్రుల చేసుకున్న పూజ ఫలాలే.
కేశిరాజు రజని వరదయ్య.         

17, ఆగస్టు 2010, మంగళవారం

శూన్యం ....(shoonyam0 కవిత

శూన్యం
---------
సునామీ కాదు
భూకంపమూ  కాదు
అణువణువునా
అణు ధూళే కాని గోధూళి కాదు!

గాండీవము  లేదు
పాంచ జన్యమూ లేదు
దేవదత్తము లేదు
నిముషం లో నాకాన్ని  సైతం
'నాశం' చేసే  ద్రోణు లొచ్చాయి !
స్టార్ వార్లు లేవింక
చంపడమే ముఖ్యం 
ఎవరినన్న ప్రశ్నే లేదు 
'ద్రోణుల'కేం  తెలుసు 
ధ్వని కూడా చేయవు
క్షణంలో  చేరువవుతుంది.
గురి తప్పదు
'గుళ్ళ' వర్షం కురిపిస్తుంది!
హాహాకారాలు లేవు!
ఆర్తనాదాలు లేవు ! 
చప్పున చంపేస్తుంది!
కుప్పల కుప్పల  కంకాళాలు
కాకులకి, గద్దలకే కాని
చూసేందుకు, చేశేందుకు
నిక్షిప్తం చేసేందుకు
నిమజ్జనం చేసేందుకు
కాదర్హం!
మిగిలేదేమీ లేదు!
అంతా శూన్యమే!

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.
మొబైల్ నం. 9849118254

16, ఆగస్టు 2010, సోమవారం

కొండ ( KONDA )ఈ 'కధ' 19-6-2014 తేదీన 'ఆంధ్రభూమి' సచిత్ర వారపత్రిక లో ముద్రితమైనది )

                                         
                                                                        కొండ
                                                                     -------------
            ( ఈ 'కధ' 19-6-2014 తేదీన  'ఆంధ్రభూమి' సచిత్ర వారపత్రిక  లో ముద్రితమైనది )
                                                                  
                     
                     దాదాపు రాత్రి  రెండు గంటలవుతోంది. రేపు శలవుకదాని మధ్యరాత్రి దాకా చదువుకొని
ఇలా  పడుకున్నానో లేదో మా  ఇంటి వెనకాలఉన్న 'చేద బావి' లోనుంచి 'దబ్బు'మని
ఏదో పడ్డ శబ్దం అయింది.
వెంటనే  బావి గూళ్ళలో  ఉన్న పావురాలు బావిలోనే  ఎగురుతున్నశబ్దం.
ఊళ్ళో విపరీతంగా దొంగతనాలు. ఎందుకైనా మంచిదని నాన్నగారిని కూడా లేపి ఇంటి వెనకాల 'లైట్స్' వేసి  ఇద్దరం దొడ్లోకి వెళ్ళాము. బావిలో ఇంకా పావురాలు విపరీతంగా ఎగురుతున్న శబ్దం వస్తూనే వుంది. టార్చిలైట్ బావి లోకి ఫోకస్ చేశాను.
లైట్ కాంతి కన్పించే సరికి నాలుగైదు పావురాలు పైకి ఎగిరి బయటకి వచ్చేశాయి.
భావిలో నీళ్లు ఏదో పెద్ద వస్తువు పడ్డట్లుగా అలలతో కల్లోలంగా వుంది. బావి లోతుగా ఉండడంతో లైట్ 'ఫోకస్' భావి అడుగు దాకా సరిగా చేరడం లేదు. అలాగే నేను బావిలోకి ఒంగి చూస్తూ టార్చిలైట్  బావిలో అన్నిపక్కలావేసి  చూశాను.
ఒక పక్కన కొద్ది ఒడ్డు పట్టుకుని చెయ్యి ఊపుతూ 'సార్ , సార్ రక్షించండి.
బావిలో నీళ్ళు  చాలా లోతుగా వున్నయ్. తాడు వెయ్యండి' అని అరుస్తున్నాడు
ఎవరో. వాడి మాటలు బావిలో ప్రతిధ్వనిస్తూ వినిపించాయి.
నాన్నగారు  నేను ఒకరి ముఖాలు ఇంకొకరం చూస్తూ ... బిత్తర పోయాం.
'అసలు ఎవడు వాడు' ?  దొంగా? అయితే బావిలో ఎందుకు పడ్డాడు'?  అంతా అయోమయంగావుంది అనుకుంటూ 'ఇంకెవరినైనా  పిలుద్దాం నాన్నా' ఆందోళనగా అన్నాను నేను.
'ముందు చేంతాడు వెయ్యి బావిలో మునిగి వాడు చస్తే మన చావుకొస్తుంది'. అన్నారు  నాన్నగారు. నాకేమి అర్ధం కాలేదు. గబగబా బావిలోకి తాడు వదిలాను. వాడు ఇటు పక్కకి కొద్దిగా ఈది తాడు పట్టుకున్నాడు.
ఇంతలో బావిలోనుంచి  పెద్దగా అరుస్తూ.
'సార్...తాడు సన్నగా ఉంది...'మోకు' వెయ్యండి  అని అరుస్తున్నాడు బావిలోనుంచి వాడు.
'చేంతాడు అంతా బలంగా లేదు నాన్నగారూ' వెళ్లి 'మోకు' తెస్తాను' అంటూ చేంతాడుని భావి పైన అడ్డదూలపు మొద్దుకి ముడి వేస్తూ
ఈ తాడు తెగితే వాడు మళ్ళీ బావిలో పడి చస్తాడు' అనుకుంటూ మోకు తెద్దామని వెనక్కి తిరిగాను.
ఇంతలో పక్కింటి  ప్రకాశరావు ఈ హడావుడికి లేచినట్లున్నాడు.
'ఏమయింది కిట్టయ్య గారూ ...
అర్దరాత్రి భావిదగ్గర' అన్నాడు  గోడ మీదనుంచి తొంగిచూస్తూ.
'నువ్వు గోడదిగి ఇటొచ్చి బావిలోకి చూడు... అంటూ ఇంట్లోకి పరుగెత్తాను నేను.
మోకు తీసుకుని తిరిగి వచ్చేసరికి ప్రకాశరావు కూడా బావిలోకి తొంగి చూస్తూ నాచేతిలోనుంచి  'మోకుతాడు' తీసుకుని బావిపైన అడ్డు దూలానికి ముడి వేసి బావిలోకి వదిలాడు.
రెండు తాళ్ళు జత చేసి మెలిక వేశాను. వాడు మెల్లగా తాడు పట్టుకుని పైకి వచ్చిఒక్కసారిగా బావి అంచు మీదనుంచి దూకి పరుగు లంకించుకున్నాడు.
నేను ధైర్యం చేసి ఒక్క ఉదుటున  పరుగెత్తి పట్టుకున్నాను వాడిని. వాడు వదుల్చుకోవడానికి  గింజుకుంటున్నాడు.
లైట్ కాంతి లో వాడి ముఖం చక్కగా కనిపించింది.
నాన్నగారూ, వీడు 'కొండ' గాడు. ఈసారి బిత్తర పోవడం నాన్నగారి వంతు అయింది.
వాణ్ని లాక్కుని వరండా లోకి వచ్చాము. వాడి  నిక్కరు నుంచి నీళ్లు  వొడుస్తున్నాయి.
'ఏరా కొండా'బావిలోకి ఈవేళ  ఎందుకు దిగావు ?
'మేం రాక పోతే చచ్చేవాడివి గదరా... గాడిద కొడకా' అన్నారు నాన్నగారు కోపాన్ని అణుచుకుంటూ.
'అట్టా మెల్లగా అడిగేదేంది 'కాంతయ్యగారూ' నాలుగు ఉతక్క దొంగ ముండాకొడుకుని' అన్నాడు కోపంగా వాడి ముఖంలోకి తదేకంగా చూస్తూ మాపక్కింటి ప్రకాశరావు.
'మాట్లాడవేం? నాలుగు తగిలించ మంటావా'? కోపంగా లేచారు నాన్నగారు.
వాడు తలెత్తడం లేదు. చేతులు కట్టుకున్నాడు.
నేను లేచి నాన్నగారిని కూర్చోబెట్టి  చెప్పరా'మాట్లాడు' అని రెట్టించాను వాడిని నేను.
'మీకు తెలుసు గదండి అయ్యగారూ, మానాయనకి పక్ష వాతమని. పావురం ఇంటిలో పెంచుతే  పక్షవాతం 
నయమైతదని  ఎవరోఅంటే ఇన్నాను.  చీకట్లో వాటికి కళ్ళు కన్పించవు కదా సులువుగా పట్టుకోవచ్చనుకొని  బావిలోకి దిగాను. రెండుపావురాలని పట్టుకెళదామని ... పాడు పావురాలు చీకట్లో ముఖం మీద తన్నినై.
అందుకే కంగారులో పట్టు తప్పి బావిలో పడ్డానయ్యా!
మిమ్ముల్ని ఆడుగుతే ఇవ్వరని, పావురాల్ని పట్టుకోనివ్వరని, అర్ధ రాత్రి బావిలో దిగి పట్టు జారి భావిలో పడి ఇట్లా దొరికిపొయినా. తప్పయింది. అంటు ఏడుపు లంకించుకున్నాడు 'కొండ'.
'నువ్వు చచ్చే వాడివి గాక  మమ్ముల్ని అందరిని ఇబ్బంది పెట్టేవాడివి 'నడువు' అన్నారు నాన్నగారు లేచి బయలుదేరుతూ.
'మీరెక్కడికి నాన్నగారూ'? అని నేను అనే సరికి  'వీణ్ణి ఈవేషంలోనే తల్లి కి చూపించి రావాలి' అంటూ బయలుదేరారు.
'నేనూ వస్తాను' అని తలుపులు బయటనుంచి వేసి బయలు దేరాం.
'అయ్యా, 'బాయి' వెనకాల చొక్కా వుందయ్యా, తెచ్చుకుంటా'అంటూ పరుగెత్తాడు కొండ.
'అది అక్కడే  వుండనియ్యి. 'లాక్కుని రా వెధవని' అంటూనే బయదేరారు నాన్నగారు.
నాన్నగారి వెంట నేను, వాడు వాళ్ళింటికి  వెళ్ళాం.
కొండ తలుపు కొట్టాడు.
తల్లి తలుపు తీసి, కొండను, నన్ను, నాన్నగారిని చూసి కంగారు పడింది.
కొడుకుని తడి నిక్కరుతో చూసింది.
'ఏరా అయ్యగారి  బావిలో దిగినవా'?  వద్దని చిలక్కి చెప్పినట్లు చెప్పిన గదరా....అంటూనే రెండు చెంపలు వాయించింది' సీతమ్మ.
'ఏం దయ్యగారూ 'మీరు ఇయ్యాలటప్పుడు' అంది సీతమ్మ.
నాన్నకి నాకు అంతా అయోమయం.  నాన్నగారు కోపం అపులేకపోయారు.
'అంటే  వీడు నీకు తెలిసే వచ్చాడా? బుద్ధుందా అసలు నీకు.
పావురం కోసం  అర్దరాత్రి బావిలో దింపుతావా'?
వాడు మునిగి చస్తే'? కోపంతో గట్టిగా అన్నారు నాన్నగారు.
బిత్తరచూపులు చూసింది ...సీతమ్మ!
'పావురాలేంది అయ్యగారూ'...నాకు అర్ధం కావట్లే అంది సీతమ్మ.
'అదేంటే' తండ్రికి పక్ష వాతం కదా. పావురాన్నిఇంట్లో పెంచుతే పక్షవాతం తగ్గుతుందని
ఎవరో చెప్పారట.
'నన్ను అడిగితే కాదంటానని అర్దరాత్రి  బావిలో దిగాడట వాటిని పట్టుకుందామని'
'అయ్యో...కాదయ్యగారూ....అందుకు కాదు వాడు  బావిలో దిగింది. ఏడుస్తూ అంది' సీతమ్మ.
విస్తుబోయి  నాన్నగారి వంక చూశాను నేను. నాన్నగారి పరిస్థితి ... కూడ అలాగే వుంది.
'కొండ'  ఒక్కసారి గా ముందుకు వచ్చి'అయ్యగారూ ... నిద్రలో లేచింది ... రాత్రి కొద్దిగా తాగింది కూడ......ఏదేదో మాట్లాడుతోంది...అమ్మ' పొద్దునే మాట్లాడుద్ది ...  అంటూనే
'తప్పయి పోయింది ....చమించండయ్యా'...అంటూ నాన్నగారి కాళ్ళుపట్టుకున్నాడు  'కొండ'.
'వెధవ తాగినట్లున్నాడు...ఇందాకట్నుంచీ అందుకే నోరు విప్పలే'... అన్నారు నాన్నగారు వెనక్కి జరుగుతూ.
'అయ్యా... నేను రేపు చెబుతా... ఈడు ఎందుకు బావిలోదిగాడో", ఇప్పుడు  మీ రెల్లండి' అంది సీతమ్మ ఏడుస్తూనే కొడుకుని ఉరిమి చూస్తూ.
'సరే, పదరా వెళదాం. రేపు చూద్దాం ఈ వెధవ సంగతి' అన్నారు నాన్నగారు ఇంటికి నడుస్తూ.
'పావురం కాకపొతే వీడెందుకు బావిలో దిగినట్లు'?..'పావురం కాదురా, ఇంకేదో వుంది. వాడేదో దొంగతనానికి వచ్చి ఏదైనా అలికిడి వల్ల బావిలో దిగాడా? ఎందుకు దిగినట్లు?  బావిలో బిందెగాని, వెండి వస్తువులు గాని ఏమైనా పడిపోయాయా కనుక్కో'అన్నారు నాన్నగారు..  '.అయినా సీతమ్మ రేపు చేపుతానందిగా'... నడువు...అన్నారు నాన్నగారు వడిగా అడుగులు వేస్తూ.
ఇంటికెళ్ళే సరికి మూడున్నర అయింది. అమ్మలేచే వుంది.
'ఏమిటీ ? ఏమయింది? 'అర్దరాత్రి ఎక్కడికి వెళ్ళారు, తండ్రీ, కొడుకు' అంది అమ్మ నిద్ర చెడగొట్టినందుకు విసుగ్గా !
'తలుపులు కూడా సరిగ్గా వేయలేదు. గేదెలు గాని మళ్ళీ విడిపించుకున్నాయా? మొక్కలన్నీ తోక్కేశాయా?
ఎన్ని సార్లు చెప్పినా వాటికి ఇనుప గొలుసులు తేరు. మొక్కలన్నీధ్వసం' అమ్మ గొణుక్కుంటూనే పడుకుంది.
'నువ్వు కూడ వెళ్లి పడుకోరా... రాత్రి చాలా సేపు చదివినట్లున్నావుగా', అన్నారు నాన్నగారు.
వెళ్లి పడుకున్నానే గాని నిద్ర రాలేదు. సీతమ్మ మీదే ధ్యాస అంతా.ఇంటిల్లి పాదికీ తలలో నాలుకలా వుంటుంది.
నేను పుట్టక ముందు నుంచి పనిచేస్తోంది ఇంట్లో. అన్నలు, అక్కలు, చుట్టాలు, అంతెందుకు, బావలందరూ కూడ 'సీతమ్మ'ని చాలా అభిమానిస్తారు.
ఈ ఇంట్లో పని మనిషి గా ఎప్పుడు అనుకోలేదు తనని. అమ్మ కుడా పల్లెత్తు మాట అనదు.
'కొడుకని కూడా చూడకుండా వాడు పావురానికి కాదు, వచ్చింది' అని చెప్పింది.
వెధవ 'కొండ' గాడు కూడా ఈ ఇంట్లో మనిషిలానే ఉంటాడు. నాకు వాడికి అయిదు నెలల తేడా అని సీతమ్మ చెపుతూ వుంటుంది. వాణ్ని చదువుకొమ్మని నాన్నగారు చాలా ప్రోత్సహించారు. కానీ వాడికి చదువు అబ్బలేదు. ఆరో తరగతి మధ్యలో  మానేశాడు. ఇంట్లో అందరి దగ్గరా చనువు వాడికి. ఒకళ్ళకి తెలీకుండా అందరి దగ్గరా కొద్దో , గొప్పో డబ్బులు తీసుకుంటూనే ఉంటాడు. సోమరి వెధవ. ఈ మధ్య  వెధవకి
వ్యసనాలు కూడ అలవాటు  అయినట్లుంది. ఈమధ్య రెండు, మూడు సార్లు అయిదు, పదీ కనపడలేదనీ అమ్మ అందీ, నా రూములో కూడ కొద్దిగా డబ్బులు మిస్సయినట్లు అనుమానం వచ్చింది. వెధవ పాడయ్యాడు.
వాడి తండ్రి కి మందులు కూడా చాలా వరకు మాఇంటి నుంచే వెళ్తాయి.
ఒకసారి దీపావళి పండక్కి అక్క,బావ,అన్నయ్య,వదిన అందరు వచ్చారు. పండగ సందడిలో   
వదిన నా కొత్త షర్టు గుండీ కుట్టి 'సూది' వాడి చేతికిచ్చి గోడకున్న కేలండర్ కి గుచ్చమంది.
వీడు వెళ్లి సూదిని  పవర్ సాకెట్ లో పెట్టాడు. కరెంటు షాక్కి వచ్చి మా బావగారి వొళ్ళో పడ్డాడు.
'ఏమయిందిరా? అంటే 'దిమ్మ తిరిగింది, తరువాత ఏమయిందో తెలవదు. బావగారి వొళ్ళో ఎట్టా పడ్డానో తెలీదు' అన్నాడు. అది గుర్తు వచ్చినప్పుడల్లా అందరం పడీ,పడీ నవ్వు కుంటాం.
అలాంటి అమాయకపు వెధవ ఇలా తయారయ్యాడు అనుకుంటూ నిద్రకుపక్రమించాను. తెల్లారింది.
నేను వేప పుల్ల నోట్లో వేసుకుని వాకిట్లోనే  వున్నా. సీతమ్మ వచ్చి తలెత్తకుండా వాకిలి వూడవడం మొదలెట్టింది.
ఇంతలో నాన్నగారు కాఫీ  కప్పుతో వరండాలోకి వచ్చి" ఏమే' సీతాలు' రాత్రి ఏదో అంటివి.
'వాడు పావురాయి కోసం కాదా బావిలో దిగింది ? మరి దేని కోసం ? అన్నారు  నాన్నగారు.'
'ఏందోనయ్యా... రాత్రి నిద్రలో  ఏం మాట్లాడానో... ఏందో ! వాడు పావురాల  కోసమే వచ్చిండటయ్యా'!
అంది తల వంచుకుని వాకిలి ఊడుస్తూనే.
సీతమ్మ నిజం చెప్పడం లేదని ఏదో ఒత్తిడిలో వుందని తన ముఖ కవలికలే చెబుతున్నాయని మనసులో అనుకుంటూ
'సరేలే వాడు జాగ్రత్త. వెధవ చేతికందకుండా పోయేటట్లున్నాడు.
'వాణ్ని ఒక కంట కనిపెడుతూ వుండు'అన్నారు నాన్నగారు లోపలికి వెళ్తూ.
ఇంతలో పక్కింటావిడ గోడ మీద నుంచి పిలుస్తూ ' ఏంటి కిట్టయ్య గారు రాత్రి గొడవ' అంది.
'కొండ'  రాత్రి పావురం కోసం బావిలో దిగాడు. 'అట్టానే అనుకోండి కిట్టయ్య గారు, ఎప్పుడో వాడు మీ ఇంటికో,
మా ఇంటికో కన్నం వేసిందాక' అంది పక్కింటావిడ వెటకారంగా.
'అదేందమ్మా... అట్లంటారు, వాడేం చేశాడమ్మా? ' అంది సీతమ్మ.
సీతమ్మ మాట్లాడకుండా 'ఇదిగో కిట్టయ్య గారు మొన్న మీరంతా  వూరు వెళ్లి నప్పుడు మీ పాత రేకులు వాడు సర్దుతుంటే చూశాను. తరువాత మీ అమ్మగారు వూరి  నుంచి వచ్చాక రేకులు పోయినై, పాతవే నని పట్టించుకోలేదని" అన్నారు.  రాత్రి 'కొండ' బావి లో పావురాల్లకోసమే దిగాడంటే నేను నమ్మను. సరిగ్గా కనుక్కోండి' అంటూ వెళ్లి పోయిందావిడ. 'ఆవిడ మాటలు విన్న నాకు అసలీ సంగతేమిటో తేల్చాలి' అన్న భావన గట్టిగా స్థిరపడింది నామదిలో.
సీతమ్మ తల ఎత్తకుండా పనిచేసు కుంటూనే  వుంది. వెధవ వాడి మూలాన్న సీతమ్మ మాటపడాల్సి వచ్చింది ఆనుకున్నానేను. ఇంతలో నాన్నగారు  'కృష్ణా' ఇలారా! అన్నారు. నేను నోట్లో వేప పుల్ల తీసి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను.
'సీతమ్మని  నువ్వుగాని, అమ్మగాని ఎవరూ ఏమి అడగొద్దు. దానంతట అది ఏమైనా చెపుతే నాకు చెప్పండి.
'మళ్ళీ చెపుతున్నాదాన్ని ఎవరూ ఏమీ అడగకండి. అమ్మకు కుడా చెప్పు' అన్నారు నాన్నగారు.
అదీ దాని మీద మా అందరికి ఉన్న అభిమానం. వారం, పది రోజులయ్యాయి. 'కొండ' గాడు మళ్ళీ కన్పించలేదు.
నాన్నగారు మాత్రం వాడికి దగ్గర  పట్టణం లో ఏదైనా వుద్యోగం వేయిద్దామని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుసు.
దాదాపు నెల రోజుల తరువాత అనుకుంటా నాన్నగారు పొలంలో నాట్లు... నువ్వు కూడా  పొలానికి రమ్మని చెప్పి ఉదయమే వెళ్ళారు. నేను నాన్నగారికి టిఫెన్ తీసుకుని తొమ్మిది గంటలకల్లా పొలానికి వెళ్ళాను.
'కొండ' గాడు నారు కట్టలు అందిస్తూ, కుదప తొక్కుతూ పై పనులు చేస్తూ కన్పించాడు.
ఎప్పుడు వస పిట్టలా వాగే వెధవ నావంకే సరిగ్గా చూడ్డం లేదు.' ఏరా కొండా' ఆరోజు నుంచి కనిపించడం మానేశావు.
'ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు'? అనడిగాను వాణ్నిఎలాగైనా వివరం కనుక్కోవాలని .
'అదేంటి కిట్టయ్యగారూ, నాన్నగారు చెప్పలేదా'! అయ్య గారు పట్నంలో
ఉద్యోగం వేయించారు. టెంపరవరి. 3500 /- రూపాయలు  జీతం కిట్టయ్య గారు. ఇక బుద్ధిగా ఉంటాను. 
ఉద్యోగంలో చేరి కూడా పది రోజులయింది. ఇవాళ శలవు.
పెద్దయ్యగారు  కూలికి రమ్మన్నారు. వచ్చినా'.
'పెద్దయ్య గారిది  'పెద్దమనసు' కిట్టయ్య గారూ' అన్నాడు కొండ
'సరేలే.... పని చూసుకో' అని నాన్నగారికి  టిఫెన్ ఇస్తే వద్దన్నారు. ఇంటికెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తానన్నారు. 'సరే నాన్నగారూ... భోజనం కూడా చేసి వచ్చేయండి  నేను ఇక్కడే వుంటాను అన్నాను నేను'.
'సరే  రా' అని నాన్నగారు ఇంటికి వెళ్ళారు. ఇక నేను వాడితో కలిసి పని మొదలెట్టాను.
ఎలా అయినా సరే ఆరోజు సంగతి ఇప్పుడు తేల్చాల్సిందే,  అనుకున్నా. దాదాపు పన్నెండు అయింది టైం.
కూలీలందరూ భోజనాలు చేస్తున్నారు. నా దగ్గర 'టిఫెన్' తీసి తినడం మొదలెట్టా.
'కొండ' గాడిని కూడ పిలిచా.
'ఏందీ కిట్టయ్య గారు టిఫెన్'? అన్నాడు కొండ. ఇడ్లీ, దోశ  రెండు వున్నాయిరా...రా...తిందాం.' పిలిచాను నేను.
ఎలాగయి నా సరే వాడి దగ్గరనుంచి ఆ రోజు విషయం లగాల్సిందే అనుకున్నా.
వాడు దగ్గరకొచ్చి కూర్చున్నాడు.
ఇద్దరం టిఫెన్ తినడం మొదలెట్టాం. నేను ఎలా మొదలు పెట్టాలి 'టాపిక్' అని ఆలోచిస్తున్నా.
"కిట్టయ్య గారూ, ఎందుకంత ఆలోచిస్తారు. మీకు కావలసింది ఆరోజు నేను బావిలో ఎందుకు దిగానని కదా"! ఇనండి. 
నేను భావిలో దిగిన రోజు రెండు రోజుల ముందు మీ పిన్నిగారు 'పట్నం' నుంచి వచ్చారు కదా !
ఆవిడ రెండు రోజులు వున్నారు. ఆవిడ బాగా నగలేసుకొచ్చారు. పెద్దమ్మగారు 'ఎందుకే ఇన్నినగలేసుకోచ్చావు'
అసలే ఈ వూర్లో దొంగల భయంతో చస్తున్నాము' అన్నారు పెద్దమ్మగారు.
అప్పుడు నేను అక్కడే వున్నాను. 
'జాగ్రత్త, ఎక్కడ దాచుకుంటావో, ఈ రెండు రోజులు' ? అన్నారు అమ్మగారు.
'నీకెందుకే భయం. నానగలు, నేను ఎక్కడయినా దాచుకుంటాను' అన్నారు పిన్నమ్మ గారు.
'అదేనే ఎక్కడ దాస్తావు'? అని పెద్దమ్మగారు మళ్ళీ అడిగారు.
'అబ్బా' నీ భయం పాడుగాను. కంగారు పడకు. వాటిని ఒక ఇనుప తీగకు చుట్టి ప్లాస్టిక్ సంచిలోవుంచి మీ బావిలో వేశాను.
ఇక నువ్వునిశ్చింతగా పడుకో అక్కా' అన్నారు మీ పిన్నిగారు.
'ఆ'... మళ్ళీ వాటిని ఎట్లా తీస్తావే ? ఏమిటో ఈ పిల్ల అఘాయిత్యం' అని కంగారుగా
'ఏమండీ, ఏమండీ' అంటూ పెద్దమ్మగారు పెద్దయ్యగారికి చెప్పడానికి లోనికి వెళ్ళారు.
పిన్నిగారేమో పగలబడి నవ్వుతు, ఏరా 'కొండా' మీ అమ్మగారికి ఇంతా భయమేమిటి రా"? అన్నారు.
'అబ్బ...  భలే చాన్సులే' అని అప్పుడే మనసులో అనుకున్నాను.
ఎలాగయినా ఆ నగల్ని భావిలోనుంచి తీసి అమ్ముకుందా మనుకున్నాను.
వెంటనే నేను చేతిలో పని ఆపు చేసి భావి లోకి  తొంగి చూస్తుంటే పెద్దమ్మగారు,
'ఏం చేస్తున్నావురా అక్కడ' అని గద్దించారు కూడా'....
'అదీ సంగతి' ! ఆరోజు భావిలోకి  నగల కోసం దిగాను!
'బావిలో వెతికి, వెతికీ చచ్చాను. అసలు మీ పిన్ని గారు నగల్నిభావిలో వేయలేదు.
'ఆవిడ ఎక్కడో దాచి అమ్మగార్ని నవ్వులాట  పట్టిస్తుంటే నేను నిజమే అనుకున్నాను'.
బుద్ధి వచ్చింది కిట్టయ్య గారు. మళ్ళీ జన్మలో దొంగతనం గురించి ఆలోచన గూడా చేయను. అయినా దేవుడి లాంటి అయ్యగారింట్లో నే దొంగతనం చెయ్యాలనుకున్నా.
చాలా తప్పుచేసినాను కిట్టయ్యగారు' అని 'కొండ' చెబుతుంటే నాకు నవ్వు ఆగింది కాదు.
అమ్మ ఈ విషయం అయ్యగారికి చెప్పి చమించమని కాళ్ళు పట్టుకోమంది.
లేకుంటే చస్తానని బెదిరించింది మాయమ్మ 'అన్నాడు కొండ .
'మీరుకూడా ...చమించండి కిట్టన్నాఅన్నాడు 'కొండ' తలవంచుకుని.
అయ్యగారికి, అమ్మగారికి చెప్పండి. నాకు అయ్యగారికి చెప్పే ధైర్నం లేదు.
ఎంత పెద్ద మనసో అయ్యగారిది.
ఇంకొక్క విషయం కిట్టయ్య గారు...అక్కలకి, అన్నలకి ఎవరికీ ఈ విషయం మాత్రం చెప్పొద్దు.
నా పరువు పోద్ది. మళ్ళీ ఎవరిదగ్గరనుంచి ఒక్క పైసా కూడ రాలదు' అని వివరంగా చెప్పాడు 'కొండ'.
'వెధవా' నీ బుద్ధి మారదురా అనుకున్నా. అయినాసరే, వాడి మీద  కోపం గాని, అసహ్యం కాని కలగలేదు.
ఇదంతా సీతమ్మ మీద మా అందరికీ  ఉన్నఅభిమానం వల్లే.
'ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి...ఎప్పుడు అందరికి చెప్పాలి'  అన్నధ్యాసలో పడ్డాను.
ఈ విషయం గుర్తు కొచ్చినప్పుడల్లా మా ఇంటిల్లపాది అందరం తెగ నవ్వుకునే వాళ్ళం. సీతమ్మకూడా మాతో కలిసి నవ్వుకునేది.

రచన:-
కేశిరాజు వెంకట వరదయ్య.
Mobile No. 9849118254.

14, ఆగస్టు 2010, శనివారం

Punyabhoomi naa bharathadhatri.

                                                             పుణ్యభూమి నా భరత ధాత్రి.

భరత మాతను నేను. భరత ధాత్రిని నేను. శతబ్దాల  చెరలో ముద్దు బిడ్డలని కసాయిలకు  బలి ఇచ్చిన  బంధకిని  నేను.  లెక్కకు మిక్కిలి  ముష్కర మూకల దాడులతో, మహమ్మదీయుల దండయాత్రలతో, శతాబ్దాల  పరాయి  పాలనలో చిక్కి శల్యమైన నేను  దాస్య శ్రుంఖలాల నుంచి విముక్త మైనా నని అనుకొన్నాను.
నాటి నుంచి  నేటి వరకు నా శిరం భారం. దానికి మందు లేదు నా వాళ్లకి లేదు ముందు చూపు. ఇటు  ప్రక్కన 'ఇసి' వుశి గోల్పుతోంది. మతోన్మాదుల మదం, మాత్సర్యం తో ఇసుమంత విశ్రాంతి లేదు. కాశ్మీరం నా శిరం. నా శిరచ్చేదానికి కుట్రలు, కుతంత్రాలు  నిత్యకృత్యమైపోయాయి. అడ్డుకునే నాధుడే కరువయ్యారు. నా బిడ్డలు మౌనం వీడాలి. కార్యదీక్షా నిబద్దులుకావాలి.
దశాబ్దాలుగా మౌనంగానే వున్నాను. చెర పట్టిన వారిని సైతం కరుణించాను. సహనానికో హద్దుందని ముష్కర మూకలికి అర్ధమయ్యేలా చెప్పండి. మౌన ముని మౌనం వీడి మన్మోహనాస్త్రాన్నిపదును పెట్టాలి.
పర తంత్ర మంత్రాంగమే భారం అంటూ ఉత్త నినాదాలు. వినీ,వినీ విసిగి, వేసారి పోయాను. నిద్ర లేదు నివృత్తి లేదు.
శిరో భారమే కాదు. భుజాలు సైతం బాధతో మెలి తిరుగు తున్నాయి.
ఇటు ప్రక్క' చీనా' చీడలా  తినేస్తుంది. ఈ సరికే నన్ను కొంత కబళించింది. సూర్యబాంధవుడు నన్ను తాకే చోటు నాది కాదు పొమ్మంటోంది. నాకొమ్ము కాశే వారే కరువయ్యారు.
'ఆసాం' తం అల్లర్లు, అల్లకల్లోలం.      
ఇక నా 'వక్షం' వృక్షం అవుంతుందని నలుగురికి నీడ ఇస్తుందని ఆనుకున్నా. 'హస్తి 'నా' పురం కదా వాసి కెక్కుతుంద నుకున్నాను. తనా లేదు, మనా లేదు కీచక పర్వానికి  నీడ గా మారింది. 'నీరోలు' వాసి కెక్కారు. నా బిడ్డలు ఉడిగం  చేస్తున్నారు. నిమ్న జాతులు నీరసిస్తున్నాయి నీచులు నీడ పాటున నా జాతిని నిర్వీర్యం చేస్తున్నారు.
'నా' పురం  నా అంగాంగ భాగాలకి రాచ కురుపుల కేంద్రంగా మారింది.
మరాటులు, అరుణాచల వాసులు గళ  మెత్తారనుకున్న. సింహాసనానికే రాచ మర్యాదలని, తమ, తమ నెలవులుకే భంగపాటు లోస్తాయని, అధినేతల  ఊసెత్తని వారలతో  స్నేహం తమకు తగదని వారు  కూడా  తిరోగమించారు. కార్యదీక్షులు, స్వార్ధం వీడాలి. జాతి సేవకు అంకితం కావాలి. కావలసిన  కార్యాలు, చేయవలసిన పనులు  కాల పరీక్షకు వదలరాదు.
ఇక నా ఉదరం లో ఎటు చూసినా అటు పోట్లు. నిజాయితీ కి నిలు వెల్లా 'కొరవే'. రాజ పుటానులు రోషం మరిచారు. బీహారి బేహారుల్ని బీహారులు బేఖాతరు చేశారు. భిన్నత్వం లో ఏకత్వం అన్న నానుడి నాని పోతోంది. శతాబ్దాల మత సామరస్యం మంట కలిసింది. మంట  రాజేస్తున్న వారు సింధు ప్రక్కనే  రాబందుల్లా  కొలువై వున్నారు. అన్ని తెలిసీ తెగువ లేక చేష్టలుడిగి అచేతనంగా ఉన్న నా  బిడ్డలు  తమ తమ నెలవుల నెచ్చెలుల వీడి పీడిత ప్రజల సేవే పరమార్ధంగా, మాతృభూమి కొలువే కొలమానంగా చేసుకున్న నాడే నాకు నిద్ర. ఎటు చూసినా  జాతి వ్యతిరేక  దాడులు, వాడ వాడలా దంతే వాడలు. కులమార్పుల కల్లోలాలు. తూర్పు సైతం మనదికాని మావోఇజం తో తల్లడిల్లుతోంది. నామధ్యంలో మరాటీల  'మహా' దృష్టి వక్రించి నా ప్రజలను దోషులుగా ద్రుక్కిస్తున్నారు.
క్రిందకు వెళితే ఏముంది కుహనా లౌక్యం, భూభాగోతాలు, 'సెజ్జు'లంటూ 'సజ్జ'  పండే భూమి సైతం సంతలో పెట్టారు. నవాబుల  సైతోడు  జాగీరుల నజరానాలు, నాసహజ వనరుల్నిగునపాల గురితో నజ్జు చేస్తున్నారు. నదీమ తల్లుల్నినాది, నాదంటూ క్రింద మీదవుతున్నారు. నీరు పల్లమెరుగు అన్న సత్యం  అనిత్యం అయిపొయింది.  నాది, నాదంటూ ఎవరికీ వారే లెక్క లేసు కుంటున్నారు. భగీరధుదు  సైతం బామాల్సిందే. అయినా తెగని నీటి నాటకం. చోద్యం చూస్తున్నారు చేవ కలిగిన వారు. ఇంకా చోద్యం  భూ"మధ్య" గీత గీస్తున్నారు. కర్నాటకాన అంతర్నాటకం "రాఘవుని" బళ్ళారి  చుట్టూ ప్రదక్షిణం. నా దేవుని సొంత భూమి నానాటికి విచ్ఛిన్నం. మత  చాందసవాదులాట నిత్య కృత్యం. నా లలాట లిఖితమేదో నిర్లిఖితమైనట్టుంది. ప్రవక్తలు, మత పెద్దలు పంచాలి మంచినే కాని మానవాళిని మట్టు పెట్టరాదు. శ్రమైక జీవులను
పరాన్నభుక్తుల గానే ఉంచాలని, పెంచాలన్న యోచనకు తాళం వెయ్యాలి. శ్రమజీవికి  స్వాంతన కావాలి. వందల వత్సరాల బానిస బ్రతుకేదో "బాంచనే" పోమ్మంటోంది ! మార్పేది లేదు! ఆరు దశాబ్దాల  క్రింద 'నేనేదో' నేడు 'నేనదే' అనడంలో నా కేమీ నగుబాటులేదు. అవినీతి, అనైతికత నాకు జీర్ణమై పోయాయి.
'మోతీ' లాలంటి బిడ్డలు కోకొల్లలు నాకు . నాకెందుకీ 'దత్తు' ? నా కడుపున  పండు సిరులు
ఎంతకయినా చాలు. గోదాముల్లోని నిలవ పురుగులకు  కాదు. నిలవ  నీడ లేక, ముద్దనోటికి రాక కడుపులో కాళ్లేట్టుకు కాల మీడుస్తున్న బిడ్డలందరికి కావాలి. తనువు చాలిచ్చేటంత ముదుసలిని కాను. ఆరు పదులు దాటి ముచ్చటగా మూడేళ్ళు. రోగిష్టి దానిలా  పడుతు,లేస్తున్నాను. జవ్వనివి నీకేమి అంటు వెంట పడుతున్నారు. దొరికినంతకు మేర పీక్కు తింటున్నారు.
ఏ దారి లేదింక. త్రిమూర్తుల వంక తిరిగి చూస్తున్నాను.
వినాయకుణ్ణి పంపి స'నాయకుణ్ణి' తెచ్చి నన్ను నా ప్రజను దీవించమని చెప్పి.
కేశిరాజు వెంకట వరదయ్య .

గెలుపు ఓటములు

                                                    
                                                     
                                  గెలుపు ఓటములు                                                
ఆట కానీ జీవితం కానీ  గెలుపు, ఓటములు సమానంగా తీసుకుంటేనే మనిషి మనుగడ.
చీకటి వెంట వెలుగు ఎలానో ఓటమి తరువాత గెలుపు అంతే అనుకోని రోజున మనిషి ప్రయత్నం చెయ్యడం మానేస్తాడు.
ప్రయత్నం చేయని రోజున సృష్టి స్తబ్దుగా తయారవుతుంది.
అంచేత మనిషి తను ఏదైనా పని  చేయ తలుచుకున్నప్పుడు సాధ్యాసాద్యాల గురించి ఆలోచించడం,   అది తన వల్ల అవుతుందా లేదా అని బేరీజు వేసుకున్నాక  ఆ కార్యం మొదలు పెట్టాలి. అప్పుడు కార్యసాధన గురించి అది అవుతుందా, కాదా అన్న మీమాంస   అంతగా మనిషిని ఆందోళనకు గురిచేయవు. జీవనపధంలో కొన్ని కొన్ని పనులు
అనుకోకుండా, అకస్మాత్తుగా చెయ్యాల్సి వస్తుంది. అవి తమ కోసం కాకపోయినా తనవారి కోసమో, సఘం కోసమో తప్పనిసరిగా  చెయ్యాల్సి వస్తుంది.

9, ఆగస్టు 2010, సోమవారం

Gundechappudu.

                                                         గుండె చప్పుడు/ sixth sense.
నాకు మావారికి యాత్రలకి వెళ్ళాలంటే మహా ఇష్టం. దక్షిణ దేశ యాత్ర ఇప్పటికే నాలుగు సార్లు అయింది. ఈసారి ఉత్తర దేశ యాత్ర అందునా 'చార్ ధామ్'(యమునోత్రి,గంగోత్రి ,బదరీనాథ్,కేదార్నాథ్)యాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అసలు ఈపాటికే అమెరికా వెళ్ళాల్సి ఉంది. కానీ మా పెద్దమ్మాయి నెలతప్పిందని తెలిసి ఆఖరి నిముషం లో ప్రయాణం అయిదు నెలలు వాయిదా వేసుకుని  'చార్ ధాం' యాత్రకు బయలు దేరాం. మా  చిన్నఅమ్మాయి హైదరాబాదు లో ఉంటుంది. దానికి చెప్పాను ఇలా ఉత్తర దేశ యాత్ర కి వెళ్తామని.అన్ని  వివరాలు తీసుకుంది. హైదరాబాదు నుంచి ఢిల్లీ దాక విమానం లో
అక్కడనుంచి ఉత్తరాంచల్ టూరిజం వారి బస్సు లో ప్రయాణం. వసతి సౌకర్యం కూడ కలిపి  అన్నిటికెట్స్ తను ఆన్ లైన్ తీసుకుంది. ప్రయాణ తేదీలు, ఏ రోజు ఎక్కడ ఉంటాము అన్ని వివరాలు అమెరికాలో ఉన్న అన్నకు,అక్కకు పంపి మాకు ఒక కాపీ ఇచ్చింది. ఢిల్లీ నుంచి  హృషీ కేష్  ప్రయాణం కొద్దిగా అలసట అనిపించినా సాఫీగా సాగింది. హృషీ కేష్  చేరే సరికి
సాయంత్రం 6 గంటలయింది. అక్కడ రెండు రోజుల విశ్రాంతి. మాకిచ్చిన వసతి గృహం చాలా బాగుంది. హృషీ కేష్, హరిద్వార్ లో చూడవలసిన" గంగామయ్య" హారతి, రాం ఝూలా,లక్ష్మన్ ఝూలా,ముఖ్యమైన దేవాలయాలు వారే మరుసటి రోజు  చూపిస్తామన్నారు. అందరిని బయటకు ఒంటరిగా వెళ్ళవద్దని నగలు, నట్రా జాగ్రత్త అని, పర్సులు,డబ్బు జాగ్రత్త అని, పదే పదే  హెచ్చరించారు. మరుసటి రోజు అన్ని చూసి తిరిగి వచ్చే సరికి దాదాపు రాత్రి 10  గంటలయింది. వారి కాంటీన్ లోనే
దాల్ రోటి తినేసి రూంకి వచ్చాము. పిల్లలూ ముగ్గురు కూడబలుక్కున్నట్లు  ఒకరితరువాత ఒకరు ముగ్గురు ఫోన్లు చేశారు.ప్రతి రోజు ఇదే టైం కి ఫోన్ చేస్తామని ఆరోగ్యం జాగ్రత్త అని మేము వాళ్ళకి చెప్పినట్లు తిరిగి మాకు చెప్పారు.
ఉదయం స్నానం, టిఫెన్ ముగించుకుని మేమిద్దరం,ఇంకా కొంత తెలుగు వారం కలిసిరెండు   టాక్సీలు  చేసుకుని  హరిద్వార్
మళ్ళీ వెళ్ళాం. సంకట మోచన్ గణేష్ దేవాలయం, ఇంకా కొన్నిమందిరాలు చూసి ఒక పెద్ద శివాలయం కి వచ్చాము.
ఆలయంలో చాల రద్దీ, తోపుడుగా ఉంది. అయినా సరే వచ్చాం కదా అని మేము గుంపుగా ఆలయంలోకి వెళ్లి
ఆ రద్దీ లో,తోపుడులో మావారు ఒక పక్కకి నేనొక పక్కకి అయి పోయాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మా పని అయిపొయింది. నాకేదో తెలియని ఇబ్బందిగా అనిపించి బాగ్, అందులో పర్సు చూసుకున్నాను అప్రయత్నంగానే. ఇంకేముంది రెండు అరల్లో పెట్టిన దాదాపు 15 వేల రూపాయలు మాయం. పర్సు జిప్ తీసి ఉంది. గుండె తీవ్రంగా కొట్టుకుంటోంది.
నోట మాట రావడం లేదు.ఆయనకు ఈ విషయం చెపుదామని నాప్రయత్నం. నోరు పెగల లేదు.
సైగలతో నే ఖాళీ పర్సు చూపిద్దామని అయన కోసం చూశాను. అక్కడ ఇంకో తెలుగావిడది నాపరిస్తితే. ఈయన ఆవిడను,వాళ్ళ  ఆయనను పరామర్శిస్తున్నారు.వాళ్ళాయన ఆవిడను  ఒకటే అరుస్తున్నాడు. నా పరిస్తితి కి నాకే నవ్వు వచ్చింది. రండి, మనసంగతి చూడండిముందు, అనుకున్నాను, మనస్సులో కొద్దిగా కుదుట పడి ఆయనదగ్గరికి  వెళ్లి మనది కూడ అదే పరిస్థితి. మొత్తం డబ్బు పోయింది.అని ఖాళీ పర్సు చూపించాను. మీ దగ్గర ఎంత ఉంది అని అడిగాను ఆయన్ని.
అయన జేబులు  చూసుకొని మూడు వేలు  ఉందన్నారు.  ఇంకా 14 రోజులు గడవాలి, ఎట్లారా భగవంతుడా,ఎంత పని చేశావు స్వామీ !అనుకోవడం తప్ప ఇంకేమి చేయగలం. టికెట్స్ అన్నీ కొన్నాం, కానీ తిండీ, తిప్పలూ ఎలా ? మా గ్రూప్ లోనే ఒకాయన ఇవన్నీ గమనించి ఏం ఫరవా లేదండి. తెలుగు వాళ్ళం ఇంత మాత్రం సర్దుకు పోక పోతే ఎలాగండీ.నా దగ్గర దండి గానే ఉంది లెండి. సర్దు కుందాం అన్నాడు ఒకాయన.ఆయన దేవుడిలా కనిపించాడు ఆక్షణంలో.
ఇంతలోనే ఆయన భార్య ఆయనకు క్లాసు పీకడం మొదలెట్టింది.
మొదలెట్టారూ? ఎక్కడ  కెళ్ళినా ఈ సంత తప్పదు కదా నాకు. అంటోంది ఆవిడ బిగ్గరగానే . అందరూ ఆవిడని ఏదోలా చూశారు.
నా మనస్సు చివుక్కు మంది. అనవసరంగా మాట పడాల్సి వచ్చింది నావల్లే కదా అన్నాను ఆయనతో.
మనమేమి వాళ్ళని అడగలేదే.నువ్వెందుకు బాధ పడాలి. అయన నా చెయ్యి పట్టుకుని వదిలెయ్యి అన్నట్లుగా చూశారు నావంక. అందరు అక్కడే ఉన్న పెద్ద చెట్టు క్రింద నీడలో కూర్చున్నాం. పోలీసు రిపోర్ట్ ఇవ్వడమా,లేదా, తలొక మాట మాట్లాడుతున్నారు.ఇంతలో మావారు, సరే,  ఇక్కడ పక్కనే స్టేటు బ్యాంకు ఉందండీ. క్రెడిట్ కార్డు మీద ఏమైనా కేష్  లోన్  ఇస్తాడేమో అడిగి  వస్తాను. అని చెప్పి వెంటనే  వెళ్లారు. ఇంతలో నా మొబైల్ మ్రోగింది. అమెరికా నుంచి మావాడి ఫోను. అమ్మా మీరిద్దరూ బావున్నారా? మీ దగ్గర డబ్బు ఎంత ఉంది. కొద్దిగా ఎక్కువ ఉంచుకోండి. ఇప్పుడు
హృషీ కేష్  లో వున్నారా? రేపు కదా మీ యాత్ర స్టార్ట్ అయ్యేది అన్నాడు వాడు.  అవునురా, ఇప్పుడు మీకు రాత్రి రెండు న్నరో,మూడో అయ్యింది  కదా ఇంకా నిద్ర పోలేదా? అనడిగాను. లేదమ్మా, నిద్ర లోనే వున్నాను, ఏదో పిచ్చి కల వచ్చింది.నీ దగ్గర డబ్బు మొత్తం పోయినట్లు కల వచ్చిందమ్మా, అని డాడీ కివ్వమ్మా ఫోను అన్నాడు. డాడీ లేరురా ఇక్కడ అయన ఇక్కడే ఎక్కడో తిరుగు తున్నారు,. అని చెప్పాను. సరే అమ్మా, పెన్ తీసుకుని ఈ నెంబరు  నోట్ చేసుకో అన్నాడు వాడు. అరేయ్, నాదగ్గర పెన్, పేపరు లేదు పది నిముషాలాగి  ఫోన్ చెయ్యి లేకపోతే డాడీ నెంబరు కి ఫోన్ చెయ్యి అని చెప్పాను.. సరే అన్నాడు వాడు .ఇక వెల్దామండీ   మీవారు ఇంకా రాలేదేంటి, అని తొందర పెడుతున్నారు ఇక్కడ మిగతా వాళ్ళంతా. దాదాపు అర్ధగంట
తరువాత తిరిగి వచ్చారు ఈయన. వస్తూనే పని అయింది. బ్యాంకు వాళ్ళు చాల బాగా  సహకరించారు. నిముషాల్లో కార్డు/debits/ నా identity పరిశీలించారు. రూ. 20 ,000/- తెచ్చాను అన్నారు. చాల రిలీఫ్ వచ్చింది.మనస్సులో
ఆయన్నిఅభినందించుకున్నాను. ఇంతలో ఆయన, నువ్వుగాని వంశీ (మా అబ్బాయి) కి ఫోను చేశావేంటి అనడిగారు. లేదే! నేనేమి ఫోను చెయ్యలేదు, వాడే ఇంతకూ ముందే ఫోన్ చేశాడు.వాడికి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయినట్లు కల వచ్చిందట. ఏదో నెంబరు నోట్ చేసుకోమన్నాడు.అదేదో మీకే చెప్పమని చెప్పాను. అదే చెపుతున్నాను నువ్వే ఫోను చేసి
డబ్బులు పోయాయి అని చెప్పి వుంటావు. అందుకే వాడు నాకు ఫోను చేసి  వెస్ట్రన్ మనీ (western money) లో 500 డాలర్లు
పంపించాను అని ఒక కోడ్ నంబరు ఇచ్చాడు. మీ ID చూపించి ఎక్కడయినా పోస్ట్ ఆఫీసు లో తీసుకోవచ్చు.మీరు కేష్ తీసుకోండి, ఇబ్బంది పడకండి అన్నాడు వాడు. సరే ఎలాగు మేము స్టేటు బ్యాంకు లో డబ్బు తీసుకున్నాము.
అసలు మా డబ్బు పోయినట్లు వాడికి కల రావడమేమిటి? వాడు, డబ్బు పోయిన పది నిముషాల్లో ఫోన్ చేసి డబ్బు పంపించాను అని చెప్పడమేమిటి! అంతా ఒక విచిత్రం! దాన్నే 'టెలిపతి'  (telepathy) అంటారు అన్నారు మావారు.
కాదు  నా గుండె చప్పుడు వినిపించింది వాడికి అనిపించింది నాకు. తరువాత యాత్ర అంతా చేసుకుని క్షేమంగా   తిరిగి వచ్చాం.
జరిగింది చెపుతే అందరికి వాడి కల గురించి 'చిత్రం' అనిపించింది. మా పెద్దది ఫోను చేసి అమ్మా నాకు కూడ మీ డబ్బులు పోయిన రోజు ఎలాగో అనిపించింది. నేను వంశీ కి ఫోన్ చేసి డాడీ వాళ్లకి డబ్బులు పంపించాలంటే ఎలారా అని వాడిని అడిగానమ్మా, కాని వెధవ వాడు అప్పటికే  పంపించాడట అని అది అంటుంటే నాకు నిజంగా sixth సెన్స్ అంటుంటారు కదా అది తల్లులకే  కాదు పిల్లలకు వుంటుంది అని తెలిసిందారోజు! కాకపోతే ప్రతి మనిషి గుర్తించ వలసిన విషయం ఏమిటంటే అలాంటి స్పందన ఏదైనా మీలో కలిగినప్పుడు, ఆ గుండె చప్పుడు, మీ మనస్సు చెపుతున్న విషయం వినండి.అర్ధం చేసుకోండి.
వెంటనే, కాలయాపన చేయ కుండా స్పందించండి.మీ వాళ్ళని ఆదుకున్నవాళ్ళవుతారు. తరువాత ఇక్కడ ఇంకో విషయం
కూడా వ్రాయ తలచుకున్నాను. ఆడ వాళ్ళూ మారండి.మాట జారకండి. మనస్సులు నొచ్చుకుంటాయి. ఆపదలు చెప్పి రావు.
రేపు మీకు  అదే పరిస్థితి  ఎదురు కావచ్చు. హంగు వున్నవాళ్ళు ఏదో విధంగా ఒంటి మీద నగ, నట్రా అమ్ముకోనయినా బయట పడవచ్చు. అందరు వున్నవాళ్ళు కాదుకదా. మనది కాని వూరిలో లేక దేశంలో ఎవరికైనాఆపద రావచ్చు.
మీరు సాయం చెయ్యక పోవచ్చు.చేసే వాళ్ళని చెడ గొట్టకండి.
కేశిరాజు రజని.

4, ఆగస్టు 2010, బుధవారం

ఆహార ధాన్యాల వృధా - మానవ తప్పిదాలు-ప్రభుత్వ ఉదాసీనత

                                     ఆహార ధాన్యాల వృధా - మానవ తప్పిదాలు-ప్రభుత్వ ఉదాసీనత.
ఈ రోజు 'ఈనాడు' లో ఆహార ధాన్యాల నిల్వలఫై "పురుగుపట్టి ..మొలకలెత్తి ".. అన్న వార్త చూశాక ఈ విషయం లో
ఇంకా ఎందుకు ప్రభుత్వం  క్రియాశున్యంగా, ఉదాశీనంగా వ్యవహరిస్తుందో అర్ధంకావడం లేదు.
 ఇదివరకే పార్లమెంటు లో ఈవిషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆహరశాఖామాత్యులు
 తక్షణం పరిశీలిస్తామని, ఆహారధాన్యాలు వృధాకాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
మన పొరుగు రాష్ట్రం లో కొంతమంది కటిక పేదలు ఆకాశాన్నం టుతున్నధరలతో సరైన ఆహరం కొనలేక ఎలుకలు,దుంపలు
తింటుంటే చూడలేక శ్రీ దేవాశిష్ భట్టాచార్య అనే వ్యక్తి స.హ చట్టం, క్రింద మనదేశంలో FCI గోదాముల లో క్రిత దశాబ్ద కాలంలో ఆహార ధాన్యాలు ఎంత వృధా అయ్యాయి అన్న సమాచారం కోరి ఎట్టకేలకు సంపాదించ గలిగారు.ఆ సమాచార సారం ప్రకారంగా దాదాపు పది లక్షల టన్నుల పైగా ఆహారధాన్యాలు( 1 .83 lakh M.T గోధుమ, 6. 33 lakh M.T బియ్యం,2.20 MT వరిధాన్యం,111 lakh MT మొక్కజొన్న) FCI గోదాముల్లో క్రిత దశాబ్ద కాలంలో వృధా అయినట్లు ప్రభుత్వం తెలిపింది. (SOURCE : గూగుల్.కాం) అందుకు చూపిన కారణాలు వివిధ గోదాములకు రవాణా, నిలవ,వేరే వేరే ప్రదేశాలకు సరఫరా మొదలైనవి. ఈ వృధా అయిన ఆహార ధాన్యాలు ఒక విశ్లేషణ ప్రకారం ఒక కోటి మంది జనానికి ఒక సంవత్సరం పాటు లేక ఆరు లక్షల మందికి పది సంవత్సరాల పాటు భోజనం పెట్టవచ్చు. ప్రభుత్వం ఈ ఆహార ధాన్యాల నిల్వ కోసం దాదాపు 243 కోట్ల రూపాయలు, ఈ నిల్వలలో మనుషులు వాడడానికి వీలు లేనంత గా పాడై పోయినఆహార ధాన్యాలు పారబోయడానికి ప్రభుత్వ వారి ఖర్చు రెండు కోట్ల రూపాయలు. ఇదండీ మన ప్రభుత్వాల నిర్వాకం. ఒక ప్రక్కన పేదలు, వారి భాష లో 'ఆమ్ ఆద్మీ' అధిక ధరలతో కొనలేక, దొరక్క నానా ఈతి బాధలతో బ్రతుకీడుస్తుంటే, ఈ మానవ తప్పిదాలతో, నిలువెత్తు నిర్లక్ష్యంతో అధికారులు,ప్రభుత్వాలు వారి విధి నిర్వహణలోజాతి (య),మానవతా దృక్పధం లేకపోవడం, వారు చేశే పనిని ఆరాధించలేక పోవడం, పనిలో సరైన ఉద్యోగులను సరైన చోట ఉంచక పోవడం లెక్కలేని ఆహార ధాన్యాలను మానవుపయోగానికి పనికిరాకుండా చేయడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఇదివరకు పార్లమెంటులో హామీ ఇచ్చిన మేరకు
ఆహారశాఖ మంత్రివర్యులు క్రికెట్ బోర్డు, IPL , వ్యవహారాల కంటే ఈఆహార ధాన్యాల సరైన నిల్వల కు ప్రాధాన్యత
ఇస్తే కొంతయినా జాతికి మేలు చేసిన వారవుతారు.
కేశిరాజు వెంకట వరదయ్య .

 draft 8/3/10 by Varadaiah & Rajani Delete
Edit View Methagaalake Common "wealth" kreedothsavam.

1, ఆగస్టు 2010, ఆదివారం

Methagaalake Common "wealth" kreedothsavam.

ఆగష్టు  1 న  "ఈనాడు" లో వచ్చిన 'మేత గాళ్ళకే  కామన్ 'వెల్త్'  వ్యాసం చదివాక ఈలేఖ వ్రాయకుండా ఉండలేక పోయాను.
డెబ్భై పైగా కామన్ వెల్త్ దేశాల ప్రతిష్టాత్మక క్రీడల నిర్వహణ సన్నాహాలు ఎంత లోపభూఇష్టం గా వున్నాయంటే  క్రీడా మైదానాల
నిర్మాణం,మౌలిక వసతుల ఏర్పాట్లు  అంతా అవకతవకల మయం.అసలు అవి నిర్ణీత సమయానికి తయారవుతాయా అన్నది పెద్ద ప్రశ్న.నిర్మాణాల నాణ్యతా రాహిత్యం, నకిలీ ధ్రువ పత్రాల ఆగడం,నిర్వాహకుల ఆరోపణా, ప్రత్యారోపణల పర్వం, ప్రపంచం
గమనిస్తుందన్నవిషయం నిస్సిగ్గుగా వదిలేసి అవినీతి క్రీడలో దేశ పరువు పోతుందన్న భయం లేకుండా
ఈ క్రీడానిర్వహకుల నిర్వాకం చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. ఈ క్రీడా నిర్వహణ కోసం 80   వేల కోట్ల రూపాయల  ఖర్చు, దానిలో అవినీతి సొమ్ము దాదాపు  30  వేల కోట్లు అవినీతికే  తర్పణం అని, దానినుంచి విదేశాలకు సొమ్ము తరలింపు జరుగుతోందన్న ఆరోపణలు సరికొత్తగా వెలుగు చుశాయి.
కేంద్ర విజిలెన్సు కమిషన్ (సి.వి.సి) ప్రాధమిక విచారణ లోనే ఈ అవకతవకలు  బట్టబయలు అయ్యాయి.
అసలు ఈక్రీడలకి  నిర్వహణ మనదేశం ఎందుకు ఎంపికయింది? అన్న ప్రశ్నకు ఒక్కటే సమాధానం.
అయినవాళ్ళు అక్రమ మార్గాన  ధనం సంపాదించుకునేందుకే  కాని దేశ క్రీడల మీద, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి
ప్రోత్సాహిద్దామని కాని వారి ఉద్దేశ్యం కాదు. ప్రజారోగ్యానికి, క్రీడలకి అవినాభావ సంబంధం వుందని  అనర్త్యసేన్ గారిచ్చిన పిలుపు ఎవరికీ కావాలి. ఈదేశంలో క్రీడలకు, క్రీడాకారులకు,క్రీడా వ్యవస్థకు  రాజకీయనాయకుల
మకిల అంటి, క్రీడా శిక్షణ గాడి తప్పి పతకాలు  రావడం ఎక్కడో నూటికో, కోటికో ఒక్కటి.  ఏది ఏమైనా వందలమంది విదేశీ, స్వదేశీ క్రీడాకారులు పాల్గొనే ఈక్రీడోత్సవం ఎలాంటి అడ్డంకులు,అవాంతరాలు, కీడు జరగకుండా జరిగి పోవాలని భారతీయులంతా మనః స్పూర్తిగా కోరుకుంటున్నారు.
కేశిరాజు వెంకట వరదయ్య