లేబుళ్లు

29, జులై 2010, గురువారం

అధిక ధరల పైన బుధవారం పార్లమెంట్ లో జరిగిన చర్చకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీగారు హాజరు కాలేదని పత్రికల్లో చదివి దిగ్ర్భాంతి చెందాను. ఆమ్ ఆద్మీ నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారు అదే ఆమ్ ఆద్మీ ఈరోజు అధిక ధరలతో సతమత మవుతు కూరగాయలే కాదు, కనీస భోజనం కోసం కావాల్సిన గోధుమలు/గోధుమపిండి,బియ్యం, కూరగాయల ధరలు అటకెక్కి, రెక్కలొచ్చి ఆకాశాన్నంటుతుంటే ఆర్ధిక మంత్రి వర్యులు ఏదో సాకు చూపి పార్లమెంటులో చర్చించనవసరం లేదని తేల్చేశారు. ఇటు ప్రజ అధిక ధరలతో నానా ఇబ్బందులు పడుతుంటే ఇంకో ప్రక్కన రైతులు తమ పంటలకు కనీస ధర రాక మార్కెట్ దాక తీసుకవచ్చి పెంట కుప్పల్లో పారబోయవలసిన పరిస్థితి. పెరిగిన ధరల పయిన నియంత్రణ, రైతుల పంటలకు సరైన గిట్టు బాటు ధర వచ్చేటట్లు చూడడం ఇవి ప్రభుత్వ పరిధిలోని అంశాలు కావా? ఏవో కుయుక్తులతో పార్లమెంటులో నెగ్గురావచ్చు.
కానీ ప్రజల కడగండ్లు ప్రభుత్వం వారి మనో నేత్రాలకి కానరావడం లేదా?
ఎలెక్షనలకు ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి, అన్నధీమానా?
ఏలిన వారు ఇప్పటికయినా కళ్ళు తెరిచి 'ఆమ్' ఆద్మీ ని పట్టించుకోండి.
లేకపోతే పుట్టగతులుండవు.
కేశిరాజు వెంకట వరదయ్య.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి