లేబుళ్లు

11, జులై 2010, ఆదివారం

ఈ "నా" తరం

తరాలు మారుతున్నాయి .
తలరాతలు మారుతున్నాయి. నిన్న మొన్నటి క్రొత్త జీవితాలు నిలువునా కూలుతున్నాయి.
పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. నేటి యువతలో ( యువతీ యువకులు) చాలామందికి .
నేను, 'నా' అన్నమాట తప్ప వేరే ప్రపంచం లేదు. ఎక్కడో ఒకరో, ఇద్దరో తప్ప మిగతావారంత ఇలాగే వున్నారు.
ఈ వ్యవహారం ఇంతవరకయితే సర్దుకుపోవచ్చు. ఈవిషయం ఇక్కడ ఆగి పోవడం లేదు. ఇదొక జాడ్యం గా మారిపోయింది. వారిలో నేను, నాది, నా ఇష్టం అన్న వ్యవహారం తోనే కుటుంబాలలో గొడవలు, తేడాలు, అపార్ధాలు , అల్లర్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవి ఇక్కడ ఆగి పోవడం లేదు. కొన్ని జీవితాల నాశనానికి / అంతానికి నాంది పలుకుతున్నాయి. కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయి. కుటుంబ పెద్దలు దిక్కుతోచక గాలిలో దీపాన్ని చూస్తున్నట్లు కూలుతున్న జీవితాల్ని, విధిలేక, పాలుపోక, ఏమిచేయలేక చేష్టలుడిగి దిక్కు లేని వాళ్ళలాచూస్తూ దుఖ్హం దిగమింగుకుని జీవచ్చవాల్లా బతకల్సివస్తోంది .
ఉడుకురక్తం తో లేనిపోని ఆవేశ కావేశాలతో నిండు జీవితాలు నిలువునా కూల్చుకుంటు న్నారు.
భారత, హిందూ సాంప్ర దాయ వివాహ వ్యవస్థ కే పెద్దముప్పు వచ్చింది. వ్యవస్థ ని ఇప్పుడు కాళహస్తి రాజ గాలిగోపురం తో పోల్చవచ్చు. అది కూలింది. ఇది కూలడానికి తయారుగా వుంది. ఇంకా ఎన్నోరోజులు పట్టదు.
ప్రస్తుత ఈ మార్పుకి కారణం మారుతున్న ప్రపంచం, విదేశీ, స్వదేశి చదువులు, విదేశీ ఉద్యోగాలు,మరింతగా విదేశీయాత్రలు,విదేశీ నివాసం, పాశ్చ్యాత్య పోకడలు, ఇంటా, బయటా పరిస్టితులు, ఆర్ధిక ఎదుగుదల , స్వశక్తి , మారుతున్న సమాజ సమీకరణాలు,పురుషాధిక్యత, స్త్రీల ఆర్ధిక స్వావలంబన . ఇవన్ని చెడు చేస్తున్నాయని నేను చెప్పడం లేదు. చెడు ఆలోచనలకి దోహదం చేస్తున్నాయనడానికి ఏమాత్రం సందేహంలేదు. ఇవన్నిఎక్కడెక్కడో మనుషుల్ని ఎంత త్వరితగతిని కలుపుతున్నాయో అంత త్వరగానే విడతీస్తున్నాయి. బహుశా ఈ వ్యాసం చదువుతున్న ప్రతివారికి ఇటువంటి సంఘటనలు తెలిసేవుంటాయి. విడమరిచి చెప్పాలంటే ఎంత త్వరగా జీవితాలు ఒకటవుతున్నాయో అంత త్వరగానే కూలుతున్నాయి. నాకు తెలిసి ఇటువంటి ఘటనలు కోకొల్లలు. ఎందుకవుతోందిలా? కారణం వారా ? వారి తల్లితండ్రు లా ? సమాజమా? లేక పైన చెప్పిన కారణాలా ? ఎవరు దోషి ? ఎవర్ని నిందించి ప్రయోజనం ! దిగుమతి చేసుకున్న, మనదికాని నాగరికత తో ఈరోజున మన యువత కి / మనకి అవుతున్న హాని అంత, ఇంతా కాదు.
ఈ ప్రవాహం లో సమిధలు వాళ్ళే కాదు. మనందరినీ కలిపి లాక్కుని వెళుతున్నారు.కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ ఒకసారి కూలితే మళ్లి పునర్నిర్మించడం సాధ్యమా ? ఇది మానవతకి, మతాలకి కూడా చేటు.
అందుకే అభ్యర్ధిస్తున్నాఅందరిని. ఆలోచించండి ఎక్కడ తప్పటడుగు వేస్తున్నామో . మేధావులు,సంఘ సంస్కర్తలు, శాస్త్రవేత్తలు, ముఖ్యంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు,ఇంకా పెద్దలు గమనించండి ....... జరుగుతున్నది అంత మనమంచికే అవుతే మంచిదే . కాలం నిర్ణయించే లోపులో జరగవలసిన నష్టం, హాని జరుగుతే మనల్ని మనం క్ష మించుకునే రోజు మిగిలి ఉంటుందా అనేది అనుమానమే. అందుకే ఈ వ్యాసం వ్రాస్తున్నాను. పెద్దలూ లేవండి , మేల్కోండి. పిల్లల్ని గమనిస్తు ఉండండి i . మూల వ్యవస్థల్ని కాపాడండి. ఒక్క వివాహవ్యవస్థ నే కాదు . సాంప్రదాయ వ్యవస్థలన్నీ కూలడానికి సిద్దంగా వున్నాయి. ఎప్పుడో హిందూ వ్యవస్థల మీద దాడులు జరిగాయి, జరుగుతున్నాయి ఇదివరకు అవి ఇతరులు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు.

చివరకు వెంకన్ననే ఏడుకొండలు నీవికావు పో అన్నారు ఇంకేమి జరగనుందో ఎవరికీ తెలుసు.
ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తా విస్తు న్నానంటే మనవ్యవస్థ మీద మన యువతే దాడులు చేస్తున్నారు.అవి భౌతిక దాడులు కావు. అరువు తెచ్చుకున్న నాగరికతతో అతి అనాగరికంగా ప్రవర్ర్తిస్తూన్నారు. దానికి వారొక్కరే కారణం కాదు. ప్రతి కుటుంబపెద్ద, ప్రతి తల్లి,తండ్రి, గురువు ,సమాజం అందరు సమానంగా కారణమే.
పెంపకాల్లో తేడా వచ్చింది. తప్పుల్ని దిద్దుకోండి. పారాహుషార్ !
తల్లితండ్రుల్లార జాగ్రత్త , ముద్దు, ముచ్చట వరకు మంచిదే. మంచి నేర్పండి.లోకగ్జానం నేర్పండి.మీరెవరు, మీమూలాలేమిటి,చెప్పండి. పేద్దల్ని గౌరవించడం, అన్ని మీకు తెలుసు.వారికి చెప్పండి . మంచిగా పెంచండి. చూసి చూడనట్టు ఉండకండి ! తప్పులేమైన చేస్తే దండించండి ! మళ్లి ఆతప్పు చేయకుండా చూడండి.అలాగని పిల్లలకు స్వేఛ్చ లేకుండా చేయకండి .ఓ చక్కటి స్నేహితుడులా సహకారం ఇవ్వండి.వాళ్ళని చక్కని భారత పౌరుడుగా తీర్చి దిద్దండి.
రోజులు మారుతున్నాయి.
మార్పులు తధ్యం. మార్పు లేకపోతె మనిషి లేడు , మనుగడ లేదు .మనందరిలో మార్పు రావాలి. ఆమార్పురావాలంటే మనమేమి చెయ్యాలి. చెదపట్టిన వ్యవస్థ దానికదే బాగవుతుందా? కాదు!
అందుకే నాకు తోచిన నాలుగు వాక్యాలు వ్రాస్తున్నా!
ప్రపంచం పూర్వంలా లేదు. మారింది. మారుతోంది. మనిషి మారుతున్నాడు. ఆమార్పుమంచిది కావాలి. ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. మార్పు వ్యవస్థీకృతం కావాలి.
ఇప్పుడు దేశంలో హింస ఎలావుంది?
పిల్ల ల్నవదలడం లేదు. పెద్దల్ని వదలడంలేదు.స్త్రీల సంగతి చెప్పనవసరం లేదు.
హింస, నేరాలు,ఘోరాలు కూడా వ్యవస్తలో భాగం అయ్యాయి. ఇంకా చెప్పాలంటే వ్యవస్తీకృతం అయ్యాయి
వ్యవస్తీకృతం అయ్యాయి అని ఎందుకంటున్నానంటే ఒక్క మనిషి గాలిలో చిటికేస్తే దేశంమంతా ఎక్కడంటే అక్కడ దాడులు జరుగుతాయి.ఆ దాడులు చేస్తున్నవరెవరు? పాతికేల్లలోపు యువకులు/యువతులు. వారి వారి తల్లితండ్రుల
పెంపకం బాగుంటే అంతమంది దాడులు చేస్తారా? లేదు. చెయ్యరు. కాబట్టి తల్లితండ్రులూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి.
గురువులూ జాగ్రత్త .మీలో కొందరు విధులు మీరు సక్రమంగా నిర్వర్తించడం లేదనడం లో ఎలాంటి సందేహంలేదని ప్రజావాక్కు.దీంట్లో భిన్నాభిప్రాయం లేదు.
సంఘసంస్క్రత్తలూ మేల్కోండి. పత్రికలూ మోరాల్స్ పాటించండి. ఏదో ఒక రాజకీయ పార్టీ కో, సామా జిక వర్గానికో కొమ్ముకాయకండి. సంఘ హితం చూడండి, సొంతలాభం కొంత మానండి.
ఈరోజున యువత తప్పుదోవలో వున్నారంటే ముమ్మాటికి మీరు,మీ టీవీ ఛానల్స్,సినిమాలు చాలావరకు కారణం.
ఎందుకంటే మీకు మీ మీ పత్రికలూ / టివి లు / ratings ముఖ్యం. ఏదో ఒక విషయం లో sensation కావాలి. ముందు
నా ఛానల్ ప్రసారం చేసింది అన్నదే ముఖ్యం మీకు. అందులో కించిత్తు అయిన జనహితం వుందా , లేదా అన్న విషయం మీకు అవసరం లేదు. నయ్ తికత అసలే లేదు. కూలుతున్న కుటుంబ వ్యవస్తని బాగుచేయగల సామర్ధ్యం ఎవరికైనా వుందంటే వారు మీరే. ఇందుకు దయచేసి మీరు మీ మీ పరిధిలో ఏమి చెయ్యగలరో ఆలోచించండి .నడుం బిగించండి.దీనికి కొంత దూకుడు కావాలి. ఇందుకు సర్వశ్రీ శ్రీ రామోజీరావు, రామచంద్ర మూర్తి ,వేమూరి బలరాం, వెంకటేశ్వరరావు,టి.వెంకట్రామరేడ్డి ,మాలతీచందూర్,పి.వి.ఆర్.కే.ప్రసాదు,కే.విశ్వనాధ్,ఇంకా నేను తెలియక పేరు వ్రాయని పెద్దలు, తదితరులు కార్యాచరణ మొదలుపెడితే వ్యవస్థ కోలుకోవడానికి శ్రీకారం చుట్టిన వారవుతారు. చరిత్రకారులు అవుతారు. .
చివరిగా ఇంకొక్క విషయం. మొన్ననే జనాభా లెక్కల్లో ఒక విషయం తెల్సింది.
దీనికి పైన విషయాలకి సంబంధం లేదనుకున్నా ఖచ్చితంగా బంధం మాత్రం వుంది . అందుకే దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా.పాలకులు, జనం గమనించండి .
దక్షిణ భారతంలో కుటుంబాలు చక్కగా జనాభా నియంత్రించుకుని జనాభా పెరగకుండా పాలకుల చెప్పింది చెప్పినట్లుగా విని పాటించారు.
ఉత్తర భారతంలో మాత్రం జనాభా పెరుగుదల మాములుగానే వుంది. అందువల్ల దక్షిణభారతంలో వచ్చే పాతిక సంవత్సరాలలో యువత తగ్గి పోయి అంతా వయసు మీరినవాళ్లు తయారవుతారు. ఉత్తర భారత యువత సంఖ్య చక్కగా పెరుగు తుంది. మరి కుటుంబ వ్యవస్థ అవసాన దశ లోవున్న దక్షిణలో ఈ ముసలి వాళ్ళను ఎవరు భరిస్తారో. ఎందుకయినా మంచిది వృద్ధుల ఆశ్రమాలు పెంచుకుందాం.
కేశిరాజు వెంకట వరదయ్య.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి