వెయిట్ ప్లీజ్ .......
ప్రధానమంత్రి విదేశీ పర్యటన పూర్తి అయింది. క్యాబినెట్ మంత్రులు, ఉపమంత్రులు విదేశీశాఖ కు చెందిన కార్యదర్శులు, విలేఖరులు, ఇంకా మందీ, మార్బలం ఆయనతో వెళ్లిన వారంతా విమానంలో ఉన్నారు.
పదుల సంఖ్యలో వెళ్లిన విలేఖరులలో ఒక సీనియర్ రచయిత గుర్నాధం కూడా ఉన్నారు. ప్రధానమంత్రి ఆయనను బాగా అభిమానించేవారు. గుర్నాధం మంచి చమత్కారి కూడా. విమానం ల్యాండ్ అయ్యే ముందు ప్రధానమంత్రి గుర్నాధంగారిని పిలిచితన పక్క సీటులో కూర్చోబెట్టుకుని ఏదో మాట్లాడారు. విమానం ల్యాండ్ అవుతోందని ఆయన అక్కడే కూర్చుండి పోయారు.
ఢిల్లీలో విమానం ల్యాండ్ అయింది. పది నిముషాలలో పార్కింగ్ బే లో వచ్చి ఆగింది. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి ముందుగా దిగి వెళ్ళాలి.
తరువాత వరుసగా క్యాబినెట్ మంత్రులు,ఉపమంత్రులు సెక్రటరీలు 'ప్రోటోకాల్' ప్రకారం ఒక్కొకరుగా దిగాలి.
ఫ్లైట్ కెప్టెన్, ఎయిర్ హోస్టెస్' ద్వారం దగ్గర ఉండి వెళ్లేవారికి వీడ్కోలు నమస్కారం చేయడానికి తయారుగా ఉన్నారు. ప్రధానమంత్రి ముందుగా దిగివెళ్ళాలి.
ఎయిర్ హోస్టెస్ డోర్ తెరిచి దిగవొచ్చు అన్న సంకేతం ఇవ్వడమే తరువాయి మన గుర్నాథంగారు ప్రధాన మంత్రితో మాట్లాడుతూ కలిసి 'ద్వారం' దగ్గరికి వచ్చారు ప్రోటోకాల్ పాటించకుండా.
ఇదిగమనించిన ఎయిర్ హోస్టెస్ చేయి అడ్డంగా పెట్టి గుర్నాధం గారిని ఆపుతూ 'వెయిట్ ప్లీజ్' అన్నది ఎయిర్ హోస్టెస్.
'సెవెంటీ నైన్' ప్లీజ్ అంటూ తాపీగా దిగి వెళ్లారు జర్నలిస్ట్, రచయిత 'గుర్నాధం' గారు
* * * * * * * * *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి