లేబుళ్లు

23, సెప్టెంబర్ 2019, సోమవారం

'నాటు'

                                                                         'నాటు' 
                                                                        =======

'నాటు, నాటు నాటు...' పాటని మోటుగా పాడుతూ హుషారుగా ఉదయం ఏడుగంటలకే పనిలోకి వచ్చిపెరటి భావి దగ్గరికి వచ్చాడు నటరాజు. 
జీతగాడు నటరాజుని చూస్తూనే ''మూడు రోజుల ముసురుతో మాంచి వర్షం పడ్డదిరా! ఈ వారంలో ఎలాగ యినా 'నాటు' వెయ్యాలిరా' అన్నాడు'' అన్నాడు  కరెంటు పోవడంతో తనింటి పెరట్లో చేద భావినుంచి నీళ్లు తోడుతున్న జీతగాడు సుబ్బయ్యతో.
''ఏందయ్యా !? మీరు... నాటు వేస్తారా!?'' మళ్ళీ భావిలో బకెట్ వేస్తూ అన్నాడు యజమాని తో.
''అవున్రా! నాటు వేద్దామనుకుంటున్నా. ముందు మోటభావి తోటలో వేద్దాం. తరువాత డొంక దాంట్లో వేద్దాం ! ఆ పన్లేవో త్వరగాచూడు !'' అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు సర్వేశ్వరరావు.
''అయ్యబాబోయ్ !వారం దాకా ఎందుకయ్యా...రేపటి కల్లా అంతా రెడీ చెయ్యనూ! '' అన్నాడు నటరాజు హుషారుగా బకెట్ ను బర బరా భావిలోనుంచి లాగుతూ యజమాని సర్వేశ్వరరావు ఇంకా అక్కడే ఉన్నాడన్నధ్యాసతో.
'ఎన్నడూ లేంది అయ్యగారు గారు నాటు వేద్దామంటున్నారు. అన్నీనాటువే ఏర్పాటు చెయ్యాలి. దీని సిగతరగ ఎన్నాళ్టికొచ్చిందీ అవకాశం. అయ్యగారి దిమ్మ తిరిగిపోయేలా చేయాలి. 'బాగాచేశావురా సుబ్బిగా' అనిపించుకోవాలి. అప్పుడుంటది నా సామి రంగా... అయ్యగారికి కొద్దిగా అలవాటు అయ్యిందంటే సొంతఖర్చు కొంత తగ్గించుకోవచ్చు'' అనుకుంటూ ఊహాలోకంలో మునిగి పోయాడు సుబ్బయ్య.
ఒళ్ళు తెలియని సంతోషంలో త్వరత్వరగా ఇంటిపనులు,బయటపనులు అన్నీ త్వర త్వరగా తెముల్చుకుని, యజమాని ఇంటికి చేరేసరికి, సర్వేశ్వరరావు హాళ్ళో అటు ఇటు తిరుగుతూ ఫోనులో మాట్లాడుతున్నాడు.
''రేపటికన్నీ ఏర్పాట్లు చేసినానయ్యా'' అన్నాడు సుబ్బయ్య గుసగుసగా, ఫోనులో మాట్లాడుతున్న సర్వేశ్వరరావుతో.
ముఖ్యమైన విషయమేదో ఫోనులోమాట్లాడుతూ సుబ్బయ్య చెప్పింది వినీ వినక తన వెనకాలే  తిరుగుతూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నసుబ్బయ్యతో ''ఏమిటి? అప్పుడే ముఠా మనుషులు దొరికారా ? సరే రా! ఏర్పాట్లు చేశావుగా...డబ్బేమైనా కావాలంటే అమ్మగారి దగ్గరతీసుకెళ్ళు'' అన్నాడు సర్వేశ్వరరావు విసుగ్గా.
హుషారుగా ఉన్న నటరాజుకి యజమాని అన్నదేమిటో అర్ధంగాక పోయినా నాటుకి కావాల్సిన డబ్బు యజమాని భార్య దగ్గర తీసుకుని క్షణంలో మాయమయ్యాడు సుబ్బయ్య.
                                                 * * *                 * * *               * * *
మరుసటి రోజు ఉదయాన్నేఏడుగంటలకి ఎప్పటిలా పనికి వచ్చాడు సుబ్బయ్య.
అప్పటికే తయారైవున్నసర్వేశ్వరరావు సుబ్బయ్యను చూస్తూనే ''నువ్వీవేళ ఇక్కడికెందుకు వచ్చావు? తోట దగ్గర పనంతా వదిలేసి. అసలే 'నాటు'...వెళ్ళు. టిఫిన్ చేసి నేనొక గంట గంటన్నర తరువాత వస్తాను. ఏర్పాట్లన్నీ అయ్యాయన్నావుకదా?" అన్నాడు సర్వేశ్వరరావు
తెల్లమొహమేసి తలగోక్కుంటూ నిలబడ్డ సుబ్బయ్యవంక చూస్తూ ''ఏవయిందిరా నీకు?
నువెళ్ళు. నేనొస్తున్నానని చెపుతున్నాగా'' అన్నాడు సర్వేశ్వరరావు సుబ్బయ్య వంక విసుగ్గా చూస్తూ.
''ఓర్నాయనో...ఏమైందీయనకు. పొద్దున్నే నాటంటాడు నేనేమో సాయంత్రానికి ఏర్పాటు చేస్తిని. ఇప్పుడేంచేయాల్రా దేవుడా !''...అనుకుంటూ భుజంమీద తువ్వాలని సరిచేసుకుంటూ
పరుగెత్తాడు సుబ్బయ్య తోటకి. మధ్యలో కాకా హోటల్ దగ్గర ఆగి నాటుకి కావలిసిన పదార్ధాలన్నీ తయారు చేయించి తీసుకుని తోటకి చేరాడు సుబ్బయ్య.
                                                   * * *           * * *          * * *
రెండు గంటల తరువాత తోటకొచ్చాడు సర్వేశ్వర్రావు.
వస్తూనే తోటలో పాకలోకి వస్తూ ''ఏమయిందిరా సుబ్బడూ! ముఠా రాలేదా ఇంకా ? అరకలేవీ... ?"
అన్నాడు సర్వేశ్వర్రావు పాకలో టేబుల్ మీద క్లాత్, 'నాటు' ప్యాకెట్లు, తినుబండారాలు వంక ఆశ్చర్యంగా చూస్తూ.
ఆయనమాటలు విన్న సుబ్బయ్య చేష్టలుడిగి కదలకుండా నిలబడి చేతులుకట్టుకుని
'అరకలేంది...ముఠా ఏందీ?'' అనుమానం మనసును  వేధిస్తున్నా 'అయ్య బాబోయ్ ఈయనగారికి కొత్తగా నాటు ముఠా ఒకటి ఉందా! ? నాకు తెలియదు. ఈయన ఎప్పుడూ చెప్పనే లేదు…ఓరి బాబోయ్...నెవర్నీ పిలవలేదు. అంతా గందరగోళంగా ఉంది' అనుకున్నాడు సుబ్బయ్యకి తలగోక్కుంటూ ఏం చేయాలో అర్ధంగాక. 
"ఏవిట్రా?తలగోక్కుంటూ ... వెర్రోడిలా ఆ చూపేంటి ? ఈ సీసాలేమిటి ? ఆ తిండేవిటి ... ?"  అర్ధంగాక  అడిగాడు సర్వేశ్వరరావు 
"నాటేస్తానన్నారు కదండీ మీరు ...! అయేనండి ఏర్పాట్లన్నీ... " 
నివ్వెరబోయి, నోట మాట రాక 'నాటు' వంక చూస్తూ ఉండిపోయాడు సర్వేశ్వర రావు.   
                                                * * *          * * *          * * *
రచన
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ : 9849118254
     
                                                                     'నాటు' 
                                                                        =======

''మూడు రోజుల ముసురుతో మాంచి వర్షం పడ్డదిరా! ఈ వారంలో ఎట్లయినా 'నాటు' వెయ్యాలిరా' అన్నాడు'' అన్నాడు సర్వేశ్వరరావు కరెంటు పోవడంతో తనింటి పెరట్లో చేద భావినుంచి నీళ్లు తోడుతున్న జీతగాడు సుబ్బయ్యతో.
''ఏందయ్యా !? మీరు... నాటు వేస్తారా!?'' మళ్ళీ భావిలో బకెట్ వేస్తూ అన్నాడు యజమాని సుబ్బయ్యతో.
''అవున్రా! నాటు వేద్దామనుకుంటున్నా. ముందు మోటభావి తోటలో వేద్దాం. 
ఆ పన్లేవో త్వరగాచూడు !'' అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు సర్వేశ్వరరావు.'
''వారం దాకా ఎందుకయ్యా...రేపటి కల్లా అంతా రెడీ చెయ్యనూ'' అన్నాడు సుబ్బయ్య హుషారుగా బకెట్ ను బర బరా భావిలోనుంచి లాగుతూ యజమాని ఇంకా అక్కడే ఉన్నాడన్నధ్యాసతో.
'ఎన్నడూ లేంది అయ్యగారు గారు నాటు వేద్దామంటున్నారు.
అన్నీనాటువే ఏర్పాటు చెయ్యాలి. దీని సిగతరగ ఎన్నాళ్టికొచ్చిందీ అవకాశం.
అయ్యగారి దిమ్మ తిరిగిపోయేలా చేయాలి. 'బాగాచేశావురా సుబ్బిగా' అనిపించుకోవాలి. నా సామి రంగా...  య్యగారికి కొద్దిగా అలవాటైతే సొంతఖర్చు కొంత తగ్గించుకోవచ్చు'' అనుకుంటూ ఊహాలోకంలో మునిగి పోయాడు సుబ్బయ్య.
ఒళ్ళు తెలియని సంతోషంలో త్వరత్వరగా ఇంటిపనులు తెముల్చుకుని, బయటపనులు అన్నీ పూర్తిచేసుకుని సాయంత్రానికి యజమాని ఇంటికి చేరేసరికి, సర్వేశ్వరరావు హాళ్ళో అటు ఇటు తిరుగుతూ ఫోనులో మాట్లాడుతున్నాడు.
''రేపటికన్నీ ఏర్పాట్లు చేసినానయ్యా'' అన్నాడు సుబ్బయ్య గుసగుసగా, ఫోనులో మాట్లాడుతున్న సర్వేశ్వరరావుతో.
ముఖ్యమైన విషయమేదో ఫోనులోమాట్లాడుతూ సుబ్బయ్య చెప్పింది వినీ వినక తన వెనకాలే  తిరుగుతూ తనవంకే చూస్తున్నసుబ్బయ్యతో ''సరే రా... ఏర్పాట్లు చేశావుగా...డబ్బేమైనా కావాలంటే అమ్మగారి దగ్గరతీసుకెళ్ళు'' అన్నాడు సర్వేశ్వరరావు విసుగ్గా.
మరుసటి రోజు నాటుకి కావాల్సిన డబ్బు అమ్మగారి దగ్గర తీసుకుని క్షణంలో మాయమయ్యాడు సుబ్బయ్య.
                                                 * * *                 * * *               * * *
మరుసటి రోజు ఉదయాన్నేఏడుగంటలకి ఎప్పటిలా పనికి వచ్చాడు సుబ్బయ్య.
అప్పటికే తయారైవున్నసర్వేశ్వరరావు సుబ్బయ్యను చూస్తూనే ''నువ్వీవేళ ఇక్కడికెందుకు వచ్చావు? తోట దగ్గర పనంతా వదిలేసి. అసలే 'నాటు'...వెళ్ళు. టిఫిన్ చేసి నేనొక గంట గంటన్నర తరువాత వస్తాను. ఏర్పాట్లన్నీ అయ్యాయన్నావుకదా?" అన్నాడు సర్వేశ్వరరావు
తెల్లమొహమేసి తలగోక్కుంటూ నిలబడ్డ సుబ్బయ్యవంక చూస్తూ ''ఏవయిందిరా నీకు?
నువెళ్ళు. నేనొస్తున్నానని చెపుతున్నాగా'' అన్నాడు సర్వేశ్వరరావు సుబ్బయ్య వంక విసుగ్గా చూస్తూ.
''ఓర్నాయనో...ఏమైందీయనకు. పొద్దున్నే నాటంటాడు నేనేమో సాయంత్రానికి ఏర్పాటు చేస్తిని. ఇప్పుడేంచేయాల్రా దేవుడా !''...అనుకుంటూ భుజంమీద తువ్వాలని సరిచేసుకుంటూ
లగెత్తాడు సుబ్బయ్య తోటకి. మధ్యలో కాకా హోటల్ దగ్గర ఆగి నాటుకి కావలిసిన పదార్ధాలన్నీ తయారు చేయించి తీసుకుని తోటకి చేరాడు సుబ్బయ్య.
                                                   * * *           * * *          * * *
రెండు గంటల తరువాత తోటకొచ్చాడు సర్వేశ్వర్రావు.
వస్తూనే తోటలో పాకలోకి వస్తూ ''ఏమయిందిరా సుబ్బడూ! ముఠా రాలేదా ఇంకా ? అరకలేవీ... ?"
అన్నాడు సర్వేశ్వర్రావు పాకలో టేబుల్ మీద క్లాత్, 'నాటు' ప్యాకెట్లు, తినుబండారాలు వంక ఆశ్చర్యంగా చూస్తూ.
ఆయనమాటలు విన్న సుబ్బయ్య చేష్టలుడిగి కదలకుండా నిలబడి చేతులుకట్టుకుని
'అరకలేంది...ముఠా ఏందీ?'' అనుమానం మనసును  వేధిస్తున్నా 'అయ్య బాబోయ్ ఈయనగారికి కొత్తగా నాటు ముఠాఒకటి ఏర్పడిందా! ? ఎప్పుడు చెప్పనే లేదు…ఓరి బాబోయ్...నెవర్నీ పిలవలేదు.అంతా ఆగమాగంగా ఉంది' అనుకున్నాడు సుబ్బయ్యకి తలగోక్కుంటూ ఏం చేయాలో అర్ధంగాక. 
"ఏవిట్రా?తలగోక్కుంటూ ... వెర్రోడిలా ఆ చూపేంటి ? ఈ సీసాలేమిటి ? ఆ తిండేవిటి ... ?"  అర్ధంగాక  అడిగాడు సర్వేశ్వరరావు 
"నాటేస్తానన్నారు కదండీ మీరు ...! అయేనండి ఏర్పాట్లన్నీ... " 
నివ్వెరబోయి, నోట మాట రాక 'నాటు' వంక చూస్తూ ఉండిపోయాడు సర్వేశ్వర రావు.   
                                                * * *          * * *          * * *
రచన
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ : 9849118254

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి