quotes / సూక్తులు
( పెద్దలమాట చద్దిమూట )
------------------------------------
ఓర్పు, సహనం ఎంత చేదుగా ఉంటాయో వాటి వల్ల లభించే ఫలం అంత తియ్యగా ఉంటుంది.
ఆత్మ విశ్వాశం మనిషికి పెట్టని ఆభరణం.
భయపడే మనస్తత్వం ఉన్నవారికి ఎప్పుడు ప్రమాదం పొంచే ఉంటుంది.
పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి, ఉపయోగపడతాయి.
ఇతరుల అభిప్రాయాలకు భయపడినంత కాలం మనం ఏ పనిలోనూ విజయం సాధించలేము.
ఈలోకంలో నాకేమీ తెలియదని తప్పించుకునేవాడు చాలా తెలివికలవాడు. నాకు అన్నీ తెలుసు
అని చెప్పేవాడు నిందల పాలవుతాడు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడు చాలా
బుద్దిమంతుడనిపించుకుంటాడు.
రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు. రోజువారీ నీ దినచర్యలోనే ఉంది !
హృదయం నిండా ఇతరులపట్ల సానుభూతి పొంగిపొరలే మనిషికి మాత్రమే వారిని విమర్శించే
అధికారం ఉంటుంది.
ఏ ఆదర్శము లేని మనిషి తెడ్డు లేని నావ వంటివాడు.
జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితంరోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాల్ని నేర్పుతుంది.
ఏ దేశానికైనా పెద్ద సంఖ్యా బలం ఉంటె చాలదు. ప్రజలు విద్యావంతులై , చైతన్యవంతులై,
ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే 'జాతి' జాగృతమవుతుంది, బాగుపడుతుంది.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఓర్పు, సహనంతో వెతికితే అది దొరుకుతుంది.
ప్రోత్సాహం లేదని మంచిపనిని వాయిదా వేయకండి.
అహంకారం కలవారు అవతలిమనిషిని మనసారా అభినందించలేరు.
విజయం సాధించిన ప్రతి మనిషి వెనక ఓ సాహసోపేతమైన నిర్ణయం తప్పక ఉండేవుంటుంది.
అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. అది జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.
వేలకోట్ల ధనరాసుల కధిపతివైనా ఒక్క 'నిముషం' ఆయుషుని కొనలేవని తెలుసుకో!
నీ పొరపాట్లు, తొందరపాటు మరొకరికి అగచాటు కాకూడదు.
నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకిచ్చింది 'నీపాలు'.
అనుకున్నామని జరగవు అన్నీ....అనుకోలేదని ఆగవు కొన్ని!
మనకు కావాలి అనుకున్నది దొరకనప్పుడు మనకు దొరికినదే'కావాలి' అని అనుకోవడంఉత్తమం.
జరిగేదేదో జరుగక మానదు.నీ అనవసర ఆందోళనతో జరిగే మార్పు ఏమీ ఉండదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి