బూట్ కేంప్
--------------------
( శ్రీ కర్లపాలెం గోపాలరావు కొసమెరుపు- సస్పెన్స్ కథల పోటీలో 20-అక్టోబర్, 2025 న 'రవళి' అంతర్జాల పత్రికలో బహుమతి పొందిన కథ )
చీకటి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది. ఉషస్సు ఉరుకులు పెడుతోంది. తూర్పున వెలుగు చీకటికి వెల్లలేస్తోంది. అవని అంచు నుంచి తేజాన్ని పంచుతూ పయనమయ్యాడు భాస్కరుడు. క్షణాల్లో వెలుగుపరుచుకుంది నేల తల్లి ఒంటిమీద.
క్రితం రాత్రి నిద్రపట్టక ఆలస్యంగా పడుకున్న ప్రకాశరావుకి ఎప్పటిలా ఉదయాన్నేతొందరగా మెళుకువరాలేదు. మొబైల్ ఫోను మోతతో మెలుకువ వచ్చింది. పక్కకు ఒదిగి చేతిమీద భారంవేసి మెల్లగా లేచి, క్షణంపాటు కూర్చుని, బెడ్ సైడ్ బల్ల మీద ఉంచిన మొబైల్ అందుకుని "హలో! ఎవరూ... ?" అన్నాడు మగతగా.
"సార్! కిరాణా సామాను గుర్తు చేయమన్నారు" అన్నాడు తోటమాలి రాజప్ప.
తోట కెళ్లాలని అప్పుడు గుర్తుకువచ్చింది ప్రకాశరావుకి.
"సరే! నిన్న చెప్పిన లిస్ట్ గాక ఇంకేమైనా కావాలంటే గంటలోపున చెప్పు? " అని ఫోను పెట్టేసి బాత్రూమ్ వైపు నడిచాడు ప్రకాశరావు.
"ఈ వారం నాలుగయిదు రోజులపాటు తోటలోనే బస. ఏర్పాట్లన్నీ చూడ్డానికి ఉదయాన్నే తోటకి వస్తానని చెప్పాడు రాజప్పతో. భార్య ఇందుమతి అప్పటికే లేచి వంటింట్లో పనిచేసుకుంటోంది. మాములుగా అవుతే ఆవిడకు తోటకు రావడమంటే మహా ఇష్టం. కానీ ఈసారి ఎందుకో తోటకి రావడానికి ఆవిడ అంతగా సుముఖంగా లేదు. అయినా భర్త వెళదామని అనడంతోనే అయిష్టంగానే ఒప్పుకుంది.
"గంటలో బయలుదేరాలి. పిల్లలిద్దరికీ చెప్పాను తోటకెళుతున్నామని " అన్నాడు ప్రకాశరావు
"ఎన్ని రోజులు మకాం?"
"తోట పని ఉంది. సుమారు వారం"
''నెత్తిన పాలు పోశారు. పనిమనిషి ఊరికెళ్లింది. వారంపాటు రాదు''
"ఇహనేం...మరి అంత ఉత్సాహంగా లేవు ?" అన్నాడు ప్రకాశరావు .
'అక్కడైతే పనివారు, తాజా కూరలు, రుచిగా వండిపెట్టే రాజప్ప భార్య రేణుక.
హాయిగా తోటలో గడపవచ్చు. కానీ ఈసారి... ' ఆమె ఆలోచనకు అడ్డుతతగుల్తూ "నిన్నతెచ్చిన సామానంతా కారులోనే ఉంది. తోట కిచెన్ లో పప్పులు, పోపు, మసాలా దినుసులు నిండుకున్నాయట.
తోవలో కొనుక్కెళదాం. తీసుకెళ్లే బట్టలు, పుస్తకాలు సదురు" అన్నాడు ప్రకాశరావు.
"వెళ్లిన ప్రతిసారి చెబుతూనే వున్నాను. అక్కడ అల్మెరాలో నెలరోజులకు సరిపడా ఇద్దరివీ బట్టలున్నాయి. మనమేనా? ఇంకెవరైనా వస్తున్నారా?"
"ఈ సారి పరమహంస ఫ్యామిలీతో వస్తున్నాడు. రెండ్రోజులుండి వెళతారు. రాఘవరావు వాళ్లు కూడా ... "
"పరమహంస గారా ? ఆయన సిటీ కి వచ్చాడేంటి ?"
"అవును ఇందూ! వాళ్ళు కూతురి ఫ్లాట్ లో దిగారు. పోయిన్నెల పూనాలో ఆక్సిడెంట్ లో కూతురూ అల్లుడూ ఇద్దరూ పోయారు తెలుసుగా. మనవడు, మనవరాలు దిక్కులేకుండా అయ్యారని పుట్టెడు దుఃఖ్ఖంలో ఉన్నాడు. పసి పిల్లల భవిష్యత్తు గురించి క్షోభ పడుతున్నాడు. రెండ్రోజులు టెన్షన్ కి దూరంగా వుంటారని నేనే రమ్మన్నాను"
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ! ... సారీ! పిల్లల గురించికాదు నేననేది"
"తప్పు ఇందూ! ప్లీజ్...ఎవరి గురించైనా సరే ఆలా మాట్లాడకు. అతన్ని ఎంతకాలం ద్వేషిస్తావు ? ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు! మనం నోటికి పనిచెబితే మనకే నష్టం. నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎవరిపట్ల దుర్భాష, పరుష వ్యాఖ్యలు వద్దని... మనం ఆతిధ్యమిస్తున్నామన్న విషయం గుర్తుంచుకుని హుందాగా మసులుకో!" భార్యని సున్నితంగా మందలిస్తూ గట్టిగా అన్నాడు ప్రకాశరావు.
'పరమహంస కాదు... పరమహింసగాడు' కసిగా మనసులో అనుకుంటూ.
"ఆయన సరే! ... రాఘవరావుగారు వాళ్ళు అమెరికా వెళ్లారుకదా. ఆర్నెల్లు ఉంటామంది వాళ్ళావిడ పోయినసారి కలిసినప్పుడు ... ఇంతలోనే వెళ్లడం... తిరిగి రావడం కూడా అయిందా !?
ఆశ్చర్యంగా అంది ఇందుమతి.
"వచ్చి కూడా వారం రోజులయింది"
"ఎందుకు అంత త్వరగా తిరిగి వచ్చారు ?"
"ఉండలేక వచ్చామన్నాడు రాఘవరావు!"
"అమెరికాలోనా లేక కొడుకింట్లోనా ?"
ప్రకాశరావు 'మౌనం' లోనే ఆమె సమాధానం వెతుక్కోవాల్సి వచ్చి
"దట్ స్పీక్స్ వాల్యూంస్ ...!" అంటూ లోనికి వెళ్ళిందక్కడ నుంచి ఇందుమతి. అన్నీ సదురుకుని అర్ధగంటలో బయలుదేరి, కిరాణాషాపులో కావలసిన సామాను తీసుకుని తొమ్మిదిన్నర కల్లా తోటకు చేరారు వారిద్దరు.
* * * * *
ప్రకాశరావు జైళ్ల అధికారిగా రిటైరయ్యాడు. వయస్సు అరవై ఎనిమిది నిండాయి. ఇద్దరు కొడుకులు. ఇద్దరు అమెరికాలోనే సెటిలయ్యారు. తనది మంచి ఆరోగ్యం. వివాద రహితుడు. సాత్వికుడు. నిజాయితీకి మారుపేరు.
'ఈ డిపార్టుమెంటు కెందుకువచ్చావయ్యా మా ప్రాణంతీయడానికి' అని విసుక్కునే వారతనిపై అధికారులు. రిటైర్ కాకముందే సిటీకి కొద్ది దూరంలోఉన్నఆరెకరాల మెట్టభూమిని తోటగా అభివృద్ధి చేశాడు. పెద్ద హాలు రెండు గదుల, కిచెన్ తో ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక తరుచుగా అక్కడే ఉండడం, వ్యవసాయం, తోటపని చేసుకోవడం, అప్పుడప్పుడు స్నేహితులికి, దగ్గరి బంధువులకు తోటలో ఆతిధ్యమివ్వడం అలవాటయ్యింది.
తోట ఆదాయంలో సింహభాగం ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తాడు. కూరగాయలు, పళ్ళు వృద్ధాశ్రమాలలో పంచడమే కాదు. రాత్రుళ్ళు అన్నార్తులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు పంచడం అలవాటు. కుడిచేత్తో చేసేది ఎడం చేతికి తెలవద్దు అనేవాడు. ఆర్భాటాలు గిట్టవు.
'డౌన్ టు ఎర్త్ ' మనిషి ప్రకాశరావు.
* * * * *
తోటకి చేరుతూనే ఏర్పాట్లన్నీ పరిశీలించి తోటలో అలా తిరిగి వచ్చేసరికి పరమహంస కారు పార్క్ చేస్తూ కన్పించాడు. ఇంతలో రాఘవరావు ఏదో అర్జెంటు పని వచ్చి రావడం లేదని ఫోను చేయడంతో రాజప్పతో చెప్పి వచ్చాడు ప్రకాశరావు.
* * * * *
పరమహంస మొదటి భార్య వంటింట్లో వంట గ్యాస్ లీకయి సిలిండరు పేలి చనిపోయింది. ఆసమయంలో పరమహంస ఇంట్లో లేడు. పోలిసువారు మొదట్లో పరమహంసను అనుమానించినా తరువాత ఏక్సిడెంటల్ కేసుగా పరిగణించారు. కేసు క్లోజయింది.
ఏడాది తరువాత పరమహంస రెండో పెళ్లి చేసుకుని సిటీ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే జిల్లాకు వెళ్ళాడు. మళ్ళీ సిటీకి రావడం ఇప్పుడే!.
అప్పట్లో, పరమహంస భార్యను విపరీతంగా టార్చర్ పెట్టేవాడనే అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆయన 'పరమహంస' కాదు 'పరమ హింస' గాడనుకునేవారు క్వార్ట ర్స్ లో కొందరు. అందరితో బాటే తనూ పరమ 'హింస' గాడనుకునేది ఇందుమతి.
* * * * *
చనిపోయిన ఇందిర పరమహంస మొదటి భార్య. క్వార్టర్స్ లో పక్క పక్కఇండ్లలో ఉండడంతో ఇందుమతికి, ఇందిరకు మంచి స్నేహం కుదిరింది. పరమహంస భార్యను 'ఇందూ' అని పిలిచేవాడు. దాంతో ప్రకాశరావు భార్యను పూర్తిపేరుతో పిలవడం అలవాటు చేసుకున్నాడు. ఇందుమతి, ఇందిరా ఖాళీ సమయాల్లో సినిమాలు, షాపింగులకు కలిసి తిరిగేవాళ్లు. దాదాపు పాతిక, ముప్ఫై సంవత్సరాల తరువాత పరమహంసను, ఆయన రెండో భార్యను కలవబోతోంది. ఇందిరతో పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ కలవరపెడుతున్నాయామెను.
భర్త మందలించాడని సైలెంట్ గా ఉంది. అయినా ఇందుమతి ఎక్కడ నోరు జారుతుందేమోనని ప్రకాశరావు భయపడుతునే ఉన్నాడు.
పరమహంస పెద్ద వయసులో తన కొచ్చిన సమస్యని పంచుకుని, సలహా కోసం వస్తున్నానన్నాడు. అందుకే కాదనలేక పోయాడు ప్రకాశరావు. ఈ సమయంలో ఇందుమతి పాత విషయాలు ప్రస్తావించడం బావుండదని ప్రకాశరావు భావన. భార్య సంగతి తెలుసు. ఆమె ఓ ఫెమినిస్ట్.
ఈమధ్య అఫెన్సివ్ గా ఉంటోంది. ఆడవారిని కించపరిచే వారినెవరిని స్పేర్ చేయడంలేదు. అపరకాళిలా విరుచుకుపడుతోంది.
మొన్నీమధ్య మొగుడు కొట్టాడని పనిమనిషి చెప్పడమే తరువాయి, ఆమెను పోలీసుస్టేషన్ తీసుకెళ్లి మరెట్టా కంప్లైంట్ ఇప్పించి భర్తకి వార్నింగ్ ఇప్పించింది.
అప్పట్లో, పరమహంస మొదటి భార్య చావుకు పరోక్షంగా అతనే కారణమని, చట్టానికి దొరక్కుండా వ్యవహరించాడని వాళ్ళు, వీళ్ళు అనడం విని వాదనకు దిగేది భర్తతో.
* * * * *
పరమహంస వస్తూనే భార్యను పరిచయం చేశాడు 'పద్మ' అంటూ.
"మిమ్ముల్ని ఇంతవరకు కలవనే లేదు" అంది ఇందుమతి.
"ఎన్నిసార్లు చెప్పినా తనింతవరకు ఏ స్నేహితుల ఇళ్లకు రాలేదు" అన్నాడు పరమహంస.
"అవును. రాలేదు" అంది పద్మ మెల్లగా.
'ఈమెను ఎక్కడో, ఎప్పుడో చూసినట్లనిపిస్తోంది' అనుకుంటూ "ఇట్స్ ఓకే. లెట్స్ గో ఇన్ " అంటూ వారితో లోనికి నడిచింది ఇందుమతి. టీ, బిస్కట్స్ అవుతూనే ఆడవారు, మగవారు విడిపోయి ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో తోటంతా కలియ తిరిగారు. బత్తాయి చెట్లు మంచి పూత మీదున్నాయి. పండ్లలాగే పూలు కూడా ఎంతోదూరానికి సువాసనలు విరజిమ్ముతూ పరిమళభరితంగా ఉన్నాయి. చూస్తుండగానే నల్లటి మబ్బులు కమ్ముకుని వాతావరణం ఆహ్లాదంగా మారింది. చిరుజల్లు మొదలయింది. చినుకుల్లో తడుస్తూ ఫార్మ్ హౌజ్ కి చేరి కబుర్లలో పడ్డారు.
వేడి టీ రావడంతో తాగుతూ కబుర్లలో పడ్డారు మగవారు. .
"చెప్పండి ... పిల్లలు ఎలా ఉన్నారు? పెద్దవాళ్ళం ఎలాటి ఆటు పోట్లనైనా తట్టుకోగలం. పసికూనలు. మీరే ఇక వారికి సర్వస్వం !" అన్నాడు ప్రకాశరావు.
పెద్ద నిట్టూర్పు విడిచి "ప్రస్తుతం ఇద్దరూ వాళ్ళ నానమ్మ, తాత దగ్గర ఉన్నారు. వాళ్లిద్దరూ బాగా పెద్దవారు. ఉన్న ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వీళ్లూ, అక్కడే సెటిలయ్యారు. కొడుకు, అదే మా అల్లుడు పోవడంతో హైదరాబాద్ వచ్చారు. అత్త, చిన్నమ్మ, బాబాయి పిల్లల్నిపెంచడం మావల్ల కాదన్నారు. ఇక మాకు తప్పిందికాదు. జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. మేమూ పెద్ద వాళ్లమయ్యాము.
రేపనే రోజు తలుచుకుంటే వెన్నుల్లోంచి భయం తన్నుకొస్తోంది. పద్మ ఖచ్చితంగా నావల్ల కాదంటోంది. అయినా, వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో ... పిల్లల భవిష్యత్తు ఏమిటోనని బహు బెంగగా ఉంటోంది. రాత్రిళ్ళు నిద్ర కరువయింది" అన్నాడు పరమహంస ప్రకాశరావు వంక దీనంగా చూస్తూ.
"నీ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం 'పరం'! ... 'కాలం'... కాలమే సమాధానం చెప్పాలి.
మనం నిమిత్త మాత్రులం. ఊహించనిది జరిగింది. ఇలాటి ఘోర విపత్తు నీ జీవితంలో రెండో సారి వచ్చింది! కాలంతో కలిసి నడవడం తప్ప నీకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మొదటిసారి శక్తి నిచ్చిన భగవంతుడు ... ఇప్పుడూ నీతో ఉంటాడు. ఎప్పుడెలాటి సాయం కావాలన్నా చెప్పు.
నాకు చేతనయింది చేయడానికెప్పుడూ సిద్ధం" అన్నాడు ప్రకాశరావు.
కళ్ళ నీరు తుడుచుకుంటూ "అందుకే ప్రకాశం నీ దగ్గరికి వచ్చాను. నాకు కొండంత ధైర్యం వచ్చింది. థాంక్స్!" అన్నాడు పరమహంస ప్రకాశరావు రెండు చేతులు పట్టుకుని, కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని కప్పిపుచ్చుతూ.
"ఇంకొక విషయం. పిల్లల్ని గారాబం చేయవద్దు. చదువు, క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం ఉపేక్ష వద్దు" అన్నాడు రాఘవరావు.
"నీ సలహా తప్పక పాటిస్తాను'' అన్నాడు పరమహంస.
రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి.
* * * * *
పరమహంస, పద్మ బయలుదేరారు. వారు కారు ఎక్కుతున్నప్పుడు
"పద్మగారూ! రెండురోజులనుంచి ప్రయత్నం చేస్తుంటే నాకిప్పుడు గుర్తుకి వచ్చింది. మీరు ఇందిర కజిన్ కదా! ఆక్సిడెంట్ ముందు రోజు ఇందిరవాళ్ళింటికి వచ్చివెళ్లారు. ఇందిర మిమ్ముల్ని నాకు పరిచయం చేసింది గుర్తుందా?
ఆరోజు తనకి తలనొప్పిగా ఉంటే మీరు మంచి 'టీ' పెట్టి ఇచ్చారని కూడా చెప్పింది ఇందిర నాతో.
పరమహంస గారు అసలు మిమ్ముల్ని పెళ్లి చేసుకోవలసిందని, ఏవో కారణాలచేత మీ ఇద్దరి పెళ్లి తప్పిపోయిందని కూడా ఇందిర నాతో స్పష్టంగా చెప్పింది" కూల్ గా అంది ఇందుమతి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.
పద్మ మౌనంగా పరమహంస వంక చూస్తూ హ్యాంకీతో నుదురు మీద పట్టిన చిరు చెమట తుడుచుకుంది.
"వెళ్లొస్తాం" అని కారు స్టార్ట్ చేశాడు పరమహంస.
* * * * * అయి పోయింది * * * * *
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు :9849118254
బూట్ కేంప్
--------------------
చీకటి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది. ఉషస్సు ఉరుకులు పెడుతోంది. తూర్పున వెలుగు చీకటికి వెల్లలేస్తోంది. అవని అంచు నుంచి తేజాన్ని పంచుతూ పయనమయ్యాడు భాస్కరుడు. క్షణాల్లో వెలుగుపరుచుకుంది నేలతల్లి ఒంటిమీద.
క్రితం రాత్రి నిద్రపట్టక ఆలస్యంగా పడుకున్న ప్రకాశరావుకి ఎప్పటిలా ఉదయాన్నేతొందరగా మెళుకువరాలేదు. మొబైల్ ఫోను మోతతో మెలుకువ వచ్చింది. పక్కకు ఒదిగి చేతిమీద భారంవేసి మెల్లగా లేచి, క్షణంపాటు కూర్చుని, బెడ్ సైడ్ బల్ల మీద ఉంచిన మొబైల్ అందుకుని "హలో! ఎవరూ... ?" అన్నాడు మగతగా.
"సార్! కిరాణా సామాను గుర్తు చేయమన్నారు" అన్నాడు తోటమాలి రాజప్ప.
తోట కెళ్లాలని అప్పుడు గుర్తుకువచ్చింది ప్రకాశరావుకి.
"సరే! నిన్న చెప్పిన లిస్ట్ గాక ఇంకేమైనా కావాలంటే గంటలోపున చెప్పు? " అని ఫోను పెట్టేసి బాత్రూమ్ వైపు నడిచాడు ప్రకాశరావు.
"ఈ వారం నాలుగయిదు రోజులపాటు తోటలోనే బస. ఏర్పాట్లన్నీ చూడ్డానికి ఉదయాన్నే తోటకి వస్తానని చెప్పాడు రాజప్పతో. భార్య ఇందుమతి అప్పటికే లేచి వంటింట్లో పనిచేసుకుంటోంది. మాములుగా అవుతే ఆవిడకు తోటకు రావడమంటే మహా ఇష్టం. కానీ ఈసారి ఎందుకో తోటకి రావడానికి ఆవిడ అంతగా సుముఖంగా లేదు. అయినా భర్త వెళదామని అనడంతోనే అయిష్టంగానే ఒప్పుకుంది.
"గంటలో బయలుదేరాలి. పిల్లలిద్దరికీ చెప్పాను తోటకెళుతున్నామని " అన్నాడు ప్రకాశరావు
"ఎన్ని రోజులు మకాం?"
"తోట పని ఉంది. సుమారు వారం"
''నెత్తిన పాలు పోశారు. పనిమనిషి ఊరికెళ్లింది. వారంపాటు రాదు''
"ఇహనేం...మరి అంత ఉత్సాహంగా లేవు ?" అన్నాడు ప్రకాశరావు .
'అక్కడైతే పనివారు, తాజా కూరలు, రుచిగా వండిపెట్టే రాజప్ప భార్య రేణుక.
హాయిగా తోటలో గడపవచ్చు. కానీ ఈసారి... ' ఆమె ఆలోచనకు అడ్డుతతగుల్తూ "నిన్నతెచ్చిన సామానంతా కారులోనే ఉంది. తోట కిచెన్ లో పప్పులు, పోపు, మసాలా దినుసులు నిండుకున్నాయట.
తోవలో కొనుక్కెళదాం. తీసుకెళ్లే బట్టలు, పుస్తకాలు సదురు" అన్నాడు ప్రకాశరావు.
"వెళ్లిన ప్రతిసారి చెబుతూనే వున్నాను. అక్కడ అల్మెరాలో నెలరోజులకు సరిపడా ఇద్దరివీ బట్టలున్నాయి. మనమేనా? ఇంకెవరైనా వస్తున్నారా?"
"ఈసారి పరమహంస, ఆయన వెళ్ళాక రాఘవరావు ఫ్యామిలీతో వస్తున్నారు. రెండ్రోజులుండి వెళతారు"
"పరమహంస గారా ? ఆయన సిటీ కి వచ్చాడేంటి ?"
"అవును ఇందూ! వాళ్ళు కూతురి ఫ్లాట్ లో దిగారు! పోయిన్నెల పూనాలో ఆక్సిడెంట్ లో కూతురూ అల్లుడూ ఇద్దరూ పోయారు తెలుసుగా. మనవడు, మనవరాలు దిక్కులేకుండా అయ్యారని పుట్టెడు దుఃఖ్ఖంలో ఉన్నాడు. పసి పిల్లల భవిష్యత్తు గురించి క్షోభ పడుతున్నాడు. రెండ్రోజులు టెన్షన్ కి దూరంగా వుంటారని నేనే రమ్మన్నాను"
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ! ... సారీ! పిల్లల గురించికాదు నేననేది"
"తప్పు ఇందూ! ప్లీజ్..ఎవరిగురించైనా సరే ఆలా మాట్లాడకు. అతన్ని ఎంతకాలం ద్వేషిస్తావు ? ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు! మనం నోటికి పనిచెబితే మనకే నష్టం. నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎవరిపట్ల దుర్భాష, పరుష వ్యాఖ్యలు వద్దని! మనం ఆతిధ్యమిస్తున్నామన్న విషయం గుర్తుంచుకుని హుందాగా మసులుకో!" భార్యని సున్నితంగా మందలిస్తూ గట్టిగా అన్నాడు ప్రకాశరావు.
'పరమహంస కాదు... పరమహింసగాడు' కసిగా మనసులో అనుకుంటూ.
"ఆయన సరే! ... రాఘవరావుగారు వాళ్ళు అమెరికా వెళ్లారుకదా. ఆర్నెల్లు ఉంటామంది వాళ్ళావిడ పోయినసారి కలిసినప్పుడు ... ఇంతలోనే వెళ్లడం... తిరిగి రావడం కూడా అయిందా !?
ఆశ్చర్యంగా అంది ఇందుమతి.
"వచ్చి కూడా వారం రోజులయింది"
"ఎందుకు అంత త్వరగా తిరిగి వచ్చారు ?"
"ఉండలేక వచ్చామన్నాడు రాఘవరావు!"
"అమెరికాలోనా లేక కొడుకింట్లోనా ?" మాటలు నొక్కి పలుకుతూ అంది ఇందుమతి.
ప్రకాశరావు సమాధానం చెప్పలేదు.
అతని 'మౌనం' లోనే ఆమె సమాధానం వెతుక్కోవాల్సి వచ్చి
"దట్ స్పీక్స్ వాల్యూంస్ ..." భుజాలెగరేసి లోనికి వెళ్ళిందక్కడ నుంచి ఇందుమతి. కావలసిన సమానంతా సదురుకుని అర్ధగంటలో బయలుదేరి, తోవలో ఆగి, కిరాణాషాపులో కావలసిన సామాను తీసుకుని తొమ్మిదిన్నర కల్లా తోటకు చేరారు వారిద్దరు.
* * * * *
ప్రకాశరావు జైళ్ల అధికారిగా రిటైరయ్యాడు. వయస్సు అరవై ఎనిమిది సంవత్సరాలు నిండాయి. ఇద్దరు కొడుకులు. ఇద్దరు అమెరికాలోనే సెటిలయ్యారు. తనది మంచి ఆరోగ్యం. వివాదరహితుడు. సాత్వికుడు. నిజాయితీకి మారుపేరు.
'ఈ డిపార్టుమెంటు కెందుకువచ్చావయ్యా మా ప్రాణంతీయడానికి' అని విసుక్కునే వారతనిపై అధికారులు. రిటైర్ కాకముందే సిటీకి కొద్ది దూరంలోఉన్నఆరెకరాల మెట్టభూమిని తోటగా అభివృద్ధి చేశాడు. పెద్ద హాలు రెండు గదుల, కిచెన్ తో ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక తరుచుగా అక్కడే ఉండడం, వ్యవసాయం, తోటపని చేసుకోవడం, అప్పుడప్పుడు స్నేహితులికి, దగ్గరి బంధువులకు తోటలో ఆతిధ్యమివ్వడం అలవాటయ్యింది.
తోట ఆదాయంలో సింహభాగం ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తాడు. కూరగాయలు, పళ్ళు వృద్ధాశ్రమాలలో పంచడమే కాదు. రాత్రుళ్ళు అన్నార్తులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు పంచడం అలవాటు. కుడిచేత్తో చేసేది ఎడం చేతికి తెలవద్దు అనేవాడు. ఆర్భాటాలు గిట్టవు.
'డౌన్ టు ఎర్త్ ' మనిషి ప్రకాశరావు.
* * * * *
తోటకి చేరుతూనే ఏర్పాట్లన్నీ పరిశీలించి తోటలో అలా తిరిగి వచ్చేసరికి పరమహంస కారు పార్క్ చేస్తూ కన్పించాడు. ఇంతలో రాఘవరావు ఏదో అర్జెంటు పనివచ్చి రావడంలేదని ఫోను చేయడంతో వంటవారికి చెప్పి వచ్చాడు ప్రకాశరావు.
* * * * *
పరమహంస మొదటి భార్య వంటింట్లో వంట గ్యాస్ లీకయి సిలిండరు పేలి చనిపోయింది. ఆసమయంలో పరమహంస ఇంట్లో లేడు. పోలిసువారు మొదట్లో పరమహంసను అనుమానించినా తరువాత ఏక్సిడెంటల్ కేసుగా పరిగణించారు. కేసు క్లోజయింది.
ఏడాది తరువాత పరమహంస రెండో పెళ్లి చేసుకుని సిటీ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే జిల్లాకు వెళ్ళాడు. మళ్ళీ సిటీకి రావడం ఇప్పుడే!.
అప్పట్లో, పరమహంస భార్యను విపరీతంగా టార్చర్ పెట్టేవాడనే అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆయన 'పరమహంస' కాదు 'పరమ హింస' గాడనుకునేవారు క్వార్ట ర్స్ లో కొందరు. అందరితో బాటే తనూ పరమ 'హింస' గాడనుకునేది ఇందుమతి.
* * * * *
చనిపోయిన ఇందిర పరమహంస మొదటి భార్య. క్వార్టర్స్ లో పక్క పక్కఇండ్లలో ఉండడంతో ఇందుమతికి, ఇందిరకు మంచి స్నేహం కుదిరింది. పరమహంస భార్యను 'ఇందూ' అని పిలిచేవాడు. దాంతో ప్రకాశరావు భార్యను పూర్తిపేరుతో పిలవడం అలవాటు చేసుకున్నాడు. ఇందుమతి, ఇందిర ఖాళీ సమయాల్లో సినిమాలు, షాపింగులకు కలిసి తిరిగేవాళ్లు.
ఇప్పుడు, దాదాపు పాతిక, ముప్ఫై సంవత్సరాల తరువాత పరమహంసను, ఆయన రెండో భార్యను కలవబోతోంది ఇందుమతి. ఇందిరతో పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ కలవరపెడుతున్నాయామెను.
భర్త మందలించాడని సైలెంట్ గా ఉంది.
అయినా ఇందుమతి ఎక్కడ నోరుజారుతుందేమోనని ప్రకాశరావు భయపడుతునే ఉన్నాడు.
పరమహంస పెద్ద వయసులో తనకొచ్చిన జటిల సమస్యని పంచుకుని, సలహా కోసం వస్తున్నానన్నాడు. అందుకే కాదనలేక పోయాడు ప్రకాశరావు. ఈ సమయంలో ఇందుమతి పాత విషయాలు ప్రస్తావించడం బావుండదని ప్రకాశరావు భావన. భార్య సంగతి తెలుసు. ఆమె ఓ ఫెమినిస్ట్.
ఈమధ్య అఫెన్సివ్ గా ఉంటోంది. ఆడవారిని కించపరిచే వారినెవరిని స్పేర్ చేయడంలేదు. అపరకాళిలా విరుచుకుపడుతోంది.
మొన్నీమధ్య మొగుడు కొట్టాడని పనిమనిషిచెప్పడమే తరువాయి, ఆమెను పోలీసుస్టేషన్ తీసుకెళ్లి మరెట్టా వాడికి వార్నింగ్ ఇప్పించింది.
అప్పట్లో పరమహంస చట్టానికి దొరక్కుండా వ్యవహరించాడని వాళ్ళు, వీళ్ళు అనడం విని వాదనకు దిగేది భర్తతో. భార్య చావుకు పరోక్షంగా అతనే కారణమని ఆమె నమ్మకం.
* * * * *
పరమహంస వస్తూనే భార్యను పరిచయం చేశాడు 'పద్మ' అంటూ.
"ఇన్నేళ్ళలో మిమ్ముల్ని ఇంతవరకు కలవనే లేదు" అంది ఇందుమతి.
"ఎన్నిసార్లు చెప్పినా తనింతవరకు ఏ స్నేహితుల ఇళ్లకు రాలేదు" అన్నాడు పరమహంస.
"అవును రాలేదు!" అంది పద్మ మెల్లగా.
'ఈమెను ఎక్కడో, ఎప్పుడో చూసినట్లనిపిస్తోంది' అనుకుంటూ "ఇట్స్ ఓకే. లెట్స్ గో ఇన్" అంటూ వారితో లోనికి నడిచింది ఇందుమతి.
టీ, బిస్కట్స్ అవుతూనే ఆడవారు, మగవారు గ్రూపులుగా విడిపోయి ఆహ్లాదకర వాతావరణంలో తోటంతా కలియ తిరిగారు. బత్తాయి చెట్లు మంచి పూత మీదున్నాయి. పండ్లలాగే బత్తాయి పూలు కూడా ఎంతోదూరానికి సువాసన విరజిమ్ముతూ పరిమళభరితంగా ఉన్నాయి. చూస్తుండగానే నల్లటి మబ్బులు కమ్ముకుని వాతావరణం ఆహ్లాదంగా మారింది. చిరుజల్లు మొదలయింది. మబ్బుల్లో పెద్ద రంగుల హరివిల్లు విరిసింది. అందరూ చినుకుల్లో తడుస్తూ ఫార్మ్ హౌజ్ కి చేరి కబుర్లలో పడ్డారు. వేడి టీ, ఉల్లి పకోడీలు రావడంతో తాగుతూ, తింటూ కబుర్లలో పడ్డారు.
* * * * *
"చెప్పు పరం! ఎలావున్నావు ? పిల్లలెలా ఉన్నారు? పెద్దవాళ్ళం మనం ఎలాటి ఆటు పోట్లనైనా తట్టుకోగలం. సర్వం కోల్పోయిన పసికూనలకి మీరే ఇక సర్వస్వం! దేవుడు మీకు ఓ బాధ్యత అప్పచెప్పాడు. ధైర్యం కోల్పోవద్దు. లక్ష్యం ఒక్కటే. అప్రమత్తంగా ఉండు. పిల్లలు జాగ్రత్త!" అన్నాడు ప్రకాశరావు.
పెద్ద నిట్టూర్పు విడిచి "ప్రస్తుతం ఇద్దరూ వాళ్ళ నానమ్మ, తాత దగ్గర ఉన్నారు. వాళ్లిద్దరూ బాగా పెద్దవారు. ఉన్న ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వీళ్లూ, అక్కడే సెటిలయ్యారు. కొడుకు, అదే మా అల్లుడు పోవడంతో వచ్చారు. అత్త, చిన్నమ్మ, బాబాయి పిల్లల్నిపెంచడం మావల్ల కాదన్నారు. ఇక మాకు తప్పిందికాదు. జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. మేమూ పెద్ద వాళ్లమయ్యాము.
రేపనే రోజు తలుచుకుంటే వెన్నుల్లోంచి భయం తన్నుకొస్తోంది. పద్మ ఖచ్చితంగా నావల్ల కాదంటోంది. అయినా, వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో ... పిల్లల భవిష్యత్తు ఏమిటో నని బహు బెంగగా ఉంటోంది. రాత్రిళ్ళు నిద్రకరువయింది" అన్నాడు పరమహంస ప్రకాశరావు వంక దీనంగా చూస్తూ.
"నీ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం 'పరం'! చెప్పానుగా... 'కాలం'... కాలమే సమాధానం చెప్పాలి. మనం నిమిత్త మాత్రులం. ఊహించనిది జరిగింది. ఇలాటి ఘోర విపత్తు నీ జీవితంలో రెండో సారి వచ్చింది. కాలంతో కలిసి నడవడం తప్ప నీకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మొదటిసారి శక్తి నిచ్చిన భగవంతుడు...ఇప్పుడూ నీతో ఉంటాడు. ఎప్పుడెలాటి సాయం కావాలన్నా చెప్పు. నాకు చేతనయింది చేయడానికెప్పుడూ సిద్ధం" అన్నాడు ప్రకాశరావు.
కళ్ళ నీరు తుడుచుకుంటూ "అందుకే ప్రకాశం నీ దగ్గరికి వచ్చాను. నాకు కొండంత ధైర్యం వచ్చింది. థాంక్స్!" అన్నాడు ప్రకాశరావు రెండు చేతులు పట్టుకుని, కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని కప్పిపుచ్చుతూ.
"ఇంకొక విషయం. పిల్లల్ని గారాబం చేయవద్దు. చదువు విషయంలో ఏమాత్రం ఉపేక్ష వద్దు" అన్నాడు రాఘవరావు.
"ఈ విషయాలు తప్పక పాటిస్తాను'' అన్నాడు పరమహంస.
రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి.
* * * * *
పరమహంస, పద్మ బయలుదేరారు. వారు కారు ఎక్కుతున్నప్పుడు
"పద్మగారూ! రెండురోజులనుంచి ప్రయత్నం చేస్తుంటే నాకిప్పుడు గుర్తుకి వచ్చింది. మీరు ఇందిర కజిన్ కదా! ఆక్సిడెంట్ ముందు రోజు ఇందిరవాళ్ళింటికి వచ్చివెళ్లారు. ఇందిర మిమ్ముల్ని నాకు పరిచయం చేసింది గుర్తుందా?
ఆరోజు తనకి తలనొప్పిగా ఉంటే మీరు మంచి టీ పెట్టి ఇచ్చావని కూడా అంది ఇందిర.
పరమహంసగారు అసలు మిమ్ముల్ని పెళ్లి చేసుకోవలసిందని, ఏవో కారణాలచేత పరమహంసగారితో మీపెళ్లి తప్పిపోయిందని కూడా ఇందిర నాతో చెప్పింది" కూల్ గా అంది ఇందుమతి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.
పద్మ మౌనంగా పరమహంస వంక చూస్తూ హ్యాంకీతో నుదురు మీద పట్టిన చిరు చెమట తుడుచుకుంది.
"వెళ్లొస్తాం" అని కారు స్టార్ట్ చేశాడు పరమహంస.
* * * * * అయిపోయింది * * * * *
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు :9849118254
బూట్ కేంప్
--------------------
చీకటి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది. ఉషస్సు ఉరుకులు పెడుతోంది. తూర్పున వెలుగు చీకటికి వెల్లలేస్తోంది. అవని అంచు నుంచి తేజాన్ని పంచుతూ పయనమయ్యాడు భాస్కరుడు. క్షణాల్లో వెలుగుపరుచుకుంది నేలతల్లి ఒంటిమీద.
క్రితం రాత్రి నిద్రపట్టక ఆలస్యంగా పడుకున్న ప్రకాశరావుకి ఎప్పటిలా ఉదయాన్నేతొందరగా మెళుకువరాలేదు. మొబైల్ ఫోను మోతతో మెలుకువ వచ్చింది. పక్కకు ఒదిగి చేతిమీద భారంవేసి మెల్లగా లేచి, క్షణంపాటు కూర్చుని, బెడ్ సైడ్ బల్ల మీద ఉంచిన మొబైల్ అందుకుని "హలో! ఎవరూ... ?" అన్నాడు మగతగా.
"సార్! కిరాణా సామాను గుర్తు చేయమన్నారు" అన్నాడు తోటమాలి రాజప్ప.
తోట కెళ్లాలని అప్పుడు గుర్తుకువచ్చింది ప్రకాశరావుకి.
"సరే! నిన్న చెప్పిన లిస్ట్ గాక ఇంకేమైనా కావాలంటే గంటలోపున చెప్పు? " అని ఫోను పెట్టేసి బాత్రూమ్ వైపు నడిచాడు ప్రకాశరావు.
"ఈ వారం నాలుగయిదు రోజులపాటు తోటలోనే బస. ఏర్పాట్లన్నీ చూడ్డానికి ఉదయాన్నే తోటకి వస్తానని చెప్పాడు రాజప్పతో. భార్య ఇందుమతి అప్పటికే లేచి వంటింట్లో పనిచేసుకుంటోంది. మాములుగా అవుతే ఆవిడకు తోటకు రావడమంటే మహా ఇష్టం. కానీ ఈసారి ఎందుకో తోటకి రావడానికి ఆవిడ అంతగా సుముఖంగా లేదు. అయినా భర్త వెళదామని అనడంతోనే అయిష్టంగానే ఒప్పుకుంది.
"గంటలో బయలుదేరాలి. పిల్లలిద్దరికీ చెప్పాను తోటకెళుతున్నామని " అన్నాడు ప్రకాశరావు
"ఎన్ని రోజులు మకాం?"
"తోట పని ఉంది. సుమారు వారం"
''నెత్తిన పాలు పోశారు. పనిమనిషి ఊరికెళ్లింది. వారంపాటు రాదు''
"ఇహనేం...మరి అంత ఉత్సాహంగా లేవు ?" అన్నాడు ప్రకాశరావు .
'అక్కడైతే పనివారు, తాజా కూరలు, రుచిగా వండిపెట్టే రాజప్ప భార్య రేణుక.
హాయిగా తోటలో గడపవచ్చు. కానీ ఈసారి... ' ఆమె ఆలోచనకు అడ్డుతతగుల్తూ "నిన్నతెచ్చిన సామానంతా కారులోనే ఉంది. తోట కిచెన్ లో పప్పులు, పోపు, మసాలా దినుసులు నిండుకున్నాయట.
తోవలో కొనుక్కెళదాం. తీసుకెళ్లే బట్టలు, పుస్తకాలు సదురు" అన్నాడు ప్రకాశరావు.
"వెళ్లిన ప్రతిసారి చెబుతూనే వున్నాను. అక్కడ అల్మెరాలో నెలరోజులకు సరిపడా ఇద్దరివీ బట్టలున్నాయి. మనమేనా? ఇంకెవరైనా వస్తున్నారా?"
"ఈసారి పరమహంస ఫ్యామిలీతో వస్తున్నాడు. రెండ్రోజులుండి వెళతారు"
"పరమహంస గారా ? ఆయన సిటీ కి వచ్చాడేంటి ?"
"అవును ఇందూ! వాళ్ళు కూతురి ఫ్లాట్ లో దిగారు! పోయిన్నెల పూనాలో ఆక్సిడెంట్ లో కూతురూ అల్లుడూ ఇద్దరూ పోయారు తెలుసుగా. మనవడు, మనవరాలు దిక్కులేకుండా అయ్యారని పుట్టెడు దుఃఖ్ఖంలో ఉన్నాడు. పసి పిల్లల భవిష్యత్తు గురించి క్షోభ పడుతున్నాడు. రెండ్రోజులు టెన్షన్ కి దూరంగా వుంటారని నేనే రమ్మన్నాను"
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ! ... సారీ! పిల్లల గురించికాదు నేననేది"
"తప్పు ఇందూ! ప్లీజ్..ఎవరిగురించైనా సరే ఆలా మాట్లాడకు. అతన్ని ఎంతకాలం ద్వేషిస్తావు ? ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు! మనం నోటికి పనిచెబితే మనకే నష్టం. నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎవరిపట్ల దుర్భాష, పరుష వ్యాఖ్యలు వద్దని! మనం ఆతిధ్యమిస్తున్నామన్న విషయం గుర్తుంచుకుని హుందాగా మసులుకో!" భార్యని సున్నితంగా మందలిస్తూ గట్టిగా అన్నాడు ప్రకాశరావు.
'పరమహంస కాదు... పరమహింసగాడు' కసిగా మనసులో అనుకుంటూ.
"ఆయన సరే! ... రాఘవరావుగారు వాళ్ళు అమెరికా వెళ్లారుకదా. ఆర్నెల్లు ఉంటామంది వాళ్ళావిడ పోయినసారి కలిసినప్పుడు ... ఇంతలోనే వెళ్లడం... తిరిగి రావడం కూడా అయిందా !?
ఆశ్చర్యంగా అంది ఇందుమతి.
"వచ్చి కూడా వారం రోజులయింది"
"ఎందుకు అంత త్వరగా తిరిగి వచ్చారు ?"
"ఉండలేక వచ్చామన్నాడు రాఘవరావు!"
"అమెరికాలోనా లేక కొడుకింట్లోనా ?"
ప్రకాశరావు 'మౌనం' లోనే ఆమె సమాధానం వెతుక్కోవాల్సి వచ్చి
"దట్ స్పీక్స్ వాల్యూంస్ ..." అంటూ లోనికి వెళ్ళిందక్కడ నుంచి ఇందుమతి. అన్నీ సదురుకుని అర్ధగంటలో బయలుదేరి, కిరాణాషాపులో కావలసిన సామాను తీసుకుని తొమ్మిదిన్నర కల్లా తోటకు చేరారు వారిద్దరు.
* * * * *
ప్రకాశరావు జైళ్ల అధికారిగా రిటైరయ్యాడు. వయస్సు అరవై ఎనిమిది నిండాయి. ఇద్దరు కొడుకులు. ఇద్దరు అమెరికాలోనే సెటిలయ్యారు. తనది మంచి ఆరోగ్యం. వివాదరహితుడు. సాత్వికుడు. నిజాయితీకి మారుపేరు.
'ఈ డిపార్టుమెంటు కెందుకువచ్చావయ్యా మా ప్రాణంతీయడానికి' అని విసుక్కునే వారతనిపై అధికారులు. రిటైర్ కాకముందే సిటీకి కొద్ది దూరంలోఉన్నఆరెకరాల మెట్టభూమిని తోటగా అభివృద్ధి చేశాడు. పెద్ద హాలు రెండు గదుల, కిచెన్ తో ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక తరుచుగా అక్కడే ఉండడం, వ్యవసాయం, తోటపని చేసుకోవడం, అప్పుడప్పుడు స్నేహితులికి, దగ్గరి బంధువులకు తోటలో ఆతిధ్యమివ్వడం అలవాటయ్యింది.
తోట ఆదాయంలో సింహభాగం ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తాడు. కూరగాయలు, పళ్ళు వృద్ధాశ్రమాలలో పంచడమే కాదు. రాత్రుళ్ళు అన్నార్తులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు పంచడం అలవాటు. కుడిచేత్తో చేసేది ఎడం చేతికి తెలవద్దు అనేవాడు. ఆర్భాటాలు గిట్టవు.
'డౌన్ టు ఎర్త్ ' మనిషి ప్రకాశరావు.
* * * * *
తోటకి చేరుతూనే ఏర్పాట్లన్నీ పరిశీలించి తోటలో అలా తిరిగి వచ్చేసరికి పరమహంస కారు పార్క్ చేస్తూ కన్పించాడు. ఇంతలో రాఘవరావు ఏదో అర్జెంటు పనివచ్చి రావడంలేదని ఫోను చేయడంతో వంటవారికి చెప్పి వచ్చాడు ప్రకాశరావు.
* * * * *
పరమహంస మొదటి భార్య వంటింట్లో వంట గ్యాస్ లీకయి సిలిండరు పేలి చనిపోయింది. ఆసమయంలో పరమహంస ఇంట్లో లేడు. పోలిసువారు మొదట్లో పరమహంసను అనుమానించినా తరువాత ఏక్సిడెంటల్ కేసుగా పరిగణించారు. కేసు క్లోజయింది.
ఏడాది తరువాత పరమహంస రెండో పెళ్లి చేసుకుని సిటీ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే జిల్లాకు వెళ్ళాడు. మళ్ళీ సిటీకి రావడం ఇప్పుడే!.
అప్పట్లో, పరమహంస భార్యను విపరీతంగా టార్చర్ పెట్టేవాడనే అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆయన 'పరమహంస' కాదు 'పరమ హింస' గాడనుకునేవారు క్వార్ట ర్స్ లో కొందరు. అందరితో బాటే తనూ పరమ 'హింస' గాడనుకునేది ఇందుమతి.
* * * * *
చనిపోయిన ఇందిర పరమహంస మొదటి భార్య. క్వార్టర్స్ లో పక్క పక్కఇండ్లలో ఉండడంతో ఇందుమతికి, ఇందిరకు మంచి స్నేహం కుదిరింది. పరమహంస భార్యను 'ఇందూ' అని పిలిచేవాడు. దాంతో ప్రకాశరావు భార్యను పూర్తిపేరుతో పిలవడం అలవాటు చేసుకున్నాడు. ఇందుమతి, ఇందిరా ఖాళీ సమయాల్లో సినిమాలు, షాపింగులకు కలిసి తిరిగేవాళ్లు. దాదాపు పాతిక, ముప్ఫై సంవత్సరాల తరువాత పరమహంసను, ఆయన రెండో భార్యను కలవబోతోంది. ఇందిరతో పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ కలవరపెడుతున్నాయామెను.
భర్త మందలించాడని సైలెంట్ గా ఉంది. అయినా ఇందుమతి ఎక్కడ నోరుజారుతుందేమోనని ప్రకాశరావు భయపడుతునే ఉన్నాడు.
పరమహంస పెద్ద వయసులో తనకొచ్చిన సమస్యని పంచుకుని, సలహా కోసం వస్తున్నానన్నాడు. అందుకే కాదనలేక పోయాడు ప్రకాశరావు. ఈ సమయంలో ఇందుమతి పాత విషయాలు ప్రస్తావించడం బావుండదని ప్రకాశరావు భావన. భార్య సంగతి తెలుసు. ఆమె ఓ ఫెమినిస్ట్.
ఈమధ్య అఫెన్సివ్ గా ఉంటోంది. ఆడవారిని కించపరిచే వారినెవరిని స్పేర్ చేయడంలేదు. అపరకాళిలా విరుచుకుపడుతోంది.
మొన్నీమధ్య మొగుడు కొట్టాడని పనిమనిషిచెప్పడమే తరువాయి, ఆమెను పోలీసుస్టేషన్ తీసుకెళ్లి మరెట్టా వాడికి వార్నింగ్ ఇప్పించింది.
అప్పట్లో పరమహంస మొదటి భార్య చావుకు పరోక్షంగా అతనే కారణమని, చట్టానికి దొరక్కుండా వ్యవహరించాడని వాళ్ళు, వీళ్ళు అనడం విని వాదనకు దిగేది భర్తతో.
* * * * *
పరమహంస వస్తూనే భార్యను పరిచయం చేశాడు 'పద్మ' అంటూ.
"మిమ్ముల్ని ఇంతవరకు కలవనే లేదు" అంది ఇందుమతి.
"ఎన్నిసార్లు చెప్పినా తనింతవరకు ఏ స్నేహితుల ఇళ్లకు రాలేదు" అన్నాడు పరమహంస.
"అవును రాలేదు" అంది పద్మ మెల్లగా.
'ఈమెను ఎక్కడో, ఎప్పుడో చూసినట్లనిపిస్తోంది' అనుకుంటూ "ఇట్స్ ఓకే. లెట్స్ గో ఇన్ " అంటూ వారితో లోనికి నడిచింది ఇందుమతి. టీ, బిస్కట్స్ అవుతూనే ఆడవారు, మగవారు విడిపోయి ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో తోటంతా కలియ తిరిగారు. బత్తాయి చెట్లు మంచి పూత మీదున్నాయి. పండ్లలాగే పూలు కూడా ఎంతోదూరానికి సువాసనలు విరజిమ్ముతూ పరిమళభరితంగా ఉన్నాయి. చూస్తుండగానే నల్లటి మబ్బులు కమ్ముకుని వాతావరణం ఆహ్లాదంగా మారింది. చిరుజల్లు మొదలయింది. చినుకుల్లో తడుస్తూ ఫార్మ్ హౌజ్ కి చేరి కబుర్లలో పడ్డారు.
వేడి టీ రావడంతో తాగుతూ కబుర్లలో పడ్డారు మగవారు. .
"చెప్పండి ... పిల్లలు ఎలా ఉన్నారు? పెద్దవాళ్ళం ఎలాటి ఆటు పోట్లనైనా తట్టుకోగలం. పసికూనలు. మీరే ఇక వారికి సర్వస్వం !" అన్నాడు ప్రకాశరావు.
పెద్ద నిట్టూర్పు విడిచి "ప్రస్తుతం ఇద్దరూ వాళ్ళ నానమ్మ, తాత దగ్గర ఉన్నారు. వాళ్లిద్దరూ బాగా పెద్దవారు. ఉన్న ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వీళ్లూ, అక్కడే సెటిలయ్యారు. కొడుకు, అదే మా అల్లుడు పోవడంతో వచ్చారు. అత్త, చిన్నమ్మ, బాబాయి పిల్లల్నిపెంచడం మావల్ల కాదన్నారు. ఇక మాకు తప్పిందికాదు. జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. మేమూ పెద్ద వాళ్లమయ్యాము.
రేపనే రోజు తలుచుకుంటే వెన్నుల్లోంచి భయం తన్నుకొస్తోంది. పద్మ ఖచ్చితంగా నావల్ల కాదంటోంది. అయినా, వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో ... పిల్లల భవిష్యత్తు ఏమిటో నని బహు బెంగగా ఉంటోంది. రాత్రిళ్ళు నిద్రకరువయింది" అన్నాడు పరమహంస ప్రకాశరావు వంక దీనంగా చూస్తూ.
"నీ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం 'పరం'! ... 'కాలం'... కాలమే సమాధానం చెప్పాలి.
మనం నిమిత్త మాత్రులం. ఊహించనిది జరిగింది. ఇలాటి ఘోర విపత్తు నీ జీవితంలో రెండో సారి వచ్చింది! కాలంతో కలిసి పోవడం తప్ప నీకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మొదటిసారి శక్తి నిచ్చిన భగవంతుడు ... ఇప్పుడూ నీతో ఉంటాడు. ఎప్పుడెలాటి సాయం కావాలన్నా చెప్పు. నాకు చేతనయింది చేయడానికెప్పుడూ సిద్ధం" అన్నాడు ప్రకాశరావు.
కళ్ళ నీరు తుడుచుకుంటూ "అందుకే ప్రకాశం నీ దగ్గరికి వచ్చాను. నాకు కొండంత ధైర్యం వచ్చింది. థాంక్స్!" అన్నాడు ప్రకాశరావు రెండు చేతులు పట్టుకుని, కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని కప్పిపుచ్చుతూ.
"ఇంకొక విషయం. పిల్లల్ని గారాబం చేయవద్దు. చదువు విషయంలో ఏమాత్రం ఉపేక్ష వద్దు" అన్నాడు రాఘవరావు.
"ఈ విషయాలు తప్పక పాటిస్తాను'' అన్నాడు పరమహంస.
రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి.
* * * * *
పరమహంస, పద్మ బయలుదేరారు. వారు కారు ఎక్కుతున్నప్పుడు
"పద్మగారూ! రెండురోజులనుంచి ప్రయత్నం చేస్తుంటే నాకిప్పుడు గుర్తుకి వచ్చింది. మీరు ఇందిర కజిన్ కదా! ఆక్సిడెంట్ ముందు రోజు ఇందిరవాళ్ళింటికి వచ్చివెళ్లారు. ఇందిర మిమ్ముల్ని నాకు పరిచయం చేసింది గుర్తుందా?
ఆరోజు తనకి తలనొప్పిగా ఉంటే మీరు మంచి టీ పెట్టి ఇచ్చావని కూడా అంది ఇందిర.
పరమహంసగారు అసలు మిమ్ముల్ని పెళ్లి చేసుకోవలసిందని, ఏవో కారణాలచేత పరమహంసగారితో మీపెళ్లి తప్పిపోయిందని కూడా ఇందిర నాతో చెప్పింది" కూల్ గా అంది ఇందుమతి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.
పద్మ మౌనంగా పరమహంస వంక చూస్తూ హ్యాంకీతో నుదురు మీద పట్టిన చిరు చెమట తుడుచుకుంది.
"వెళ్లొస్తాం" అని కారు స్టార్ట్ చేశాడు పరమహంస.
* * * * * అయిపోయింది * * * * *
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు :9849118254
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి