ఉదార ఉద్గారం ( కవిత)
కాలుష్యపు విషపు కరకు కోరల్లోంచి
స్రవిస్తున్న కార్బన్ ఉద్గార గరళం
గొంతుజారుతోంది గరిష్టంగా !
ఓ మనిషీ… కలియజూడు !
జాడతెలియని మూలాల్లోంచి
పత్తాలేని పల్లె క్వారీ ల్లోంచి
తరుగుతున్న బండ కొండల్లోంచి
మరుగుతున్న బడబాగ్నుల్లోంచి
కసిరే కడలి సునామీల్లోంచి
పుడమితల్లి గుండెల్లో స్థంబాలు గుచ్చి
అడ్డగోలుగా అవతరించే ఆవాసాల్నుంచి
కుచించుకుపోతున్న కీకారణ్యాల్లోంచి,
దివారాత్రాలు విజృంభిస్తున్నధ్వని విధ్వంసం నుంచి
కదులుతున్న వాహనశ్రేణుల్లోనుంచి,
శీతల,మర యంత్రాల్లోంచి
నీవిసిరే ప్లాస్టిక్ గోతాల్లోంచి
మండుతున్న రాక్షస బొగ్గులోంచి
మారుతున్న ఖనిజామూలాల్లోంచి
ఉద్భవిస్తున్న ఉద్గార గరళం
నీ ఉఛ్ఛాస నిశ్వాసలను
నాసికాపుటాల్నినియంత్రించే
కాలమాసన్నమైంది !
ఓ మనీషీ మేలుకో !
మేలుకుంటే కోలుకుంటావు !!
లేకుంటే తప్పదు
మరింత మహా విధ్వసం !!!
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నం. 9849118254
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి