లేబుళ్లు

3, మార్చి 2015, మంగళవారం

భారతీయత -మారుతున్నవిలువలు - వైరుధ్యాలు                                               భారతీయత -మారుతున్నవిలువలు - వైరుధ్యాలు
                                               ---------------------------------------------------------------

                                               ప్రస్తుత భారత ప్రజల జీవనవిధానం, సామాజిక పరిస్థితులను గమనిస్తే, పెద్దగా గణాంకాల జోలికే వెళ్ళకుండానే అవగతమయ్యే విషయం ఏమంటే  ఓ పక్క ఉన్నవారికి పుష్కలమైన సంపద, విలాసవంతమైన జీవితం, సుఖలాలస, అట్టహాసాల జీవిత ప్రదర్శన చేస్తూ పోటీపడి జీవించడమైతే  మరొకపక్క కడు పేదరికం - తిండికి, గుడ్డకు, నీడకు కరువు; వీటికై  నిరంతర జీవనపోరాటం.ఈ జీవన వైరుధ్యాల సంకట పరిస్థితులతో సమ్మిళితమైన సమాజపరిస్థితి 'యువత'ను అయోమయంలో పడేస్తోంది. ఇవికాక నాగరికత ముసుగులో దిగజారిన  విలువలు, ప్రజల,ప్రభుత్వ,వ్యాపారుల వ్యాపార దృష్టితో భారతీయ సైద్ధాంతిక,మానవీయ, నైతిక విలువలను రూపుమాపిన ప్రసారమాధ్యమాలు అనగా సినిమా,   టివీ, వార్తాపత్రికలు,ఇంటర్నెట్ ( అంతర్జాలం), వాటి వాటి వ్యాపారధోరణిలో పోటీపడి చేస్తున్న అసభ్య, అశ్లీల, ఆవేశపూరిత  విషయ సమాచారం, ప్రసారాలు, ప్రచారం ఇవన్నీ కలిసి విలువకట్టలేని, ప్రపంచంలో మరెక్కడా లేని మన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, సంపదని మంటగలిపి మన ఋషులు, పూర్వీకులు, కవులు, పండితులు, మేధావులు  మనకందించిన శాశ్వత విలువలను, సత్యాలను పునాదివేళ్ళతో సహా నాశనం చేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఆవిలువలే మన భారతజాతిని ఇన్నాళ్ళు కాలపరీక్షకు వెన్నుగాచి నిలిచి, గెలిచిన విభిన్న భారతీయతను 'భిన్నత్వంలో ఏకత్వం' తో ఒకే గాట కట్టిఉంచాయన్న సత్యాన్ని మరుగుపరిచి ఆవిలువల్నిఅవాస్తవ
'ప్రతి' పరిశీలనా, విపరీత విమర్శనాత్మక ధోరణులతో అవహేళన చేయడం, కాలరాయడం రోజువారీ కార్యక్రమమయింది. వీటి ప్రభావంతో యువత పోటీ జీవితమే ' జీవితం' అన్నట్లుగా  కంటికి కనిపించిన ప్రతి ఆనందం, వస్తువు తనది కానిదైనా, తనకు చెందనిదైనా, కొ న్ని క్షణాలైనా తన సొంతం చేసుకోవాలన్న దుగ్ధతో జీవితాల్ని విలువలేని  విషయానందానికై వెచ్చించి, తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళకు గురిచేసుకుని, జీవిత లక్ష్యసాధన మరిచి తమ తమ జీవితాల్ని దుర్భరం చేసుకుంటున్నారు.
                                          

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి