లేబుళ్లు

30, నవంబర్ 2012, శుక్రవారం

సమస్యలు-కర్మ-నేటి జీవితాలు.

                                                        సమస్యలు- కర్మ- నేటి జీవితాలు.
                                                        ---------------------------------------------

'బలం జీవితం, బలహీనత చావు' అన్నారు స్వామి వివేకానంద.
ప్రతి మనిషి జీవితంలో సమస్యలు, ఒడిదుడుకులుంటాయి.
ఇందులో పేదలు, ధనవంతులు, గొప్పవాళ్లు, సామాన్యులు అన్న తారతమ్యాలు ఉండవు. త్రోవలో ఎత్తు పల్లాల్లాగే మనిషి జీవితంలో కూడా కష్ట సుఖాలు, వెలుగు నీడలు కూడ వెన్నంటి వుంటాయి. ఇది ప్రతి మనిషికి తెలిసిందే ! దీంట్లో కొత్తేమీ లేదు.
కాకపోతే ప్రతి మనిషి 'కష్ట' మొచ్చినప్పుడు అందరో ఒకడిలా, సుఖాలలో అన్నింటా తానొక్కడే అయినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే మనుషుల దుర్బలత. అయితే కష్ట సుఖాలను సమానంగా తీసుకోగలిగిన మనిషే జీవితంలో 'పరిపూర్ణత' సాధించిన వాడవుతాడు.
మనుషులు నిత్య జీవితంలో కష్టాలతో, సమస్యలతో, కలహాలతో, రోగాలతో, లేమితో,ఈ ఉరుకుల పరుగుల జీవితంతో వేగలేక మనః శ్శాంతి కరవై నిస్పృహ, నిస్సత్తువ, నిస్సహాయతతో ఒత్తిడికి, ఆందోళనకు లోనై ఏదో తెలియని ప్రవాహంలో కొట్టుకుని పోతున్నారు.
ఈ ప్రవాహానికి తీరం లేదు.కొందరు ఒడ్డుకు ఈదగలుగుతారు. మరి కొంతమంది ప్రవాహ వేగానికి కొట్టుకు పోతుంటారు. కొంత మంది ధైర్యం చేసి ఎదురీది ఏదో ఒక ఒడ్డుకు చేరడమో లేక ఏదో ఒక ఊతం దొరకబుచ్చుకోవడమో చేస్తారు.
ఒడ్డుకు చేరేవారు చేరుతుంటే ప్రవాహంలో చేరే వారు చేరుతుంటారు.
ఇదొక నిరంతర జీవన ప్రక్రియ.
అలాగే మానవ జీవన గమనంలో ఏదో ఒక సమయంలో మనిషికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కష్టాలతో కాపురం చేయవలసి వస్తుంది. సమస్యల సుడిగుండంలో చిక్కుకుని వివేక రహిత స్థితిలో కొట్టుమిట్టాడుతుంటాము.
ఏపని అనుకున్నా ఆపని కాదు సరికదా ఇంకో కొత్త సమస్య వచ్చి ఉక్కిరి,బిక్కిరి చేస్తుంది. ఇలాంటి సమయంలోనే మనిషి తెలివి, ధైర్యం, తెగువ, అనుభవం, కీర్తి, ధనం, పలుకుబడి దేనికీ కొరగావు! సాధారణంగా ఈ 'స్థితి' లోనే 'మనిషి' శరణాగతుడవుతాడు. అంటే తన అహాన్ని చంపుకోవడమే.
మనిషిని ఈ 'చర్య'కు పురిగోల్పేది అంతర్లీన భగవత్ శక్తి మాత్రమే!
ఇవన్నీ పురాణాలు, ఉత్త చెత్త అని తీసి పారేసే వాళ్ళు వున్నారు.
మరి అలా అనుకునే వాళ్ళకీ ఇలాంటి సమస్యలు లేవా? రావా? అంటే అదేమీ లేదు!
వారికి సమస్యలున్నాయి కదా!
ఉదాహరణకు పశ్చిమ బెంగాలుకు చెందిన గౌరవనీయులు కీ.శే.జ్యోతిబసు గారిని తీసుకుందాం !
ఒకప్పుడు ఆయనకు ఈ దేశ ప్రధాన మంత్రి పదవిని ఇవ్వ చూపారు. అందుకు ఆయన పార్టీనో....
ఆయనో విముఖత చూపారు. దాన్ని ఏదో 'సమస్య'గా చూశారు వారంతా!అప్పటికప్పుడు ఆ 'సమస్య' ను సానుకూలంగా పరిష్కరించుకోవడంలో వారు పెద్ద తప్పిదమే చేశారు.
సరే, ఆ స్థానంలో ఇంకెవరో ప్రధాన మంత్రి అయ్యారనుకోండి....తరువాత కొంత కాలానికి ఆయన పార్టీ వారే  'దానిని చారిత్రాత్మిక తప్పిదం' అని వ్యాఖ్యానించారు కదా!
అది వారి 'కర్మ' కాదా?
'అసలు 'కర్మ' హిందూమత సిద్దాంతం అయినా బ్రిటిష్, అమెరికా దేశాలలోనే  గాక అనేక పాశ్యాత్య దేశాలలో కూడా ప్రాచుర్యం చెందింది. ఆక్సఫర్డ్  నిఘంటువు లోనే కాక అనేక ఇతర నిఘంటువుల్లో కూడా 'కర్మ'
అన్నపదం ఈ 'జన్మ', పూర్వజన్మలలో మనిషి చేసుకున్న'క్రియా ఫలం' గా నిర్వచించబడ్డది.  
సరే...ఈ 'కర్మ' విషలో  ఉదాహరణకు మనందరికీ తెలిసిన ఒక  సినీ ప్రముఖుడి జీవితాన్నిచూడండి....
అదే మన 'అమితాబచ్చన్' గారు...జీవితంలో ఎన్ని 'సమస్యలు'...'ఆటుపోట్లు !
ఆయన జీవత ఉత్థాన, పతనాలు, తరువాత, పోయిన దానిని పొందేందుకు ఆయన చూపిన పోరాట పటిమ
ఎన్నదగినవి కావా? సామాన్యులు సైతం స్ఫూర్తి పొందే 'కర్మ' సాఫల్యం కాదా వారిది?
అంతెందుకు ఇందిరా గాంధీ, మన పి.వి. గార్లు కోర్టుల చుట్టూ తిరగవలసి రాలేదా?
ఈవ్యాసంలో ప్రస్తావించదలుస్తే ఒక్క మనదేశంలోనే ఇలాంటివి ఎన్నెన్నో దృష్టాంతరాలు ఉన్నాయి.
కర్మ, కష్టం, సుఖం అన్నవి మనిషి ఎంత వారైనా అనుభవించవలసిందే !
దీనికి మినహాయింపు అంటూ ఎవరికీ లేదు.
కాబట్టి మనిషి ఎవరైనా 'కర్మ'ని ' కాదు', లేదు' అని కొట్టి పారేయలేరు కదా!
'కష్టాలు' కలకాలం కాపురం చేయవు అనే వాళ్ళు మన పెద్దలు.
కాని 'సమస్యలు' మనిషి బ్రతికి ఉన్నత కాలం మనిషితో ఉండేవే.
సరే, మనం ఇప్పుడు మనిషి కష్టాలను వారి వారి 'సమస్య' గా అనుకుందాం కాసేపు ఈ 'వ్యాసం' కోసం.
అసలు 'సమస్య' లేని మనిషంటూ ఈ భూమండలంలో ఎవరైనా వున్నారా?
అసలు "సమస్య"అంటే ఏమిటి ? అవి ఎందుకు వస్తాయి?
"సమస్య" అంటే ఒక చిక్కు ముడి లాటిది. కఠిన మైనది. నివృత్తి, పరిష్కారం అవశ్యం లభించని, మానవకల్పిత 'విషయ' లాలస. స్వయంకృతం.
అలా అని ' అన్నీ' మానవ కల్పిత స్వయంకృత  'సమస్య'లు కావు. కొన్ని మనిషికి  పుట్టుకతో వస్తాయి. కొన్ని మధ్యలో వస్తాయి.
పూర్వకాలంలో 'సమస్యలు' సాధారణంగా తనది కాని నీరు, రాజ్యం, ధనం, స్త్రీ వ్యామోహం వల్ల 'సమస్య'లు ఉత్పన్నమయ్యేవి.
ప్రస్తుతం కూడా స్థూలంగా 'సమస్య' లకు అవే కారణాలు. కాకుంటే ఇప్పుడు రాచరికాలు లేకపోయినా 'రాజ్యహింస' ఎక్కువయిందని ఏదో పార్టీ వాళ్ళు గొడవచేస్తుంటే విన్నాను.
కొంత నిజమే అనిపిస్తుంది.
నీళ్లు రావు. వస్తే మనిషిని ముంచేస్తాయి.కరంటు ఎప్పుడూ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలీదు.
రేషను ఈనెల వస్తుందో, మూడు నెలల తరువాత ఇస్తారో తెలీదు.
సామాన్య ప్రజలకి ఇవన్నీ సమస్యలే. కూలి వాడికి పని దొరికి కూలి డబ్బులు చేతిలో పడ్డ దాక 'సమస్యే'!
డబ్బు చేతిలో వుంటే 'సమస్యల' దేముంది, చిటికలో పరిష్కార మవుతాయి అనేవాళ్ళు లేకపోలేదు.
డబ్బుతో పోయిన వాళ్ళని తీసుకు రాగలమా? లేదు కదా...ఎంతటి వారైనా ఆరోగ్యాన్ని కొనలేరు కదా!
ఇవన్నీ ఇలా వుండగా ఇప్పుడు మనల్ని ఓ కొత్త 'సమస్య' దావానంలా కమ్ముకొస్తోంది.
దాదాపు ఒక దశకం పైగా మనవారు సంపాదన, మనుగడ కోసం తమ నెలవులను, 'స్వస్థలిని' వదలి, ఎల్లలు, దేశాలు దాటి వెళ్తున్నారు.......
దానితో ఆయాదేశాలలో , ప్రదేశాలలో వారి ప్రశాంత మనుగడ కోసం తమ 'ఉనికి'లో, తమ మూలాలలో, వేష, భాషలలో మార్పులు, చేర్పులు సహజ మయ్యాయి. అక్కడ వరకే అవసరమైన ఆమార్పులు, చేర్పులు ఆయాదేశాలనుంచి, మనుషుల నుంచి దిగుమతి అయి ' ఇక్కడ' వారికి కూడా చేరువయ్యాయి.
ఆ పాశ్చాత్య మార్పులు, చేర్పులు, భాష, వేషం ఇక్కడ సంస్కృతికి 'విభిన్నం' కావడంతో ఇక్కడ పాత తరం వారి జీవితాల్లో
'సంఘర్షణ' రేకెత్తిస్తోంది..... నేటి తరం వారు ఆ మార్పులకు, చేర్పులతో 'మమేకం' అవడంతో ఇక్కడి సామాజిక వర్గాల్లో, సంఘంలో ఊహించని ' సమస్య'లు ఉత్పన్నమవుతున్నాయి.
విపరీత పరిణామాలకు కారణం అవుతున్నాయి. సమాజ ధోరణిలో వినూత్న పోకడల మూలంగా అనేక 'మూల వ్యవస్థ'ల మనుగడే ప్రశ్నార్ధక మవుతోంది. ఈ ధోరణి కొద్ది మందిలో కాదు...మరింత మందిలో పాగా వేసింది. దీనితో రోజుకో 'సమస్య' కొత్త కోణంలో ఆవిష్కారమవుతోంది.
దేశం లో 'కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ'లు దాదాపు విచ్చిన్నదశలో, ప్రమాదపుటంచులలో ఉన్నాయనడం లో ఏమాత్రం అతిశయోక్తిలేదు. అందుకు రోజు, రోజుకీ పెరుగుతున్న 'విడాకుల' కేసులు, కురుచ,చిత్ర,విచిత్ర,వేష ధారణ, ఆహార, విహారపు అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పులే తార్కాణం.
ఇక సాంప్రదాయ, ఆచార వ్యవహారాల్లో అంతరాయం, అయినవారి అనాదరణ...... ఫలితం 'తరాల' మధ్య సంఘర్షణ. అందుకే ప్రతి కుటుంబం లో ఏదో ఒక 'సమస్య'. ఆ సమస్య 'వివాహమే' కావచ్చు, వివాహ విచ్చిత్తే కావచ్చు, విడి పోయిన వారి పిల్లల గురించే కావచ్చు, పిల్లల అలవాట్లే కావచ్చు, నేరాలు కావచ్చు, వయసుడిగిన తలి తండ్రుల పోషణ కావచ్చు, ఆస్తులు కావచ్చు.....ఇలా చెప్పుకుంటూ పోతే...చాలా వున్నాయి.
వీటన్నింటికీ మూల కారణం.........మారుతున్న కాలం, సంస్కృతి, ప్రపంచీకరణ....అంతే కాదు! 
మనుషులం యంత్రాలమయ్యాము. ఏకాకుల మయ్యాము.
'నేను, 'నా' అన్నమాట తప్పితే
ఒక తల్లీ లేదు, చెల్లీ లేదు, అన్నా లేడు.
కని పెంచిన తలి తండ్రులే లేరు.'.నా' తప్ప వేరే లోకమే లేదు.
'అహం బ్రహ్మాస్మి'.....
అసలు 'సమస్య' ఇక్కడ ప్రారంభమవుతోంది.
మన పిల్లలతో మాట్లాడే తీరిక లేదు. పిల్లలను వారి మానాన వారిని  వదిలేస్తున్నాం....వారిని  చక్కటి 'పౌరులు' గా తీర్చిదిద్దుతున్నతలి తండ్రులు ఈనాటి సమాజంలో ఎంతమంది ఉన్నారు?....
ప్రక్కన ఇంట్లో ఎవరుంటున్నారో తెలీదు.
తెలుసుకుందామనో, పరిచయం చేసుకుందామని ఎవరైనా కొద్దిగా ఉత్సుకత చూపుతే వారి గుమ్మం ముందునుంచే వెనక్కు తిరగాల్సిందే.
పైగా వెనకాలనుంచి "ఈయనకు / ఈవిడకు వేరే పని లేదా?...వీళ్ళతో జాగ్రత్తగా వుండాలి".... అనే 'విమర్శ'  వినక తప్పదు.
పైవన్నీ ఈనాడు మనల్ని తొలిచేస్తున్న 'సమస్య' లకు సమాధానం దొరికే మానవ సంబంధాలు.....అనుబంధాలు..... అవి ఇప్పుడు వాటిని తిరిగి పొందే స్థితి నుంచి 'మనం'ఎప్పుడో దూరంగా వచ్చేశాము.
సరిగ్గా 70 , 80 దశకాలలో 'అమెరికా'లో ప్రజ ఇలాగే వుండే వారు. తొంభై దశకం నుండి వారి తీరు మారింది.
వారి కుటుంబ,మానవ సంబంధాలు మెరుగయ్యాయి.
సరిగ్గా మనం ఇప్పుడు తిరోగమనంలో ఉన్నాము. మనకు వారి జాడ్యం 90 దశకంలో ప్రారంభ మయింది.
అందుకే ఎవరైనా, తమకు తెలిసీ, తెలియక విడిపోయిన మానవసంబంధాలు తిరిగి పొంద గలిగితే
వారు వారి సమస్యల సుడిగుండం నుంచి కొంత వరకు బయట పడ్డట్లే...మానవ సంబంధాలు
అంత గొప్పవి...కారణం .....
అవి మనం కల్పించుకున్నవి కావు కనుక...ఇందుకు మనం చిన్నప్పుడు చదువుకున్న చిన్న ఉదాహరణ...'కట్టె' ఒక్కటయితే తేలిగ్గా విరగ కొట్టవచ్చు...అదే నాలుగు కట్టెలు కలిపితే అంత తేలిగ్గా విరగ గొట్ట గలమా?......
కాని, ఇక్కడ గమనించ వలసిన ఒక సున్నిత మైన విషయం మరొకటుంది.
మానవ సంబంధాలు తిరిగి పొందడం గురించి తన 'సమస్య'ల ను వేరే వారితో చర్చించే టప్పుడు తస్మాత్ జాగ్రత్త.
రెండవది, ఆలోచించండి. విశ్లేశించుకోండి. మీ సమస్య అంత క్లిష్టంగా ఎందుకయింది?
ఏయే అంశాలు 'సమస్య' తీవ్రతకు కారణమయ్యాయి...మీ 'సమస్య' తీవ్రతకు మీరు ఎంతవరకు కారణం? మీతప్పు ఏమైనా వుంటే కప్పి పుచ్చుకోకండి.
తప్పులు దిద్దుకునే ప్రయత్నం ప్రారంభించండి..మీ ఆంతరంగికులతో చర్చించ తగ్గ విషయమైతే తప్పక చర్చించండి...
కార్యాచరణ ప్రణాళిక ఒకటి సిద్ధం చేసుకోండి.మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి.
ధృడమైన, కఠిన మైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే తీసుకోండి. వెనుకంజ వేశారో మళ్ళీ మొదటికి వస్తారు.
మూడవది, ఈ ఆధునిక సమాజంలో మార్పులు సహజం. మార్పులు జరిగేటప్పుడు సంఘర్షణ సహజం. సంఘర్షణ, సంస్కృతుల మధ్య కారాదు. కాని ఈ రోజున సమాజం లో జరుగుతోంది ఏమిటి ? మనది కాని 'సంసృతి' మన 'సమస్య' అయి మనల్ని వెంటాడు తోంది. మన 'వ్యవస్థ' ల మూలాల్నిసైతం మలిన పరుస్తోంది. ఇది మత సమస్య కాదు. 'మన' మనుషుల 'మూలాలు, వ్యవస్థ' ల మీద దాడి. దాడి చేస్తోంది వేరెవరో అయితే ఎదురు దాడి చేయవచ్చు. దాడిని తిప్పి కొట్టనూ వచ్చు. కాని, ఈ దాడి చేస్తోంది స్వయానా మన బిడ్డలే ! పొట్టకోసం పరాయి దేశాల కెళ్ళి, డబ్బు సంపాదిస్తే సరే ! అక్కడి తో ఆగడం లేదు. ఆగడాలు మితి మీరాయి! పాశ్యాత్య జీవన స్రవంతి, శైలి మనం దిగుమతి చేసుకుని పాటించవలసిన అగత్యం, అవసరం మనకు లేదు.
మన నాగరికతనే ప్రపంచం కావాలంటోంది. కుటుంబ పెద్దలూ.... కర్మభూమిలో జన్మనెత్తినమనం కాసులవేటలో
'అర్ధాన్నే' 'పరమార్ధమనే' వరకూ రావద్దు.
నిజమే ! బ్రతకడానికి ధనం కావాలి. ధనం కోసం 'బ్రతకడానికి' ప్రయత్నిస్తేనే 'సమస్యలు'......
సరైన సమయం వచ్చింది ! సమాజ హితం కోసం కుటుంబ పెద్దలు, అన్ని మాధ్యమాలు నడుం కట్టాల్సిన సమయంఆసన్నమయింది. ఇప్పుడు మేల్కొనక పోతే ఇక ఎప్పటికీ లేదు అన్న విషయం తెలుసుకుంటే మేలు!.
ప్రపంచీకరణ పంచుతోంది మనకు పాశ్చ్యాత్తత ! వెర్రి తలలు వేస్తోంది నాగరికత.
నగరాల లోనే కాదు, మారు మూల గ్రామాల్లో సైతం. కుటుంబ వ్యవస్థకు చీడ పట్టింది. 'చీడను' తుద ముట్టించక పోతే మొదలుకంటా తినేస్తుంది. మన సంస్కృతి కి పట్టిన 'చీడ', 'పీడ' లా తయారయింది. ఇప్పటికే ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి. ఇంకా కాలయాపన చేశామో, ప్రతి ఇంటా' సమస్య'లు జఠిల మవుతాయి అందుకే, నీ కుటుంబ 'సంస్కృతి' నీవే కాపాడుకో. దేశ తర తరాల సంస్కృతీ సంపదను కాపాడిన వాడివవుతావు !

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.
Mob. No.9849118254

                                                        సమస్యలు- కర్మ- నేటి జీవితాలు.
                                                        ---------------------------------------------

'బలం జీవితం, బలహీనత చావు' అన్నారు స్వామి వివేకానంద. ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులుంటాయి. ఇందులో పేదలు, ధనవంతులు, గొప్పవాళ్లు, సామాన్యులు అన్న తారతమ్యాలు ఉండవు. త్రోవలో ఎత్తు పల్లాల్లాగే మనిషి జీవితంలో కూడా కష్ట సుఖాలు, వెలుగు నీడలు కూడ వెన్నంటి వుంటాయి. ఇది ప్రతి మనిషికి తెలిసిందే ! దీంట్లో కొత్తేమీ లేదు. కాకపోతే ప్రతి మనిషి కష్ట మొచ్చినప్పుడు అందరో ఒకడిలా, సుఖాలలో అన్నింటా తానొక్కడే అయినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే మనుషుల దుర్బలత. అయితే కష్ట సుఖాలను సమానంగా తీసుకోగలిగిన మనిషే జీవితంలో 'పరిపూర్ణత' సాధించిన వాడవుతాడు.
మనుషులు నిత్య జీవితంలో కష్టాలతో, సమస్యలతో, కలహాలతో, రోగాలతో, లేమితో, ఉరుకుల పరుగుల జీవితంతో వేగలేక మనః శ్శాంతి కరవై నిస్పృహ, నిస్సత్తువ, నిస్సహాయతతో ఒత్తిడికి, ఆందోళనకు లోనై ఏదో తెలియని ప్రవాహంలో కొట్టుకుని పోతున్నారు. ఈ ప్రవాహానికి తీరం లేదు. కొంతమంది ఒడ్డుకు చేరుతారు. కొందరు ఒడ్డుకు ఈదుతుంటారు. మరి కొంతమంది ప్రవాహ వేగానికి కొట్టుకు పోతుంటారు. కొంత మంది ధైర్యం చేసి ఎదురీది ఏదో ఒక ఒడ్డుకు చేరడమో లేక ఏదో ఒక ఊతం దొరకబుచ్చుకోవడమో చేస్తారు.
ఒడ్డుకు చేరేవారు చేరుతుంటే ప్రవాహంలో చేరే వారు చేరుతుంటారు. ఇది మానవ నిరంతర జీవన శైలి. 
మానవ జీవన గమనంలో ఏదో ఒక సమయంలో మనిషికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కష్టాలతో కాపురం చేయవలసి వస్తుంది. సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఆలోచన రహిత స్థితిలో కొట్టుమిట్టాడుతుంటాము. ఏపని అనుకున్నా కాదు
సరికదా ఇంకో కొత్త సమస్య వచ్చి ఉక్కిరి,బిక్కిరి చేస్తుంది. ఇలాంటి సమయంలోనే మనిషికి తెలివి, ధైర్యం, తెగువ, అనుభవం, కీర్తి, ధనం, పలుకుబడి దేనికీ కొరగావు!
సాధారణంగా మనిషి ఈ 'స్థితి' లోనే శరణాగతుడవుతాడు. అంటే  పరిస్థితులు వికటించి తన అశక్తతతో కాలానికి వశమవుతాడు. అంటే తనని తాను ఎంతో కొంత తెలుసుకుంటాడు.
కానీ ఈ పరివర్తన 'మనిషి' లో శాశ్వతం కాదు. పరిపూర్ణం కాదు  
మనిషిని ఈ 'చర్య'కు పురిగోల్పేది ఒక్క  భగవత్ శక్తి మాత్రమే!
ఇవన్నీ పురాణాలు, ఉత్త చెత్త అని తీసి పారేసే వాళ్ళు వున్నారు.
మరి అలా అనుకునే వాళ్ళకీ ఇలాంటి సమస్యలు లేవా? రావా? అంటే అదేమీ లేదు !
వారికి సమస్యలున్నాయి కదా !
ఉదాహరణకు పశ్చిమ బెంగాలుకు చెందిన గౌరవనీయులు కీ.శే.జ్యోతిబసు గారిని తీసుకుందాం !
ఒకప్పుడు ఆయనకు ఈ దేశ ప్రధాన మంత్రి పదవిని ఇవ్వ చూపారు. అందుకు ఆయన పార్టీనో...ఆయనో విముఖత చూపారు. దాన్ని ఏదో 'సమస్య'గా చూశారు వారంతా!
సరే, ఆ స్థానంలో ఇంకెవరో ప్రధాన మంత్రి అయ్యారనుకోండి.... తరువాత కొంత కాలానికి ఆయన పార్టీ వారే  'దానిని చారిత్రాత్మిక తప్పిదం' అని వ్యాఖ్యానించారు కదా.
అది వారి 'కర్మ' కాదా?  'అసలు 'కర్మ' హిందూమత సిద్దాంతం అయినా  ఐరోపా,అమెరికా దేశాలలొనె గాక అనేక పాశ్యాత్య దేశాలలో కూడా ప్రాచుర్యం చెందింది. అనేక  నిఘంటువుల్లో కూడా 'కర్మ'
అన్నపదం ' ఈ 'జన్మ' పూర్వజన్మలలో మనిషి చేసుకున్న'క్రియాఫలం' గాక  నిర్వచించబడ్డది.  
సరే...ఈ 'కర్మ' విషయంలో  ఉదాహరణకు మనందరికీ తెలిసిన ఒక  సినీ ప్రముఖుడి జీవితాన్నిచూడండి....
అదే మన 'అమితాబచ్చన్' గారు...జీవితంలో ఎన్ని 'సమస్యలు'...'ఆటుపోట్లు !
ఆయన జీవత ఉత్థాన, పతనాలు, తరువాత, పోయిన దానిని పొందేందుకు ఆయన చూపిన పోరాట పటిమ
ఎన్నదగినవి కావా? సామాన్యులు సైతం స్ఫూర్తి పొందే 'కర్మ' సాఫల్యం కాదా వారిది?
అంతెందుకు ఇందిరా గాంధీ, మన పి.వి. గార్లు కోర్టుల చుట్టూ తిరగవలసి రాలేదా?
ఈవ్యాసంలో ప్రస్తావించదలుస్తే ఒక్క మనదేశంలోనే ఇలాంటివి ఎన్నెన్నో దృష్టాంతరాలు ఉన్నాయి.
కర్మ, కష్టం, సుఖం అన్నవి మనిషి ఎంత వారైనా అనుభవించవలసిందే !
దీనికి మినహాయింపు అంటూ ఎవరికీ లేదు.
కాబట్టి మనిషి ఎవరైనా 'కర్మ' ని ' కాదు, లేదు' అని కొట్టి పారేయలేరు కదా!
'కష్టాలు' కలకాలం కాపురం చేయవు అనే వాళ్ళు మన పెద్దలు.
కాని 'సమస్యలు' మనిషి బ్రతికి ఉన్నత కాలం మనిషితో ఉండేవే.
సరే, మనం ఇప్పుడు మనిషి కష్టాలను వారి వారి 'సమస్య' గా అనుకుందాం కాసేపు ఈ ' వ్యాసం' కోసం.
అసలు 'సమస్య' లేని మనిషంటూ ఈ భూమండలంలో ఎవరైనా వున్నారా?
అసలు "సమస్య"అంటే ఏమిటి ? అవి ఎందుకు వస్తాయి?
"సమస్య" అంటే ఒక చిక్కు ముడి లాటిది. కఠిన మైనది. నివృత్తి, పరిష్కారం అవశ్యం లభించని, మానవకల్పిత 'విషయ' లాలస. స్వయంకృతం. అలా అని ' అన్నీ' మానవ కల్పిత స్వయంకృత  'సమస్య'లు కావు. కొన్ని మనిషికి  పుట్టుకతో వస్తాయి. కొన్ని మధ్యలో వస్తాయి.
పూర్వకాలంలో 'సమస్యలు' సాధారణంగా తనది కాని నీరు, రాజ్యం, ధనం, స్త్రీ వ్యామోహం వల్ల 'సమస్య'లు ఉత్పన్నమయ్యేవి.
ప్రస్తుతం కూడా స్థూలంగా 'సమస్య' లకు అవే కారణాలు. కాకుంటే ఇప్పుడు రాచరికాలు లేకపోయినా 'రాజ్యహింస' ఎక్కువయిందని ఏదో పార్టీ వాళ్ళు గొడవచేస్తుంటే విన్నాను. కొంత నిజమే అనిపిస్తుంది.
నీళ్లు రావు. వస్తే మనిషిని ముంచేస్తాయి.కరంటు ఎప్పుడూ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలీదు.
రేషను ఈనెల వస్తుందో, మూడు నెలల తరువాత ఇస్తారో తెలీదు.
సామాన్య ప్రజలకి ఇవన్నీ సమస్యలే. కూలి వాడికి పని దొరికి కూలి డబ్బులు చేతిలో పడ్డ దాక 'సమస్యే'!
డబ్బు చేతిలో వుంటే 'సమస్యల' దేముంది, చిటికలో పరిష్కార మవుతాయి అనేవాళ్ళు లేకపోలేదు.
డబ్బుతో పోయిన వాళ్ళని తీసుకు రాగలమా? లేదు కదా...ఎంతటి వారైనా ఆరోగ్యాన్ని కొనలేరు కదా!
ఇవన్నీ ఇలా వుండగా ఇప్పుడు మనల్ని ఓ కొత్త 'సమస్య' దావానంలా కమ్ముకొస్తోంది.
దాదాపు ఒక దశకం పైగా మనవారు సంపాదన, మనుగడ కోసం తమ నెలవులను, 'స్వస్థలిని' వదలి, ఎల్లలు, దేశాలు దాటి వెళ్తున్నారు.......
దానితో ఆయాదేశాలలో , ప్రదేశాలలో వారి ప్రశాంత మనుగడ కోసం తమ 'ఉనికి'లో, తమ మూలాలలో, వేష, భాషలలో మార్పులు, చేర్పులు సహజ మయ్యాయి. అక్కడ వరకే అవసరమైన ఆమార్పులు, చేర్పులు ఆయాదేశాలనుంచి, మనుషుల నుంచి దిగుమతి అయి ' ఇక్కడ' వారికి కూడా చేరువయ్యాయి.
ఆ పాశ్చాత్య మార్పులు, చేర్పులు, భాష, వేషం ఇక్కడ సంస్కృతికి 'విభిన్నం' కావడంతో ఇక్కడ పాత తరం వారి జీవితాల్లో
'సంఘర్షణ' రేకెత్తిస్తోంది..... నేటి తరం వారు ఆ మార్పులకు, చేర్పులతో 'మమేకం' అవడంతో ఇక్కడి సామాజిక వర్గాల్లో, సంఘంలో ఊహించని ' సమస్య'లు ఉత్పన్నమవుతున్నాయి.
విపరీత పరిణామాలకు కారణం అవుతున్నాయి. సమాజ ధోరణిలో వినూత్న పోకడల మూలంగా అనేక 'మూల వ్యవస్థ'ల మనుగడే ప్రశ్నార్ధక మవుతోంది. ఈ ధోరణి కొద్ది మందిలో కాదు...మరింత మందిలో పాగా వేసింది. దీనితో రోజుకో 'సమస్య' కొత్త కోణంలో ఆవిష్కారమవుతోంది.
దేశం లో 'కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ'లు దాదాపు విచ్చిన్నదశలో, ప్రమాదపుటంచులలో ఉన్నాయనడం లో ఏమాత్రం అతిశయోక్తిలేదు. అందుకు రోజు, రోజుకీ పెరుగుతున్న 'విడాకుల' కేసులు, కురుచ,చిత్ర,విచిత్ర,వేష ధారణ, ఆహార, విహారపు అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పులే తార్కాణం.
ఇక సాంప్రదాయ, ఆచార వ్యవహారాల్లో అంతరాయం, అయినవారి అనాదరణ...... ఫలితం 'తరాల' మధ్య సంఘర్షణ. అందుకే ప్రతి కుటుంబం లో ఏదో ఒక 'సమస్య'. ఆ సమస్య 'వివాహమే' కావచ్చు, వివాహ విచ్చిత్తే కావచ్చు, విడి పోయిన వారి పిల్లల గురించే కావచ్చు, పిల్లల అలవాట్లే కావచ్చు, నేరాలు కావచ్చు, వయసుడిగిన తలి తండ్రుల పోషణ కావచ్చు, ఆస్తులు కావచ్చు.....ఇలా చెప్పుకుంటూ పోతే...చాలా వున్నాయి.
వీటన్నింటికీ మూల కారణం.........మారుతున్న కాలం, సంస్కృతి, ప్రపంచీకరణ....అంతే కాదు! 
మనుషులం యంత్రాలమయ్యాము. ఏకాకుల మయ్యాము. 'నేను, 'నా' అన్నమాట తప్పితే
ఒక తల్లీ లేదు, చెల్లీ లేదు, అన్నా లేడు....... కని పెంచిన తలి తండ్రులే లేరు.....'.నా' తప్ప వేరే లోకమే లేదు.......
'అహం బ్రహ్మాస్మి'.....
అసలు 'సమస్య' ఇక్కడ ప్రారంభమవుతోంది.... తరువాత,
మన పిల్లలతో మాట్లాడే తీరిక లేదు. పిల్లలను వారి మానాన వారిని  వదిలేస్తున్నాం....వారిని  చక్కటి 'పౌరులు' గా తీర్చిదిద్దుతున్నతలి తండ్రులు ఈనాటి సమాజంలో ఎంతమంది ఉన్నారు?....
ప్రక్కన ఇంట్లో ఎవరుంటున్నారో తెలీదు.
తెలుసుకుందామనో, పరిచయం చేసుకుందామని ఎవరైనా కొద్దిగా ఉత్సుకత చూపుతే వారి గుమ్మం ముందునుంచే వెనక్కు తిరగాల్సిందే.
పైగా వెనకాలనుంచి "ఈయనకు / ఈవిడకు వేరే పని లేదా?...వీళ్ళతో జాగ్రత్తగా వుండాలి".... అనే 'విమర్శ'  వినక తప్పదు.
పైవన్నీ ఈనాడు మనల్ని తొలిచేస్తున్న 'సమస్య' లకు సమాధానం దొరికే మానవ సంబంధాలు.....అనుబంధాలు..... అవి ఇప్పుడు వాటిని తిరిగి పొందే స్థితి నుంచి 'మనం'ఎప్పుడో దూరంగా వచ్చేశాము.
సరిగ్గా 70 , 80 దశకాలలో 'అమెరికా'లో ప్రజ ఇలాగే వుండే వారు. తొంభై దశకం నుండి వారి తీరు మారింది.
వారి కుటుంబ,మానవ సంబంధాలు మెరుగయ్యాయి.
సరిగ్గా మనం ఇప్పుడు తిరోగమనంలో ఉన్నాము. మనకు వారి జాడ్యం 90 దశకంలో ప్రారంభ మయింది.
అందుకే ఎవరైనా, తమకు తెలిసీ, తెలియక విడిపోయిన మానవసంబంధాలు తిరిగి పొంద గలిగితే
వారు వారి సమస్యల సుడిగుండం నుంచి కొంత వరకు బయట పడ్డట్లే....... మానవ సంబంధాలు
అంత గొప్పవి...కారణం .....
అవి మనం కల్పించుకున్నవి కావు కనుక...ఇందుకు మనం చిన్నప్పుడు చదువుకున్న చిన్న ఉదాహరణ...'కట్టె' ఒక్కటయితే తేలిగ్గా విరగ కొట్టవచ్చు...అదే నాలుగు కట్టెలు కలిపితే అంత తేలిగ్గా విరగ గొట్ట గలమా?......
కాని, ఇక్కడ గమనించ వలసిన ఒక సున్నిత మైన విషయం మరొకటుంది.
మానవ సంబంధాలు తిరిగి పొందడం గురించి తన 'సమస్య'ల ను వేరే వారితో చర్చించే టప్పుడు తస్మాత్ జాగ్రత్త.
రెండవది, ఆలోచించండి. విశ్లేశించుకోండి. మీ సమస్య అంత క్లిష్టంగా ఎందుకయింది? ఏయే అంశాలు 'సమస్య' తీవ్రతకు కారణమయ్యాయి...మీ 'సమస్య' తీవ్రతకు మీరు ఎంతవరకు కారణం? మీతప్పు ఏమైనా వుంటే కప్పి పుచ్చుకోకండి.
తప్పులు దిద్దుకునే ప్రయత్నం ప్రారంభించండి..మీ ఆంతరంగికులతో చర్చించ తగ్గ విషయమైతే తప్పక చర్చించండి...
కార్యాచరణ ప్రణాళిక ఒకటి సిద్ధం చేసుకోండి..... మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. ధృడమైన, కఠిన మైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే తీసుకోండి. వెనుకంజ వేశారో మళ్ళీ మొదటికి వస్తారు.