లేబుళ్లు

6, మార్చి 2012, మంగళవారం

పుదినా రైస్ ( Mint (leaves) Rice)

                                                     పుదినా రైస్ ( Mint (leaves) Rice)
                                                      -------------------------------------


కావలసిన పదార్దములు ( ingredients )
--------------------------------------------
మసూరి /బాస్మతి  బియ్యం పావు కిలో
పుదినా -   ఒక కట్ట
పచ్చి మిర్చి-  నాలుగు లేక అయిదు
కొత్తిమీర - ఒక కట్ట
జీలకర్ర -  తగినంత
ఎండు మిరపకాయలు - రెండు
కరివేపాకు - ఒక రెమ్మ ( పది ఆకులు)
నిమ్మకాయ - ఒకటి
నూనె  - చిన్నకప్పు  
జీడిపప్పు - యాభై గ్రాములు 
ఉల్లిపాయలు - ఒకటి
వెల్లుల్లి - నాలుగు పాయలు
కారం - తగినంత
ధనియాలపొడి - తగినంత
ఉప్పు - తగినంత

                                               తయారుచేయు విధానం

                       ముందుగా 'అన్నం' (rice)  పొడిగా వండుకొని కొద్దిగా చల్లార్చుకోండి. పుదినాను శుభ్రం చేసి ఆకులను వేరుగా చేసుకుని, (కొన్నిపుదినా ఆకులను, కొత్తిమీర, కరివేపాకు ఆకులను)  వేరు చేసి రైస్ రెడి అయిన తరువాత రైస్ పై చల్లడానికి)  తయారుగా ఉంచుకుని మిగతా పుదినా  ఆకునంతా మూకుడుని స్టవ్ మీద మీడియం సెగపై ఉంచి  రెండు టీ స్పూనుల  నూనె వేసి, నూనె వేడి అయినతరువాత పుదినా ఆకులు, పచ్చి మిరపకాయలు తుంపి  చేసి మూకుడులో వేసి వేగించవలెను. పుదినా, మిరపకాయ ముక్కలు వేగాక మూకుడు నుంచి తీసి 'పేస్ట్' గా చేసి దానిని తయారుగా పక్కన ఉంచండి. తరువాత మరల మూకుడు స్టవ్ పై ఉంచి మిగిలిన  నూనె / ఆయిల్ వేసి వేడిఅయిన తరువాత ఎండు మిరపకాయలు తుంపి అవి వేగిన తరువాత జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయలు వేసి దోరగా వేగిన  వెంటనే వెల్లుల్లి, కారం, ధనియాల పౌడరు  సన్నని మంటపై  రెండు నిముషాలు ఉంచి వేగిన తరువాత  'పుదినా పేస్ట్' ని  కూడా మూకుడులో వేసి కొద్దిగా వేగిన తరువాత 'అన్నం/ రైస్ , తగినంత ఉప్పు కూడా ఆ మిశ్రమములో  వేసి  బాగా కలిపుతూ   మూడు లేక నాలుగు నిముషముల పాటు ( మాడకుండా చూసుకుంటూ) స్టవ్ పై సన్నని సెగమీద ఉంచి వెంటనే దింపి  మిగిల్చి ఉంచిన పుదినా ఆకులు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం వేసి   కలపాలి. అంతే  చక్కటి సువాసనతో ఘుమ ఘుమ లాడుతూ  మీ 'పుదినా రైస్' రెడి.     
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి