లేబుళ్లు

29, ఫిబ్రవరి 2012, బుధవారం

రవ్వలడ్డు (రెసిపి) Rawa laddu.

                                                                   రవ్వలడ్డు (రెసిపి)                    
                                                                   -------------------

కావలసిన పదార్దములు
--------------------------
బొంబాయి రవ్వ ( 1/4 kg) 
పంచదార          ( 1/4 kg)    
జీడిపప్పు          (25 gms)
కిస్మిస్               (25gms)
ఏలకులు           (6)
పాలు                (50ml)
నెయ్యి               (100gms)
                                                           తయారు చేసే విధానం

                                         ముందుగా ఏలకులు పొడి తయారు చేసుకోండి. మూకుడుని  స్టవ్ మీద సన్నటి సెగ మీద వేడి చేసింతరువాత రెండు చెంచాల నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు దోరగా వేయించుకోండి. తరువాత కిస్మిస్ కూడా వేరుగా దోరగా వేయించుకుని ఆ రెండింటినీ పక్కన ఉంచండి. మిగిలిన నెయ్యి మూకుడులో వేసి వేడి అయింతరువాత మంటను మీడియం లో ఉంచి  'రవ్వ'ను మూకుడులో వేసి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించండి. బాగా వేగిన తరువాత 'పంచదార' ను వేగిన రవ్వలో కలిపి మరల  షుమారు అయిదు నిముషములు మీడియం మంట పైనే ' పంచదార, రవ్వ' మిశ్రమమును వేయించండి. మంటను బాగా తగ్గించి (సన్నటి సెగలో )
పాలు ఆ మిశ్రమములో పోసి బాగా కలిపిన తరువాత అనగా పాలు పోసిన తరువాత షుమారు ఒక నిముషం పాటు
కలిపిన తరువాత  స్టవ్ ఆపుచేయగలరు. వెంటనే ఈ మిశ్రమములో ఏలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ కలపవలెను.
తరువాత రెండు, మూడు నిముషముల తరువాత ( రవ్వలడ్డు మిక్స్ ) కొద్దిగా వేడి తగ్గగానే చేయి తడి చేసుకుంటూ
లడ్డు మిశ్రమమును  తగినంత తీసుకుంటూ రవ్వలడ్డూలు చేసుకొనగలరు.

note:  మూకుడు లో  రవ్వ, పంచదార  వేసిన తరువాత సరిగా వేగి స్టవ్ ఆపేంత వరకు కలుపుతూనే ఉండండి.
సరిగా కలపకపోతే అవి 'మాడే' ప్రమాదం పొంచి ఉంటుంది.
            

1 వ్యాఖ్య: